AP News

Monday, August 14, 2017 - 13:35

విశాఖపట్టణం : ఓ బైక్ అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లడంతో భార్య..కుమార్తె మృతి చెందారు. భర్తకు గాయాలయ్యాయి. ఈఘటన చీడికాడ మండలం పెద్ద భోగాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నూక రాజు లక్ష్మీ దంపతులు కుమార్తె దేహీ బైక్ పై కొత్తపల్లికి వెళుతున్నారు. మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. లక్ష్మీ..దేహి అక్కడికక్కడనే మృతి చెందారు. నూకరాజుకు...

Monday, August 14, 2017 - 11:11

విజయవాడ : కాపు రిజర్వేషన్ అంశానికి సంబంధించిన విషయానికి తాము ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని తాము చెప్పినా ఆయన నిర్ణయం తీసుకోలేదన్నారు. కావాలనే రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని, ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ముద్రగడకు తెలియ చేయలేదన్నారు. పిలిచినా ఆయన రాడని...

Monday, August 14, 2017 - 10:13

విజయవాడ :కొద్ది రోజుల్లో మంజునాథ కమిషన్ నివేదిక వస్తుందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజనేయ పేర్కొన్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడితో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని కోరనున్నారు.

అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పాదయాత్ర...

Monday, August 14, 2017 - 09:10

విజయవాడ : కాపు రిజర్వేషన్ అంశంపై టిడిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా ? గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కాపు వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరగనుంది.

గత ఎన్నికల్లో హామీనిచ్చిన కాపు జర్వేషన్ అంశంపై చర్చించనున్నారు. మంజునాథ కమిషన్...

Monday, August 14, 2017 - 08:11

తూర్పుగోదావరి : పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరు కుటుంబాలు తలపడ్డాయి. 9 మందికరి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య గతకొన్ని రోజులుగా సిరిహద్దు విషయంలో గొడవ చెలరేగింది. చిన్న గొడవ కాస్త పెద్దదై పోయింది. కత్తులు..ఇతర మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. 9 మందికి తీవ్రమైన గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు....

Sunday, August 13, 2017 - 21:21

కర్నూలు : జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ పీఎస్‌లో హల్‌చల్‌ చేశాడు. పీకల దాకా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. పత్తికొండలోని సవారం కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసరావు ఆస్పరి పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్నారు. కొన్నాళ్లుగా ఆయన స్థానిక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మహిళలు శ్రీనివాసరావుపై పత్తికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో...

Sunday, August 13, 2017 - 20:54

'అధునిక సమాజంలో అంబేద్కరిజం' అనే అంశంపై మాస్టర్ కీ సంస్థ ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

Sunday, August 13, 2017 - 20:10

అనంతపురం : వైఎస్‌ జగన్‌పై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుని ఉరి తీయాలని జగన్‌ అనడం ఫ్యాక్షనిజానికి నిదర్శనమని.. తీరు మార్చకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఘాటుగా విమర్శించారు. అలాగే నంద్యాలలో టీడీపీనే గెలుస్తుందని పల్లె రాఘునాథ్‌ జోష్యం చెప్పారు. 

 

Sunday, August 13, 2017 - 20:07

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఖండించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు తొమ్మిది పేజీల లేఖ రాశారు. పోలవరం అడ్డుకుంటున్నట్లు నిరూపిస్తే రాజ్యసభ పదవిని వదులుకోవడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలగతానంటూ సవాల్ విసిరారు. తనపై ప్రత్యేక కమిటీ వేసినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. లేని...

Sunday, August 13, 2017 - 20:05

కర్నూలు : నంద్యాలలో కులాల ఆత్మీయ సభల పేరుతో టీడీపీ నేతలు ఓటర్లను మభ్య పెడుతున్నారని వైసీపీ ఆరోపించింది. కులాల పేరుతో చంద్రబాబు ఏర్పాటు చేసిన కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లతో ఆయా కులాలకు ఒరిగిందేమీలేదని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాపు కార్పొరేషన్‌ ఎంతమందికి రుణాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు...

Sunday, August 13, 2017 - 19:22

 హైదరాబాద్ : టీడీపీకి  ధైర్యం ఉంటే నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు మూడేళ్ల పాలనకు రెఫరెండంగా పరిగణించాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఉప ఎన్నిక లేకపోతే నంద్యాలకు ఇన్ని వరాలు ప్రకటించేవారా ? అని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పశ్నించారు. నంద్యాలకు వేల కోట్ల రూపాయల వరాలు ప్రకటించారని.. ఉప ఎన్నిక లేకపోతే ఇన్ని వరాలు ప్రకటించే వారా ? అని ప్రశ్నించారు....

Sunday, August 13, 2017 - 19:11

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు సాయి నగర్‌లో కాపురానికి తీసుకుపోవడం లేదని భర్త ఇంటి ముందు బైటాయించింది భార్య మౌనిక. మౌనికకు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పూనాటి బ్రహ్మయ్య కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భార్యభర్తల మధ్య వివాదాలు రావడంతో మౌనికను తన ఇంటికి పంపించేశాడు. ఆనాటి నుండి భర్త తనను వేధిస్తున్నాడని, విడాకుల నోటీసులు...

Sunday, August 13, 2017 - 19:08

తూర్పు గోదావరి : మరోసారి రెడ్‌ మీ నోట్‌4 మొబైల్‌ లో మంటలు చెలరేగాయి. నెల క్రితం ఓ వ్యక్తి రిపేరింగ్‌ చేసే సమయంలో మంటలు వచ్చిన ఘటన మరవకముందే.. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. రావులపాలెంకి చెందిన సూర్యకిరణ్‌ అనే యువకుడు 20 రోజుల క్రితం మొబైల్‌ ఖరీదు చేశాడు. బైక్‌ పై వెళ్తుండగా అకస్మాత్తుగా జేబులో ఉన్న మొబైల్‌లో మంటలు చెలరేగాయి. జేబులో...

Sunday, August 13, 2017 - 19:00

గుంటూరు : మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఏపీ డిజిపి నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. ఈనెల 16న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. 10 నెలల వ్యవధిలోనే డీజీపి కార్యాలయాన్ని నిర్మించినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు రావడం వల్ల...

Sunday, August 13, 2017 - 18:45

అనంతపురం : వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఏపీ ఐద్వా కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా బార్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను రద్దు చేయాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఛలో వెలగపూడి కార్యక్రమాన్ని...

Sunday, August 13, 2017 - 18:41

కర్నూలు : మూడున్నరేళ్ల నుంచి ఏపీని చంద్రబాబు దోచుకున్నారని... వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. మంచి చేసే ఆలోచన చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలో వైసీపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.. నంద్యాలలో రోడ్‌ షో నిర్వహిస్తున్న జగన్‌... జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. 

 

Sunday, August 13, 2017 - 18:27

కర్నూలు : నంద్యాలలో అభ్యర్థుల హోరాహోరీ ప్రచారంతో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. సార్వ్రతిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌ పోరు ఉత్కంఠ రేపుతోంది.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తున్న నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటర్లు ఎక్కువ పట్టం కట్టారు?.. అసలు నియోజకవర్గం చరిత్ర ఏంటి... 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్...
ఏపీలో రాజకీయ వేడి ...

Sunday, August 13, 2017 - 15:37

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదగా డీజీపీ నూతన కార్యాలయం ప్రారంభం కాబోతోంది. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, August 13, 2017 - 15:12

తూర్పు గోదావరి : కాకినాడ బీజేపీ కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సొంత ఆఫీస్ పైనే కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు విసిరి, ఫ్లెక్సీలను చింపేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై బీజేపీ కార్యకర్తలు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ... టీడీపీతో...

Sunday, August 13, 2017 - 13:51

విశాఖ : 23 వందల కోట్లతో నిర్మిస్తున్న అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి అనుబంధంగా మల్కన్ గిరి నుంచి బలిమెల, సీలేరు, చింతపల్లి, నర్సిపట్నం, చోడవరం మీదుగా సబ్బవరం వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే రాజమండ్రి-పాడేరు-విజయనగరం మీదుగా మరో రహదారిని విస్తరించనున్నారు. మొత్తం 724 కిలోమీటర్ల మేర... 4900 కోట్లతో..ఈ ప్రాజెక్ట్‌కు...

Sunday, August 13, 2017 - 13:50

గుంటూరు : ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి నక్కా ఆనంద బాబు సూచించారు. ఈ మేరకు గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో చైల్డ్‌ హెల్త్‌ మిషన్‌ మరియు ఆర్దోపెడిక్‌ ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో హెల్త్‌ కేర్‌పై అవగాహన వచ్చిందన్నారు. పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని నక్కా ఆనంద్‌బాబు అన్నారు.

Pages

Don't Miss