ట్రంప్ గొడుగు ఎందుకు క్లోజ్ చేయలేదో మీకు తెలుసా?

16:30 - October 30, 2018

అమెరికా : డొనాల్డ్  ట్రంప్. ఈ పేరే సంచలనం. తన నిర్ణయాలను నిర్మొహమాటంతో ఎన్నికల ఎజెండాలోపెట్టి విజయం సాధించిన ట్రంప్ కామెడీలు కూడా చేస్తుంటారు. తన వింత చర్యలతోను, చేష్టలతో నవ్వులు పూయించే ట్రంప్ మరోసారి నవ్వులు పూయించారు. గతంలో ఓసారి బాత్రూమ్ లో వాడే పేపర్ తో విమానం ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో  నెటిజన్లతో  వింత వింత కామెంట్స్ చేశారు. ఈసారి మరోసారి ట్రంప్ నెటిజన్లకు చిక్కారు.

Image result for trump umbrellaచిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ గా మారే ఆయన, ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరగా, వర్షం కురుస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానం మెట్లు ఎక్కిన వేళ ఈ ఘటన జరిగింది. విమానం లోపలికి వెళ్లే వేళ, గొడుగును మూసేందుకు సాధ్యం కాకపోవడంతో, ద్వారం వద్దే దాన్ని పడేసిన ట్రంప్ లోపలికి వెళ్లిపోయారు. ఆపై గాలికి ఆ గొడుగు అటూ ఇటూ తిరుగుతూ, విమాన ద్వారం వద్దే ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా, సరదా సరదా కామెంట్లు వస్తున్నాయి. "ట్రంప్‌ కు గొడుగును ఎలా మూసివేయాలో కూడా తెలీదు" అని ఒకరు, "చేతిలో ఉన్న గొడుగునే మూయలేదంటే బాత్ రూమ్‌ కు వెళితే ఫ్లష్‌ కూడా చేయరేమో" అని ఇంకొకరు, "ట్రంప్‌ తెల్లగా ఉంటారు. గొడుగు నల్లగా ఉంది కాబట్టే, ఆయన అందుకే పట్టించుకోకుండా వదిలేసుంటారు" అని ఇంకొకరు  కామెంట్లు చేశారు. గతంలోనూ ట్రంప్ కు సంబంధించిన ఇటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. మరి ట్రంప్ మరోసారి నవ్వులు పూయించటంలో సక్సెస్ అయినట్లే కదా!..

 

 

 
 

Don't Miss