AP News

Tuesday, April 25, 2017 - 14:18

గుంటూరు : వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తుళ్లూరు పీఎస్ లో పోలీసు విచారణకు హాజరైయ్యారు. ఇతనిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇందూరి రవికిరణ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మధుసూదర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇందూరి రవికిరణ్ కు , వైసీపీ సంబధంలేదని ఆయన తెలిపారు. రవికిరణ్ టీడీపీ పైనే కాకుండా అన్ని పార్టీలపై వ్యంగ్యంగా...

Tuesday, April 25, 2017 - 11:37

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వడగాల్పులు ప్రారంభమయ్యాయి. సూర్యడి నుంచి వస్తున్న బ్లూరేస్‌ నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. అల్ట్రావైలెట్‌ రేస్‌ శరీరంపై పడితే ప్రమాదమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్ర 5 గంటల వరకు బయట తిరగవద్దని సూచిస్తున్నారు.

Tuesday, April 25, 2017 - 10:16

అమరావతి : 2014 ఎన్నిక‌ల‌లో విజ‌యం త‌మ‌దేనని భావించి నిరాశపడిన వైసీపీ అధినేత జ‌గ‌న్.. 2019 సాధారణ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాలతో పార్టీ నేతలను గ్రామాల్లో, పట్టణాల్లో ప‌రుగులు పెట్టిస్తున్నారు. రాబోయే ఎన్నికలను డుఆర్‌డై మ్యాచ్‌గా భావిస్తున్నాజగన్‌... ప్రముఖ రాజ‌కీయ వ్యూహాక‌ర్త...

Tuesday, April 25, 2017 - 07:07

అమరావతి: భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని ప్రాంతంలోని పెనమాక గ్రామంలో భూసేకరణపై కోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలు తీసుకునే వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.

రాజధాని నిర్మాణానికి భూ సేకరణ...

Tuesday, April 25, 2017 - 06:58

అమరావతి: ఏపీలో సిమెంట్‌ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. నగదు రద్దుతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న నిర్మాణరంగంపై ఇప్పుడు సిమెంట్‌ ధరల పిడుగుపడింది. బిల్డర్లు, సొంతిళ్లు నిర్మించాలనుకున్న ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సిమెంట్‌ ధరలపై 10టీవీ కథనం..

...

Monday, April 24, 2017 - 21:20

గుంటూరు : ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికోసం నిధులు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కార్యక్రమానికి పురంధేశ్వరి హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ద్వారా డబ్బు ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

Monday, April 24, 2017 - 21:18

విజయవాడ : టీడీపీ మహానాడుకు వేదిక ఖరారయ్యింది. మే 27, 28, 29 తేదీల్లో మహానాడును విశాఖలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులతో కూడిన 20 వేల మందికి పైగా పాల్గొంటారని, అందరికీ వసతి, భోజన ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేసింది.

Monday, April 24, 2017 - 18:54

కాకినాడ : ఇళ్లు ఇస్తామని ఆశ చూపించారు. లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. భవనాలు సిద్ధమయ్యాయి. కానీ వాటిని కేటాయించడానికి మాత్రం డబ్బులు కట్టించుకున్నవాళ్లు రెడీగా లేరు. ఎప్పటికప్పుడు ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం అంటూ వాళ్ల కలలను కల్లలు చేస్తున్నారు. కాకినాడ నగరంలో ఐహెచ్‌ఎస్‌ఎల్‌ స్కీమ్‌ లబ్ధిదారుల గోడుపై ప్రత్యేక కథనం. కాకినాడ 15వ డివిజన్...

Monday, April 24, 2017 - 18:33
Monday, April 24, 2017 - 18:31

విజయవాడ : అగ్రిగోల్డ్‌ ఆస్తులపై మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ నేతల కన్ను పడిందని అందుకే సమస్యను పరిష్కరించడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. అగ్రిగోల్డ్‌లో 32లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాయని.. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వారికి ఇచ్చే మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నాయని.. వాటిని అమ్మితే సమస్య త్వరగా పరిష్కారమవుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్...

Monday, April 24, 2017 - 18:30

అనంతపురం : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి ఆరవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సత్యసాయి మహాసమాధి వద్ద ట్రస్ట్‌ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానంతో పాటు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులతో పాటు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. వచ్చే గురుపౌర్ణమికి అన్నపూర్ణ నిత్య...

Monday, April 24, 2017 - 18:28

విజయవాడ : ఏపీలో రైతుల పండించిన పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. పంటల గిట్టుబాటు ధరలు, కరవు సహాయక చర్యలు, ప్రభుత్వ విధానాలపై విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మిర్చి, పసుపు పంటల్ని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రైతు...

Monday, April 24, 2017 - 15:22

విజయవాడ : రాష్ట్రంలో ఐదువేల జనాభా పైబడిన అన్ని గ్రామాల్లో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సాగునీరు, తాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు విజయవాడలో జరిగిన పంచాయతీ రాజ్‌ దినోత్సవంలో మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. రెండేళ్లలో 12 వేల కిలో మీటర్ల సిమెంటు రోడ్లు వేయాల్సివుందని, అన్ని కార్యక్రమాల అమల్లో...

Monday, April 24, 2017 - 12:14

హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్నే ఆపుతారా? అంటూ, టోల్ గేటు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్ లో తన అనుచరులకు విషయం చెప్పి, వారిని పిలిపించి ఆపై దాడికి దిగారు. టోల్ గేటులోని కంప్యూటర్లను...

Monday, April 24, 2017 - 11:35

హైదరాబాద్‌..: సాఫ్ట్‌వేర్‌ రాజధాని. కానీ ఇప్పుడీ భాగ్యనగరం.. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే మోసాలకు, అక్రమాలకూ రాజధానిగా మారిపోయింది. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే మాయా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు హైదరాబాద్‌లో కోకొల్లలు. అట్లాంటి ఓ మోసకారి సంస్థ గుట్టును 10tv బట్టబయలు చేసింది. ఇంతకీ ఆ సంస్థ ఏది..? దాని మాయాప్రపంచం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

జెనెసిస్‌ ఇన్‌...

Monday, April 24, 2017 - 11:26

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మరో రెండు గ్రామాల్లో భూసేకరణకు సీఆర్డీఏ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ య్యింది. మంగళగిరి మండలం కొంరగల్లు, నవలూరు గ్రామాల్లో భూములను సేకరిస్తారు. కొంరగల్లులో 128 మంది రైతుల నుంచి 148 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు...

Monday, April 24, 2017 - 07:03

పశ్చిమగోదావరి : తుందుర్రులో అక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు ఉద్యమకారులు. గత శుక్రవారం నుంచి చేస్తున్న నిరహార దీక్షలను విరమించారు. నర్సాపురం ఆస్పత్రిలో దీక్షచేస్తున్న ఉద్యమకారులకు సీపీఎం నేత ఉమామహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి.. దీక్ష విరమింపజేశారు.

ఈనెల 21 న...

Monday, April 24, 2017 - 07:01

అమరావతి: ఏపీలో సోమవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజనీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ఇతర కోర్సుల ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,96,977 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. ఇక మెడికల్‌ విభాగంలో 79,611 మంది రాస్తున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు...

Sunday, April 23, 2017 - 21:22

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ దీక్షచేస్తున్న ఉద్యమకారులు నిరాహారదీక్ష విరమించారు.. నర్సాపురం ఆస్పత్రిలో ఉన్న ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చిన అఖిలపక్ష నేతలు దీక్ష విరమింపజేశారు.. రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం దీక్షచేస్తున్న ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసిన...

Sunday, April 23, 2017 - 21:18

చిత్తూరు : ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మునగలపాలెంలో ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్‌, ఇసుక మాఫియానే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ దందాలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు వాటాలు ఉన్నాయన్నారు....

Sunday, April 23, 2017 - 21:16

ఢిల్లీ : చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది చనిపోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మునగలపాలెం గ్రామస్తుల ఆందోళనకు కారణమైన చిరంజీవి నాయుడు, ధనుంజయనాయుడును టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. స్థానిక ఎమ్మార్వోనూ సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించారు. ఈ ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి...

Pages

Don't Miss