AP News

Monday, April 24, 2017 - 12:14

హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్నే ఆపుతారా? అంటూ, టోల్ గేటు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్ లో తన అనుచరులకు విషయం చెప్పి, వారిని పిలిపించి ఆపై దాడికి దిగారు. టోల్ గేటులోని కంప్యూటర్లను...

Monday, April 24, 2017 - 11:35

హైదరాబాద్‌..: సాఫ్ట్‌వేర్‌ రాజధాని. కానీ ఇప్పుడీ భాగ్యనగరం.. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే మోసాలకు, అక్రమాలకూ రాజధానిగా మారిపోయింది. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే మాయా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు హైదరాబాద్‌లో కోకొల్లలు. అట్లాంటి ఓ మోసకారి సంస్థ గుట్టును 10tv బట్టబయలు చేసింది. ఇంతకీ ఆ సంస్థ ఏది..? దాని మాయాప్రపంచం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

జెనెసిస్‌ ఇన్‌...

Monday, April 24, 2017 - 11:26

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మరో రెండు గ్రామాల్లో భూసేకరణకు సీఆర్డీఏ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ య్యింది. మంగళగిరి మండలం కొంరగల్లు, నవలూరు గ్రామాల్లో భూములను సేకరిస్తారు. కొంరగల్లులో 128 మంది రైతుల నుంచి 148 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు...

Monday, April 24, 2017 - 07:03

పశ్చిమగోదావరి : తుందుర్రులో అక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు ఉద్యమకారులు. గత శుక్రవారం నుంచి చేస్తున్న నిరహార దీక్షలను విరమించారు. నర్సాపురం ఆస్పత్రిలో దీక్షచేస్తున్న ఉద్యమకారులకు సీపీఎం నేత ఉమామహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి.. దీక్ష విరమింపజేశారు.

ఈనెల 21 న...

Monday, April 24, 2017 - 07:01

అమరావతి: ఏపీలో సోమవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజనీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ఇతర కోర్సుల ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,96,977 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. ఇక మెడికల్‌ విభాగంలో 79,611 మంది రాస్తున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు...

Sunday, April 23, 2017 - 21:22

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ దీక్షచేస్తున్న ఉద్యమకారులు నిరాహారదీక్ష విరమించారు.. నర్సాపురం ఆస్పత్రిలో ఉన్న ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చిన అఖిలపక్ష నేతలు దీక్ష విరమింపజేశారు.. రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం దీక్షచేస్తున్న ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసిన...

Sunday, April 23, 2017 - 21:18

చిత్తూరు : ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మునగలపాలెంలో ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్‌, ఇసుక మాఫియానే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ దందాలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు వాటాలు ఉన్నాయన్నారు....

Sunday, April 23, 2017 - 21:16

ఢిల్లీ : చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది చనిపోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మునగలపాలెం గ్రామస్తుల ఆందోళనకు కారణమైన చిరంజీవి నాయుడు, ధనుంజయనాయుడును టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. స్థానిక ఎమ్మార్వోనూ సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించారు. ఈ ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి...

Sunday, April 23, 2017 - 18:12

హైదరాబాద్ : జనసేన అధినేత ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలతో కేంద్రం సఖ్యతగా వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈమేరకు ఆదివారం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రాష్ట్రాల సాంప్రదాయాలు..సాంస్కృతిక..భాషలను గౌరవించి నడచుకోవాలని, భాష..జాతుల వైరుఢ్యాలకు నిలయమైన ఉప జాతీయత గుర్తింపును కేంద్రం గౌరవించాలని పేర్కొన్నారు...

Sunday, April 23, 2017 - 16:37

విజయవాడ : అసభ్యకర మెసేజ్‌లతో మహిళల్ని వేధిస్తున్న ఇద్దరు నిందితుల్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాసరావు ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. బస్‌పాస్‌లపై ఉన్న నెంబర్లను తీసుకొని మెసేజ్‌లద్వారా వేధించాడు.. ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకిదిగిన పోలీసులు.. శ్రీనివాసరావుతో పాటు అతనికి సహకరిస్తున్న శ్యామ్యుల్‌ను అదుపులోకి తీసుకున్నారు...

Sunday, April 23, 2017 - 16:35

కర్నూలు : రాయలసీమ పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్షత కొనసాగిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. ఏపీలో అత్యంత వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు ఏ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సీమలో ఉపాధిలేక ప్రజలు వలసలుపోతుంటే.. పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. జూన్‌లో కర్నూలులో నిర్వహించనున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల...

Sunday, April 23, 2017 - 16:33

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చామని బాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందని జగన్‌ ధ్వజమెత్తారు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు ఇసుక మాఫియాగా మారారని.. ఈ ఇద్దరు టీడీపీ నేతలకు అధికారుల వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాతో టీడీపీ నేతలు 200 కోట్లు సంపాదించారని.. ఆ సొమ్మును రికవరీ చేసి బాధితులకు...

Sunday, April 23, 2017 - 15:29

విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మూడేళ్లపాటు ప్రభుత్వం, రాజధాని భూసమీకరణ, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, మండలి భవనాలు, రోడ్ల నిర్మాణంపై ఎక్కువ సమయం కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు టీడీపీ పటిష్టతకు నడుం బిగించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో లోక్‌సభ స్థానాల వారీగా మంత్రులను పార్టీల ఇన్...

Sunday, April 23, 2017 - 15:25

విజయవాడ : కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు కోసం సీపీఎం చేపట్టిన 72 గంటల దీక్ష ముగింపు సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. కృష్ణలంక నుండి సిటీలోకి వెళ్లడానికి రోడ్డుమార్గం లేనందున..వెంటనే కృష్ణలంక నుండి బందర్‌ రోడ్డు వెళ్లడానికి యుద్ధ ప్రాతిపదికన మూడు వంతెనలు నిర్మించాలని ఇందుకు 15 రోజుల సమయం పెడుతున్నట్లు మధు తెలిపారు. ఒకవేళ సబ్‌వేలను నిర్మించకపోతే అన్ని...

Sunday, April 23, 2017 - 15:22

నెల్లూరు : రవికిరణ్‌ అరెస్ట్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రవికిరణ్‌కు వైసీపీ జీతాలిచ్చి టీడీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కించపరిచే పోస్టింగులు...

Sunday, April 23, 2017 - 15:19

చిత్తూరు : జిల్లా ఏర్పేడులో లారీ ప్రమాద బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మునగలపాలెం, ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకున్న జగన్‌..ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌ డిమాండ్ చేశారు. మృతుల...

Sunday, April 23, 2017 - 14:25

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం తుందుర్రులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరవదిక నిరహార దీక్ష రెండవ రోజు కొనసాగుతుండగా..పోలీస్ బలగాలు దీక్షను భగ్నం చేసి బలవంతంగా నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు తమను ఎన్ని...

Sunday, April 23, 2017 - 11:35

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..కడప నుంచి రేణిగుంట వరకు లారీని క్లీనర్‌ నడిపినట్లు తాజాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్‌ గురవయ్య మద్యం సేవించినట్లు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. రేణిగుంట నుంచి ఏర్పేడు వరకు మద్యం మత్తులో లారీని డ్రైవర్‌ గురవయ్య...

Sunday, April 23, 2017 - 10:44

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడు బాధితులను పరామర్శించేందుకు కాసేపట్లో వైఎస్‌ జగన్‌ ఏర్పేడుకు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మునగలపాలెం, ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకొని ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ కార్యకర్తలు...

Sunday, April 23, 2017 - 08:27

గుంటూరు : ఏపీలో మెడికల్ సీట్ల భర్తీకి వైద్య విద్యాశాఖ నిబంధనలు కఠినతరం చేసింది. నిబంధనలు, రిజర్వేషన్ విధానాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసిఐ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కట్ ఆఫ్ తేదీలోగా పీజీ మెడికల్ అడ్మిషన్ల  భర్తీకి నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విలువైన వైద్య సీట్లు మిగిలిపోకుండా సద్వినియోగం చేసేందుకు ఏపీ మెడికల్ కళాశాలల ప్రవేశ...

Sunday, April 23, 2017 - 08:11

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. భూములకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మెట్ట భూములు ఒక్కో ఎకరానికి 16 లక్షలుగా నిర్ణయించింది. అయితే.. భూసేకరణ పరిహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ పరిహారం తీసుకునేందుకు తాము సిద్దంగా లేమిని.. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు రైతులు. 
3...

Pages

Don't Miss