National News

Friday, April 29, 2016 - 18:59

చెన్నై : తమిళనాడులో అన్ని పార్టీలు మద్యనిషేధం గురించి హామీలిస్తున్నాయి. కానీ, ఈ నెల రోజుల్లోనే అక్కడ మద్యం అమ్మకాలు పెరగడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు లిక్కర్ చుట్టూ తిరుగుతున్నాయి.  పిఎంకె, డిఎంకె, ఏఐఏడిఎంకె  ఈ మూడు పార్టీలు మద్య నిషేధానికి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రాధాన్యతనిచ్చాయి. కానీ ఎన్నికల వేళ తమిళనాడులో మద్యం వ్యాపారం మూడు  సీసాలు ఆరు...

Friday, April 29, 2016 - 17:19

ఢిల్లీ : కార్మికుల పోరాటం ఫలించింది. కార్మికులకు ఆందోళనలకు కేంద్ర సర్కాచ్ దిగివచ్చింది. పీఎఫ్ వడ్డీరేటు తగ్గింపు నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. వడ్డీరేటును 8.7 నుంచి 8.8కు పెంచుతూ జారీచేసింది. PFపై వడ్డీరేటును 8.7 శాతానికి తగ్గిస్తూ ఇటీవల ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇవాళ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. దీంతో దిగివచ్చిన ఆర్థిక శాఖ...

Friday, April 29, 2016 - 16:59

ముంబై : ఆదర్శ్‌ బిల్డింగ్‌ను కూల్చి వేయాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు పాటించలేదని కోర్టు మండి పడింది. ఆదర్శ్‌ స్కాంలో నేతలు, బడాబాబులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మాజీ సైనికుల కోసం ఆదర్శ భవన్‌ కేటాయించారు.

Friday, April 29, 2016 - 13:15

ఢిల్లీ : వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్స్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా స్పందించారు. బ్యాంకులతో సెటిల్‌మెంట్‌ చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు మాల్యా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు లండన్‌కు చెందిన ఓ పత్రిక ప్రచురించింది. బ్యాంకులతో తాను తరచూ చర్చలు జరుపుతున్నానని.. న్యాయమైన సెటిల్‌మెంట్లకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు...

Friday, April 29, 2016 - 13:10

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణకు బొగ్గు కుంభకోణం వదలడం లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాంలో దాసరిపై మరింత ఉచ్చు బిగిసింది. ఈ రోజు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, మధుకోడాలపై ఛార్జీషీట్ నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అక్రమ మార్గాల్లో బొగ్గు కేటాయింపులు జరిపారంటూ ఆధారాలు ఉన్నాయని...

Friday, April 29, 2016 - 12:18

గుజరాత్ : పటేళ్ల ఉద్యమానికి సర్కార్ దిగొచ్చింది. గత కొంతకాలంగా పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి హార్థిక్ పటేల్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు..తనదైన శైలిలో ఆందోళనలు చేస్తుండడంతో ప్రభుత్వం ఇరకాటలో పడిపోయింది. గుజరాత్ రాష్ట్రం ప్రతిష్టాత్మకం కావడంతో కేంద్రం ఏదైనా నిర్ణయం...

Friday, April 29, 2016 - 12:11

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై కేంద్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోర్టును అటార్నీ జనరల్‌ కోరారు. ఇప్పటికిప్పుడు పరీక్షను హిందీ, ఇంగ్లీషులో రాయడం కష్టమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని...

Friday, April 29, 2016 - 09:02

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ దీక్ష చేపట్టారు. దేశద్రోహం, జాతీ వ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో కన్హయ్య కుమార్ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్హయ్య కుమార్ తో పాటు మరో 14 మంది విద్యార్థులపై జేఎన్ యూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. కన్హయ్య కుమార్ కు రూ.10వేల జరిమానా, ఉమర్ ఖలీద్ అనే విద్యార్థి సంఘం నేతకు ఒక సెమిస్టర్...

Thursday, April 28, 2016 - 21:34

హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోదిపై సరికొత్త దాడి చేశారు. మోదికి సంబంధించిన విద్యార్హతలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్‌కు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ప్రధాని మోదీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు. తన వివరాలను బహిరంగ...

Thursday, April 28, 2016 - 21:31

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ స్కాంకు సంబంధించి కాంగ్రెస్ నేతలు సోనియా, మన్మోహన్, అహ్మద్ పటేల్‌పై కేసు పెట్టాలని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటలీకోర్టులో తీర్పులో వెల్లడైన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరపాలని పిల్‌లో పేర్కొన్నారు. దీన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు -...

Thursday, April 28, 2016 - 21:30

ఢిల్లీ : రాజ్యసభలో బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై రగడ జరిగింది. సుబ్రమణ్యస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. సుబ్రమణ్యస్వామి పార్లమెంట్‌కు వచ్చి రెండు రోజులే అవుతోంది, ఆయన వాడిన భాషను రెండు సార్లు సభా రికార్డుల నుంచి తొలిగించారు. ఇలా ఎన్ని సార్లు ఆయన మాటల్ని తొలిగిస్తారని కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్...

Thursday, April 28, 2016 - 21:27

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశీయ జీపీఎస్ వ్యవస్థను సుస్థిరం చేసుకునే దిశగా తుది రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ఎగిరింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉప గ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను...

Thursday, April 28, 2016 - 17:02

ఢిల్లీ : గుట్టలుగా పేరుకుపోతున్న కేసుల భారాన్ని న్యాయవ్వవస్థపై మోపవద్దంటూ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పెట్టిన కంటతడి మోదీ సర్కార్‌ను కదిలించింది. తక్షణమే రంగంలోకి దిగి.. కార్యాచరణను ప్రారంభించింది. గత నెల ఢిల్లీలో జరిగిన ఫోరం ఫర్ ఫాస్ట్ జస్టిస్‌ చేసిన తీర్మానాలను పరిశీలించింది. అవే తీర్మానాలను రాష్ట్రాలకు పంపి...

Thursday, April 28, 2016 - 16:55

ఢిల్లీ : వైద్య వృత్తి ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన నీట్ ఎగ్జామ్‌ నిర్వహణపై సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నీట్ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఎంబిబిఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించాలంది. రెండు విడతలుగా నీట్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో మే 1, జులై 24 తేదీల్లో...

Thursday, April 28, 2016 - 13:24

ఢిల్లీ : భారత శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ ఎస్ -1జీ ని రోదసీలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మోడీ ప్రసంగించారు. ఒకటి తరువాత ఒకటి ఇలా..ఏడు ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం జరిగిందని, జీపీఎస్ సిస్టంలో...

Thursday, April 28, 2016 - 12:48

బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరులో కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తో సమావేశమయ్యారు. రాజోలి బండ నీటి మళ్లింపు ఎత్తు పథకంపై చర్చించారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపు ఉన్నా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కాల్వల ఆధునీకరణ చేపట్టినా పూర్తి కాలేదు...

Thursday, April 28, 2016 - 11:46

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్..బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్న రాజ్యసభలో బీజేపీకి దాడికి దిగిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభలో ఆగస్టా ల్యాండ్ పై చర్చకు కాంగ్రెస్ పార్టీ నోటీసిచ్చింది. ఈ అంశంపై సుబ్రమణ్యస్వామి..డిప్యూటి...

Thursday, April 28, 2016 - 11:39

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... మరో మైలు రాయిని చేరుకోబోతుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ ఎస్ -1జీ ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం ద్వారా పూర్తిస్థాయి పరిజ్ఞానంతో.. నావిగేషన్ వ్యవస్థను వినియోగించుకునేందుకు మార్గం సుగుమం కానుంది. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిపుష్టం కానుంది. నావిగేషన్...

Thursday, April 28, 2016 - 11:36

బెంగళూరు : గోదావరినదిపై నిర్మించే ప్రాజెక్ట్‌లపై మహారాష్ట్రలో సయోధ్య కుదర్చుకున్న తెలంగాణ సర్కార్‌ ఇప్పుడు కర్నాటకతో ఇదే విధంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్ట్‌ల విషయంలో కర్నాటక ఇరిగేషన్‌ మంత్రి ఎంబీ పాటిల్‌తో చర్చించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బెంగళూరు వెళుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి...

Thursday, April 28, 2016 - 10:55

పశ్చిమ బెంగాల్ : ఓ వైపు తండ్రిని కోల్పోయిన దు:ఖం. అంత్యక్రియలు పూర్తి చేసిన మరుసటి రోజే పోలింగ్. అంతటి బాధలోనూ ఆ యువకుడు పోలింగ్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. పశ్చిమబెంగాల్ లో జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇతను పేరు రాజీవ్ మిస్త్రీ. నార్త్ పరగణాల జిల్లాలోని హరోవా ఇతని స్వగ్రామం. తండ్రి సిపిఎం కార్యకర్త. మొన్న సోమవారం ఈ గ్రామంలో పోలింగ్ జరిగింది. అంతకు...

Thursday, April 28, 2016 - 09:22

పశ్చిమబెంగాల్ : ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ లో ఆసక్తికర పోటీ నెలకొంది. దీదీగా పేరొందిన మమతాబెనర్జీ బౌదీగా పేరుతెచ్చుకున్న దీపాదాస్ మున్షీతో తలపడుతున్నారు. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు కూడా రంగంలో వుండడంతో పోటీ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. భవానీపూర్ లో దీదీకి బౌదీకి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. టిఎంసీ కార్యకర్తలు మమతాబెనర్జీని...

Thursday, April 28, 2016 - 06:41

ఢిల్లీ : పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు మోడీ సర్కార్‌ అగస్టా వెస్ట్ ల్యాండ్‌ చాపర్‌ స్కాం అస్త్రాన్ని ప్రయోగించింది. సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్‌ టాప్‌ లీడర్స్‌కు ఈ స్కాంతో సంబంధం ఉందని బిజెపి ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభలో వ్యూహాత్మకంగా సోనియాపై దాడికి బిజెపి- సుబ్రహ్మణ్య స్వామిని దింపింది. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సోనియా...

Wednesday, April 27, 2016 - 17:27

ఢిల్లీ : ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగించాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. శాస‌న‌స‌భ‌లో ఈనెల‌ 29న బ‌ల నిరూప‌ణ లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిష‌న్‌పై ఈరోజు వాద‌న‌ల‌ను విన్న సుప్రీం రాష్ట్రప‌తి పాల‌న...

Wednesday, April 27, 2016 - 17:19

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. హెలిక్యాప్టర్ల కొనుగోళ్లకు సంబంధించి ఇటలీ కంపెనీ అగస్టా వెస్ట్‌లాండ్‌తో తానెలాంటి తప్పుడు పనులు చేయలేదని తెలిపారు. దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని సోనియా పేర్కొన్నారు. ఏవైనా తప్పులు జరిగితే రెండేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్టీయే ప్రభుత్వం ఎందుకు...

Wednesday, April 27, 2016 - 17:18

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ పై రాజ్యసభ్యలో దుమారం చెలరేగింది. ఆగస్టా కుంభకోణంపై ఎన్డీయే తరుపున నూతనంగా రాజ్యసభ సభ్యత్వం పొందిన సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆరోపణలు చేశారు. అగస్టాకు సంబంధించి సోనియా పేరు ఉన్నట్లు మధ్యవర్తి క్రిశ్చన్‌ మిశేల్‌ ఇటలీ కోర్టులో రాత పూర్వకంగా ఇచ్చారని స్వామి ఆరోపంచారు. సోనియా పేరు తీసుకోవడంతో...

Wednesday, April 27, 2016 - 10:45

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టింది. కాంగ్రెస్‌కు ఎస్పీ, బిఎస్పీ, వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. కాంగ్రెస్‌ సభ్యుల గందరగోళం మధ్య సభ ఈరోజుకు వాయిదా పడింది. ఉత్తరాఖండ్‌ అంశపై కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో...

Wednesday, April 27, 2016 - 10:43

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... మరో మైలు రాయిని చేరుకోబోతుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ సీ -1G ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం ద్వారా పూర్తిస్థాయి పరిజ్ఞానంతో.. నావిగేషన్ వ్యవస్థను వినియోగించుకునేందుకు మార్గం సుగుమం కానుంది. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిపుష్టం కానుంది. నావిగేషన్...

Pages

Don't Miss