National News

Tuesday, February 16, 2016 - 21:37

ఢిల్లీ : జేఎన్‌యూలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆరెస్సెస్, బీజేపీ, ఏబీవీపీ నేతలు ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్‌ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు అరెస్టుకు ముందు కన్నయ్య ఏం మాట్లాడాడు...ఎలాంటి కామెంట్స్ చేశాడు...బీజేపీ, ఏబీవీపీ...

Tuesday, February 16, 2016 - 21:33

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతోంది.  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ప్రకాష్‌కారత్‌, బృందా కారత్‌, ఏకే పద్మనాభం, మాణిక్‌ సర్కార్‌, రాఘవులతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులందరూ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పొలిట్‌బ్యూరో భేటీలో...

Tuesday, February 16, 2016 - 21:23

ఢిల్లీ : బ్యాంక్‌ ల్లో తీసుకున్న అప్పులు తీర్చకుండా మొండికేసిన ప్రముఖులకు ఇదొక షాకింగ్‌ న్యూస్‌. 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిపడ్డ మొండిపద్దుల జాబితా ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆర్‌ బీఐని ఆదేశించింది. మొండిబకాయిలు ప్రభుత్వరంగ బ్యాంక్‌లను షేక్‌ చేస్తున్నాయి. ఈ మొండిపద్దులు ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా నష్టాల బాట పట్టించే...

Tuesday, February 16, 2016 - 15:49

ఢిల్లీ : బ్యాంకుల్లో మొండి బకాయిలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. రూ.500 కోట్లకు పైగా ఎగ్గొట్టిన వారి జాబితా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

Tuesday, February 16, 2016 - 13:51

ఫిబ్రవరి 14...వాలంటైన్స్ డే..ప్రేమికులంతా ఏం చేస్తారు ? ప్రేమికుడు తన ప్రేయసికి.. ప్రేయసి తన ప్రియుడికి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు కదా..భారతేదశంలో మాత్రం కొంతమంది ఈ ప్రేమికుల రోజున అడ్డుకుంటుంటారు. ఇదిలా ఉంటే అమెరికాలో మాత్రం వాలంటైన్స్ డే రోజు న ఓ యువకుడు చేసిన చేసిన నిర్వాకం చూసిన..విన్న వారు ముక్కు మీద వేలేసుకోవడం ఖాయం. అమెరికాకు చెందిన టీనేజీ కుర్రాడు హెడెన్ గాడ్ ఫ్రే...

Tuesday, February 16, 2016 - 13:40

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఏపీనుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు.. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారన్నారు మేకపాటి.. ఏపీ సమస్యలపైకూడా చర్చ జరపాలని కోరినట్లు చెప్పారు..

Tuesday, February 16, 2016 - 12:57

ఇంట్లో సతీమణి వంట సరిగ్గా చేయకపోతే ఏం చేస్తాం ? ఆ ఏం చేస్తాం..వండుకుంటాం లేదా..అదే తింటాం..హోటల్ నుండి తెచ్చుకుంటాం..లేదా కోప్పడుతాం..అంటారు అంతే కదా..కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యపై విచిత్రంగా ఫిర్యాదు చేశాడు. 42 ఏళ్లు ఉన్న ఈ వ్యక్తి తన భార్య తనకు సరిగ్గా వంట చేయడం లేదని..ఇతరత్రా కారణాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటలీ..ఇటాలియన్ చట్టాల ప్రకారం కుటుంబ..గృహ వ్యవహారాల్లో...

Tuesday, February 16, 2016 - 11:33

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఎల్‌తో రంగప్రవేశం చేయనున్న రైజింగ్‌ పుణే సూపర్‌ జైయింట్స జట్టు జెర్సీని సోమవారం ఆష్కరించారు. ఈ కార్యక్రమంలో పుణే జట్టు యాజమాని సంజీవ్‌ గోయోంక, కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా కెప్టెన్‌గా ఉన్న చెన్నై జట్టు దూరంగా ఉండటంపై ఉద్వేగంగా స్పందించారు. చైన్నె ఆటగాళ్లు సురేష్‌రైనా, రవీంద్ర...

Tuesday, February 16, 2016 - 09:47

హైదరాబాద్ : ఢిల్లీ జేఎన్ యూ లో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ఉగ్రవాది అఫ్జల్‌గురు ఉరితీతను నిరసిస్తూ ఓ వర్గం ర్యాలీ తీయడం, ర్యాలీని ఏబీవీపీ అడ్డుకోవడంతో రేగిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు నిన్న కోర్టులో హాజరుపరిచారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ లెక్చరర్‌...

Tuesday, February 16, 2016 - 07:07

ఢిల్లీ : ఈనెల 23 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బడ్జెట్‌ భేటీని సజావుగా నడిపించేందుకు కేంద ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో జేఎన్ యూ వ్యవహారం రగులుతున్న నేపథ్యంలో మోదీ ఏర్పాటు చేసిన ఈ భేటీకి రాజకీయ ప్రధాన్యత...

Tuesday, February 16, 2016 - 07:02

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా పది పరిశుభ్రమైన నగరాల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ టాప్ టెన్‌లో మైసూర్ మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో చండీగఢ్, మూడోస్థానంలో తమిళనాడులోని తిరిచ్చిరాపల్లి, ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం టాప్ టెన్ క్లీన్ సిటీస్‌లో ఐదో...

Monday, February 15, 2016 - 19:33

ఢిల్లీ : బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై రచ్చరచ్చ జరుగుతోంది. జేఏఎన్‌యూ ఆందోళన ముసుగులో ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్‌ను సపోర్ట్ చేస్తూ చేసిన స్లోగన్స్ జాతీయ ఛానెల్స్ తో పాటు యూట్యూబ్‌లోనూ హల్‌చల్ చేస్తున్నాయి. ఏబీవీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇతర విద్యార్థి సంఘాలపై ఆరోపణలు చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అందుకు...

Monday, February 15, 2016 - 19:30

ఢిల్లీ : జెఎన్‌యూ ఘటనకు సంబంధించి మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన గూండాలు...తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరించారు. మరోవైపు జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీని పొడిగించింది. కోర్టు వద్ద బిజెపి ఎమ్మెల్యే సాక్షిగా లాయర్లు విద్యార్థులపై...

Monday, February 15, 2016 - 16:33

ఢిల్లీ : విశాఖ నగరానికి రెండు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు లభించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రకటించారు. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరాలకు ర్యాంకింగ్‌ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాలో మైసూర్‌ నగరం మొదటి స్థానంలో నిలిచింది. రెండు మూడు స్థానాల్లో చంఢీగర్, తిరుచునాపల్లి ఉన్నాయి. ఈ జాబితాలో విశాఖపట్నం ఐదో స్థానంలో...

Monday, February 15, 2016 - 16:27

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థులపై ముష్కరులు ఇంకా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేసిన కన్హయ్యను సోమవారం పాటియాల కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోర్టు వద్దకు జేఎన్ యూ విద్యార్థులు..అధ్యాపకులు..జర్నలిస్టులు భారీగా చేరుకున్నారు. అదే సందర్భంలో నల్లకోట్లు ధరించిన కొంతమంది ముష్కరులు దాడులకు తెగబడ్డారు. జర్నలిస్టులు సైతం గాయపడిన వారిలో ఉన్నారు....

Monday, February 15, 2016 - 15:16

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 20016-17 బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో దేశ రాజధానిలో అంగన్ వాడీలు కదం తొక్కారు. అంగన్ వాడీలు సోమవారం చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్ కు తగిన కేటాయింపులు జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆరు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా...

Monday, February 15, 2016 - 12:46

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై నిన్న దాడిచేసిన సంఘటన సంఘ విద్రోహశక్తుల పనే అని సీపీఎం నేత శ్రీనివాసరావు అన్నారు. కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా...సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై బీజేపి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆయన మాటల్లోనే 'మతాన్ని, మత విద్వేశాల్ని బీజేపి...

Monday, February 15, 2016 - 10:43

ఢిల్లీ: నిన్న సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగులు ఈ సారి బెదింరింపులకు దిగారు. సీపీఎం కేంద్ర కార్యాలయానికి, సీతారాం ఏచూరికి అర్ధరాత్రి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. నీ సంగతి తేలుస్తామంటూ ఏచూరికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.

Monday, February 15, 2016 - 07:14

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ భేటీ అయ్యారు. విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో.... దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతోపాటు... పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలపై చర్చించినట్టు సమాచారం. జేఎన్‌యూ వ్యవహారం రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై...

Monday, February 15, 2016 - 07:10

హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ను టార్గెట్‌ చేస్తూ మరోసారి కాషాయ నేతలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లో షారూఖ్‌ ఖాన్‌కు చెందిన కారుపై విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. సిటీలోని హయత్‌ రీజెన్సీ హోటల్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో షారూఖ్‌ కారును నిలిపి ఉంచగా వాళ్లు రాళ్లు విసిరారు. దేశంలో నెలకొన్న మత అసహనంపై ఇంతకుముందు...

Sunday, February 14, 2016 - 21:28

ఢిల్లీ : సీపీఎంను బలహీనపరిచేందుకే దాడులు చేస్తున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. ఆదివారం సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివితో ఏచూరి మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సీపీఎంను బలహీన పరచడమే లక్ష్యంగా సంఘ్ పరివార్‌ పావులు కదుపుతోందని...

Sunday, February 14, 2016 - 21:04

ముంబై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ముంబైలో మేక్ ఇన్ ఇండియా వారోత్సవ కార్యక్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేదిక మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా మృతి చెందారా ? ఎవరైనా గాయపడ్డారా ? అనేది తెలియాల్సి ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు...

Sunday, February 14, 2016 - 20:56

ఢిల్లీ : సీపీఎం సెంట్రల్‌ కార్యాలయంపై సంఘ్‌ పరివార్‌ దాడికి తెగబడింది. సర్కారీ తప్పులను ఎత్తి చూపే భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనం.. ప్రజాస్వామ్య వాదుల పట్ల... పాలక భారతీయ జనతాపార్టీ.. దాని అనుబంధ పరివార్‌ శ్రేణుల్లో పెల్లుబుకుతున్న అసహనం..ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆదివారం.. సంఘ్‌పరివార్‌ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. దాడి సమయంలో.. సీపీఎం జాతీయ ప్రధాన...

Sunday, February 14, 2016 - 20:21

విశాఖపట్టణం :  శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 3 మ్యాచ్ ల టి-20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడవ టి-20లో భారత్ అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దోని సేన లంకేయులను 82 పరుగులకే కుప్ప కూల్చింది. స్టార్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు తీసి లంక నడ్డి విడిచాడు. తదనంతరం 83 పరుగుల స్వల్ప...

Sunday, February 14, 2016 - 19:09

ఢిల్లీ : తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీకి చెందిన నలుగురు ముష్కరులు పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించారు. అందులో ఒకరిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడారు. దాడి జరగడం దారుణమని, దృష్టి మళ్లించడానికి...

Sunday, February 14, 2016 - 18:30

ఢిల్లీ : సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముష్కరులు జరిపిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పూనుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముష్కరులు కొంతమంది సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని దాడికి యత్నించారు....

Sunday, February 14, 2016 - 17:38

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను కేంద్రాన్ని అడిగామని చెప్పారు. కేంద్ర సర్కారుతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకుంటామని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అంశాల వారీగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. 

Pages

Don't Miss