జాతీయం

హైదరాబాద్: సైన్స్‌, గణితం, సాంఘిక శాస్త్రం బోధించని మదర్సాలతో పాటు ఇస్లాం మత బోధనలు చేసే సంస్థల గుర్తింపును రద్దు చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రోబో మనిషిని చంపిన దుర్ఘటన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్‌వాగన్ తయారీ ప్లాంట్‌లో ఓ కాంట్రాక్టర్‌ను రోబో చంపినట్టు కంపెనీ అధికారులు బుధవారం వెల్లడించారు.

ఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని... కరీంనగర్ ఎంపీ వినోద్ ఆరోపించారు. మోడీ సర్కారు మాట ఇచ్చి మాట తప్పిందన్నారు. ఈ విషయంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు. 

ఢిల్లీ : నేడు అంతర్జాతీయ క్రీడాపాత్రికేయుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంఘాలు స్పోర్ట్స్ జర్నలిస్టు డే..వేడుకలను ఘనంగా జరుపుకోడానికి సిద్ధమవుతున్నాయి.

ఢిల్లీ : ఎన్డీఏ యూపీఏ అనే తేడా లేకుండా అందరినీ తన ట్వీట్లతో ఖంగారెత్తిస్తున్నాడు లలిత్‌ మోడీ. సుష్మా స్వరాజ్‌ తో మొదలైన లలిత్ గేట్‌ వ్యవహారం సుష్మా కుటుంబసభ్యులను, వసుంధర రాజే, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాలను తాకి వారందరినీ సంజాయిషీ ఇచ్చుకొనేలా చేసింది.

ఢిల్లీ : ఎన్డీఏ సర్కార్‌పై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వం విధానాలనే ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. యూపీఏ స్కాంలు బయటపడటానికి ఏడేళ్లు పడితే ఎన్డీఏ స్కాంలు వెలుగుచూడటానికి ఎక్కువ సమయం పట్టలేదన్నారు.

హైదరాబాద్: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ నియమించిన ఎసిబి చీఫ్‌ ఎం కె మీనా అధికారాలపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోత పెట్టింది. కోర్టు ఉత్తర్వులు వచ్చేవరకు ప్రస్తుతానికి మీనా కేవలం శిక్షణా వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలని స్పష్టం చేసింది.

ఢిల్లీ:తన వీసా కోసం సహకరించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు లలిత్‌మోదీ మంచి ఆఫరే ఇచ్చాడు. సుష్మ భర్త స్వరాజ్‌కౌశల్‌కు తన కంపెనీ ఇండోఫిల్‌లో బోర్డు డైరెక్టర్‌ పదవి ఇస్తానంటూ మోదీ ఏప్రిల్‌లో ఈమెయిల్‌ ద్వారా ప్రతిపాదించాడు.

ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత్‌నెట్‌, డిజిటల్‌ లాకర్‌, ఉపకార వేతనాల పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. ఇకపై ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌ ద్వారా జరగనున్నాయి.

హైదరాబాద్:యూరోపియన్ జోన్ కు గ్రీస్ షాక్ ఇచ్చిందా? గ్రీస్ సంక్షోభాన్ని ప్రాపంచక దృక్పధంతో చూడాల్సిన అవసరంవుందా? గ్రీస్ ప్రభావం భారత్ పై పడుతుందా? గ్రీస్ సంక్షోభం అనుభవాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? రూ.170 కోట్ల డాలర్ల రుణాన్ని తీర్చలేనని గ్రీస్ చెప్పిందా?

Pages

Don't Miss