National News

ఉత్తర్ ప్రదేశ్ : తన భర్త మరణానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలని తివారీ భార్య కల్పన డిమాండ్‌ చేశారు. తన భర్త ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. తనకు రూ.కోటి పరిహారం, పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎంకు ఆమె లేఖ రాశారు. తివారీ, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తివారీ మృతికి బాధ్యులైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఆత్మ రక్షణ పరిమితులను దాటి వారు అతిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని అన్నారు. ఎవరినీ కాల్చేందుకు పోలీసులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడిని పోలీస్ కానిస్టేబుల్ కాల్చిచంపిన ఘటన సంచలనం రేపుతోంది. తనిఖీల సమయంలో కారు ఆపలేదన్న కారణంతో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం లక్నోలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో పెరిగిన ఎన్‌కౌంటర్ల సంస్కృతి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లక్నోలోని విలాసవంతమైన గోమతీనగర్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రశాంత్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వివేక్ తివారీ యాపిల్ కంపెనీ ఉద్యోగి. తివారీ విధులు ముగించుకొని వస్తున్న సమయంలో గస్తీ కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయన వాహనాన్ని ఆపమని కోరారు. కానీ ఆప కుండా ముందుకు పోవడంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈఘటనలో తివారీ అక్కడే మృతి చెందాడు. ఈసమయంలో కారులో మరో మహిళ కూడా ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్ : మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. గ్రనైడ్లు, తుపాకులతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం షోపియాన్ పీఎస్‌పై దాడికి పాల్పడ్డారు.  ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన ఉగ్రవాదులు పీఎస్‌పై గ్రనైడ్లు విసురుతూ..తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కొద్దిసేపటి అనంతరం పోలీసులు తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. కానీ ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. అనంతరం అడవుల్లోకి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు పీఎస్‌కు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. అడవుల్లో నక్కిన ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపడుతున్నారు. షోపియాన్ జిల్లాలో పట్టు సాధించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులే టార్గెట్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం నలుగురిని పోలీసులును ఉగ్రవాదులు మట్టబెట్టారు. దాడులు చేసిన అనంతరం పోలీసుల ఆయుధాలను ఎత్తుకెళుతున్నారు. 

కర్ణాటక : మండ్య జిల్లా మళవళ్లి తాలూకా చిక్కబాగిలు గ్రామంలో దారుణ హ‌త్య జ‌రిగింది. పశుపతి, గిరీశ్ అనే ఇద్ద‌రు మంచి మిత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఐతే రెండు రోజుల కిందట ఓ సంఘటనకు సంబంధించి గిరీశ్‌‌- పశుపతి తల్లి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో ప‌శుప‌తి త‌ల్లిని గిరీశ్ దూషించినట్టు స‌మాచారం. ఈ సంఘటన స్నేహితులిద్దరి మధ్య గొడ‌వ‌కు దారితీసింది. ఆ గొడ‌వ‌ను సీరియ‌స్‌గా తీసుకున్నప‌శుప‌తి, గిరీశ్‌ను హ‌త‌మార్చాల‌ని స్కెచ్ వేశాడు. స‌ర‌దాగా వెళ‌దామంటూ గిరీశ్‌ను స‌మీపంలోని కొళతూరు గ్రామం వరకు తీసుకెళ్లాడు. అక్కడ వాహనాన్ని నిలిపి.. కత్తితో గిరీష్‌ తల నరికాడు. హత్యానంతరం తలను తీసుకుని నిందితుడు 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మళవళ్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన తల్లిని నానా దుర్భాషలాడినందుకే హతమార్చినట్లు నిందితుడు పశుపతి పోలీసులకు చెప్పాడు.

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ వ్యాఖ్యలతో నానా పాటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో వార్తలు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ మహిళా దర్శకురాలు ఫరా ఖాన్ నానా పాటేకర్ తో కలసి ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నానా పాటేకర్ తో కలసి ఉండడం, అతడి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫరా ఖాన్ పై తనుశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు ఎలాంటి మనిషో ఓ వైపు నేను చెబుతూనే ఉన్నాను. సాటి మహిళగా నా వేదనకు విలువ ఇచ్చి అండగా నిలబడాల్సింది పోయి అతడితో సంతోషంగా గడుపుతూ, పైగా ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి అని తనుశ్రీ మండిపడింది. 
ప్రస్తుతం నానా పాటేకర్ హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నాడు. జైసల్మేర్ లో జరుగుతున్న షూటింగ్ ఫినిష్ కావడంతో చిత్ర యూనిట్ ముంబైకి బయలు దేరింది. ఈ సందర్భంగా నానా పాటేకర్ తో పాటు చిత్ర యూనిట్ తో దిగిన సెల్ఫీని ఫరా ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
తనుశ్రీ తనపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో నానా పాటేకర్ గుర్రుగా ఉన్నాడు. తన న్యాయవాదులతో కలసి ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తనుశ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నానా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

 

ఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంత మహిళా వ్యాపారుల జాబితాలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీ అలైస్‌ వైద్యన్‌ చోటు దక్కించుకున్నారు. మనదేశం నుంచి జాబితాలో స్థానం పొందింది ఈమె ఒక్కరే. ప్రస్తుత సంవత్సరానికి గాను అమెరికా వెలుపల 50 మంది శక్తిమంత మహిళా వ్యాపారులతో ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ ఈ జాబితా రూపొందించింది. ఇందులో అలైస్‌ వైద్యన్‌కు 47వ ర్యాంకు లభించింది. 

 

మహారాష్ట్ర : కంపెనీలో పనిచేసే వారిని యజమానులు కేవలం పనివాళ్లుగా మాత్రమే చూస్తారు. కానీ సూరత్‌ వ్యాపారి సావ్జీ ధోలాకియా.. సిబ్బందిపై అపారమైన ప్రేమను కురిపిస్తాడు. తన సిబ్బందికి విలువైన బహుమతులు ఇస్తూ... వారిని ఆనందంలో ముంచెత్తుతుంటారు. తన కంపెనీలో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న ముగ్గురు సీనియర్‌ ఉద్యోగులకు మూడు కార్లు ఇచ్చారు. అవి ఇలాంటి.. అలాంటి కార్లు కావు. మూడు కోట్ల విలువచేసే మెర్సిడెజ్‌ బెంజ్‌కార్లు. గుజరాత్‌ మాజీ సీఎం, మధ్యప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఆనందిబెన్‌ చేతుల మీదుగా వారికి కారు తాళాలు అందజేశారు. సిబ్బంది పనితనాన్ని బట్టే బహుమతులు అందజేస్తుంటానని ధోలాకియా చెప్పారు.

ధోలాకియా సిబ్బందికి గతంలో దీపావళికి 51 కోట్ల రూపాయలు బోనస్‌ ఇవ్వడంతోపాటు 1260 కార్లు, 400 ఫ్లాట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక 2017 కొత్త సంవత్సరం కానుకగా... 1200 కార్లు ఉద్యోగులకు ఇచ్చారు. ఇవి ఆయన ఉదార స్వభావానికి మచ్చుతునకలు.

 

బెంగళూరు: పార్టీ ఫిరాయించి బీజేపీలో   చేరితే మంత్రి పదవితో పాటు రూ.30 కోట్ల నగదు ఇస్తామని  కమల దళం  నుంచి ఆఫర్‌ వచ్చినట్లు కర్నాటకలోని బెళగావి గ్రామీణ నియోజకవర్గ  కాంగ్రెస్  ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాల్కర్  శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. ఆమె ఇక్కడ బెళగావిలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ..తాను హైదరాబాద్‌లో ఉన్న సమయంలో  పార్టీ మారమని  బీజేపీకి చెందిన ఓ బీజేపీ నేత తనకు ఫోన్‌ చేశారని,  బీజేపీ  నాయకులు తనకు చేసిన ఫోన్‌లోని సంభాషణల్ని రికార్డు చేసి పార్టీ నాయకులకు చూపినట్లు తెలిపారు. ‘ఆపరేషన్‌ కమలం’ గురించి నాయకులకు వివరించానన్నారు.  ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు లక్ష్మి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్‌ కమలం చేపట్టడం అనైతికమని, వారిచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని ఆమె తెలిపారు. అయితే తనతో సంప్రదింపులు జరిపిన నేతల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్నారు. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని లక్ష్మి హెబ్బాళ్కర్‌ వ్యాఖ్యానించారు. రానున్న మంత్రివర్గ విస్తరణ నేపథ్యమే ఆమె ఆరోపణలకు కారణంగానూ  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

ముంబై : ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘోర విషాదాన్ని ముంబై వాసులు మరలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో 23 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. దీనితో పలువురు మృతి చెందిన వారి ఫొటోలను స్టేషన్ లో ఏర్పాటు చేశారు. మృతి చెందిన వారికి పలువురు నివాళులర్పిస్తున్నారు. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నారు. 
అసలేం జరిగింది...
సెప్టెంబర్ 29, 2017...ఉదయం...ముంబైలో వర్షం...స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే మార్గంలో పాదచారుల వంతెన ఉంటుంది. ఉదయం వర్షం రావడంతో ప్రయాణికులు స్టేషన్‌లో ఆగిపోయారు. వర్షం నిలిచిపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా వంతెనపైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు కొందరు వంతెన కడ్డీలు పట్టుకుని కిందకు పరుగులు తీశారు. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయారు. వారిపై నుండి ఇతరులు తొక్కుకుంటూ వెళ్లడంతో చనిపోయారు. దీనిపై అక్కడి ప్రభుత్వం స్పందించి కమిటీని నియమించింది. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనిపై హైకోర్టులో కూడా పిల్ దాఖలైంది. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగి 23 మంది చనిపోయిన ఘటనలో విచారణ జరిపిన రైల్వేస్ ప్యానెల్.. నెపాన్ని వర్షం మీదికి నెట్టేసింది. భారీ వర్షం కురవడంతో ప్రయాణికుంతా బ్రిడ్జిపైకి వెళ్లడానికి ప్రయత్నించడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ప్యానెల్ తేల్చింది.

హైదరాబాద్ : సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌లో సమాచార భద్రత డొల్లగా మారింది. వంద కాదు.. వెయ్యి కాదు.. దాదాపు ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారానికి ముప్పు వాటిల్లింది. ఫేస్‌బుక్‌లోని సాంకేతిక లోపంతో  ఎటాకర్లు ఫేస్‌బుక్‌ ఖాతాల్లోకి ప్రవేశించి సమాచారం చోరీ చేస్తున్నట్టు సంస్థ గుర్తించింది. 

సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌లో సమాచార భద్రత ప్రమాదంలో పడింది. ఫేస్‌బుక్‌ ఖాతాల్లోకి హ్యాకర్లు చొరబడుతూ సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా దాదాపు ఐదు కోట్ల  మంది ఖాతాదారుల సమాచారం చోరీకి గురయ్యే  అవకాశం ఉందని గుర్తించిన ఫేస్‌బుక్‌ సంస్థ.. దీనిపై ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అమెరికా దర్యాప్తు సంస్థ... ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌... ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఐరిష్‌ డెటా ప్రొటెక్షన్‌ కమిషన్‌కు కూడా తెలియజేసింది. 

వ్యూ యాజ్‌ ఫీచర్‌ ద్వారా ఎటాకర్లు ఫేస్‌బుక్‌ ఖాతాల్లోకి చొరబడి వ్యక్తిగత సమాచారం దొంగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో సమాచార గోప్యతకు ముప్పు కలుగుతోంది. ఆర్థిక లావాదేవీలతోపాటు వ్యక్తం సమాచారం కూడా సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఆ తర్వాత తొమ్మిది కోట్ల మంది ఖాతాదారుల అకౌంట్లను బలవంతంగా లాగౌట్‌ చేయించింది. 

ఎటాకర్ల చొరబాటుతో ఎన్ని ఖాతాల్లోని సమాచారం బయటకు పొక్కిందన్న అంశంపై ఫేస్‌బుక్‌ స్పష్టత ఇవ్వలేదు. ఎక్కడ నుంచి చొరబాటు జరుగుతోంది, ఈ పని చేస్తోంది ఎవరు... అన్న విషయాలను గుర్తించలేదు.  జరిగిన దానికి ఖాతాదారులకు క్షమాపణ చెప్పిన ఫేస్‌బుక్‌ యాజమాన్యం. సమాచార భద్రత కోసం ఫేస్‌బుక్‌ భారీగానే ఖర్చు చేస్తోంది. దాదాపు పదివేల మంది సిబ్బంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. అయినా ఎటాకర్ల చొరబాట్లు ఆగడంలేదు. గత ఏడాది జులైలో ఇలాంటి లోపాన్ని గుర్తించినప్పుడు వీడియో అప్‌లోడింగ్‌ ఫీచర్‌లో మార్పలు చేశారు. మళ్లీ ఇప్పుడు సమాచార భద్రతకు ముప్పు ఏర్పడటంతో ఈ రంగంలో పనిచేసే సిబ్బందిని 20 వేలకు పెంచాలని నిర్ణయించింది. 

ఢిల్లీ : ఆసియాకప్‌ మరోసారి భారత్‌ కైవసం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చివరికి ఇండియానే విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి మరోసారి ఆసియాకప్‌ను తన ఖాతాలో వేసుకుంది. భారత బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ధావన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కించుకున్నాడు. దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది.  48.3 ఓవర్లలో  ఆలౌట్‌ అయిన బంగ్లాదేశ్‌... 222 పరుగులు చేసింది. 

223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడ్డాయి.  83 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. 4వ వికెట్‌గా క్రీజ్‌లోకి అడుగుపెట్టిన ధోనీ.. దినేష్‌ కార్తీక్‌తో కలిసి పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి  జట్టు స్కోర్‌ పెంచేందుకు శ్రమించారు.  వీరిద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 137 పరుగుల దగ్గర దినేష్‌ కార్తీక్‌ ఔట్‌ అయ్యాడు. దినేష్‌ కార్తీక్‌ ఔటైన కొద్దిసేపటికే ధోనీ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమ్‌ ఇండియా పీకల్లోతు కష్టాలో మునిగిపోయింది. బాల్స్‌ ఉన్నప్పటికీ స్కోరుబోర్డు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్‌ జాదవ్‌ కొద్దిగా ఊరట కల్పించాడు. అంతలోనే కాలికి గాయంతో పిచ్‌ నుంచి వెనుదిరిగాడు.
 
టీమిండియా పేసర్లు రవీంద్ర జడేడా, భువనేశ్వర్‌ కుమార్‌ కలిసి స్కోర్‌ను కాస్త పెంచారు. ఈ క్రమంలోనే జడేజా ఔట్‌ అయ్యాడు. ఆ వెంటనే భువి కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో జాదవ్‌ మళ్లీ క్రీజ్‌లోకి అడుగుపెట్టాడు. కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు.  27 బంతులాడిన జాదవ్‌ 23 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. బౌలింగ్‌లోనూ రాణించిన జాదవ్‌ 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సెంచరీ చేసి బంగ్లా స్కోర్‌లో కీలక భూమిక పోషించిన  లిటన్‌ దాస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక భారత ఓపెన్‌ శిఖర్‌ ధావన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రధాని నరేంద్ర మోదీపై నేరుగా విమర్శలు ప్రారంభించారు. మోదీ విదేశీ పర్యటనలు..  డిజిటల్‌ ఇండియా... మేక్‌ ఇన్‌ ఇండియాతో సాధించింది ఏంటో చెప్పాలని నిలదీశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగొట్టిన ఆర్థిక నేరస్థులను దేశం దాటించడమే ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ప్రగతా.. అని చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఏపీ ముఖ్యమంత్రి చందబాబు... ప్రధాని మోదీని నేరుగా టార్గెట్‌ చేశారు. చంద్రబాబు అమెరికా పర్యటనపై బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ... విదేశీ పర్యటనలో మోదీ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. డిజిటల్‌ ఇండియాతో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు సాధించిన ఫలితాలు ఏంటో చెప్పాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. 
బైట్‌ః చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి 

అసూయతో విమర్శలు చేస్తే బీజేపీకి ఒరిగేదేమీ ఉండదని బాబు ధ్వజమెత్తారు. బోఫోర్స్‌ కుంభకోణం రాద్ధాంతం చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు రాఫెల్‌ స్కామ్‌పై ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు  ప్రశ్నించారు. వాస్తవాలను వక్రీకరించొద్దని ప్రధాని మోదీతోపాటు బీజేపీ నాయకులకు చంద్రబాబు సూచించారు. 

ఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. భక్తి పేరుతో మహిళల పట్ల వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలపింది. సుప్రీంకోర్టు తీర్పును మహిళా హక్కుల సమాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ స్వాగతించారు. ఇది మహిళలకు దక్కిన విజయం అని ఆమె అన్నారు. 

ముంబై : కన్నకూతురైన షీనా బోరాను హత్య చేసిందన్న ఆరోపణలతో జైలులో ఉంటున్న వ్యాపారవేత్త ఇంద్రాణి ముఖర్జియా ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం అస్వస్థతతో ఉన్న ఇంద్రాణిని జేజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆమె బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 
హైపోటెన్షన్ ఇతరత్రా కారణాలతో ఆసుపత్రిలో చేరడం జరిగిందని ఆసుపత్రి సూపరిటెండెంట్ ఓ జాతీయ ఛానెల్‌తో పేర్కొన్నారు. గతంలో ఛాతిలో నొప్పి కారణంగా..ఇతరత్రా కారణాలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీ  ప్రధాన నిందితురాలు. 2012 ఏప్రిల్‌ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్‌ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

ముంబయి: ఫేస్‌బుక్ తన అసలు బండారాన్ని బట్టబయలు చేసింది. మీ అకౌంట్ భధ్రత పేరుతో సేకరిస్తున్న ఫోన్ నెంబర్లు అసలు లక్ష్యం వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ నెంబర్లను తమ అడ్వర్‌టైజ్‌మెంట్లను ఎవరిని టార్గెట్ చేయాలో తెలుసుకొనేందుకే నంటూ అసలు విషయాన్ని చిన్నగా తెలియజేసింది ఫేస్‌బుక్.

‘‘మాకు వచ్చిన సమాచారాన్ని వ్యక్తిగత సేవలను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తాము.. అందులో అడ్వర్‌టైజ్‌మెంట్లు కూడా ఉంటాయి’’ అంటూ ఫేస్‌బుక్ ప్రతినిధి టెక్ క్రంచ్ అనే మీడియా సంస్థకు తెలియచేసింది.  రెండు విధాల గుర్తించేందుకు ఫేస్‌బుక్ వినియోగదారులు ఫోన్ నెంబరును జతచేయాల్సి ఉంటుంది. ఇది వినియోగదారుల అకౌంట్ భధ్రత కల్పించడం ప్రధాన లక్ష్యం అయినప్పటికీ... యాడ్స్‌ను ప్లేస్ చేసేందుకు ఈ నెంబర్లు ఉపయోగిస్తామని ఫేస్‌బుక్ తేల్చిచెప్పేసింది. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఫేస్ బుక్ కృషి ప్రయత్నం చేస్తున్నట్టు తేటతెల్లమైంది కదా..!

కేరళ : శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునన్న సుప్రీం కోర్టు తీర్పుపై ఆలయ ప్రతినిధుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. అయ్యప్ప ఆలయం ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్పందిస్తూ ‘కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, అమలు చేస్తాం కూడా.. కానీ థార్మిక అంశాలతో ముడిపడివున్న సమస్యపై  కోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకంగా లేదు’ అని వ్యాఖ్యానించారు.
సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు..
శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మహిళలకు అనుమతిపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పును ప్రకటించింది. 4-1 తేడాతో తీర్పును ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. దీనితో పలువురు సుప్రీంను తీర్పును స్వాగతించారు.
తీర్పు ప్రతి అందాక సమగ్రంగా పరిశీలించి నిర్ణయం : ఎ.పద్మకుమార్‌ 
ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌ స్పందిస్తూ తీర్పు ప్రతి అందాక సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. ‘మా విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక మాకు మరో మార్గం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చట్టాలు..సమాజం అందరినీ గౌరవించాలి : జస్టిస్ దీపక్ మిశ్రా 
చట్టాలు..సమాజం అందరినీ గౌరవించాలని జస్టిస్ దీపక్ మిశ్రా వెల్లడించారు. ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదని, పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువేమి కాదని వ్యాఖ్యానించారు. ఓవైపు దేవతలను పూజిస్తూనే మరోవైపు మహిళలను సమదృష్టితో చూడకపోవడం సరికాదని పేర్కొన్నారు. మహిళలను దేవతలుగా పూజించే దేశం మనదని, మహిళల నిషేధమనేది హిందూ మత స్వేచ్చకు భంగం కలిగిస్తుందని తెలిపారు. మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు - పురుషులపై లేని వివక్ష మహిళలపై ఎందుకు? - ప్రైవేటు ఆలయాలు ఉండవు.. ఎవరైనా వెళ్లొచ్చు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో కీలకవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలో పూజలు చేయడానికి మగవారిపై లేని వివక్ష ఆడవారిపై ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడ పూజలకు స్త్రీలు అర్హులేనని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి 10-50 ఏండ్ల మధ్య వయసు మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి.

 

కర్ణాటక : కరడు కట్టిన ఉగ్రవాదులు కూడా ఒకో సందర్భంగా మానవత్వం వున్న మనిషిగా ప్రవర్తించిన దాఖలాలు లేకపోలేదు. మనిషి అంటే సహజంగా వుండే ప్రేమ, జాలి. దయ,మానవత్వం వంటివి వారు పెరిగిన వాతావరణ పరిస్థితుల ప్రభావం వుండకుండాపోదు. వారి వారి పెరిగిన పరిస్థితుల వల్ల కొంతమంది నేరస్థులుగా మారుతుంటారు. ఒక్కసారి నేరస్థుడు అనే ముద్ర పడిన తరువాత ఆ వ్యక్తిపై అదే ముద్ర కొనసాగుతుంది. కానీ కిరాయి తీసుకుని దారుణ హత్యలు చేసేఈ నరహంతుకుడు మాత్రం చిన్నారులను చూసి చలించిపోయాడు. 
ఓ వివాహితను హత్య చేసేందుకు సుపారీ తీసుకున్నాడు. ఆమెను చంపేందుకు వెళ్తే అక్కడామె పిల్లలు కనిపించారు. ఆమెను చంపితే వారు అనాథలైపోతారని భావించి డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. శివమొగ్గలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే రవీంద్రగిరి-అనిత దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి 8 ఏళ్ల అబ్బాయి, 6 ఏళ్ల అమ్మాయి ఉన్నారు. రవీంద్రకు గత కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని ప్రియురాలిని పెళ్లాడాలని ప్లాన్ వేశాడు.

భార్య అనితను చంపించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్ ఫిరోజ్‌తో రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనితను హత్య చేసేందుకు ఫిరోజ్ తన అనుచరులు సయ్యద్ ఇర్ఫాన్, సుహైల్‌లతో కలిసి వెళ్లాడు. అయితే, అక్కడామె పిల్లల్ని చూసి చలించిపోయాడు. ఆమెను చంపితే పిల్లలు అనాథలైపోతారని భావించాడు. మూడుసార్లు హత్యకు ప్రయత్నించినా ప్రతిసారీ పిల్లల భవిష్యత్ గుర్తుకు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇక ఆ హత్యను చేయలేనని ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. ఈ ఘటనతో మానవత్వం మేలుకొలిపిన మనిషిగా ఫిరోజ్ మారిపోయాడు.

ఢిల్లీ : అయోధ్యపై వివాదం కొనసాగున్న నేపథ్యంలో అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు నిన్న కీలక రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే అయోధ్య వివాదం తరచు వార్తల్లోకి వస్తుండటం గమనించాల్సిన విషయం. ఈ క్రమంలో అయోథ్య స్థల వివాదంపై అయోధ్య ముస్లింలకు పవిత్ర స్థలం కాదని ఆమె అన్నారు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి హిందువులకు ఇది పవిత్ర స్థలమని చెప్పారు. ముస్లింలకు సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర స్థలమని తెలిపారు. 16వ శతాబ్దంలో రాముడి దేవాలయం స్థానంలో బాబ్రీ మసీదును నిర్మించారని గతంలోనే ఉమాభారతి పలుమార్లు చెప్పారు. పలువురు బీజేపీ నేతలతో కలసి బాబ్రీ మసీదు కూల్చివేత కార్యకర్తను ఉద్దేశించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.

అయోధ్యలో రామమందిరం- బాబ్రీ మసీదు వివాదం కేసును ఐదుగురు జడ్జీల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ చివరివారంలో విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే తుది నిర్ణయంపై 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాగా, ఈ తీర్పు విషయంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ లతో జస్టిస్ అబ్దుల్ నజీర్ విభేదిస్తూ, విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడ్డారు.  
 

ఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని, ఈ అంశంలో స్త్రీస్వేచ్ఛకు సమాన హక్కు ఉందని,  బ్రిటీష్‌ కాలంలో పుట్టుకు వచ్చి 497 రాజ్యాంగ నిబంధన ఈ తరానికి అవసరం లేదంటూ భారత అత్యున్నత  న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యత్రనార్యంతు పూజ్యంతి తత్ర రమంతు దేవతా’...అన్న ఆర్యోక్తిని ఉటంకిస్తూ మహిళలు గౌరవం పొందనిచోట రాక్షసులు నివాసం ఉంటారని వ్యాఖ్యానించారు. భారతీయ సంప్రదాయంలో మహిళదే ఆధిపత్యమని, పాశ్యాత్యదేశాల్లో అమలవుతున్న ‘సమానత్వం’ అంశం మనకు వర్తించదని అన్నారు. మన దేశంలో మహిళను ఎంతో గౌరవిస్తాం. సమాజంలో వారిదే ఆధిపత్యం. అటువంటి చోట సమాన హక్కు కల్పించాలంటూ కోర్టుకు వెళ్లడం సరికాదు. అసలు ప్రతి విషయానికి ఈ జనం కోర్టునెందుకు ఆశ్రయిస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించారు. బ్రిటీష్‌ కాలంనాటి ఏకపక్ష పురాతన నిబంధన సెక్షన్‌ 497 అని సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసిన విషయం తెలిసిందే.

 

ఆమె పాట పాడిదంటే పరశవించిపోవాల్సిందే. ఆ గాన మాధుర్యానికి సాటి..పోటి..రాగల గళం మరొకటి లేదనే చెప్పవచ్చు. దశాబ్దాలు గడిచినా మాధుర్యం తరగని స్వరం ఆమెది. ఆమెనే గాన కోకిల...‘లతా మంగేష్కర్’. ఆమె పుట్టిన రోజు నేడు. లతా 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుండే ఆమె తండ్రి దగ్గర సంగీతం నేర్చుకుంది. అనంతరం హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ ఆలీఖాన్, అమానత్ ఆలీఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. లతా మంగేష్కర్ మొదటి సారిగా మరాఠి మూవీలో పాడారు. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి ఆమె పాటను తొలగించారు. 

మహాల్ సినిమాతో లతకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ‘ఆయేగా..ఆయేగా’ అనే పాటతో మంచి క్రేజ్‌తో ముందుకు దూసుకెళ్లారు. ఆగ్’, ‘శ్రీ 420’, ‘చోరి చోరి’, ‘హైవే నెంబర్ 44’, ’దేవదాస్’ వంటి చిత్రాలు బాలీవుడ్‌లో తిరుగులేని గాయనిగా నిలబెట్టాయి.  1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన ‘మొఘల్-ఏ-ఆజమ్’ సినిమాలో పాడిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాట ఎంత సంచలన సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికీ పలువురి నోట ఈ పాట నానుతూ వస్తుంది. ‘మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్’’ సినిమాల్లో.. లతా పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తెలుగులో కూడా లతా పాటలు పాడారు. ఈ పాట తెలుగు ప్రేక్షకుల్ని అలరిచింది. ‘సంతానం’ సినిమా కోసం ఆమెతో పాట పాడించారు. ‘ఆఖరి పోరాటం’ సినిమాలో తెల్లచీరకు అనే సాంగుని కూడా పాడారు. 

ఈ గానకోకిలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1948 నుంచి 1978 వరకు 50వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను సత్కరించింది. 
గానకోకిలకు టెన్ టివి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది. 

 

ఢిల్లీ : శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మహిళలకు అనుమతిపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పును ప్రకటించింది. 4-1 తేడాతో తీర్పును ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. దీనితో పలువురు సుప్రీంను తీర్పును స్వాగతించారు.

చట్టాలు..సమాజం అందరినీ గౌరవించాలని జస్టిస్ దీపక్ మిశ్రా వెల్లడించారు. ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదని, పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువేమి కాదని వ్యాఖ్యానించారు. ఓవైపు దేవతలను పూజిస్తూనే మరోవైపు మహిళలను సమదృష్టితో చూడకపోవడం సరికాదని పేర్కొన్నారు. మహిళలను దేవతలుగా పూజించే దేశం మనదని, మహిళల నిషేధమనేది హిందూ మత స్వేచ్చకు భంగం కలిగిస్తుందని తెలిపారు. మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు - పురుషులపై లేని వివక్ష మహిళలపై ఎందుకు? - ప్రైవేటు ఆలయాలు ఉండవు.. ఎవరైనా వెళ్లొచ్చు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో కీలకవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలో పూజలు చేయడానికి మగవారిపై లేని వివక్ష ఆడవారిపై ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడ పూజలకు స్త్రీలు అర్హులేనని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి 10-50 ఏండ్ల మధ్య వయసు మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్ : అత్యున్నత న్యాయస్థానం..ఈ మధ్యకాలంలో కీలక తీర్పులను వెలువరిస్తోంది. తాజాగా మరొక కీలక తీర్పును సుప్రీం వెల్లడించనుంది. శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలో మహిళలు పూజలు చేయాలా ? వద్దా ? అనే దానిపై సుప్రీం ఎలాంటి తీర్పును వెల్లడించనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

రాజ్యాంగం కల్పించిన హక్కు - పురుషులపై లేని వివక్ష మహిళలపై ఎందుకు? - ప్రైవేటు ఆలయాలు ఉండవు.. ఎవరైనా వెళ్లొచ్చు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో కీలకవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలో పూజలు చేయడానికి మగవారిపై లేని వివక్ష ఆడవారిపై ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడ పూజలకు స్త్రీలు అర్హులేనని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి 10-50 ఏండ్ల మధ్య వయసు మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా దేవాలయంలో ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కొన్నేళ్ల పాటు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత ఆగస్టులో తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరి తీర్పును ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

హైదరాబాద్ : అమెరికా, హాంకాంగ్‌, మలేషియాల్లోనూ రేవంత్‌రెడ్డి ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది.  2014కు ముందే బ్లాక్‌మనీతో మలేసియాలో ఆస్తులు కొన్నట్లు  రేవంత్‌పై ఆరోపణలున్నాయి.  మలేషియాలో ఆస్తులను ఐటీ రిటర్న్‌లో గానీ, ఎన్నికల అఫిడవిట్‌లో గానీ పేర్కొన లేదంటున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించి లోతుగా కూపీ లాగిన ఐటీ అధికారులు.. రేవంత్‌రెడ్డికి చెందిన రెండు విదేశీ బ్యాంక్ అకౌంట్లను కనిపెట్టారు.  హాంకాంగ్‌లోని బ్యాంక్‌ ఆఫ్ ఈస్ట్‌ ఆసియాలో ఓ అకౌంట్, కౌలాలంపూర్‌లోని ఆర్‌హెచ్‌బి బ్యాంక్‌లో మరో అకౌంట్‌ రేవంత్‌ రెడ్డికి ఉన్నట్లు గుర్తించారు. 2014..  ఫిబ్రవరి 25న కౌలాలంపూర్‌లోని రఘువరన్‌ మురళి  అకౌంట్‌ నుంచి .. ఈ రెండు బ్యాంక్ అకౌంట్లకు దాదాపు 20 కోట్లు బదిలీ అయ్యాయి. అయితే, ఈ అకౌంట్ల గురించి గానీ, లావాదేవీల గురించి గానీ ఐటీ అధికారులకు రేవంత్‌రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. దీంతో ఇదంతా బ్లాక్‌మనీగానే అనుమానిస్తున్నారు అధికారులు. 

 

జార్జియా :  ప్రేమకు కులం, మతం, ప్రాంతం, ఆస్తులు, అంతస్థులు వీటితో సంబంధం లేదు. భాషకు సంబంధం లేదు. భావంతో మనస్సులు కలుస్తాయ్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకేనేమో దేశాలతో సంబంధం లేకుండా ఖండాంతర వివాహలు జరుగుతుండటమే దానికి నిదర్శనం. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినప్పటికీ ప్రేమ జంటగా మారతారు. అటువంటి ఓ జంటకు వేదికయ్యింది చెస్ టోర్నమెంట్. 
చెస్‌ టోర్నమెంటు వార్తలు రాయడానికి వెళ్లిన ఓ భారతీయ జర్నలిస్టు ఓ కొలంబియన్‌ చెస్‌ తారపై మనసు పారేసుకున్నాడు. అంతేకాదు..ఆమెకు ఆయన చెస్‌ టోర్నమెంట్ జరుగుతుండగా ప్రపోజ్‌ చేసి, ఆమె మనసుని దోచుకున్నాడు. ఆమెకు తన ప్రేమ విషయం తెలిపి ఉంగరం తొడుగుతుండగా తీసిన వీడియో వైరల్‌ అవుతోంది. కొలంబియాకు చెందిన చెస్ క్రీడాకారిణి‌ ఎంజిలా లోపెజ్‌కి భారత్‌కు చెందిన జర్నలిస్టు నిఖిలేశ్‌ జైన్‌ ఇలా తన ప్రేమను వ్యక్తపరచాడు. ఆయన జర్నలిస్టు మాత్రమే కాదు చెస్‌ క్రీడాకారుడిగా పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనటం చెప్పుకోదగిన విషయం.
జార్జియాలో జరుగుతున్న చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనడానికి వచ్చిన ఎంజిలా లోపెజ్‌ కొందరితో మాట్లాడుతున్న సమయంలో ఆమెకు ప్రపోజ్‌ చేయడానికి సిద్ధమైన నిఖిలేశ్‌ ఈ దృశ్యాలను వీడియో తీయించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పేసుకుంది. 
దీనిపై నిఖిల్ మాట్లాడుతు..నా ప్రేమను తెలియపర్చడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ, నేను చెస్‌ పోటీలు జరుగుతున్న హాలులోనే ప్రపోజ్‌ చేయాలనుకున్నాను. 189 దేశాలకు చెందిన క్రీడాకారులు ఇక్కడ చెస్‌ ఆడుతున్నారు. ఇది మాకు దేవాలయం వంటిది’ అని నిఖిలేశ్‌ తెలిపాడు. 

ఢిల్లీ : భారత్ నిరుద్యోగులకు టెలీకామ్ రంగం శుభవార్త అందించింది. చదవులు పూర్తయి ఉద్యోగ వేటలో అలసిపోయిన నిరుద్యోగులకు ఈ వార్త శుభవార్తే. మరో 4 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూపొందించిన టెలికాం నూతన విధానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇతర దేశాలతో పాటే దేశీయంగానూ 5జీ సేవలు ప్రారంభించడంతో పాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, యంత్రాల మధ్య సమాచార మార్పిడి వంటివీ సాధించేందుకు 100 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.7.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ‘జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ విధానం  2018’ను రూపొందించినట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ఇక్కడ వెల్లడించారు. వినియోగదారులకు అనువుగా, అప్లికేషన్‌తో ముందుకు సాగే విధానంగా అభివర్ణించారు. బ్రాండ్‌బ్యాండ్‌ను అందరికీ చేరువ చేయడం, అంతర్జాతీయ ఐసీటీ సూచీల్లో దేశ స్థానాన్ని 50కి చేర్చడమూ నూతన విధాన ఆశయమని మంత్రి వివరించారు. జీడీపీలో టెలికాం వాటాను ప్రస్తుత 6 .5 శాతం నుంచి 8 శాతానికి చేర్చాలన్నది ప్రణాళికగా పేర్కొన్నారు. ‘ఐదేళ్లలో అందరికీ 50 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాడ్‌బాండ్‌ సదుపాయం అందుబాటు ధరల్లో కల్పించడం’ నూతన విధాన ముఖ్య ప్రణాళికగా తెలిపారు. ఆప్టికల్‌ ఫైబర్‌, 5జీ సాంకేతికతలతో అధికవేగం బ్రాడ్‌బ్యాండ్‌ను అత్యధికులకు అందుబాటు ధరల్లో సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆశయం. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పేరును డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ నియంత్రణ సంస్థగా మారుస్తున్నట్లు తెలిపారు.

ఢిల్లీ : యువతకు ఏది నచ్చితే అదే ట్రెండ్ అవుతుంది.వారు దేన్ని ఇష్టపడితే అదే మార్కెట్ లో సేల్స్ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా యువత బైక్స్ అంటే ప్రాణం పెడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బైక్ తయారీ కంపెనీలు యూత్ కి నచ్చే విధంగా తయారుచేస్తున్నారు. ఆకర్షించే లుక్..రయ్ మని దూసుకెళ్లే సత్తా..పక్కవారిని కూడా ఆకర్షించగలిగే స్టైల్ ఇటువంటి బైక్ లకు మంచి గిరారీ వుంది. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకున్న బైక్ కంపెనీదారులు యూత్ ను ఎట్రాక్ట్ చేసేందుకు విశ్వప్రయత్నం  చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఖరీదైన బైకులు తయారు చేసే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రెండు కొత్త మోటార్‌సైకిల్‌ మోడళ్లను అంతర్జాతీయంగా విడుదల చేసింది. 
ఇందులో కాంటినెంటల్‌ జీటీ 650 ధర 5,799 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4,21,558, ఇంటర్‌సెప్టర్‌ ఐఎన్‌టీ మోడల్‌ ధర 6,749 డాలర్లు రూ.4,90,618గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు మోడళ్లలో ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌లను అమర్చింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి భారత్‌, అమెరికా, బ్రిటన్‌, ఐరోపా సహా ప్రధాన మార్కెట్లలో విక్రయాలు ప్రారంభిస్తామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తెలిపింది. ‘అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందించిన, అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులు ఇవే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగేందుకు ఇవి దోహదపడతాయి’ అని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓ సిద్దార్థ లాల్‌ తెలిపారు. కంపెనీకి చెందిన చెన్నైలో ఒరగాడమ్‌ ప్లాంట్‌ నుంచి వీటిని ఉత్పత్తి చేయనున్నారు. భారత్‌లో సైతం ఏడాది చివరికి బైకులు అందుబాటులోకి వస్తాయని లాల్‌ అన్నారు. ఈ రెండు కొత్త మోడళ్ల అభివృద్ధికి అయిన వ్యయాలు వివరాలను కంపెనీ వెల్లడించలేదు. పెద్ద బైకులను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వినియోగదారులు కోరుతున్నారని, కొత్త బైకులు వారి డిమాండ్‌ను తీరుస్తాయని లాల్‌ వెల్లడించారు. 2010లో కంపెనీ విక్రయాలు దాదాపు 50,000 కాగా.. 2017లో వీటి సంఖ్య 8,20,000కు పెరిగింది.

ఢిల్లీ : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. అయోధ్య రామజన్మ భూమి వివాదంపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. గతంలో కూడా సుప్రీం దీనిపై పలు తీర్పులు వెలువరించిన సంగతి తెలిసిందే. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తీర్పును వెలువరించింది. ఈ వివాదంలో సుప్రీంకోర్టు పలు సూచనలు కూడా చేసింది. ఇరు పక్షాలూ కూర్చుని.. చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. రామజన్మభూమి వివాదాన్ని కోర్టు వెలుపలే, ఇరుపక్షాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ సూచించారు. రాముడు జన్మించిన చోటే రామాలయం నిర్మించాలని సంఘ్‌ పరివార్‌ పట్టుబడుతుంటే.. ఆ స్థలంపై హక్కు తమదేనంటూ వక్ఫ్‌ బోర్డు వాదిస్తోంది. రామాలయ నిర్మాణం.. వివాదాస్పద స్థలంపై హక్కు ఎవరిది అన్న అంశాలు కీలకంగా మారాయి. సమస్య వివాదాస్పద భూమిపై హక్కు గురించినది అయినప్పుడు.. ఇరు పక్షాలూ కూర్చుని చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. 

1992 డిసెంబర్‌ 6 బాబ్రీమసీద్‌ విధ్వంసం...
1992 డిసెంబర్‌ 6 అయోధ్య లోని బాబ్రీమసీద్‌ విధ్వంసానికి గురైంది. హిందూ సంస్థల కరసేవకులు ఈ కట్టడాన్ని కూల్చివేశారు. అప్పటి నుంచి ఈ స్థలం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా....హిందూ మహాసభకు చెందుతుందా అనే వివాదం తలెత్తింది. వివాదస్పద 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు, నిర్మోహి అఖరాకు, రామ్‌లల్లాకు పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. రామ మందిరం భూమి రికార్డుల అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సుప్రీంకోర్టే దీన్ని తేల్చాల్సి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాబ్రీ మస్జిద్‌ యాక్షన్‌ కమిటీ కూడా, అయోధ్య వివాదానికి కోర్టు వెలుపల పరిష్కారానికి లభించే అవకాశం ఏ మాత్రం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

2010లో రామజన్మభూమికి అనుకూలంగా అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. రామాలయ నిర్మాణం కోసం మరో ఉద్యమాన్ని చేపడతామని విశ్వహిందూ పరిషత్‌ గతంలో స్పష్టం చేసింది. అక్టోబర్ 29 నుంచి సీజేఐ దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. అయోధ్య కేసుకు సంబంధించిన అన్ని పిటీషన్లను అప్పుడే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

ఢిల్లీ : తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. అసెంబ్లీ రద్దైన నాటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే ఎన్నికల నియమావళి అమల్లో ఉందని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని ఈసీ తెలిపింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి విధానపరమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ  సూచించింది. ప్రజలను ఆకర్షించేలాకొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించకూడదని షరతు విధించింది. అనధికార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులను వినియోగించుకోరాదని తెలిపింది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు ఈసీ లేఖ ద్వారా తెలిపింది. కేంద్రప్రభుత్వం సహా అసెంబ్లీ రద్దు అయిన అన్ని రాష్ట్రాల్లోను ఈ నియమాలు వర్తిస్తాయని తెలిపింది. 

 

Pages

Don't Miss