National News

హైదరాబాద్ : బాలీవుడ్‌లో మోస్ట్ హ్యపెనింగ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అమిర్‌ఖాన్, కత్రీనా కైఫ్‌లు నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రయోగాన్ని విజయ్ కృష్ణ ఆచార్య చేస్తున్నారు.  యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తున్నది. 1839నాటి ఫిలిప్ మిడోస్ టేలర్ అనే రచయిత రాసిన 1839నాటి ఓ నవల ఆధారంగా ఈ సినిమా వస్తోంది. సినిమా బడ్జెట్ రూ.210కోట్లుగా అంచనా. ఇక ట్రైలర్ విడుదలకి సినిమా యూనిట్ అంతా హాజరవగా రెస్పాన్స్ అద్భుతం అంటున్నారు. ఇందులో అమితాబ్ బందిపోటు దొంగగా నటిస్తున్నారు. ట్రైలర్ విజువల్ వండర్ గా రూపొందింది. స్వాతంత్య్రానికి పూర్వం బందిపోట్లకు, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగే పోరాటమే ఈ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఆ వయసులో కూడా అమితాబ్ ఎంతో చక్కగా నటించారు.  

ఢిల్లీ : ఇప్పుడు మార్కెట్ లో పతంజలి ప్రొడెక్ట్ హాట్స్ కేక్స్. యోగా గురువుగా పేరొందిని రామ్ దేవ్ బాబా మార్కెట్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు. నిత్యవసర వస్తువులన్నీ పతంజలిలో అందుబాటులో వున్నాయి. దానికి తగిన మార్కెట్ ను కూడా రామ్ దేవ్ బాబానే స్వయంగా యాడ్స్ చేస్తున్నారు. నాచ్యురాలిటీపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో పతంజలి ప్రొడక్ట్స్ కు మంచి గిరాకి వుంది. ఈనేపథ్యంలో రామ్ దేవ్ బాబా మరో అడుగు వేశారు. వస్త్రప్రపంచంలోకి అడుగిడి మార్కెట్ కు మరో ఝలక్ ఇచ్చారు. 
వ్యాపార విస్తరణలో భాగంగా వస్త్ర మార్కెట్‌లోకి ప్రవేశించాలని యోగా గురువు బాబారామ్‌దేవ్‌ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ‘పతంజలి పరిథాన్‌’ పేరుతో ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌ లెట్‌లను తెరవాలని నిర్ణయించినట్లు రామ్‌దేవ్‌ ట్వీట్‌ చేశారు.
దేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటా అవుట్‌లెట్లు తెరిచి ప్రాంచైజీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ఇటీవలే టెలికాం రంగంలోకి అడుగు పెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌తో జతకట్టి ‘స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డును’ జారీ చేసిన విషయం తెలిసిందే. డెయిరీ వ్యాపారం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. మరి పతంజలి ప్రొడక్ట్ వలె వస్త్ర మార్కెట్ లో కూడా పతంజలి తన ముద్రతో ఎటువంటి మార్పులు చేయనుందో..మార్కెట్ ను తనవైపు ఎలా తిప్పుకోనుందో వేచి చూడాలి.

ఢిల్లీ : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అయోధ్య రామజన్మ భూమి వివాదంపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విస్తృత ధర్మాసనానికి కేసు అప్పగించాలా లేదా అన్న దానిపై విచారణ సాగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

 

ఢిల్లీ : రైల్వే అధికారుల ఆలోచనా తీరు ఎలా వుందీ అంటే వేలు కాలితే కాలు తీసేసిన చందంగా వుంది. సమ్యలుంటే పరిష్కరించాల్సింది పోయి ఆ సమస్యను మరింతగా జటిలం చేసేలా రైల్వే అధకారుల తీరు వుంది. సాధారణంగా రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగించేందుకు మరింతగా కృషి చేస్తారు. కానీ మన రైల్వే అధికారులు మాత్రం డిఫరెంట్. రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం కోసం మన అధికారులు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ పరిశుభ్రత కేటగిరిలో మంచి ర్యాంకు పొందిన ఓల్డ్ ఢిల్లీ అధికారుల నిర్ణయంపై పబ్లిక్ నుండి తవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాయ్ లెట్ల పరిశుభ్రతగా వుండేందుకు రాత్రిపూట టాయిలెట్లను మూసేయాలని నిర్ణయించారు. నిత్యం ప్రయాణికులు వెళుతూ ఉండే ఈ స్టేషన్ లో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ స్టేషన్ లో మరుగుదొడ్లను మూసేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అధికారుల నిర్ణయంతో అసలు మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతింటోందని ప్రజలు వాపోతున్నారు.

 

హైదరాబాద్ : దేశ వ్యాపితంగా శుక్రవారం మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. మెడికల్ షాపుల బంద్ కు ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్్ట డ్రగ్ డీలర్్స అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ తరహా వ్యాపారానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ (1940) మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈనెల 20 నుంచి మెడికల్‌ షాపుల నిర్వాహకులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపారంలో ఉన్న 8లక్షల మంది కెమి్‌స్టలు, వారిపై 80లక్షల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని అసోసియేషన్ పేర్కొంటోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసరంగా మందులు మాత్రం అందిస్తామిన, వెబ్‌సైట్ల నుంచి తీసుకున్న మందులు వికటిస్తే ఎవరు కారణమని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు

ఢిల్లీ : రానున్నది పండుగల కాలం...మంచి డిస్కౌంట్లు...వస్తాయి..ఫ్రిజ్..కండీషనర్లు..ఇతరత్రా కొనాలని అనుకుంటున్నారా ? కానీ కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అత్యావశ్యకం కాని దాదాపు 19 వస్తువులపై కేంద్రం Govt Raises న్ని పెంచింది. కరెంటు ఖాతా లోటును (సీఏడీ) కట్టడి చేసేందుకు గాను ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన సుంకాలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో సర్కారు నిర్ణయం సామాన్యుడిని కొంత కలవర పెట్టింది. 

దేశీయంగా దిగుమతులు పెరిగిపోతుండడం...ఎగుమతుల్లో తరుగుదలతో కరెంటు ఖాతా లోటు పెరుగుతోంది. అంతేగాకుండా రూపాయి మారకపు విలువ తగ్గుతుండటంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు పెల్లబికాయి. దిగుమతులను తగ్గించేందుకు గాను సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. సుంకాలు పెరగడంతో ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, పాదరక్షలతో పాటు పలు వస్తువులు 5-20 శాతం మేర ప్రియం కానున్నాయి.
స్పీకర్లు, పాదరక్షలు, రేడియల్‌ కార్‌ టైర్లు, ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మెషిన్లు (10 కిలోల లోపు), ఏసీ మరియు రిఫ్రిజిరేటర్ల కంప్రెసర్లు, జ్యువెల్లరీ తయారీకి ఉపయోగించే వాణిజ్య సంబంధిత ఇతర మెటల్స్‌, పారిశ్రామికేతర వజ్రాలు, స్నానపు గదుల్లో ఫిక్చ్సర్లు, షవర్లు, సింకులు, 

ముక్కలు చేసి సానపట్టిన రంగు రాళ్లు, అభరణాలు, కంసాలీలు ఉపయోగించే పరికరాలు, ఫర్నీచర్‌కు సంబంధించిన ఫిట్టింగ్‌లు, గాజులు, అలంకరణ షీట్లు, వాష్‌ బేసిన్‌లు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఆర్టికల్స్‌, ప్యాకింగ్‌ బాక్స్‌లు, కేసులు, కంటైనర్లు, సీసాలు, ఇన్సూలేటెడ్‌ వేర్‌లు, టేబుల్‌ వేర్‌, వంటగదిలో వాడే ఉపకరణాలు, ఆఫిస్‌ స్టేషనరీ, పరుపులు, ట్రంకు పెట్టెలు, సూట్‌ కేసులు, ఎగ్జిక్యూటివ్‌ కేసులు, బ్రిఫ్‌ కేసులు, బ్యాగులు, ట్రావెల్‌ బ్యాగ్‌లు, విమాన ఇంధనాలపై కస్టమ్స్‌ సుంకం పెరగనుంది.

న్యూఢిల్లీ: హిత మహిళతో ఒక వ్యక్తి  చేసిన శృంగారం నేరంగా పరిగణించరాదని  సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇష్టపూర్వకంగా చేసే శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం  సంచలన తీర్పు చెప్పింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొంది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పొడుస్తోందిని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళలకు సమాన హక్కులు కల్పించడాన్ని అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

 

ఢిల్లీ : నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌సంస్థ వాట్సాప్‌... రిలయన్స్‌ జియోతో కలిసి పనిచేయనుంది. జియో ఫోన్లలో వాట్సప్‌ ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం జరిగింది. జియో ఫోన్‌ వినియోగదారుల్లో ఎక్కువ మంది తొలిసారి ఇంటర్నెట్‌ వినియోగించేవారు ఉన్నారు. వచ్చిన సందేశం ఎంత వరకూ వాస్తవమని ఆలోచించి ఇతరులకు పంపేలా జియో సంస్థ తన చవక ఫోన్‌ వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. దీనికి సంబంధించిన మెటీరియల్‌ను వినియోగదారులు ఫోన్‌లో పొందేలా జియో సంస్థ విధానం రూపొందించిందని వాట్సప్‌ ప్రతినిధులు తెలిపారు. జియో చేస్తున్న ఈ ప్రచారంలో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు వెల్లడించారు.

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు రసవత్తరంలో పడ్డాయి. అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రయోగించిన ఆపరేషన్‌ కమలానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కాంగ్రెస్‌ అసంతృప్తులను బుజ్జగించడంలో సీనియర్లు సఫలం అయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలుస్తోంది. మరోవైపు విధాన పరిషత్‌ ఎన్నికల్లోనూ బీజేపీ వెనక్కి తగ్గింది. కర్నాటకలో మైత్రీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రిసార్ట్స్‌ రాజకీయాలపై ఆచితూచీ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 8 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను ముంబైకి తీసుకువెళ్లి, చర్చలు జరిపి.. వారితో రాజీనామాలు చేయించాలనే వివాదానికి ప్రస్తుతం బ్రేక్‌ పడింది.  బీజేపీ చేయదల్చుకునన రిసార్ట్స్‌ రాజకీయాలు బయటపడడంతో సీఎం కుమారస్వామి, సీఎల్పీనేత సిద్దరామయ్య ప్రతివ్యూహాలతో సిద్ధమవ్వడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. 

చెన్నై : డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (65) అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న స్టాలిన్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారని డీఎంకే పేర్కొంది. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల గత కొన్ని నెలలుగా మెడికల్ చెకప్ చేయించుకోలేదని, సాధారణ చెకప్‌లో భాగంగానే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారని డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ టీఆర్ బాలు మీడియాకు తెలిపారు. అంతేగాకుండా ఆయన తొడలో చిన్న కణితి ఉందని, అది తొలగించేందుకు వైద్యులు సర్జరీ చేయనున్నారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం వరకు స్టాలిన్‌ను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేస్తారని ప్రకటించారు. 

అయోధ్య రామ జన్మభూమి వివాదం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసుది. ఎన్నో ఏళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. కాగా ఈ కేసు తుది అంకానికి చేరింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామ మందిరం కేసులో కీలక తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించనుంది. అయోధ్య రామ జన్మభూమి వివాదంపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. మసీదు ఇస్లాంలో అంతర్భాగం కాదని గతంలో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడంపై నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు గురువారం ప్రకటించవచ్చు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

 

ఈ కేసులో తీర్పును 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించవద్దని, విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ఉన్న జస్టిస్‌ దీపక్‌ మిశ్రా... గాంధీ జయంతి (అక్టోబర్ 2న) రోజున పదవీ విరమణ పొందనున్నారు. దీపక్ మిశ్రా రిటైర్మెంట్‌కు కొన్ని రోజుల ముందు.. హిందువులు, ముస్లింలకు సంబంధించిన కీలక తీర్పు వెల్లడిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

హైదరాబాద్‌ : విమానంలో చిన్నారి మృతి చెందాడు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ మరణించాడు. ఆర్నవ్‌ వర్మ అనే 11 నెలల బాబు తన తల్లిదండ్రులతో కలిసి ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎస్‌ఆర్‌-500లో ఖతార్‌లోని దోహా నుంచి హైదరాబాద్‌ వస్తున్నాడు. అయితే విమానంలో ఉండగా అతనికి  ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దీంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే వెంటనే చిన్నారిని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. అయితే బాబు అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించినట్లు తెలిపింది. ఆర్నవ్‌ వర్మకు అమెరికా పాస్‌పోర్ట్‌ ఉండగా, బాబు తండ్రి అనిల్‌ వర్మకు భారత పాస్‌పోర్ట్‌ ఉంది. 

 

ఢిల్లీ :కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చెరకు రైతుల కోసం మరో రూ.4500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. గత జూన్‌ మాసంలో చెరకు రైతుల కోసం  రూ.8500 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. చక్కెర ఎగుమతి కోసం మిల్లులకు రవాణా రాయితీ కింద ఈ ప్యాకేజీని పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్త టెలికం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదించింది.  

వంద బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశంలో 40లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన కొత్త టెలికం విధానానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ (ఎన్డీసీపీ) -2018 పేరుతో రూపొందించిన ఈ విధానం ద్వారా 5జీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో హైస్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటు ధరలో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఒక సెకనుకు 50 మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2020 నాటికి దేశంలో 40లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. 

 

చండీఘర్: డీజిల్, పేట్రోల్ ధరలు భగ్గుమంటుంటే.. దొంగల చూపు ఇప్పుడు వీటిపై పడుతోంది. హర్యానాలో జరిగిన ఈ సంఘటన పోలీసులను సైతం విస్మయ పరిచింది.  

చండీఘర్‌కు చెందిన ముగ్గురు దొంగలు ధన్యేశ్వర్ అంబోర్, నితేష్ కల్యాంకర్, జేమ్స్ మార్టిన్ 80 లీటర్ల డీజిల్‌ను ఓ లారీ నుంచి దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. భీమ్‌సింగ్ చందన్‌సింగ్ అనే డ్రైవర్ తన లారీని పార్క్ చేసి టీ తాగేందుకు దిగగా.. వీరు ముగ్గురు డ్రైవర్‌ను చితకబాది... లారీ తాళం చెవులను లాక్కుని లారీతో సహా పరారయ్యారు. లారీలో ఉన్న డీజిల్‌ను తీసుకొని లారీని కొద్ది దూరంలో వదిలేసి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే. ఉన్నత శిఖరానికి ఎదిగినా.. అమ్మకు ఆ బిడ్డ పొత్తిళ్లలోని వాడే. అమ్మ ప్రేమకు హద్దులుండవు. తల్లికి మించిన గొప్ప గురువు ఇంకెవ్వరూ ఉండరు. అందుకే కని పెంచిన తల్లిని మరువకూడదు అంటారు. తాజాగా కర్నాటకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన మాతృమూర్తి కాళ్లకు మొక్కుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇటీవలే పోలీసు శిక్షణ ముగించుకుని సబ్ ఇన్ స్పెక్టర్ గా డ్యూటీలో జాయిన్ కావాల్సిన ఆయన ముందుగా ఇంటికి వెళ్లి తన తల్లి కాళ్లకు మొక్కాడు. తండ్రి అకాల మరణం చెందడతో.. తల్లే అన్నీ తానైంది. కష్టపడి కొడుకుని చదివించింది. ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. తల్లి కష్టం కళ్లారా చూసిన కొడుకు.. విధుల్లో చేరే ముందు తల్లి కాళ్లకు మొక్కాడు. అలా తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఓ ఐపీఎస్ అధికారి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేయగా.. ఇప్పుడా ఫొటో వైరల్ గా మారింది. కన్నతల్లి పట్ల ఆ పోలీసు చూపిన గౌరవానికి, ప్రేమాభిమానాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఢిల్లీ : జపాన్ దేశస్థులకు పని పిశాలు అని పేరు. పనిచేయకుండా వుండటం అనేది వారి దేశ చరిత్రలోనే లేదని ఆర్థిక విశ్లేషకులు సైతం అంటుంటారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి..అభివృద్ధి అని పరుగులు పెట్టిన శతాబ్దకాలనికి అభివృద్ధివైపు పయనించిన జపాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఆ దేశపు తయారీ వస్తువుంటే ఒక స్టేటస్ సింబల్ గా చెప్పుకునే స్థాయికి చేరుకుంది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన వెంటనే పడి లేచిన కెరటంలా అభివృద్ధి వైపు రాకెట్ లా దూసుకుపోతుంటుంది జపాన్. ఇక భారత్ మాటకొస్తే..వ్యవసాయ ఆధారిత దేశంగా పేరొందిన భారత్ జనాభాతో పోల్చుకుంటే భారత్ చాలా చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో జపాన్ తో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటమే కాక జపాన్ ను అధిగమించబోతోందని ఓ సర్వేలో వెల్లడయ్యింది. మరి ఇది భారతీయులకు అతి పెద్ద శుభవార్తేనని ఖచ్చితంగా చెప్పి తీరవలసిందే.భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నట్లు హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్, బ్లూమ్‌బెర్గ్ అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2017లో ఆరో స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి జపాన్‌ను అదిగమించబోతున్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది.
 
అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, భారత దేశంలో పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న జనాభా పెరుగుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇదే ప్రధాన ప్రోత్సాహకారిగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. 2030నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ 26 ట్రిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలోనూ, అమెరికా ఆర్థిక వ్యవస్థ 25.2 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంలోనూ, 5.9 ట్రిలియన్ డాలర్లతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలోనూ నిలుస్తాయని ఈ అధ్యయనం అంచనా వేసింది.

 

అస్సాం : కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంకే గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. సుమారు 429,93 sq కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్ లో ఖడ్గమృగాల జోలికెళ్లితే కాల్చిపడేస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ ఖడ్గమృగాలు అధిక సంఖ్యలో కంజిరంగా పార్క్ లోనే వుంటాయి. కాగా ఖడ్గమృగాల కొమ్ము చాలా విలువైనదిగా పేర్కొంటారు. ఆ కొమ్ములో క్యాన్సర్ తో పాటు అనేక రోగాలను కూడా నయం చేసే ఔషధ గుణాలు వుంటాయని నమ్ముతుంటారు. దీంతో ఖడ్గమృగాలు వేటగాళ్ల బారిన పడి వాటి సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల పట్ల కఠిన చర్యల్ని తీసుకుంటోంది. ఈ ఖడ్గమృగాల కొమ్ము విదేశాల్లో లక్షల ధర పలుకుతోంది. దీంతో ఖడ్గమృగాల జోలికెళ్లినా..వాటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించినా..ఏమాత్రం అనునించకుండా కాల్చిపడేయాలని  అటవీశాఖ అధికారులు కాల్చిపడేస్తారు. 2016లో ఖడ్గమృగాలను వేటాడే వేటగాళ్ల సంఖ్యకంటే అటవీశాఖ అధికారులు కాల్చిపడేసిన వేటగాళ్ల సంఖ్యే ఎక్కువంగా వుంది అంటే వారు ఎంతటి కఠిన చర్యల్ని అవలంభిస్తున్నారో ఊహించవచ్చు. ఒకప్పుడు వేళ్లమీద లెక్కించగలిగే ఖడ్గమృగాల సంఖ్యల 207కి కంజిరంగా పార్క్ లో 2400లకు పెరిగటం గమనించాల్సిన విషయం. 

 

మధ్యప్రదేశ్ : సర్కార్ అధికారుల వింత వింత చేష్టలకు బొడియా గ్రామం వేదికయ్యింది. మనుష్యులకు రేషన్ సక్రమంగా అందని సమాజంలో వున్న మనం ఓ శునకరాజానికి మాత్రం రేషన్ కార్డ్ ని ఇచ్చింది ఎంపీ గవర్నమెంట్. మధ్యప్రదేశ్‌లో అధికారుల నిర్వాకానికి నిదర్శనమైన ఈ వింత ఉదంతం గురించి తెలుసుకోవాలంటే మనం బోడియా గ్రామానికి వెళ్లాల్సిందే. 
 
ఓ కుక్కకు 60 కిలోల రేషన్ సరకులను పంపిణీ చేశారని తాజాగా గుర్తించిన అధికారులు నాలిక్కరుచుకున్నారు. అపై సిగ్గుపోయి అన్నీ మూసుకున్నారు. బోడియా గ్రామానికి చెందిన నర్సింగ్ బోదార్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కకు రాజు అనే పేరు రేషన్ కార్డులో నమోదు చేయించాడు. బోడియా చౌకధరల దుకాణంలో ఆధార్ కార్డులను తనిఖీ చేస్తుండగా నర్సింగ్ బోదార్ తన భార్యతోపాటు రాజు అనే కుమారుడున్నాడని పేర్కొన్నాడు. రాజు ఎక్కడని ప్రశ్నిస్తే తన పెంపుడు కుక్కే తన కుమారుడని నర్సింగ్ సెలవిచ్చాడని ధర్ పౌరసరఫరాలశాఖ అధికారి ఆనంద్ గోలే చెప్పారు.
 
నర్సింగ్ ప్రతీ వారంలాగే రేషన్ సరకుల కోసం చౌకధరల దుకాణానికి వచ్చాడు. మీ కుమారుడు రాజు ఆధార్ కార్డు ఎక్కడుందని సేల్స్ మెన్ ప్రశ్నించాడు. రాజు అంటే నా పెంపుడు కుక్క టూ నర్సింగ్ తాపీగా సెలవిచ్చాడు. దీంతో సేల్స్ మెన్ తోపాటు పౌరసరఫరాలశాఖ అధికారులు నివ్వెరపోయారు. నర్సింగ్‌కు రేషన్ కార్డు గ్రామపంచాయతీలో ఇచ్చారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి కుక్క పేరిట రేషన్ సరకులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ అధికారి ఆనంద్ గోలే తెలిపారు.

 

మహారాష్ట్ర : నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాని కారు పైనుంచి వెళ్లినా ఓ పిల్లాడు బతికాడు. ఈ అద్భుతం ముంబాయిలో చోటుచేసుకుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పిల్లాడు స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ అడుకుంటున్నాడు. ఇంతలో షూలేస్ ఊడిపోవడంతో కారుకు కొద్దిదూరంలో కూర్చున్న పిల్లాడు.. వాటిని కట్టుకుంటున్నాడు. అప్పుడే ఓ యువతి పక్కనే పార్క్ చేసిన కారులోకి వెళ్లి కూర్చుంది. అయితే పిల్లాడిని గమనించని యువతి, కారును స్టార్ట్ చేసి అతనిపై నుంచి పోనిచ్చింది. దీంతో ఆ బాలుడిని కొద్ది దూరం తోసుకెళ్లిన కారు.. అనంతరం అతనిపై నుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టం కొద్దీ పిల్లాడు కారు మధ్యలోకి జారిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత బాలుడు లేచి స్నేహితుల దగ్గరకు పరిగెత్తాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో ఈ ఘటన రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

కేరళ : కాళ్లు చేతులు చక్కగా వున్నాయ్ ఏదన్నా పని చేసుకోకుండా అడుక్కోవటానికి సిగ్గులేదా? అంటు విసుగులు వింటుంటాం.మనంకూడా అంటుంటాం. కానీ చేతుల్లేకపోయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే ఈ అమ్మాయిని చూస్తే ఎవరైనా సరే స్ఫూర్తి పొందాల్సిందే.
చేతుల్లేకపోయినా కారు నడపడం నేర్చుకుంది.  డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. ఇంకేముంది రిజక్ట్ అవ్వటం సాధారణమే. కానీ అలా అని ఊరుకుంటే ఈరోజు మనం ఈ అమ్మాయి సంకల్పం, పట్టుదల గురించి చెప్పుకునేందుకు ఏమీ వుండకపోయేది. హైకోర్టును ఆశ్రయించి లైసెన్స్‌ పొందేందుకు అనుమతి సాధించింది. చేతుల్లేకపోయినా డ్రైవింగ్‌ లైసెన్సు పొందిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు ఆసియా ఖండంలోనే మొదటి యువతిగా పేరొందింది. ఆసియాలో కూడా ఆమే ప్రథమం. ఆమే 26 ఏళ్ల జిల్ మోల్‌.  ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పోరాడింది. చివరికి గెలిచింది. 
కేరళలో తొడప్పుళాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రుల సహకారంతో బళ్లో చేరకుండానే కాళ్లతో రాయడం,చిత్రలేఖనం, రకరకాల వస్తువులు పట్టుకోవడం అలవాటు చేసుకుంది.అన్నీ నేర్చుకున్నాకే ఆలస్యంగా బళ్లో చేరింది. అక్కడ కూడా తన పోరాటంతో పట్టుదలతో రెండుమూడేళ్లు గడిచాక కాళ్లతో రాస్తూ... మిగతా విద్యార్థులతో పోటీ పడి చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం చూసిన పాఠశాల యాజమాన్యం  జిల్ మోల్‌ ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించింది. చదువుకుంటూనే చిత్రలేఖనం, ఫొటోలు తీయడం, కంప్యూటర్‌ వంటివి కాళ్లతోనే నేర్చుకుంది. అలా గ్రాఫిక్‌ డిజైనింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే కారు నడపాలనే కోరిక కలిగింది.

అలా అష్టకష్టాలు పడి రెండేళ్లు ఉద్యోగం కోసం కష్టపడింది. చివరికి ఓ సంస్థ నా పట్టుదల తెలిసి, నన్ను ముఖాముఖికి పిలవకుండానే ఉద్యోగమిచ్చింది. అలా ఐదేళ్ల క్రితం నాకు ఉద్యోగం వచ్చింది. కారు డ్రైవింగ్‌ కూడా నేర్చుకోవాలనే కోరికని నాన్నకు చెప్పా. ఆయనే దగ్గరుండి ఓ కారుని అద్దెకి తీసుకుని నేర్పించారు. దాదాపు ఆరు నెలలపాటు కష్టపడి కాళ్లతో నడపడం నేర్చుకున్నా. ఎన్నో అవమానాల మధ్య కాళ్లనే చేతులుగా మార్చుకున్న నేను డ్రైవింగ్‌లో పట్టు తెచ్చుకుంది. లోను పెట్టి కారు కొనుక్కుని ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేస్తే.. తుల్లేనప్పుడు లైసెన్సు ఇవ్వడం కుదరదు. ఒకవేళ ఈ దేశంలో మరేదైనా రవాణా కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్స్  సాధించి చూపించు. అప్పుడు నేను కూడా నీకు లైసెన్స్‌ ఇస్తా’ అని చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు. ఎంత బతిమాలినా వినలేదు. 
దాంతో ఓ పెద్ద మనసు కలిగిన న్యాయవాది ప్రతి విషయాలను వివరిస్తు..కోర్టులో కేసు వేశారు. అప్పు చేసింది. అవమానాలు..అవహేళనలు..అప్పులు ఇలా నాలుగేళ్ల పోరాటం..చివరికి సాధించింది. 
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు నేను అర్హురాలిగా కోర్టులో తీర్పు వచ్చింది. గెలవాలనుకునే తపన వున్న జిల్ మోల్‌ లాంటివారిని అవమానించడం సరికాదని ఆర్టీవో అధికారికీ కోర్టు చురకలు అంటించింది. ఏ అధికారి అయితే అవమానించాడో అతని చేతులమీదే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సు జిల్ మోల్‌ అందుకుంది. అనంతరం ఆమెకు ఎన్నో అవార్డులు. ప్రశంసలు.

కర్నాటక : బెంగళూరులో విషపు నురగ దడ పుట్టిస్తోంది. బెల్లందూరు సరస్సులో విషపు నురగ ఏర్పడింది. నురగ సమస్య తారాస్థాయికి చేరింది. రాత్రంతా కురిసిన వర్షాలకు పది అడుగుల మేర రాకాసి నురగ చేరింది. ఈ నురగ గాలికి సమీపంలోని రోడ్లు, భవనాలపై పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఏటా వర్షాకాలంలో ఈ నురగ సమస్య ఉత్పన్నమవుతున్నా, ఈ ఏడాది మాత్రం చాలా తీవ్రస్థాయికి చేరింది. మంచు కొండల మాదిరి పేరుకున్న విషపు నురగ నుండి దుర్గంధం వస్తుందని స్థానికులు వాపోతున్నారు. దగ్గరలోని పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలు ఏళ్లుగా సరస్సులో కలుస్తుండటంతో తరచూ ఈ సమస్య తలెత్తుతుంది. నురగ పెరిగిన ప్రతిసారి స్థానికులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.

 

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధార్‌కు చట్టబద్ధత ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌‌ అనుసంధానం తప్పనిసరి కాదని కోర్టు పేర్కొంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్ కోసం బలవంతం చేయరాదని... స్కూళ్లు, ప్రయివేటు కంపెనీలు ఆధార్‌పై ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా 12అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించింది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి సమ్మతమే అని తెలిపారు. అదే సమయంలో ఆధార్‌పై  అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌పై జైట్లీ మండిపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే విధంగా ఉందన్నారాయన. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఆధార్ ద్వారా కేంద్రం ఏటా 90వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తోందని జైట్లీ వివరించారు.

ముంబయి: మహారాష్ట్ర ఏఐఎమ్ఐమ్ ఎమ్మెల్యే వారీస్ పఠాన్ వినాయక చవితి పండగ సందర్భంగా ముంబయిలోని ఓ పందిరి వద్ద ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేసినందుకు క్షమాపణలు తెలిపాడు. హైదరాబాద్ లోని పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల  మేరకే ఈ క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ తనను క్షమించాల్సిందిగా కోరాడు. ‘‘నేను ఒప్పుకుంటున్నాను. ఇది మళ్లీ చెయ్యను. అందరి లానే నేనుకూడా మనిషినే.. కాబట్టి తప్పు జరిగింది. జరిగిన దానికి అల్లా నన్ను క్షమిస్తాడు.. మీరుకూడా క్షమించాలని వేడుకుంటున్నా..’’ అంటూ వ్యాఖ్యానించాడు.

ముంబయిలోని తన నియోజకవర్గంలో వినాయకుడి మండపాన్ని సందర్శించిన సందర్భంగా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చాంటింగ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. మరో వీడియో ద్వారా క్షమాపణ చెప్పటంతో పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

తమిళనాడు : కళ్లముందే కట్టుకున్నవాడిని నడిబజారులో కత్తులతో నరికేస్తే? కనని పెంచినవారే తన జీవితాన్ని భుగ్గి చేస్తే? కుల దురహంకారంపై ఢమరుకనాధం వినిపించి గెలుపు గుర్రం ఎక్కి సవారి చేసిన కులదురహంకారాని సవాలు విసిన వీరనారి ఆమె. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని గుండె దిటువు చేసుకుని డప్పు పట్టింది. కులోన్మాదానికి వ్యతిరేకంగా వీధుల్లో తిరుగుతూ డప్పు మోగించింది. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకునేవారికి బాసటగా నిలుస్తోంది. ఇటీవల ‘పరువు’కు బలైన అమృతవర్షిణిని కలిసి, ఆమెలో స్థయిర్యాన్ని నింపిన ఉద్యమకారిణి తమిళనాడుకు చెందినకౌసల్యా శంకర్‌ జీవితంలో ఎన్నో మలుపులు..గెలుపులు..
 
పెద్దలను ఎదిరించి కులాలకు అతీతంగా ప్రేమించినవాడి చేయిపట్టుకుని నడిచిన  జంటపై కొడవళ్లు, గొడ్డళ్లలతో పట్టపగలు దాడి చేసి తాను ప్రేమించి వివాహం చేసుకున్న శంకర్‌ను అందరూ చూస్తుండగానే, నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత ప్రపంచమంతా ప్రసారమయ్యాయి.  శంకర్‌ ప్రాణం గాలిలో కలిసిపోయింది. కౌసల్య కూలిపోయింది. కుదేలైపోయింది. ప్రేమించిన సహచరుడు క్షణాల్లో తన ఎదుటే రక్తం ముద్దగా జీవం లేకుండా పడి ఉన్న దృశ్యం కౌసల్యను పిచ్చిదాన్ని చేసేసాయి. సత్యం జీర్ణించుకోలేకపోయింది. దానికి కారణం కన్నతల్లిదండ్రులేనని తెలిసి తల్లడిల్లిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికిబైటపడ్డ కౌసల్య న్యాయ పోరాటం చేసి వారికి శిక్ష పడేట్టు చేయడంలో విజయం సాధించింది.తన లాంటి స్థితి మరొకరికి రాకూడదనుకుంది. కులాంతర వివాహాలు చేసుకునే యువతీయువకులకు బాసటగా నిలవాలనే నిర్ణయంతో ‘యాక్టివిజాన్ని’ ఆయుధంగా చేసుకుంది. దళితుల సంప్రదాయ డప్పు ‘పరై’ వాద్యాన్ని నేర్చుకుని, పరువు హత్యలను నిరసిస్తూ దాన్ని మోగించింది. అలుపెరుగని పోరాటం మొదలెట్టింది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన అమృత భర్త ప్రణయ్‌ పరువుహత్యను తీవ్రంగా ఖండించింది. అమృతది, తనది ఒకేలాంటి ఘటనలని, ఆమెకు అండగా ఉంటానని అమృతను స్వయంగా కలిసి గుండె ధైర్యాన్నిచ్చింది. అమృతకే కాదు అలాంటి ఎన్నో జంటలకు కౌసల్య ఇప్పుడు దళిత ‘పరై’. 

ముంబయి: మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసమని విమానం కాక్‌పిట్‌లోకి ప్రవేశించిన అగంతకుడిని చూసిన ఫ్లైట్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. సామాన్య ప్రయాణీకులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించడం నిషిద్ధం. ముంబయి నుండి కలకత్తా వెళుతున్న ఇండిగో విమానంలోకి ఓ అగంతకుడు ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డగించి ముంబయి పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  కేవలం ఫోన్ ఛార్జింగ్ కోసమే తాను కాక్‌పిట్‌లోకి వెళ్లానని ఆ వ్యక్తి చెప్పడని పోలీసులు చెబుతున్నారు. .  

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భవన ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో కూలీల బతుకులు తెల్లారిపోతున్నాయి. పొట్టకూటికోసం కూలిపనికి వచ్చిన పేదలు  కుప్పకూలిపోతున్న శిథిలాల కింద వారి బతుకులు తెల్లారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మరో భవనం కూలిపోయింది. మరింతమంది కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతిచెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని అశోక్ విహార్ ఫేజ్ సవాన్ పార్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. శిథిలాల కిందినుంచి ఎనిమిది మందిని రక్షించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

 

ఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం మెడకు రాఫెల్ ఉచ్చు రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిపక్షాల ముప్పేట దాడికి కేంద్రం ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తన మాటల దాడిని ఉదృతం చేశారు. దేశానికి సేవలందించే సైనికులారా అమర వీరుల కుటుంబాల్లారా, హాల్‌ సంస్థ ప్రతినిధులారా...బీజేపీ ప్రభుత్వం అవలభిస్తున్న విధానాలపై మీరెంతగా ఆవేదన పడుతున్నారో..ఎంతగా రగిలిపోతున్నారో తెలుసు. త్వరలోనే బాధ్యులను చట్టం ముందు నిలబెడతాం’ అంటూ రాహుల్‌ అనంతరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
రాఫెల్ వ్యవహారంలో ఇప్పటి వరకు బయటపెట్టిన అంశాలు ఆరంభం మాత్రమే. త్వరలో గుట్టు రట్టు చేస్తామని రాహుల్ తెలిపారు. అలాగే బ్యాంకులను దోచుకుని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు మాల్యా దేశం విడిచి పారిపోవడం వెనుకున్న అసలు కథను వెల్లడిస్తామంటు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 

మిగ్‌, సుకోయ్‌, జాగ్వార్‌ తయారీలో 70 ఏళ్ల అనుభవం ఉన్న హాల్‌ను కాదని రిలయన్స్‌కు పెద్దపీట వేయడం వల్ల హాల్‌ ఎంతో నష్టపోయిందని, అవకాశం దక్కకుండా చేసింది బీజేపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఒప్పందానికి పదిరోజుల ముందే  రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ పుట్టుకొచ్చిందనీ.. తర్వాత అన్నీ చకాచకా జరిగిపోయాయాయన్నారు. దీనివెనుక మతలబు త్వరలోనే బయటపెడతామని రాహుల్‌ పేర్కొన్నారు. 

Pages

Don't Miss