AP News

Monday, January 16, 2017 - 16:28

విశాఖపట్టణం : సెల్ఫీ..ప్రస్తుతం యువత ఈ మాయలో పడిపోయింది. తమ ఫొటోలను బాహ్యప్రపంచానికి తెలియచేసే ప్రయత్నంలో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కోసారి ఈ సెల్ఫీలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. సెల్ఫీలు తీసుకుంటూ పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితులతో అరకు ప్రాంతానికి వెళ్లారు. గూడ్స్...

Monday, January 16, 2017 - 16:19

ఢిల్లీ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఏపీ రాష్ట్రం విభజన అయిపోయి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. కానీ విభజన తాలూకు అంశాలు అప్పుడప్పుడు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో విభజన పునర్ వ్యవస్థీకరణపై 24 పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని 24 పిటిషన్లలో పిటిషనర్లు పేర్కొన్నారు....

Monday, January 16, 2017 - 15:41

శ్రీకాకుళం : జిల్లాలోని పురాతన ఒక కొండకు చాలా విశిష్టత ఉంది. దశాబ్దాలుగా ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. పిల్లలు పుట్టని వారు ఆ కొండ ఎక్కి జారడం వలన సంతానం కలుగుతుందన్న విశ్వాసం స్థానికుల్లో బలంగా ఉంది. అందుకే ఏటా సంక్రాంతి సీజన్‌లో ఈ డేకరు కొండ పైకి ఎక్కి మొక్కుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఉన్న...

Monday, January 16, 2017 - 15:39

విజయవాడ : సాంకేతిక టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దూసుకెళ్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏపీని భద్రతా వలయంగా మార్చుతున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్‌ పహారాకు తోడు సరికొత్త యాప్‌లతో ప్రజలకు చేరువకావడానికి కృషి చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఎంతటి కేసులైనా ఛేదిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీకి తమ...

Monday, January 16, 2017 - 15:12

కాకినాడ : సంక్రాంతి సంబరాల్లో పందాల జోరు కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. మూడు రోజులుగా కొనసాగిన ఈ పందాలు నాలుగో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ పందాలపై పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారనే తారాస్థాయిలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు కూడా పందాలు జరుగుతున్నాయనే విషయం తెలియడం..కోట్ల రూపాయలు చేతులు మారుతుండడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం...

Monday, January 16, 2017 - 13:25

అమరావతి : రాయలసీమలో పట్టు బిగించేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరవుతో విలవిలలాడే ప్రాంతాల్లో.. ఇరిగేషన్‌ రంగాన్ని అభివృద్ధి చేసి పచ్చని పంటలు పండించేలా కసరత్తు చేస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో టీడీపీ దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష వైసీపీలో అంతర్మథనం మొదలైంది.

గోదావరి జిల్లాల్లో...

Monday, January 16, 2017 - 12:08

హైదరాబాద్: లవ్‌.. ఇది ఎక్కడ ? ఎలా పుడుతుందో చెప్పలేం. కొందరు ఫస్ట్‌ లుక్‌లోనే ప్రేమలో పడితే.. మరికొందరు ఎంతో కాలంగా స్నేహం చేసిన తర్వాత ప్రేమించుకుంటారు. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు కర్నూలు జిల్లా అబ్బాయి, అనంతపురం జిల్లా అమ్మాయి. ఇక ఒకరినొకరు వీడి ఉండలేని వాళ్లు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత...

Monday, January 16, 2017 - 12:05

కృష్ణా :కైకలూరు మండలం ఆటపాకలో చిరంజీవి సినిమా ఫ్లెక్సీపై ఉన్న వంగవీటి రంగా ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో చిరు ఫ్యాన్స్‌, వంగవీటి రంగా అభిమానులు ఆందోళనకు దిగారు. కైకలూరు-భీమవరం రహదారిపై నిరసన చేపట్టారు. ఫ్లెక్సీలను చించినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. చిరు, రంగా అభిమానుల రాస్తారోకోతో కిలో మేటర్ల మేర...

Monday, January 16, 2017 - 10:48

విశాఖ : సంక్రాంతి పండుగంటే తెలుగువారి ఇళ్లల్లో జరిగే హడావుడి అంతాఇంతాకాదు. భోగి మంటలు,ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆటపాటలు. అంతేనా.. చిన్నారులు ఏర్పాటు చేసే బొమ్మల కొలువులూ ముచ్చటగొల్పుతాయి. ఇంటింటా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఇరుగు పొరుగుని పిలిచి చూపించడంలో ఉండే ఆనందమే వేరు. నేటి ఆధునిక కాలంలో జనం బొమ్మల కొలువులు పెట్టడమే మానేశారు. ఓ...

Monday, January 16, 2017 - 09:52

పశ్చిమగోదావరి : ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో కోడి పందేలతో పాటుగా పొట్టేలు పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పొట్టేళ్లు పోటీలో పాల్గొన్నాయి. పందెంలో పాల్గొన్న పొట్టెళ్ల పేర్లు రాముడు, భీముడు, పందెంలో రాముడు పొట్టేలుపై భీముడు పొట్టేలు విజేతగా నిలిచింది. ఈ పందేలను వీక్షించేందుకు జనం...

Monday, January 16, 2017 - 07:01

తూ.గో : కోనసీమలో ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరగనున్న ఈ ప్రభల తీర్ధాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రభలు తమ పొలాల నుంచి వెళ్తే పంటలు బాగా పండుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని...

Monday, January 16, 2017 - 06:53

హైదరాబాద్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. ముందస్తుగా రైల్వే రిజర్వేషన్లు, బస్సు రిజర్వేషన్లు ఉన్నవారు మినహా, మిగిలిన వారంతా ప్రయాణం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రయాణికుల చేరవేతకు అనుగుణంగా రైలు, బస్సు సర్వీసులు లేవు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువుదోపిడీ...

Sunday, January 15, 2017 - 21:25

విజయవాడ : ఏపీలో మూడోరోజు కోడి పందాలు భారీ ఎత్తున సాగాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ జోరుగా సాగాయి. ఈ పందాల్లో భారీగా డబ్బులు చేతులు మారాయి. కోడి పందాలకు ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కోడి పందాలతోపాటు పేకాట, గుండాటలు యధేచ్చగా కొనసాగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారమూ...

Sunday, January 15, 2017 - 21:21

చిత్తూరు : జల్లికట్టు తమిళనాడులోనే కాదు... చిత్తూరు జిల్లా రంగంపేటలోనూ ఘనంగా జరిగాయి. ఈ సారి కూడా చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఐదారు రోజుల నుంచే ఏర్పాట్లలో నిమగ్నమైన గ్రామస్తులు.. ఇవాళ జల్లికట్టు నిర్వహించే వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని...

Sunday, January 15, 2017 - 19:38

బీహార్ : మకర సంక్రాతి పర్వదినం రోజున బీహార్‌ రాజధాని పాట్నాలో పెను విషాదం చోటు చేసుకుంది. పాట్నా వద్ద గంగా నదీ తీరం సమీపంలో ఓ పడవ మునిగిన ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఓ దీవి వద్ద పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. సహాయక సిబ్బంది ఎనిమిది మందిని రక్షించగా, మరి కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు...

Sunday, January 15, 2017 - 18:27

నెల్లూరు : టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మాటలతో రెచ్చిపోయారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌతంరెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే ప్రొటోకాల్‌ అంటూ రచ్చచేస్తున్నారని ఆనం విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలెందుకని ఆయన ప్రశ్నించారు....

Sunday, January 15, 2017 - 18:23

విశాఖపట్టణం : జిల్లాలో పందెం కోళ్లు పోటీకి దిగాయి. గత రెండు రోజుల నుంచి విశాఖ నగర శివారు ప్రాంతం అయిన ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనుక భాగంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ఈ కోడి పందాల వెనుక ఉండడంతో పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి రానీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. విశాఖలో కోడిపందాలపై మరింత...

Sunday, January 15, 2017 - 18:05

గుంటూరు : కృష్ణా నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొడుదామని వెళుతూ పలువురు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం కోసూరు ప్రాంతానికి చెందిన అజయ్, కోటయ్య, మొలిందర్ అనే యువకులు కృష్ణా నదికి వెళ్లారు. పండుగ రోజు కావడం..సెలవు కావడంతో సరదాగా వీరంతా అక్కడకు వెళ్లారు. అనంతరం వీరు ముగ్గురూ కృష్ణా...

Sunday, January 15, 2017 - 15:23

విజయవాడ : ప్రతొక్కరూ జన్మనిచ్చిన తల్లిని..పుట్టి పెరిగిన ఊరిని మరిచిపోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలను స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబసమేతంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. జీవితంలో ఓ స్థాయికి చేరిన అనంతరం జన్మభూమిని గుర్తు పెట్టుకుని అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకు ఆనందం కూడా అంతే...

Sunday, January 15, 2017 - 14:15

చిత్తూరు : ఎప్పటిలాగానే యువకుల కేరింతలు..ఇసుకవేసే రాలనంత జనసందోహం..రంగంపేటలో ఉత్కంఠ...ఈ దఫా జల్లికట్టు జరుగుతుందా ? లేదా ? అనే దానికి ఉత్కంఠకు తెరపడింది. సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లిన అనంతరం రెండు గంటల అనంతరం జల్లికట్టు ప్రారంభమైంది. పశువులను గ్రామంలోకి వదలవద్దని రైతులకు పోలీసులు హెచ్చరికలు...గ్రామంలో పోస్టర్లు..అతికించినా అక్కడి గ్రామస్తులు లైట్...

Pages

Don't Miss