National News

Monday, February 8, 2016 - 14:46

హైదరాబాద్ : పద్మశ్రీ... దేశంలో నాల్గో అత్యున్నత పౌర పురస్కారం. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఎన్నికల సంవత్సరాల్లోనే ఈ అవార్డులను ఎక్కువగా ఇస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఇచ్చినన్ని అవార్డులు అంతకు ముందు నాలుగేళ్లలో ఇచ్చిన దాఖలాలు లేవు. 2004లో ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ 74 మందికి పద్మశ్రీ అవార్డులు...

Monday, February 8, 2016 - 14:45

హైదరాబాద్ : 2008 నవంబర్‌ 26న జరిగిన ముంబయి దాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఈ కేసులో నిందితుడుగా ఉన్న డేవిడ్‌ హెడ్లీ వెల్లడించాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ముంబయి ప్రత్యేక న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ప్రత్యేక న్యాయమూర్తి వేసిన దాదాపు 40 ప్రశ్నలకు హెడ్లీ సమాధానం చెప్పాడు. ముంబయి...

Monday, February 8, 2016 - 14:42

హైదరాబాద్ : తైవాన్‌లో సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య 35కు చేరింది. దాదాపు 121 మందికిపైగా జాడ తెలియటం లేదని సహాయక బృందాలు చెప్పాయి. తైనాన్‌ నగరంలో కుప్పకూలిన వీగువాన్‌ భవనంలో ఆరుగురు చిన్నారులతో సహా 22 మృతదేహాలను సహాయక బృంద కార్యకర్తలు వెలికి తీశారు. ఘటనా స్థలిలో దాదాపు 282 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, 340 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, 105...

Monday, February 8, 2016 - 09:51

ఢిల్లీ : తైవాన్ లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరుకుంది. దాదాపు 121 మంది జాడా తెలియడం లేదని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. తైవాన్ నగరంలో కుప్పకూలిన విగువాన్ భవనంలో ఆరుగురు చిన్నారులతో సహా 22 మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. ఘటనా స్థలిలో దాదాపు 282 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, 340కిపైగా స్వచ్ఛంద కార్యకర్తలు, 105 అగ్నిమాపక వాహనాలు...

Monday, February 8, 2016 - 08:40

ఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలకు సీఐటీయూ పిలుపునిచ్చింది. పీఎస్ యూలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం ప్రతిపాదలను విరమించుకోవాలని సీఐటీయూ కార్యదర్శి తపన్ సేన్ డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగంలోని ఇంజనీర్ దిగ్గజ సంస్థ బీహెచ్ఎల్, చమురు రంగంలోని...

Monday, February 8, 2016 - 08:33

ముంబై : బాంబు పేలుళ్ల ప్రధాన సూత్ర ధారి డేవిడ్ హెడ్లీ ఈ రోజు పెదవి విప్పనున్నాడు. హెడ్లీని ముంబై కోర్టు విచారించనుంది. ప్రస్తుతం అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించనున్నారు. హెడ్లీ ఇచ్చే వాంగ్మూలం ద్వారా దాడి ఘటనలో అనేక అనుమానాలు నివృత్తి కానున్నాయి. ఈ వాంగ్మూలం ద్వారా పాక్ లో ఉన్న అబూ జిందాల్ పై యాక్షన్...

Monday, February 8, 2016 - 07:55

ఒడిశా : సమాజాంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయాలి అని ఉద్యమాలు జరుగుతుంటే ఎక్కడో ఒక చోట కులం పేరిట వివక్ష కొనసాగుతూనే ఉంది. కులం పేరిట..పలువురిని వెలి వేసే ఘటనలను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇందులో ఓ మంత్రిని కూడా కులం పేరిట ఊరు..కులం నుండి వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. అగ్రకులం వరునితో కుమార్తె వివాహం జరిపించిన దానికి ఈ శిక్ష వేశారు. ఈ...

Sunday, February 7, 2016 - 21:55

ఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు సంచలనం రేకెత్తిస్తోంది. ఆమె తల్లిదండ్రులు రెండు రోజులుగా కనిపించడం లేదని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓ వైపు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగానే... పోలీసులకు.. శక్తినగర్ లోని తన స్నేహితుడి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న...

Sunday, February 7, 2016 - 20:29

కర్నాటక : బెంగళూరు శివార్లలో చిరుతపులి కలకలం సృష్టించింది. శివారు ప్రాంతంలోని ఓ స్కూల్ లోకి దూకిన చిరుతపులి... ఆరుగురిని గాయపరిచింది. చిరుతపులిని పట్టుకునేందుకు స్కూల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుమారు అరగంట పాటు చిరుత హంగామా సృష్టించింది. చివరకు ఫారెస్ట్ సిబ్బంది.. మత్తు మందు ప్రయోగించి.. అదుపులోకి తీసుకున్నారు.

 

Sunday, February 7, 2016 - 20:01

విశాఖ : భద్రతపై అన్ని దేశాల నౌకాదళాలు దృష్టి సారించాలని ప్రధాని మోడీ సూచించారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలకు ఆయన హాజరై, ప్రసంగించారు. 90 శాతం వాణిజ్యం సముద్రాల ద్వారానే జరుగుతుందని చెప్పారు. సునామీ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు...

Sunday, February 7, 2016 - 19:26

ఢిల్లీ : భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ప్రాణాలను కాపాడే మందులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సుమారు 76 రకాల మందులపై.. కస్టమ్స్ సుంకం మినహాయింపులను కేంద్రం రద్దు చేసింది. ఈ జాబితాలో హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించిన పది మందులు కూడా ఉన్నాయి.

సుంకం మినహాయింపు ఉపసంహరణ 

భారత ప్రభుత్వం.. విదేశాల...

Sunday, February 7, 2016 - 18:51

ఢిల్లీ : బాస్మతి బియ్యానికి... జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌.. జీఐ ని పొందేందుకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. లాహోర్‌ ప్రాంత బాస్మతి ఉత్పత్తిదారులు వేసిన పిటిషన్‌ను.. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ బోర్డు.. ఐపీఏబీ.. తోసిపుచ్చింది. భారతీయ బాస్మతి బియ్యానికి జీఐ ట్యాగ్‌ వేసుకునేందుకు అవకాశాన్ని సానుకూల పరిచింది.

లాహోర్‌ బాస్మతి ఉత్పత్తిదారుల...

Sunday, February 7, 2016 - 15:56

ఉత్తర కొరియా : ఐక్యరాజ్య సమితి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఉపగ్రహ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 3,400 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం తేలిగ్గా ఛేదిస్తుంది. అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ క్షిపణి ప్రయోగంపై అమెరికా సహా, పలు దేశాలు మండిపడ్డాయి. ఉత్తరకొరియాది రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించాయి. గత నెల 6న హైడ్రోజన్‌ బాంబును పరీక్షించామని ఉత్తర కొరియా...

Sunday, February 7, 2016 - 10:46

ఉత్తర్ ప్రదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహింను కలిశారా ? అవును కలిశారని సమాజ్ వాది నేత, మంత్రి ఆజంఖాన్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కలకలం రేపుతోంది. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన పాకిస్తాన్ లో మోడీ పర్యటించారని, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మోడీ వ్యక్తిగత భేటీ జరిగిందన్నారు. ఈ భేటీలో షరీఫ్ తల్లి, కూతురుతో పాటూ దావూద్ కూడా...

Sunday, February 7, 2016 - 08:53

ఢిల్లీ : ఆర్థిక మంత్రుల సమావేశం హాట్ హాట్‌గా సాగింది. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించిన అంశంపై అన్ని రాష్ట్రాల మంత్రులు కేంద్రంపై దాడికి దిగారు. రాష్ట్రాల అభ్యంతరాలు పట్టించుకోకుండా కేంద్రం వ్యవహరిస్తోందని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల కొరత విధించిందని కేంద్రంపై మండిపడ్డారు...

Sunday, February 7, 2016 - 07:31

ఒడిశా : అంతర్జాతీయ నౌకా సమీక్షకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్‌ బయల్దేరి వెళ్లారు. భువనేశ్వర్‌లో జాతీయ విద్యాశాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పూరీ జగన్నాథస్వామిని దర్శించుకుంటారు. పారాదీప్‌లో నెలొల్పిన చమురు శుద్ధి కేంద్రాన్ని జాతికి అంకితమిస్తారు. ఆదివారం సాయంత్రం తిరిగి విశాఖ చేరుకుంటారు.

Sunday, February 7, 2016 - 06:48

ఢిల్లీ : బుధవారం ప్రారంభమైన ఆటో ఎక్స్‌పోకు మంచి స్పందన కనిపిస్తోంది. శుక్రవారం సాధారణ ప్రజలను అనుమతించడంతో తొలిరేజే 80 వేల మంది ఆటో ఎక్స్‌పోను సందర్శించారు. మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్‌, హోండా, టాటా మోటార్స్‌, ఆడీ తదితర కంపెనీలు వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఫోర్‌ వీలర్స్‌తో పాటు టూ వీలర్స్‌ను కూడా ప్రదర్శించారు. ఈ నెల 9తో ముగియనున్న ఈ ప్రదర్శనను సియామ్‌,...

Saturday, February 6, 2016 - 22:11

బెంగళూరు : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2016 వేలంలో షేన్‌ వాట్సన్‌  అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్‌ నెలకొల్పగా.... భారత ఆల్‌రౌండర్‌ పవన్‌ నెగీ  భారత ఆల్‌రౌండర్‌ అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చాడు. పవన్‌ నెగీ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.ఎప్పటిలానే ఈ సారి వేలంలోనూ అన్ని ఫ్రాంచైజీలు ఆల్‌రౌండర్లకే  మొగ్గు చూపాయి. షేన్‌ వాట్సన్‌ , క్రిస్‌ మోరిస్‌, పవన్ నెగీ,...

Saturday, February 6, 2016 - 21:41

ఢిల్లీ : భారత సరిహద్దులోకి అక్రమంగా చొరబడ్డ పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్‌ బోట్‌ను ఇండియన్‌ కోస్టల్‌ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని కచ్‌ జఖావు తీరప్రాంతంలో చొరబడ్డ పాక్ పడవలోని 11 మంది మత్స్యకారులను అరెస్ట్‌ చేశారు. తీరప్రాంతం దాటే మత్స్యకారుల ఇరుదేశాలు అదుపులోకి తీసుకోవడం సహజమే. పాక్‌లో చొరబడ్డ 440 మంది భారతీయ మత్స్యకారులు  జైళ్లలో...

Saturday, February 6, 2016 - 15:08

ఢిల్లీ : 2016 మహిళల టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు..మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుంది. భారత్ వేదికగా మార్చి 15 నుంచి జరిగే మహిళా ప్రపంచకప్ టోర్నీలో పదిదేశాల జట్లు పోటీపడుతున్నాయి. భారతజట్టు సభ్యుల వివరాలు ఓసారి చూద్దాం...

కోల్ కతా వేదికలుగా మ్యాచ్ లు

కోల్ కతా వేదికలుగా మహిళా ప్రపంచకప్ మ్యాచ్ లు...

Saturday, February 6, 2016 - 13:40

ఢిల్లీ : బడ్జెట్‌ ప్రతిపాదనలపై రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశమయ్యారు. ఈ నెల 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలు, రాష్ట్రాల నుంచి అందే వినతులపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాల నుంచి ఆర్ధిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Saturday, February 6, 2016 - 11:37

విశాఖ : నీలిరంగు ఆకాశం కిందకు దిగితే.. ఆ ఆకాశంలో హంసలు విహరిస్తేఎలా ఉంటుంది. పై నుంచి పౌర్ణమి చంద్రుడు కుంచె పట్టుకుని సముద్రంపై సాగరకన్యను చిత్రించి.. రంగులద్దితే ఎలా ఉంటుంది. విశాఖ సాగరతీరంలో యుద్ధ నౌకల విహారం అలాగే ఉంది. ఏరువాకలా సాగిన తెరచాపల కవాతు దీనికి తోడవటంతో.. అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన 70కి పైగా యుద్ధనౌకలు బాడీ...

Saturday, February 6, 2016 - 11:34

హైదరాబాద్ : ఐపీఎల్‌ సీజన్‌-9 హడావుడి మొదలైంది. ఆటగాళ్ల వేలంపాట బెంగళూరులో నడుస్తోంది. షేన్‌ వాట్సన్‌ను 9.50 కోట్లకు బెంగళూరు దక్కించుకోగా.. కెవిన్‌ పీటర్‌సన్‌ను 3.50 కోట్లకు పూణె దక్కించుకుంది. ఫాస్ట్‌బౌలర్‌ అశిష్‌నెహ్రాను హైదరాబాద్‌ జట్టు 5.50 కోట్లకు కొనుగోలు చేసింది. డ్వేన్‌ స్మిత్‌ను 2.3 కోట్లకు గుజరాత్‌ దక్కించుకుంది. మొత్తం 10 టీమ్‌లు 351 మంది...

Saturday, February 6, 2016 - 08:40

హైదరాబాద్ : తైవాన్‌ను భూకంపం కుదిపేసింది. 17 అంతస్తుల భవనం ఒకటి భూప్రకంపనల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. మిగతావారిని సహాయక సిబ్బంది సురక్షితంగా తప్పించనట్లు సమాచారం. రాయిటర్స్‌ కథనం ప్రకారం 10 రోజుల పాపతో పాటు 40 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. 90 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. దక్షిణ తైవాన్‌లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌...

Saturday, February 6, 2016 - 07:26

హైదరాబాద్ : విశాఖ తీరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఫ్లీట్‌ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోడీలు విశాఖపట్నం చేరుకున్నారు. వీరికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. నేడు అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొననున్నారు. మరోవైపు 51 దేశాలకు చెందిన నౌకలు ఇప్పటికే విశాఖ తీరంలో సందడి...

Friday, February 5, 2016 - 15:24

ఛండీఘర్ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో నలుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. బీడీ అడిగిన పాపానికి ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. మితిమీరిన ఆవేశంలో నలుగురు వ్యక్తులు ఉన్మాదుల్లా మారిపోయారు. ఆ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దుల వర్షం కురిపించారు....

Friday, February 5, 2016 - 15:21

ఢిల్లీ: సియాచిన్‌లో గల్లంతైన పది మంది సైనికులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఘటన చాలా బాధాకరమని, దేశాన్ని సంరక్షించేందుకు సరిహద్దులో పహారా కాస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు వందనం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.

సియాచిన్‌ గ్లేసియర్‌లో భారీ హిమపాతం

ఇండో పాక్ సరిహద్దులోని ఎత్తైన, ప్రమాదకర సియాచిన్...

Pages

Don't Miss