AP News

Monday, September 26, 2016 - 11:30
Monday, September 26, 2016 - 09:34

నెల్లూరు : పీఎస్ఎల్వీ సీ 35 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం ఉదయం ఇస్రో ఈ రాకెట్ ను ప్రయోగించింది. ఈ రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పట్టనుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో కొనసాగింది. PSLV-C35 రాకెట్‌ ద్వారా...

Monday, September 26, 2016 - 06:56

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. PSLV-C35 రాకెట్‌ ద్వారా సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఈ రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ...

Monday, September 26, 2016 - 06:48

గుంటూరు : ఇటీవల కురిసిన వర్షాలకు సర్వం కోల్పోయిన గుంటూరు జిల్లాలోని బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కొండవీటి వాగుపై ఏరియల్ సర్వే ద్వారా నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. వర్షాలతో నీట మునిగిన దాచేపల్లిని పరిశీలించారు. గుంటూరు కలెక్టరేట్‌లో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది రోజులు వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు,...

Sunday, September 25, 2016 - 21:40

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ -సీ 35 రాకెట్‌ ద్వారా సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఈ రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ప్రయోగానికి ముందు జరిగే...

Sunday, September 25, 2016 - 19:53

గుంటూరు : అరుణ్ జైట్లీ సూచనలమేరకు కేంద్ర,నాబార్ట్ అధికారులతో కలిసి ప్రాజెక్టు విషయం లో ముందుకెళ్తున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే కుంభకోణాలల్లో ఆరోపణలు ఎదుర్కొన్న కేవీపీ రామచంద్రరావు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవుసరముందని మంత్రి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి...

Sunday, September 25, 2016 - 19:01

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయం సరికొత్తగా ముస్తాబవుతోంది.... అక్టోబర్‌ 3నుంచి పూర్తిస్థాయి పాలనకు అంతా సిద్ధమైంది.. కొత్త భవనాల్లో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంతా ప్లాన్‌ ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు.. సచివాలయానికి సంబంధించి పూర్తి వివరాలతో 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్..

అక్టోబర్‌ ...

Sunday, September 25, 2016 - 18:53

విజయవాడ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగురాష్ట్రాల్లోని జలశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్‌ మినహా జూరాల, శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు జలకళతో కళకళలాడుతున్నాయి. మరో వైపు ఎడతెరిపిలేని వర్షాలతో సాగర్‌ దిగువన వస్తున్న వరద అంతా సముద్రంలోకి వృథాగా పోతోంది.

జూరాలలో నీటిమట్టం 9.66 టీఎంసీలు...

Sunday, September 25, 2016 - 18:21

పశ్చిమగోదావరి : తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. అక్వాఫుడ్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు గత 15 రోజుల నుండి ఆందోళన కొనసాగిస్తున్నారు. భీమవరం మండలం తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణాన్ని ఆపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు..ఫ్యాక్టరీతో గొంతేరు కాలువ కలుషితం అవుతుందంటూ నిరసన చేపట్టారు..వారిని పరామర్శించేదుకు...

Sunday, September 25, 2016 - 16:32

గుంటూరు : ఇటీవల వర్షాలకు సర్వస్వం కోల్పోయిన గుంటూరు జిల్లాలోని బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కొండవీటి వాగుపై ఏరియల్ సర్వే ద్వారా నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు.. వర్షాలతోనీట మునిగిన దాచేపల్లిని పరిశీలించారు. అనంతరం గుంటూరులో వరద సహాయక చర్యల్ని సీఎం చద్రంబాబు పరిశీలించనున్నారు. 36లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని...

Sunday, September 25, 2016 - 14:27

విజయవాడ : ఏడాదికొకసారి మాటమార్చే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నోటిని ఫినాయిల్‌తో కడగాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ మొగల్రాజపురంలో సీపీఐ ప్రజా బ్యాలెట్‌ చేపట్టింది. ఈ కార్యక్రమానికి నారాయణ హాజరై, మాట్లాడారు. పదేళ్లపాటు హోదా ఇస్తామంటూ వెంకయ్య సన్మానాలు చేయించుకున్నారని గుర్తుచేశారు.. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో మళ్లీ...

Sunday, September 25, 2016 - 12:39

విజయవాడ : ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. కాలేజీలో రాజకీయ కార్యక్రమాలను  నిర్వహించరాదంటూ ధర్నా నిర్వహించారు. సంగీత కళాశాలలో రాజకీయ సభలు, సమావేశాలను నిర్వహించడం వలన ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పదించిన రాజకీయ సభల నిర్వహణను  ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సి వస్తుందని విద్యార్థులు...

Sunday, September 25, 2016 - 10:45

విజయనగరం : జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. నిద్రిస్తుండగా ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి చెందారు. వేపాడ మండలం బక్కునాయుడుపేటలో ఇల్లు కూలడంతో దంపతులు మృతి చెందారు. మృతులు కర్రి అప్పారావు, నాగరాజమ్మగా గుర్తించారు. అప్పారావు దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలడంతో.. సజీవ సమాధి అయ్యారు. 

Sunday, September 25, 2016 - 10:25

ప్రకాశం : జిల్లాలోని సంతనూతల పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. సంతనూతల పాడు చెరువు కట్ట వద్ద కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

Sunday, September 25, 2016 - 09:51

నెల్లూరు : పోలార్‌ శాటిలైట్ లాంచ్ వెహికిల్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్‌ దావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-35 నింగిలోకి దూసుకెళ్లనుంది. 320 టన్నుల బరువు గల పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ 8 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇందులో 3 ఇండియాకు చెందినవి కాగా మరో ఐదు విదేశాలకు చెందిన...

Sunday, September 25, 2016 - 09:32

తూర్పుగోదావరి : జోరుగా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా మన్యం చిగురుటాకులా వణికిపోతోంది. వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..గిరిజన గ్రామాల నుంచి బయటిప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. గిరిజనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వైద్యం అందక జర్వాలతో అడవిబిడ్డలు అవస్థలు పడున్నారు. 
ఆదివాసీలకు జీవన్మరణ పోరాటమే
తూర్పుమన్యం...

Sunday, September 25, 2016 - 07:54

గుంటూరు : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశామని.. బాధితులకు పునరావాసం కల్పిస్తున్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే వరదల కారణంగా ఏపీ వ్యాప్తంగా కోట్లలో నష్టం వాటిల్లిందని సీఎం అన్నారు.
వర్షాలకు...

Saturday, September 24, 2016 - 21:52

చిత్తూరు : జిల్లాలో ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు...సుమారు 30 గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇంటిలోకి ఐటీ అధికారులు.. ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యేను ఐటీ పేరుతో వేధిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు...

Saturday, September 24, 2016 - 21:50

పశ్చిమగోదావరి : ఏలూరులో దోమలపై దండయాత్ర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులతో చేపట్టిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో విద్యార్థులు కనిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కోటి మంది విద్యార్థులకు సెలవు...

Saturday, September 24, 2016 - 21:47

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ను అతాలకుతలం చేసిన వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. కుంభవృష్టితో సముద్రాన్ని తలపించిన గుంటూరు జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. అయితే అక్కడక్కడా అడపాదడపా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, కాల్వల్లో ముంపు ప్రభావం కొనసాగుతోంది. పంట పొలాల్లో వరదనీరు నిలవడంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ముఖమంత్రి...

Saturday, September 24, 2016 - 16:40

ప్రకాశం : బ్రిటీష్ కాలంలో సముద్ర తీరం వెంట సమాంతరంగా నిర్మించిన బకింగ్‌హాం కాలువకు కాలదోషం పట్టింది. 1970నుంచి కాలక్రమేణా ఈ కాలువ కనుమరుగవుతూ వస్తోంది. రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర విస్తరించిన బకింగ్ హామ్ కెనాల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని చేసిన ప్రకటన ఆచరణలో మాత్రం కనిపించటం లేదు. బకింగ్ హాం కెనాల్‌కు పూర్వవైభవం తీసుకువచ్చే...

Saturday, September 24, 2016 - 15:30

తూర్పుగోదావరి : ఏపీ సర్కార్ రైతాంగాన్ని ఆదుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడితే విపక్ష నేతలు కోర్టులకు వెళ్లి..ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి దేవినేని తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి...

Saturday, September 24, 2016 - 13:53

చిత్తూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడు ఇంట్లో పియురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని వీరభద్ర కాలనీలో నివాసముంటున్న ప్రీతి, శివ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే శివ ప్రియురాలు ప్రీతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ప్రీతి తనను పెళ్లి చేసుకోవాలని అతన్ని...

Pages

Don't Miss