బాలయ్య @105 ప్రారంభం

Submitted on 13 June 2019
NBK 105 Launched Today

జై సింహా తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపి మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం : 5గా సి.కళ్యాణ్ నిర్మించబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

బాలయ్య నటిస్తున్న 105వ సినిమా ఇది. బాలయ్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేసాడు.. ఎ.కోదండరామి రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసారు. జూలైనుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.. 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యనున్నారు. బాలయ్యతో అధినాయకుడు సినిమా చేసిన దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు కథ అందిస్తుండడం విశేషం.. మాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..

Nandamuri Balakrishna
Chirrantan Bhatt
C.Kalyan
K.S.Ravikumar

మరిన్ని వార్తలు