AP News

Sunday, May 21, 2017 - 18:33

విజయవాడ : ఫేస్ బుక్ చాటింగ్ ఓ మైనర్ బాలిక భవిష్యత్తును అంధకారం చేసింది. తొమ్మిదో తరగతిలోనే యువకుడితో చాటింగ్ చేస్తూ ప్రేమలో పడింది. ప్రేమికుడిని రహస్యంగా కలిసి వస్తూ మరో నలుగురు యువకులకు చిక్కి గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విజయవాడలో సంచలనం కలిగిస్తోంది.

బాలికకు ఫేస్‌బుక్‌ ద్వారా అజయ్‌ పరిచయం...

Sunday, May 21, 2017 - 18:30

కాకినాడ: భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా కాకినాడ సెజ్ పరిధిలోని... రమణక్కపేటలో సదస్సు జరిగింది. సీపీఎం, రైతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో... ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని నేతలు కోరారు. ఓ వైపు నేతలు మాట్లాడుతుండగానే... పోలీసులు సదస్సును అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జి, రైతు సంఘం నేత అప్పారెడ్డిని...

Sunday, May 21, 2017 - 16:41

తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేశారు. దేవాన్ష్‌ చేత నూతన సంప్రదాయానికి అంకురార్పణ చేయించారు. శ్రీవారు తమ కుల దైవమని చంద్రబాబు అన్నారు. తిరుపతిని గ్రేటర్‌ తిరుపతిగా అభివృద్ధి చేస్తామని ఆయన...

Sunday, May 21, 2017 - 15:49

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో జిల్లా సంస్థాగత ఎన్నికల సమావేశం రసాబాసాగా మారింది. టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తింది. ఇరగవరం ఎస్సై, రైటర్‌ను నిర్బంధించిన కేసులో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై పెట్టిన కేసును వెంటనే తొలగించి, జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం...

Sunday, May 21, 2017 - 15:47

కర్నూలు : పత్తికొండ ఇంచార్జి నారాయణరెడ్డి హత్యపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ వైసీపీ ఇంచార్జి హత్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈలు చేయించినదేనని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు అరాచక పాలన నారాయణరెడ్డి హత్యతో ఉగ్రవాద స్థాయికి చేరిందన్నారు. హత్యకు నిరసనగా రేపు కర్నూల్ జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది.

Sunday, May 21, 2017 - 15:22

తూర్పుగోదావరి :కాకినాడ కబ్జా కోరల్లో చిక్కుకుంది. నగరంలోని విలువైన ఖాళీ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే స్థలాలపై కన్నేసి కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూములకు... స్థానికుల స్థలాలను రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు.

కాకినాడలో కబ్జాలకు సుదీర్ఘ చరిత్ర...

Sunday, May 21, 2017 - 15:08

అమరావతి : ఉద్దానం కడ్నీ బాధితులకు మినరల్‌ వాటర్‌ సప్లై చేస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. విశాఖలో మహానాడు సందర్భంగా టీడీపీ ప్రభుత్వానికి మధు సూటిగా ప్రశ్నలు సంధించారు. ఉత్తరాంధ్రలో మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు తెరిపిస్తారా..? కరువు మండలాల్లో ఉపాధి హామీ బకాయిల్ని ఎపుడు చెల్లిస్తారు..? విశాఖకు...

Sunday, May 21, 2017 - 11:53

తూర్పుగోదావరి జిల్లా ;  జెడ్పీ చైర్మన్ పదవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పదవి కోసం సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా వైసిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఏడాదిన్నర క్రితం తండ్రితో పాటు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంలో ఇచ్చిన హామీ...

Sunday, May 21, 2017 - 09:41

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వ పని తీరుపై నేతలు దుమ్మెత్తి పోశారు. హంద్రీనీవాకు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో విఫలమయ్యిందని విమర్శించారు. ఈ విషయంలో పల్లె రఘునాథ రెడ్డి తీరుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా...

Sunday, May 21, 2017 - 09:38

అనంతపురం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాను తనకు రెండో కన్నుగా అభివర్ణిస్తుంటారు. ఇదే విషయాన్ని చాలాసార్లు మీటింగ్‌లలో బహిరంగంగానే చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి అనంతపురం జిల్లా కీలకపాత్ర పోషించింది. 12 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబుకు అందించింది. దీంతో అనంతపురం జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెడతానంటూ చంద్రబాబు పదేపదే చెబుతూవస్తున్నారు...

Sunday, May 21, 2017 - 06:49

జీవ ఎరువుల పాత్ర వ్యవసాయంలో చాలా ముఖ్యమైంది. ఎక్కువ ఖర్చుపెట్టి నష్టపోయే బదులు జీవ ఎరువులు వాడడం మంచిది. అలాగే భూమి తన స్వభావాన్ని కోల్పోతుంది. భూసార పరీక్షాలు చేస్తే భూమికి ఎంత మొత్తంలో ఎరువులు వాడలని తెలుస్తోందని ప్రతిభ బయోటెక్ సీఈవో రాజశేఖర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Saturday, May 20, 2017 - 21:27

కడప : కేంద్ర ప్రభుత్వతీరుపై ఫైర్ అయ్యారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. కడప జిల్లాలో లాభనష్టాలతో ప్రమేయంలేకుండా స్టీల్‌ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.. దుగరాజపట్నం ఓడరేవును నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. ఎందుకు వెనక్కి తగ్గిందని ప్రశ్నించారు.. రాష్ట్రం విడిపోయేటప్పుడు...

Saturday, May 20, 2017 - 19:31

ప్రకాశం : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. బల్లికురువ మండలం వేమవరం సమీపంలో కరణం బలరాం వర్గానికి చెందిన వారిపై ప్రత్యర్థులు విచ్చు కత్తులతో విరుచుకుపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వారిపై కిరాతకంగా దాడి చేశారు. ఈ ప్రమాదంలో గోరంట్ల అంజయ్య, రామ కోటేశ్వరరావులు మృతి చెందగా.. పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు అనే నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు...

Saturday, May 20, 2017 - 19:26

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గి.. పెద్ద ఎత్తున వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో చాలామంది అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల ధాటికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో...

Saturday, May 20, 2017 - 18:42

పశ్చిమగోదావరి: జిల్లా చింతలపూడి సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. టి.నరసాపురం మండలం గండిగూడెంకు చెందిన మంగమ్మ, మహాలక్ష్మి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చింతలపూడి మండలం తీగలవంచ గ్రామ సరిహద్దుల్లో జీడి మామిడి గింజలు ఏరడానికి వెళ్లిన వారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు హత్యల వెనుక ఉన్న కారణాలను...

Saturday, May 20, 2017 - 18:37

చిత్తూరు : తన పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి 40 వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడం అభినందనీయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రొంపిచర్లలో నీరు-ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో శ్రీ సిటీ వస్తుందని.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పక్కనే సెల్‌ కంపెనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎంతో...

Saturday, May 20, 2017 - 18:36

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తామంటున్నారు ఆ పార్టీ ఎంపీ మునియప్ప. తనను ఎన్నికలయ్యే వరకు పీఆర్వోగా నియమించినందుకు రాహుల్, సోనియాలకు మునియప్ప కృతజ్ఞతలు చెప్పారు. రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న వామపక్షాలు చేపట్టబోయే బంద్ కు కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తుందన్నారు ఏపిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి. 25న అమిత్ షా...

Saturday, May 20, 2017 - 18:34

తూ.గో : కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లోని కన్వినర్‌ బెల్ట్‌లో పడి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. మైలపల్లి వాసు అనే కార్మికుడు పోర్ట్‌లో రోజులాగే విధుల్లోకి వచ్చాడు.. షిప్‌ నుండి ముడిసరుకును కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటకు తీస్తుండగా వాసు బెల్ట్‌లో చిక్కుకున్నాడు.. మృతుడు మత్స్యకారుడిగా గతంలో...

Saturday, May 20, 2017 - 16:47

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకివచ్చేందుకు అమిత్‌ షా పర్యటన ఎంతగానో ఉపయోగడుతుందని... కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు... ఈ నెల 25న విజయవాడలో నిర్వహించబోయే రాష్ట్ర కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.. గ్రామస్థాయినుంచే కార్యకర్తల్ని తయారుచేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని వెంకయ్య...

Saturday, May 20, 2017 - 16:42

ఈ.గో : తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదైంది. ఇరగవరం ఎస్సైతో పాటు రైటర్‌ను నిర్భంధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై 341, 342, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

Saturday, May 20, 2017 - 15:32

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు. యార్లగడ్డ ఏసురత్నం, కామేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోనే జనం మృత్యువాత...

Saturday, May 20, 2017 - 15:30

విశాఖ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు.. ఉద్దానం కిడ్నీ బాధితులను కలిశారు. జగతి గ్రామంలో కిడ్నీ బాధితులను కలిసి, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వైఎస్‌ జగన్‌ ఎదుట వెళ్లబోసుకున్నారు. డయాలసిస్‌ చేయించుకునేందుకు నెలకు ఒక్కొక్కరికి 15 వేల నుంచి 20వేలు అవుతోందని తెలిపారు. అంత ఆర్థిక స్తోమత...

Saturday, May 20, 2017 - 14:38

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాను పైరసి చేసేందుకు ప్రయత్నించిన పైరసి నిందితులను అరెస్టు చేసినందుకు సీసీఎస్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకులు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ. బాహుబలి-2 చిత్రాన్ని పైరసి చేస్తామని ఆర్కే మీడియాను బెదిరించి 15 లక్షలు డిమాండ్ చేశారని సైబర్‌ క్రైం పోలీసులకు రాజమౌళి తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన...

Pages

Don't Miss