National News

Saturday, July 11, 2015 - 07:11

రష్యా : భారత- పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయా? ఇరుదేశాల ప్రధానులు రష్యాలో జరిపిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. సరిహద్దు వివాదం, ఉగ్రవాదంపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పాకిస్తాన్‌లో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోడీని నవాజ్‌షరీఫ్‌ ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ రష్యాలోని ఉఫా నగరంలో...

Saturday, July 11, 2015 - 07:05

నెల్లూరు : ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. ఇప్పటి వరకూ సొంత ప్రయోగాలతోనే సత్తాచాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తాజాగా విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన ఘనత సాధించింది. తన ప్రస్థానంలోనే భారీ వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. మరో భారీ వాణిజ్య ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో దాన్ని విజయవంతంగా...

Friday, July 10, 2015 - 19:14

ఢిల్లీ: జపాన్ పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని ఎసి సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జపాన్ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనేక కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతామని జపాన్ పారిశ్రామకవేత్తలు అన్నారని ఆయన చెప్పారు. పలు రాంగాల్లో పెట్టుబడులు...

Friday, July 10, 2015 - 17:02

జింబాబ్వే: భారత్-జింబాబ్వే తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ జోరు కొనసాగుతోంది. భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 255 పరుగుల చేసింది. అంబటి రాయుడు సెంచరీతో చెలరేగాడు. 10 బౌండరీలు, ఒక సిక్సర్ తో సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్ లో రాయుడుకు ఇది రెండో సెంచరీ. స్టూవర్ట్ బిన్నీతో కలిసి... ఆరో వికెట్ కు రాయుడు సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్ లో బిన్నీ...

Friday, July 10, 2015 - 15:42

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతి నిర్మాణానికి జాతీయ ప్రాధాన్యత ఉందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అటవీ భూములు డీనోటిఫై చేయడానికి కేంద్రం అంగకరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమమయ్యారు. రాజధాని నిర్మాణానికి అటవీ భూములు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విభజన...

Friday, July 10, 2015 - 15:36

మాస్కో: రష్యాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇరువురు నేతల మధ్య ఉగ్రవాదం, కాశ్మీర్‌ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరుదేశాలకు చెందిన మత్స్యకారులను విడుదల చేసేందుకు ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. ఉగ్రవాది లఖ్వి విడుదలను...

Friday, July 10, 2015 - 12:48

హైదరాబాద్:రష్యాలోని యుఫాలో ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీయ్యారు.. రెండు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు... వివిధ అంశాలపై చర్చించారు.. దాదాపు 50 నిమిషాలపాటు చర్చలు కొనసాగాయి.. దాదాపు ఏడాదితర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు.. శిఖరాగ్ర సమావేశాలకోసం ఇద్దరు ప్రధానులు రష్యావచ్చారు..

Friday, July 10, 2015 - 07:14

హైదరాబాద్:భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం. మరో భారీ వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి రాత్రి పీఎస్ ఎల్వీ సి -28 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ 5 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. బుధవారం ఉదయం 7గంటల 28నిమిషాలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 62 గంటల 30 నిమిషాలు నిరంతరాయంగా...

Thursday, July 9, 2015 - 16:00

ఢిల్లీ : ఆమాద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఎమ్మెల్యే కొండ్లి మనోజ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు అయ్యారు. భూ ఆక్రమణకు సంబంధించి రెండు నెలల క్రితం ఇతనిపై కేసు నమోదైంది. ఎలాంటి సమన్లు అందచయకుండా అరెస్టు చేశారని మనోజ్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మనోజ్ కుమార్ తన వ్యార భాగస్వామిని రూ.6 లక్షల మేర మోసం చేశారని ఆయనపై చీటింగ్ కేసు నమోదైన...

Thursday, July 9, 2015 - 15:32

రష్యా : భారత ప్రధాన మంత్రి రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తో మోడీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన వీరు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. మోడీ బంగ్లాదేశ్ పర్యటన అనంతరం మయన్మార్ లో సైనిక చర్య చేపట్టింది. ఈ సమయంలో ఆక్రమిత కాశ్మీర్ లో ఇదే తరహా చర్యలు...

Thursday, July 9, 2015 - 13:45

ఢిల్లీ: వ్యాపం స్కాం కేసు విచారణ బాధ్యత సీబీఐకి అప్పగిస్తూ... సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వాగతించింది. దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరిపించాలని కోరింది. ఐతే ఈ కేసులో గవర్నర్ రామ్‌నరేష్‌ యాదవ్‌ను... బీజేపీ ఎందుకు ప్రొటెక్ట్‌ చేస్తుందో వెల్లడించాలని... ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఆశిష్‌ కేతన్‌ డిమాండ్ చేశారు.

 

Thursday, July 9, 2015 - 13:24

మధ్యప్రదేశ్ : ''మీ సహాయం మాకు వద్దు..మాకు న్యాయం కావాలి..ఆరోగ్యంగా ఉన్న కొడుకు ఎలా మృతి చెందాడు' అంటూ మృతి చెందిన జర్నలిస్టు కుటుంబసభ్యులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీశారు. ఇటీవల వ్యాపం కుంభకోణం స్కాంను పరిశోధించేందుకు ఆజ్ తక్ విలేకరి అక్షయ్ సింగ్ వెళ్లి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో విపక్షాలు ముఖ్యమంత్రి చౌహాన్ పై పలు విమర్శలు...

Thursday, July 9, 2015 - 12:30

ఢిల్లీ: వ్యాపం స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకూ నడుస్తోన్న కేసులన్నీ... సీబీఐకు అప్పగించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తుందని తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, గవర్నర్‌, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది...

Wednesday, July 8, 2015 - 15:45

ఢిల్లీ : జైపూర్‌ - ఆగ్రా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బిజెపి ఎంపి హేమామాలిని తొలిసారిగా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై మృతి చెందిన చిన్నారి తండ్రినే దోషిగా నిలిపారు. మృతి చెందిన చిన్నారి తండ్రి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని, పాప బతికేదని అన్నారు. పాప చనిపోవడం తనను కలచివేసిందని హేమమాలిని పేర్కొన్నారు. హేమమాలిని ట్విట్టర్‌పై...

Wednesday, July 8, 2015 - 15:43

మధ్యప్రదేశ్ : వ్యాపం స్కాంలో సంబంధమున్నట్లు ఆరోపణలున్న మెడికల్ విద్యార్థి నమ్రతా దామోర్ 2012 జనవరిలో హాస్టల్‌ నుంచి అదృశ్యమైపోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె ఉజ్జైన్‌లో రైలు పట్టాలపై శవమై తేలింది. దీన్ని అప్పట్లో ఆత్మహత్య కేసుగా నమోదు చేసి 2014లో మూసివేశారు. ముగ్గురు డాక్టర్ల బృందం మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ 2012 జనవరి 9న నివేదిక ఇచ్చారు. దీని...

Wednesday, July 8, 2015 - 15:41

మధ్యప్రదేశ్ : వ్యాపం స్కాంపై సీబీఐ విచారణకు.. మధ్యప్రదేశ్‌ సర్కారు సిఫార్సు చేయటంతో ఆ కుంభకోణంతో సంబంధమున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు..ఇలా ఎంతో మందితో జాబితా ఉంది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ప్రముఖ మెడికల్ కాలేజ్‌ జీఎస్ వీ ఎమ్ లో సుమారు 54 మంది వ్యాపం స్కాంలో భాగంగానే అడ్మిషన్లు పొందినట్లు దర్యాప్తులో...

Tuesday, July 7, 2015 - 21:35

ఢిల్లీ : ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఆరు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చీఫ్‌ జస్టిస్‌ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నోటీసులు పంపింది. ఇదే విషయంపై కేంద్రం, ఎన్నికల సంఘం తమ వైఖరేంటో చెప్పాలని...

Tuesday, July 7, 2015 - 17:23

మధ్యప్రదేశ్ : వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికి తీస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యాపం కుంభకోణంలో ఒకరి తరువాత ఒకరు చనిపోతుంటే సీబీఐ విచారణ జరిపించాలని అంటున్నా కేంద్ర ప్రభుత్వం నోరు...

Tuesday, July 7, 2015 - 15:17

ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ విమానం (టికె-85) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో బాంబు ఉందన్న సమాచారంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఏస్పీజీ భద్రతా అధికారులు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు అత్యవసరంగా...

Tuesday, July 7, 2015 - 12:35

ఢిల్లీ: వ్యాపం... మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ కుంభకోణం పేరు చెబితేనే దేశమంతటా ప్రకంపనలు వస్తున్నాయి. ఒక్కొక్కరుగా చనిపోతున్న మిస్టిరీయస్‌ ఇన్సిడెంట్స్ ను చూస్తోంటే రేపు ఎవరి వంతోననే భేతాళ ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.
స్కాంస్టర్స్ కు ఆశిష్‌ చతుర్వేది సవాల్‌
సాక్షులు, స్కాంస్టర్లు... ఇలా వ్యాపంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగా టచ్‌లో ఉన్న...

Tuesday, July 7, 2015 - 12:07

యుపి: ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్థిని అపర కాళిక అవతారమెత్తింది. పోకిరీల పాలిట సింహస్వప్నంలా మారింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన... ఓ ఆకతాయి చెంప చెళ్లుమనిపించింది. ఫిల్బిత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తమను వేధిస్తున్న కేటుగాళ్లపై కసి తీసుకుంది. సాక్షాత్తు పోలీసు స్టేషన్‌లోనే పోకిరీకి బుద్ధి చెప్పింది. షూతో దిమ్మతిరిగేలా దంచి కొట్టింది. చివరకు...

Tuesday, July 7, 2015 - 10:41

భూపాల్: మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపమ్ స్కామ్‌లో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి మహిళ ఎస్‌ఐ చనిపోయిన ఘటన మరువక ముందే...తాజాగా మరో మరణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌ఘర్‌లో కానిస్టేబుల్ రమాకాంత్‌ పాండే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని నివాసంలోనే మృతదేహం లభ్యమైంది. కొన్నిరోజుల క్రితం...

Monday, July 6, 2015 - 15:44

ఢిల్లీ : కేంద్ర రాష్ట్ర స్థాయిలో బీజేపీ అవినీతిని ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలు ఉక్కుపాదం మోపాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 20న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఆరు ప్రధాన వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అవినీతి, అశ్రితపక్షపాతంలో కూరుకుపోయిన మంత్రులను తొలగించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని ప్రకటించాయి....

Monday, July 6, 2015 - 15:30

ఢిల్లీ : దేశ రాజకీయ పరిస్థితుల గురించి... ఎన్డీఏ ప్రభుత్వ విధానాల గురించి సీపీఎం పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. మోడీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదని సంబరాలు చేసుకున్నారని... సంవత్సరం పూర్తయ్యాక స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శించారు....

Monday, July 6, 2015 - 15:26

మధ్యప్రదేశ్ : శిక్షణలో ఉన్న ట్రైనీ ఎస్సై అనామిక మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. ఆమె మృతికి వ్యాపం స్కామ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి మరణాన్ని వ్యాపంతో ముడిపెట్టకూడదన్నారు. కుంభకోణానికి పాల్పడ్డవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. 

Monday, July 6, 2015 - 13:29

హైదరాబాద్:కేరళ రాజధాని త్రివేండ్రంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠ్యపుస్తకాల పంపిణీలో ఆలస్యంపై....ఎస్ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి నేతలు ధర్నా చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి.... విద్యార్థులను చెదరగొట్టారు.

Monday, July 6, 2015 - 12:15

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగాలకు కారణమైన వ్యాపం కుంభకోణంలో పలువురి పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తక్షణమే గవర్నర్ పదవి నుంచి రాం నరేశ్ యాదవ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పిటీషన్ స్వీకరించింది. రేపు లేదా ఎల్లుండి...

Pages

Don't Miss