కాఠ్మండులో బాంబు పేలుళ్లు...నలుగురు మృతి

Submitted on 27 May 2019
Nepal explosions kill four in capital Kathmandu

నేపాల్‌ రాజధాని కాఠ్మండులో ఒకే సమయంలో వేర్వేరు చోట్ల జరిగిన మూడు బాంబు పేలుళ్లుల్లో నలుగురు మరణించగా,ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. సిటీ మధ్యలో ఒకటి,శివార్లలో రెండు బ్లాస్ట్ లు జరిగాయి. ముగ్గురు స్పాట్ లో మరణించగా,మరొకరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించినట్లు స్థానిక పోలీస్ అధికారి శ్యామ్ లాల్ గ్యావలి తెలిపారు.

కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు జరిగాయి.ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు.అయితే ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలాలను ఆ దేశ ఆర్మీ మోహరించింది. 
 

Nepal
explosions
kill
FOUR
capital
Kathmandu
Injured
hospital
Police
Arrest

మరిన్ని వార్తలు