AP News

Friday, October 13, 2017 - 20:03

కృష్ణా : విజయవాడ బందరు రోడ్‌లోని స్వరాజ్య మైదానాన్ని ప్రైవేట్‌ పరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ పిల్‌ దాఖలు చేశారు. పీడబ్లూడీ గ్రౌండ్‌ను విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సర్వత్రా ప్రజావ్యతిరేకత...

Friday, October 13, 2017 - 20:01

కృష్ణా : విజయవాడలో జనసేనా పార్టీ కార్యలయం ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. పార్టీ కార్యాలయం ఏర్పాటు పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. పార్టీ ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా... ఇప్పటివరకు పార్టీ కార్యాలయం లేదు. పవన్‌ త్వరలో పూర్తి సమయం రాజకీయాలకు సమయం కేటాయించేందుకు సిద్ధమవుతుండటంతో పార్టీ ఆఫీస్‌ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని...

Friday, October 13, 2017 - 19:58

విజయవాడ : రాష్ట్రంలో మత్స్యకారులందరినీ సంఘటిత పరిచేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ మేరకు మత్య్సకార కులాల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల పోస్టర్‌, జెండాను ఆవిష్కరించారు. మత్యస్యకారుల కోసం ఏర్పాటు చేసిన కమిటీలు 13 జిల్లాలలో అవగాహన కల్పిస్తారని మంత్రి తెలిపారు. 14 ఉపకులాలు...

Friday, October 13, 2017 - 19:52

గుంటూరు : జిల్లాలో యువతి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తాడికొండ మండలం పొన్నెకల్లులో ముగ్గురు యువకులు యువతిని కిడ్నాప్‌ చేశారు. ఎర్ర రంగు మారుతి కారులో వచ్చిన యువకులు యువతిని కిడ్నాప్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, October 13, 2017 - 19:48

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మృతులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. 

 

Friday, October 13, 2017 - 19:42

విశాఖ : జిల్లాలో బోరు నుంచి వేడినీరు రావడం స్థానికంగా కలకలంగా మారింది. పరవాడ మండలం తిక్కవానిపాలెంలో ఓ బోరు నుంచి హాట్‌వాటర్‌ వస్తోంది. గ్రామానికి చెందిన  అమ్మోరు అనే మత్స్యకారుడు 6 సంవత్సరాల క్రితం ఇంట్లో బోరు వేయించుకున్నాడు. గత నాలుగు రోజులుగా బోరు నుంచి వేడినీరు వస్తోంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్టీపీసీ సంస్థ వ్యర్థజలాలు...

Friday, October 13, 2017 - 18:27

ఆదిలాబాద్ : గిరిజనుల హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని ఆదివాసి నేత సోయం బాబూరావు అన్నారు. తమ సంస్కృతిపై, హక్కులపై అధికారులు దాడి చేసే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం జరిగితే ఎన్నిపోరాటాలకైనా సిద్ధమంటున్న సోయం బాబూరావుతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. అధికారులు గిరిజనేతరులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీల త్యాగాల...

Friday, October 13, 2017 - 18:13

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్‌ కేసు విచారణ ముగిసింది. నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో... ఆరు నెలలపాటు... ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయించాలని జగన్‌ కోరారు. దీనిపై ఈనెల 20న విచారణ చేపడతామని కోర్టు సూచించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, October 13, 2017 - 16:41
Friday, October 13, 2017 - 16:30

విజయవాడ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీ వర్కర్లు విజయవాడ అలంకార్ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున హమాలీ కార్మికులు పాల్గొన్నారు.  ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామంటున్న హమాలీ కార్మికులతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్...

Friday, October 13, 2017 - 16:18

కర్నూలు : జిల్లాలోని హంద్రీవాగులో యువకుడు గల్లంతయ్యాడు. కర్నూలు బుధవారపేటకు చెందిన తిమ్మప్ప వాగులో పడి కనిపించకుండా పోయాడు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, October 13, 2017 - 15:52

విశాఖ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు దీపావళిని  ఆనందంగా జరుపుకోవాలని విశాఖ స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణారెడ్డి అన్నారు. టపాసులు లేకుండా కేవలం దీపాలతో దీపావళి జరుపుకోవాలన్నారు. బాణసంచా కాలుష్యంతో ప్రజలు ఆనారోగ్యానికి గురౌతున్నారని అన్నారు. పూర్వం దీపారాధనతో దీపావళి జరిగేదని.. ఇప్పుడు పోటా పోటీగా టపాసులు కాల్చుతూ పర్యావరణానికి హాని...

Friday, October 13, 2017 - 15:48

గుంటూరు : వరల్డ్‌ ఎగ్‌ డే సందర్భంగా వెంకటరమణ పౌల్ట్రీస్‌ ఆధ్వర్యంలో గుంటూరులో కోడిగుడ్ల పంపిణీ జరిగింది. సంస్ధ డైరెక్టర్‌ మాధవీలతతోపాటు పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడిగుడ్లలో ఉండే పోషక విలువలను వైద్యులు వివరించారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

Friday, October 13, 2017 - 15:40

తూర్పుగోదావరి : జగన్‌ ప్రతిపక్ష నాయుకుడిగా ఉండటం మా అదృష్టమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జగన్‌ తలకిందులుగా తపస్సుచేసినా జగన్‌ను ప్రజలను నమ్మరని చెప్పారు. జగన్‌.. తన వికృత ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు ఇస్తే స్వీకరిస్తామని...

Friday, October 13, 2017 - 13:26

ఢిల్లీ : తెలగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకంపై సుప్రీం తన వ్యాఖ్యలను వెలువరించింది. ఈ పుస్తకాన్ని నిషేధించడం సాధ్యం కాదని, పుస్తకాన్ని నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకున్నట్టే అని సుప్రీం అభిప్రాయపడింది. రచయతకు చట్టపరిధిలో తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం...

Friday, October 13, 2017 - 13:18

ప్రకాశం : మరో జవాన్ దేశం కోసం తన ప్రాణాలను అర్పిచి భారతమాత నెత్తుటిపై నెత్తుటి తిలకం దిద్దాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబుళాపురానికి చెందిన రామకృష్ణా రెడ్డి దుండగల్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తుండగా పాక్ సైన్యం కాల్పుల్లో మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు మరణించడంతో రామకృష్ణారెడ్డి తల్లిదండ్రులు విషాదంలో మునిపోయారు. తన కొడుకు 120 కోట్ల మంది కోసం...

Friday, October 13, 2017 - 13:16

కర్నూలు : జిల్లా సంజామల మండలం మిక్కినేనిపల్లిలో పెను విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి వీరు మృతి చెందారు. మృతుల్లో సుధాకర్, మద్దమ్మ, ప్రవల్లిక, షుకూర్ మియా ఉన్నారు. ఇందులో ఒకే కుటుంబానకి చెందిన వారు ముగ్గురున్నారు. గాయపడ్డవారిని...

Friday, October 13, 2017 - 12:24

 

కర్నూలు : నగరంలో ఆనంద్ సినీ కాంప్లెక్స్ దగ్గర వక్కెర వాగు ప్రహిస్తుండడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పాటి రాకపోకలకు ఇబ్బంది ఎదురౌతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయం

Friday, October 13, 2017 - 12:06

 

విశాఖ : జిల్లా పాతపెందుర్తిలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టిచంపాడు. భార్యతో గొడవపడి ఆవేశంతో క్రికెట్ బ్యాట్ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, October 13, 2017 - 10:47

 

హైదరాబాద్ : కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విన్నవించనున్నాడు. 6నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరునట్టు తెలుస్తోంది. సీబీఐ కోర్టు కాసేపట్లో ఈ పిటిషన్ విచారించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Friday, October 13, 2017 - 09:13

వనపర్తి/ కృష్ణా : రోజు రోజుకు విద్యార్థుల బలన్మరణాలు పెరగుతున్నాయి. వీరి మరణానికి కాలేజీల వేధింపులేనా లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్నో అశలతో తల్లిండ్రులు తమ పిల్లలను చదుకొమ్మని పంపిస్తున్నారు. కానీ వారు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నిడమానూరు చైతన్య జూనియర్ కాలేజీ...

Friday, October 13, 2017 - 08:30

గుంటూరు : నగర శివారు అంకిరెడ్డిపాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఆటోను ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, October 13, 2017 - 08:22

కర్నూలు : జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లిలో కూలిపనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగి వరద పెరగడంతో 20 మంది కూలీలు హంద్రినీవా నదిలో గల్లంతైయ్యారు. అందులో 18 మందిని స్థానికులు, అధికారులు కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, October 13, 2017 - 08:17

చిత్తూరు : తిరుమల రెండవ ఘాట్ రోడ్డు లోని అక్కదేవతల ఆలయ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నడకదారి భక్తులకు ప్రమాదం తప్పింది. దీంతో ట్రాఫిక్ స్థంభించింది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

Thursday, October 12, 2017 - 21:45
Thursday, October 12, 2017 - 20:23

హైదరాబాద్ : ఇష్టంలేని చదువుతో కొందరు...హాస్టల్‌లో చిన్న సమస్య...చదువుకున్నా ర్యాంకు రాలేదని మరికొందరు...ఇలా ఎందరో స్టూడెంట్స్‌ మనస్తాపంతో..ధైర్యంగా ముందుకు వెళ్లలేక ఒక్క క్షణంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు..తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరాన్ని రేపుతున్నాయి...కొన్ని గంటల్లోనే ముగ్గురు స్టూడెంట్స్‌ బలవన్మరణం చెందడం...

Pages

Don't Miss