జాతీయం

ఢిల్లీ: వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. మొత్తం 40 మంది అధికారుల బృందం విచారణలో భాగస్వామ్యం అవుతోంది. ఈ బృందానికి 1986 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి... అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆర్ పి. అగర్వాల్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇవాళ ఉదయమే బోపాల్‌ చేరుకున్న సీబీఐ టీమ్‌...

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇఫ్తార్‌ విందు ప్రారంభమైంది. ఈ విందుకు ఎన్డీయేతర సెక్యులర్‌ పార్టీలను ఆహ్వానించారు. త్వరలో ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల ముందు ఈ విందు- రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫ్రాన్స్: ప్యారిస్‌లో ఓ గన్‌మెన్‌ కలకలం రేపాడు. ప్రిమార్క్ అనే బట్టల దుకాణంలో ప్రవేశించి.. అక్కడున్న పదిమందిని బందీలుగా చేశాడు. ఏం జరుగుతుందో తెలీక బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గన్‌మెన్‌ చెరనుంచి...బాధితులను విడిపించేందుకు పోలీసులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

బీహార్ : త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌పై రాజకీయ పార్టీల ఫోకస్ మొదలైంది. యుద్దానికి సన్నద్దం అయ్యేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈసారీ అక్కడ కులరాజకీయాలే రాజ్యమేలేలా కనిపిస్తున్నాయి.

తుర్కెమెనిస్థాన్ : మధ్య ఆసియా దేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. తుర్కెమెనిస్థాన్ పర్యటన ముగించుకున్న మోడీ ఆదివారం ఉదయం కిర్గిజిస్థాన్ చేరుకున్నారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తర్వాత కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యారు.

ఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణ వేగవంతం చేయాలని భారత్‌, పాక్‌ ప్రధానుల నిర్ణయించి రెండు రోజులైనా గడవలేదు. అప్పుడే విచారణకు బ్రేకులు వేసే పని అడ్డదారిలో మొదలైంది. ముంబై పేలుళ్ల కేసు నిందితుడు జకీర్ రెహ్మాన్‌ లఖ్వీ తన వాయిస్ శాంపిల్స్ భారత్‌కు ఇవ్వడని...

ఛత్తీస్‌గఢ్‌: విద్యా బుద్ధులు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సింది గురువులు. పైగా వారి నడక, నడత అన్నీ విద్యార్థులను ఇన్‌స్పైర్‌ చేసే అంశాలే. ఇంతగొప్ప గురుతర బాధ్యతల్లో వున్న ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి తరగతి గదిలో ప్రవేశించాడు.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఢిల్లీ: ఇస్రో వెబ్ సైట్ హ్యాక్ గురైంది. వాణిజ్య విభాగానికి యాంత్రిక్ సైట్ హ్యాక్ అయింది. ఇస్రో.. 2 రోజుల క్రితమే 5 కమర్షియల్ రాకెట్స్ ప్రయోగించింది. ఇస్రో వెబ్ సైట్ ను చైనా ప్రభుత్వం హ్యాక్ చేసినట్లు ఇస్రో అధికారులు అనుమానిస్తున్నారు.

భోపాల్ : వ్యాపం స్కాం విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగించాక మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కుంభకోణంపై దర్యాప్తును కావాలనే ఆలస్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధాన సభ రికార్డులే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Pages

Don't Miss