News

Saturday, June 24, 2017 - 22:01

పోర్చుగల్ : మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోర్చుగల్‌ చేరుకున్నారు. లిస్బన్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పోర్చుగీసు ప్రధాని ఆంటానియో కోస్టాతో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల నేతల మధ్య ప‌లు విష‌యాల‌పై ఒప్పందాలు జ‌ర‌గ‌నున్నాయి. అక్కడి నుంచి మోది అమెరికా వెళ్లనున్నారు.  రెండు రోజులపాటు మోదీ అమెరికాలో పర్యటిస్తారు. జూన్‌...

Saturday, June 24, 2017 - 21:57

ఢిల్లీ : జులై 17 నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరిపేందుకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌...

Saturday, June 24, 2017 - 21:54

పశ్చిమగోదావరి : దళితులు.. అగ్రవర్ణాల మధ్య ఘర్షణతో పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామం యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. అగ్రవర్ణాల కులబహిష్కరణతో బహిష్కరణకు గైరన దళితులు..అగ్రవర్ణాలపై మండిపడుతున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలలుగా తమను బహిష్కరించిన అగ్రవర్ణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్...

Saturday, June 24, 2017 - 21:43

రంగారెడ్డి : బోరుబావిలో మృత్యువుతో పోరాడుతోన్న చిన్నారి మీనాను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందానికి ఓఎన్జీసీ అధికారులు తోడయ్యారు. బాలికను బయటకు తీసేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చిన్నారి బోరుబావి నుంచి బయటపడటం లేదు. దీంతో గంటగంటకూ తల్లిదండ్రుల్లో...

Saturday, June 24, 2017 - 21:40

రంగారెడ్డి : బోరుబావిలో ఉన్న చిన్నారిని బయటకు తీసేందుకు అధికారులు చివరి ప్రయత్నం మొదలు పెడుతున్నారు. కేఎల్‌ఆర్‌ బోర్‌వెల్స్‌ ఆధ్వర్యంలో రెస్క్యూఆపరేషన్‌ జరుగుతోంది. నీళ్లలోపలే చిన్నారి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో బోరు బావిలోకి ఆక్సీజన్‌ సరఫరా చేస్తున్న పైప్‌ను తొలగించారు. ఎయిర్‌ లిఫ్టింగ్‌ టెక్నాలజీతో పాపను బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్‌...

Saturday, June 24, 2017 - 21:32
Saturday, June 24, 2017 - 21:14
Saturday, June 24, 2017 - 21:09

బోనాలపై మల్లన్నముచ్చట్లలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జానపద సింగర్స్ వడ్డేపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి శ్రీనివాస్ కూతరు మానసతో చిట్ చాట్ నిర్వహించారు. పలు బోనాల పాటలు పాడి వినిపించారు. బోనాల పండుగ ఎలా వచ్చింది, బోనాలు విశిష్టతను శ్రీనివాస్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, June 24, 2017 - 20:56

బాహుబలి సింగర్ మోహనతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన పలు విషయాలు తెలిపారు. పలు పాటలను పాడి వినిపించారు. తాను పాడిన అన్నీ పాటలు ఇష్టమని చెప్పారు. కొంతమందితోనే చనువుగా ఉంటానని తెలలిపారు. అందరూ బెస్టు ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. డబ్బింగ్ చెప్పడంపై ఇంట్రస్ట్ ఉంద కానీ.. అది చాలా కష్టటమన్నారు. చిన్మయి వాయిస్ లో డైలాగ్ చెప్పింది. సింగర్ నోయెల్ ఫ్రాంక్ కాల్...

Saturday, June 24, 2017 - 20:50

ఢిల్లీ : సంఘ్‌ పరివార్‌ అండతో దేశంలో మతపరమైన దాడులు పెరిగిపోయాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ-మధుర లోకల్‌ ట్రైన్‌లో జరిగిన మతపరమైన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. సంఘ్‌ పరివార్‌ కార్యకర్తల దాడిలో మృతి చెందిన జునైద్‌ కుటుంబాన్ని సిపిఎం నేతలు పరామర్శించారు. రంజాన్‌ పండగ షాపింగ్‌ వెళ్లి లోకల్‌ ట్రైన్‌లో తిరిగి వస్తున్న ముస్లిం యువకులపై సంఘ్‌...

Saturday, June 24, 2017 - 20:45

హైదరాబాద్ : పోడు వ్యవసాయదారులకు ఎర్రజెండా అండగా ఉంటుందని... వారి జోలికొస్తే ఊరుకునేది లేదని వామపక్ష నేతలు హెచ్చరించారు. అడవినే నమ్ముకుని బతుకుతున్న పోడు సాగుదారులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని... అటవీ హక్కుల చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
పోడు వ్యవసాయదారుల సమస్యలపై రాష్ట్ర సదస్సు 
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన...

Saturday, June 24, 2017 - 20:38

పశ్చిమగోదావరి : గరగపర్రు గ్రామాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. అయితే ఈ సందర్భంగా కలెక్టర్‌ను 10టీవీ ప్రశ్నించింది. గ్రామంలో ఎలాంటి పరిస్థితులను గమనించారని మా టెన్‌టీవీ ప్రతినిధి రాజు ప్రశ్నించగా..దానికి సమాధానం చెప్పకుండా మైక్‌ను పక్కకు లాగి వెళ్లిపోయారు. 

 

Saturday, June 24, 2017 - 18:27

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీని తీసుకువచ్చారన్నారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయన్న రోజా... నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీతో...

Saturday, June 24, 2017 - 18:24

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షన్‌  అనేది చిన్న కార్యక్రమం కాదని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి అన్నారు. ఇది మహాఉద్యమం.. మహా యజ్ఞం అన్నారాయన. దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ శాఖ ప్రతినిధులతో జాతీయ సమ్మిట్‌ను నిర్వహించింది జిహెచ్‌ఎంసి. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ సదస్సులో పలు అంశాలపై నిపుణులు చర్చించారు. జిహెచ్‌ఎంసి నిర్వహించిన ఈ సమ్మిట్‌కు...

Saturday, June 24, 2017 - 18:19

పశ్చిమగోదావరి : గరగపర్రు గ్రామంలో దళితులపై అగ్రవర్ణాలు విధించిన కులబహిష్కరణపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కుల బహిష్కరణకు గురైన దళితులను కలెక్టర్‌ కలిసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండు నెలలగా గ్రామంలోని దళితులపై అగ్రవర్ణాలు కులబహిష్కరణపై 10టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. 3రోజుల తర్వాత ఆలస్యంగా స్పందించిన కలెక్టర్...

Saturday, June 24, 2017 - 18:17

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం...తాడేపల్లిగూడెం రోడ్డుపై అగ్రవర్ణాలు ఆందోళన దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు పొడవునా టెంట్లు వేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులకు అగ్రవర్ణాలకు మధ్య తీవ్ర వాగ్వావాదం జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్‌పై...

Saturday, June 24, 2017 - 18:13

రంగారెడ్డి : నిమిషాలు గంటలయ్యాయి. ఆ గంటలు రోజులుగా మారాయి. రెండు రోజులు కావొస్తున్నా అధికారుల ప్రయత్నాలేవీ  ఫలించలేదు. దీంతో చిన్నారిని బోరుబావి చెరవీడలేదు. ఇంకా బాలిక బోరుబావిలోనే ఉండిపోయింది. చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని తల్లిదండ్రులతోపాటు రాష్ట్ర ప్రజానీకమంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే  గంటలు గడిచేకొద్దీ ఈ ఆశలు అడుగంటుతున్నాయి. మరోవైపు చిన్నారిని...

Saturday, June 24, 2017 - 18:09

కాకినాడ : ఏపీ మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగుమీడియం రద్దు చేయడంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తెలుగు, ఇంగ్లీష్‌ రెండు మీడియంలు ఉండాలని డిమాండ్ చేస్తున్న విద్యార్ధులు, ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

Saturday, June 24, 2017 - 18:07

హైదరాబాద్ : గిరిజనులపై పోలీసుల దాడులు ఆపాలని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో రాజయ్య మాట్లాడారు. భూపాల్‌పల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనుల భూములపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని.. పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిఘటన...

Saturday, June 24, 2017 - 17:57

పశ్చిమగోదావరి : గరగపర్రులో కులబహిష్కరణపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, ప్రజాసంఘాలు. రెండు నెలలుగా గ్రామంలో దళితులపై కులబహిష్కరణ జరిగినా..ప్రభుత్వం స్పందించకపోవడం దారుమని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. గరకపర్రులో జరుగుతున్న అన్యాయాన్ని 10టీవీ వెలుగులోకి తెచ్చి మూడు రోజులవుతున్నా...జిల్లా కలెక్టర్‌ గ్రామాన్ని...

Saturday, June 24, 2017 - 17:49

హైదరాబాద్‌ : నగర శివారుప్రాంతం జీడిమెట్ల..సుభాష్‌నగర్‌లో కల్తీ పన్నీర్‌, నెయ్యి, పెరుగు తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భారీగా కల్తీ నెయ్యి, పెరుగు, పన్నీర్‌ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, June 24, 2017 - 17:45

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం..మంగినపూడి బీచ్‌లో విషాదం జరిగింది. స్నానానికి వెళ్లిన అన్నా చెల్లెలు సందీప్‌, విద్య గల్లంతయ్యారు. చెల్లెలు విద్య మృతి చెందింది. అన్న సందీప్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. సందీప్‌, విద్యలది పెడన మండలం మందావానిపాలెం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Saturday, June 24, 2017 - 17:42

రంగారెడ్డి : నిమిషాలు గంటలయ్యాయి. ఆ గంటలు రోజులుగా మారాయి. రెండు రోజులైనా అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చిన్నారిని బోరుబావి చెరవీడలేదు. ఇంకా బాలిక బోరుబావిలోనే ఉండిపోయింది. చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని తల్లిదండ్రులతోపాటు రాష్ట్ర ప్రజానీకమంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే  గంటలు గడిచేకొద్దీ ఈ ఆశలు అడుగంటుతున్నాయి. మరోవైపు చిన్నారిని రక్షించేందుకు...

Saturday, June 24, 2017 - 17:26

రంగారెడ్డి : బోరుబావి దగ్గర సహాయక చర్యల్ని మంత్రి మహేందర్‌ రెడ్డి, కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 180 ఫీట్ల దగ్గర ఒక బాడీ కనిపించినట్లుగా అనిపిస్తోందని... మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. బోరుబావిలోనుంచి నీటిని బయటకుతీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాపను కాపాడేందుకు ఎవ్వరు సలహా ఇచ్చినా స్వీకరిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. చిన్నారిని...

Saturday, June 24, 2017 - 17:16

ఢిల్లీ : స్కేటింగ్‌ వరల్డ్ చాంపియన్స్‌, ర్యాన్‌ షెక్లర్‌ అండ్‌ కో....ఓ ఫ్యాక్టరీలో డేర్‌డెవిల్‌ ఫీట్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కేటర్లుగా పేరున్న జాన్‌ రైట్‌, అలెక్స్‌ సోర్జెంటీ, ర్యాన్‌ షెక్లర్‌ ఈ ఫీట్స్‌తో మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. టర్బైన్‌ ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్న సమయంలోనే స్కేటింగ్‌ చేసి ఔరా అనిపించారు. 

 

Pages

Don't Miss