National News

Saturday, February 27, 2016 - 17:28

హైదరాబాద్ : భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అభిమాని పాకిస్తాన్‌కు చెందిన ఉమర్‌ దరాజ్‌కు బెయిలు దొరికింది. ఉమర్‌ కేసు పాకిస్థాన్‌లోని ఒకరా అడిషనల్‌ జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. బెయిల్‌ ఇవ్వాల్సిందిగా అతను పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తూ  50వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. పంజాబ్‌ ప్రావిన్స్‌కి చెందిన 22 ఏళ్ల ఉమర్‌ దరాజ్‌ కోహ్లికి...

Saturday, February 27, 2016 - 17:25

కాన్పూర్‌ : బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామిపై కాన్పూర్ లో దాడి జరిగింది. విఎస్‌ఎస్‌డి కళాశాలలో గ్లోబల్‌ టెర్రరిజంపై సెమినార్‌లో పాల్గొనేందుకు వచ్చిన స్వామి కారును కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఆయనపై కోడిగుడ్లు, టమాటలతో స్వామిపై దాడి చేశారు. నల్లజెండాలతో ఆయన ముందు నిరసన తెలిపారు. ఈ ఘటనలో సుమారు 50 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ...

Saturday, February 27, 2016 - 10:54

మీర్పూర్ : ఆసియా కప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరుకు మీర్పూర్‌ షేర్‌-ఎ-బాంగ్లా స్టేడియంలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. టీ 20 ఫార్మాట్‌లో ఈ రెండు జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్ రికార్డ్ ఓ సారి చూద్దాం.....
బ్లాక్‌ బస్టర్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్
ఆసియా కప్‌లో బ్లాక్‌ బస్టర్...

Saturday, February 27, 2016 - 10:48

ఢిల్లీ : 2015-16 ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గతేడాది ఆశించిన స్థాయిలో వృద్ది రేటు నమోదు కాలేదని సర్వే తెలిపింది. రాబోయే ఏడాదికి వృద్ది రేటును 7 నుంచి 7.5 శాతంగా అంచనా వేసింది. పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి మరిన్ని మార్గాలను అన్వేషించాలని సూచించింది...

Saturday, February 27, 2016 - 09:29

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌ సాక్షిగా అన్నీ అసత్యాలు చెప్పారని రోహిత్‌ తల్లి రాధిక అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడితే 12 గంటల వరకు ట్రీట్‌మెంట్‌ చేయకుండా పలువురు అడ్డుకున్నారని స్మృతి ఇరానీ చెప్పడం దారుణమన్నారు. రోహిత్‌ యాక్ట్‌ వచ్చే వరకు పోరాడుతామని రాధిక అన్నారు.
మరో ఇరకాటంలో ఎన్డీయే సర్కార్‌ 
కేంద్రంలోని...

Friday, February 26, 2016 - 18:27

ఢిల్లీ: హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాజ్యసభ దద్దరిల్లింది. మంత్రి స్మృతీ ఇరాని అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ఆత్మహత్య కాదు... ముమ్మాటికి హత్యేనని ఏచూరి అన్నారు. రోహిత్‌ ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా దళిత విద్యార్థులతో...

Friday, February 26, 2016 - 13:58

ఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 నుంచి 7.5శాతంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో ఎకానమిక్ సర్వే రిపోర్టు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సమర్పించారు. 2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జీడీపీలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు బలహీనంగా ఉంటే... ఆ...

Friday, February 26, 2016 - 10:40

ఉత్తరాఖండ్‌ : ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి.
'ది గ్రేట్ ఖలీ షో'
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన 'ది గ్రేట్ ఖలీ షో'లో ప్రఖ్యాత రెజ్లర్‌ ఖలీ తీవ్రంగా...

Friday, February 26, 2016 - 09:36

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాన్సస్‌లోని  ఓ ఫ్యాక్టరీలో దుండగుడు... తన సహచరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యాజమాన్యంతో విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందుతుడ్ని కాల్చిచంపారు. 

Thursday, February 25, 2016 - 21:30

ఢిల్లీ : జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య అరెస్ట్, హెచ్‌సియు రిసెర్చ్‌ స్కాలర్ రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాజ్యసభ అట్టుడికింది. సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి చర్చను ప్రారంభిస్తూ దేశంలోని అసహన ఘటనలపై విదేశీ పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. బిజెపి, సంఘ్‌పరివార్‌ చర్యలపై వ్యతిరేకంగా మాట్లాడేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తారా అంటూ...

Thursday, February 25, 2016 - 21:27

ఢిల్లీ: హెచ్‌సీ‌యూ పీహెచ్‌డీ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం లోక్ సభలో చేసిన వ్యాఖ్యల్ని ప్రధాన వైద్యాధికారి ఖండించారు. రోహిత్‌ను కాపాడేందుకు డాక్టర్‌ను కూడా దగ్గరకు రానీవ్వలేదని, మరిసటి రోజు వరకు డాక్టర్ అక్కడకు వెళ్లలేకపోయారని స్మృతి ఇరానీ సభలో అన్నారు. అయితే హెచ్‌సీ‌యూ చీఫ్ మెడికల్...

Thursday, February 25, 2016 - 17:19

ఢిల్లీ : దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశాడన్న కేసులో జైల్లో ఉన్న కన్హయాను సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కన్హయ చాలా ధీమాగా ఉన్నాడని అన్నారు. తన విద్యాజీవితం పాడైనా యావత్‌ దేశం కోసం బిజెపి దౌష్ట్య విధానాలపై పోరాడతానని చెప్పినట్లు నారాయణ అన్నారు.

Thursday, February 25, 2016 - 17:15

ఢిల్లీ : రైల్వే బడ్జెట్‌లో ఈసారీ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఢిల్లీలో అన్నారు. రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశాజనకంగా ఉందని ప్రాజెక్ట్‌లను పీపీపీ పద్ధతిలో చేపట్టడం దారుణమని విమర్శించారు.

 

Thursday, February 25, 2016 - 15:43

ఢిల్లీ :సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్‌ను రూపొందించామని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. రైల్వేల ఆధునీకరణపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ వెన్నుముఖలాంటిదని సురేష్ ప్రభు అన్నారు. ప్రయాణిలకు సౌకర్యాలను పెంచేందుకు పెద్ద పీట వేశామని చెప్పారు.

Thursday, February 25, 2016 - 15:42

ఢిల్లీ : జేఎన్‌యు, హెచ్‌సియు ఘటనలపై ప్రభుత్వ తీరును సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే అది దేశద్రోహమా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదని ఘాటుగా అన్నారు. జేఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చూపుతున్నారని, యూనివర్సిటీల్లో వివక్షను నిర్మూలించాలని అన్నారు.

Thursday, February 25, 2016 - 12:49

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.లక్షా 21 కోట్లతో రైల్వే బడ్జెట్-2016 ను ప్రవేశపెట్టారు. ఇది ప్రజల బడ్జెట్ అని తెలిపారు. 'దేశ సామాన్యుల ఆకాంక్షలను నా బడ్జెట్ ప్రతిబింభిస్తుందని' అన్నారు. ఆదాయ వనురులను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రైల్వేకు...

Thursday, February 25, 2016 - 12:22

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని తెలిపారు. 'దేశ సామాన్యుల ఆకాంక్షలను నా బడ్జెట్ ప్రతిబింభిస్తుందని' అన్నారు. ఆదాయ వనురులను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రైల్వేకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. రూ. 1,84,820 కోట్ల...

Thursday, February 25, 2016 - 11:52

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చూపుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి, ఎంపీ సీతారాం ఏచూరీ మండిపడ్డారు. పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రోహిత్ ఆత్మహత్య, జెఎన్ యూ ఘటనలపై రాజ్యసభలో ఏచూరీ మాట్లాడారు. మహాత్మగాంధీని చంపిన నాతురాం గాడ్సే ను గొప్ప దేశభక్తుడుగా చిత్రీకరించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 'దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన...

Thursday, February 25, 2016 - 10:33

మీర్పూర్ : ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న టీమిండియా.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
భారత్‌ బోణీ కొట్టింది
మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియాకప్‌ తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్‌ బోణీ కొట్టింది....

Thursday, February 25, 2016 - 09:49

పూణె : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993 పేలుళ్ల కేసులో సంజయ్ కు ఐదేళ్ల శిక్ష పడింది. 42 నెలలపాటు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. సత్ర్పవర్తన కారణంగా కేంద్రం ప్రభుత్వం సంజయ్ దత్ శిక్షా కాలాన్ని తగ్గించింది. ఈమేరకు ఉదయం ఎరవాడ జైలు నుంచి సంజయ్ ను విడుదల చేశారు. 

Thursday, February 25, 2016 - 08:24

ఢిల్లీ : హస్తినలో విద్యార్థులపై పోలీస్‌లు జులుం ప్రదర్శించారు. ఇండియా గేట్‌ వద్ద రోహిత్‌కు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యా సంస్థల్లో సామాజిక వివక్షతను రూపుమాపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రోహిత్‌ ఆత్మహత్యకు గల కారకులపై చర్యలు తీసుకోవాలని, రోహిత్‌ ఆత్మకు...

Thursday, February 25, 2016 - 08:19

ఢిల్లీ : రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అమీతుమీకి దిగారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై మాయావతి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సెంట్రల్ వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. హెచ్‌సీయూ, జెఎన్‌యు...

Thursday, February 25, 2016 - 07:56

ఢిల్లీ : కరిగిపోతున్న వనరులు, చార్జీల భారం మోపేందుకు సహకరించని పరిస్థితి. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న వేళ రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ముందున్న సవాళ్లు ఇవి. గత బడ్జెట్‌లో సురేష్‌ప్రభు సరుకు రవాణాతో పాటు రవాణాచార్జీ పెంచారు. అలాగే ప్రైవేటు పెట్టుబడులు లాంటి అంశాలు సైతం రైల్వే బడ్జెట్‌లో లేవనెత్తారు. మరి ఈసారి మోడీ సర్కారు రైలింజన్‌ ఏ దిశగా తీసుకెళ్తారో ఈ...

Wednesday, February 24, 2016 - 21:24

ఢిల్లీ : జెఎన్‌యు వివాదంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందించారు. ఈ ఘటనలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో న్యాయ, అన్యాయాలను కోర్టులు నిర్ధారిస్తాయని మంత్రి తెలిపారు. నిర్దోషులైన విద్యార్థులకు పోలీసుల నుంచి ఎలాంటి వేధింపులుండవని తాను సభకు హామీ ఇస్తున్నట్టు రాజ్‌...

Wednesday, February 24, 2016 - 21:21

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్ధి వేముల రోహిత్‌ ఆత్మహత్య, జేఎన్‌యూ ఘటనలపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. వివిధ పక్షాల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. హెచ్ సియూ, జేఎన్ యూ ఘటనలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. దేశంలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నా ఏ కుటుంబాన్ని పరామర్శించని కాంగ్రెస్‌...

Wednesday, February 24, 2016 - 18:35

ఢిల్లీ : హెచ్ సియూ విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్య, జేఎన్ యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ కుమార్‌ అరెస్టు ఘటనలపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగుతుంది. చర్చతోపాటు సమాధాన్ని కూడా పూర్తి చేయాలన్న అంశంపై అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ రెండుపై చర్చకు ఒకే నోటీసు ఇచ్చిన ప్రతిపక్షాలు... చర్చను వేర్వేరుగా చేట్టాలని పట్టుపడ్డంతో అధికార...

Wednesday, February 24, 2016 - 18:33

ఢిల్లీ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం ఎపి ఎంబీ రాజేష్‌ విమర్శించారు. హెచ్ సియూ, జేఎన్ యూ ఘటనలపై లోక్‌సభ జరిగిన చర్చలో రాజేష్‌ పాల్గొన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ కారణమన్నారు.

Pages

Don't Miss