AP News

Monday, September 21, 2015 - 19:54

కృష్ణా : జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపింది. జంగారెడ్డిగూడెంకు చెందిన భానుప్రీతి అనే విద్యార్థిని విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె కాలేజ్ హాస్టల్ లో ఉంటుంది. భాను ఫ్రెషప్ కావడానికి మధ్యాహ్నం త్వరగా హాస్టల్ కు వెళ్లింది. రెండు గంటలైనా... ఆమె తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో...

Monday, September 21, 2015 - 18:56

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు అడ్డగోలుగా భూసేకరణ జరిపితే ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉరుకోమని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని మందస, పోలాకి మండలాల్లో రఘువీరా పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. ప్రజలకు ఇష్టంలేకుండా భూములు సేకరిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. 2013లో భూసేకరణపై అప్పటి కాంగ్రెస్...

Monday, September 21, 2015 - 17:23

కృష్ణా : అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలోని కేబీఎన్‌ కాలేజీలో మూడు రోజులపాటు సాగే రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్‌స్పైర్‌-2015 కార్యక్రమాన్ని దేవినేని ప్రారంభించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని...

Monday, September 21, 2015 - 17:18

విశాఖ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సీటిల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తి చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌' తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఏడాది మొత్తం 54 మంది విద్యార్థులు.. విశాఖ ఐఐఎంలో చేరారని...

Monday, September 21, 2015 - 16:48

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తుం చేసింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి.. అంటూ ప్రశ్నించింది. ఏ విషయాన్ని కలెక్టర్ పరిగణలోకి తీసుకోవడం...

Monday, September 21, 2015 - 16:38

హైదరాబాద్ : ఎపిలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్' లో నిర్వహించిన సెమినార్ లో చంద్రబాబు మాట్లాడారు. సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు ఎపి సొంతమని చెప్పారు. కార్గో విభాగంలో నెంబర్ వన్ కావడమే తమ లక్ష్యమన్నారు. ఎపిని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

...
Monday, September 21, 2015 - 13:36

హైదరాబాద్ : ఇటీవల అరెస్టైన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన కడప పోలీసులు ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వీధులను జల్లెడ పట్టిన కడప జిల్లా పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్మగ్లర్ హుసేన్ కు సంకెళ్లేశారు. ఈ సందర్భంగా హుసేన్ ఢిల్లీలో దాచిపెట్టిన 8 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...

Monday, September 21, 2015 - 13:23

విజయవాడ : నూతన రాజధానిగా అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇతర రాష్ట్రాలను తలదన్నే రీతిలో మహా నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఇరుకైన రోడ్లే ప్రధాన అడ్డంకిగా మారాయి. దీంతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్ నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది.

చిన అవుటపల్లి నుంచి బెజవాడ ఇంద్రకీలాద్రి వరకు 6లేన్స్‌.....

అమరావతి నుంచి విజయవాడకు...

Monday, September 21, 2015 - 13:16

కర్నూలు : జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త భాషాతో పాటు, వైసీపీ కార్యకర్త స్వామి చనిపోయారు. రెండు రోజుల కిందట టీడీపీ కార్యకర్తలకు చెందిన గేదెలను ఎవరో దొంగిలించారు. వైసీపీ కార్యకర్తలపై అనుమానంతో ప్రశించడంతో ఉద్రిక్తత తలెత్తి చివరకు ఘర్షణకు దారి తీసింది.

Monday, September 21, 2015 - 12:21

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక హంగులతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. ఆధునిక సాంకేతికతతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో ఈ భారీ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.

విజయవాడలో నిర్మించాలని ప్రతిపాదన......

తొలుత విజయవాడలో అంతర్జాతీయ స్టేడియం...

Monday, September 21, 2015 - 10:21

కర్నూలు : జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సోమవారం టిడిపి..వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపైకొకరు కర్రలు..రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీనితో కొందరి తలలు పగిలాయి. పలువురికి గాయాలయ్యాయి. ఇందులో టిడిపి కార్యకర్త మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ప్యాపిలి మండలం మునిమడుగులో ఉదయం బాషా పశువులు కనిపించడం లేదని వైసీపీకి చెందిన కొందరి...

Monday, September 21, 2015 - 10:16

హైదరాబాద్ : జనసేనాని మరోసారి కదనరంగంలోకి దూకుతున్నారు. ఈసారి రైతుల కోసం కాదు.. తెలుగు భాష కోసం.. అవును తమిళనాడులో తెలుగు భాషను నిషేధించారు. దీనిపై అక్కడి తెలుగు సంఘాలన్ని ఆందోళన చేస్తున్నాయి. వారికి మద్దతుగా పవన్‌కళ్యాణ్‌ ఈ నెలాఖరులో చెన్నైలో దీక్ష చేపట్టనున్నారు.

Monday, September 21, 2015 - 10:11

పశ్చిమగోదావరి : జిల్లాలో గోదావరి పోటు మీదుంటే.. భద్రాచలంలో మాత్రం కాస్త జోరు తగ్గింది. కొత్తూరు కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తుంది. ఇటు పోలవరం మండలంలోని 19 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే వరద కాస్త తగ్గు ముఖం పడుతుండటంతో..అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.

Monday, September 21, 2015 - 10:10

హైదరాబాద్ : సింగపూర్‌లో చంద్రబాబు మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యవర్గాలతో పెట్టుబడులపై సమావేశం పూర్తి కాగానే, బాబు ఈశ్వరన్‌తో సమావేశమయ్యారు. రాజధాని ప్లాన్‌ మలి దశపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 

Monday, September 21, 2015 - 09:40

విజయవాడ : రాష్ట్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సర్కార్‌ వైఫల్యం వల్లే గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడలో కుక్కల దాడితో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

జనంపై కుక్కలు దాడి .......

ప్రతి వీధిలో, ప్రధాన సెంటర్లలో జనంపై కుక్కలు దాడి చేస్తున్నాయి. పాదాచారులకు కుక్కల దాడి మృత్యుపాశంగా...

Monday, September 21, 2015 - 09:36

కడప : జిల్లాలో చింతకొమ్మదిన్నెలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బక్రీద్‌ కోసం తరలిస్తున్న ఆవులను పోలీసులు అడ్డుకోవటంతో.. ఆగ్రహించిన ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. అర్ధరాత్రి 12 గంటల వరకు హంగామా నడిచింది. ముస్లిం మత పెద్దలతో పోలీసులు చర్చలు జరపటంతో.....

Monday, September 21, 2015 - 08:39

హైదరాబాద్ : పోలవరం కుడికాల్వకు తమ్మిలేరు వద్ద గండి పడింది. దీంతో నీళ్లు భారీగా వరదలా పోటెత్తాయి. కుడికాల్వకు నీళ్లు వదిలిన రెండురోజులకే ఈ ఘటన జరగడంతో అధికారులు అవాక్కయ్యారు. మంత్రి దేవినేని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారుల వైఫల్యమని మండిపడుతున్నాయి.

Monday, September 21, 2015 - 07:09

ప్రకాశం : సింగరాయకొండ మండలం పాకలపల్లెపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనలో వాహనం ధ్వంసం అయింది. అదనపు పోలీసు బలగాలతో తెల్లవారుజామున గ్రామానికి వచ్చిన పోలీసులు దాడిచేసిన వారు లొంగిపోవాలని మైకుల్లో ఆదేశాలు జారీ చేశారు...

Monday, September 21, 2015 - 06:36

హైదరాబాద్ : టీటీడీ విద్యుత్‌ ఉత్పాదక రంగంలోకి అడుగుపెడుతోంది. పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ పెద్ద కంపెనీకి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే టీటీడీ వ్యాపారం చేయబోతోందా...? లేక అవసరాలకు వాడుతుందా అనేది ఆసక్తిగా మారింది.

ఎస్పీడీసీఎల్‌...

Sunday, September 20, 2015 - 21:11

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో పాల్గొనాల్సిందిగా.. సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణ ప్రణాళికలపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయనివాళ సింగపూర్‌ బయలుదేరి వెళ్లారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పట్టాలెక్కించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...

Sunday, September 20, 2015 - 19:20

విజయవాడ : తమ డిమాండ్ల సాధన కొరకు ఏపీ లారీ అసోసియేషన్ నడుం బిగించింది. అందులో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు లారీ అసోసియేషన్ అధ్యక్షులు పి.గోపాల్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 72 లక్షల ట్రాన్స్ పోర్టు వాహనాలు...

Sunday, September 20, 2015 - 19:11

చిత్తూరు : జిల్లా గంగాధర్ లో గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. రంగు నీళ్లలో యాసిడ్ కలపడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళితే....వడ్డేపల్లి..గణేష్ నిమజ్జనంలో ప్రతి ఇంటి నుండి ఒక రంగు నీళ్ల బాటిల్ ను తీసుకొచ్చే సంప్రదాయం ఉంది. వీటన్నింటినీ ఒక దగ్గర కలిపి ఒకరిపైకొకరు రంగు నీళ్లు చల్లుకుంటారు. అందులో...

Sunday, September 20, 2015 - 18:49

శ్రీకాకుళం : సముద్ర తీరానికి విహార యాత్రకు వెళ్తే.. అది కాస్త విషాద యాత్రగా మారిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేద్దామని నేపాల్ నుంచిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. శనివారం మధ్యాహ్నం పదిమంది నేపాలీ విద్యార్థులు సంతబొమ్మాలి మండలం భావనపాడు బీచ్ కు వెళ్లారు. ఆ సమయంలో ఎగిరిపడ్డ రాకాసి అలల్లో రాజ్ కుమార్, వివేక్ కుమార్...

Sunday, September 20, 2015 - 18:44

విజయవాడ : భారతదేశంలో ఉన్న మత, కుల వ్యవస్థల వలన లౌకికవాద వ్యవస్థపై దాడి జరుగుతుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. లౌకిక ప్రజాతంత్రవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ మాంటిస్సోరి మహిళా కళాశాలలో ''లౌఖిక ఉదార భావనలు-పొంచి ఉన్న ప్రమాదాలు'' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయవాడలోని లౌకిక, ప్రజాస్వామ్య...

Sunday, September 20, 2015 - 18:43

విజయనగరం : జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్ పోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రిశ్వరరావు డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా బాధిత గ్రామాల్లో జరుగుతున్న రిలే దీక్షల శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం నియంత్రత్వ పాలనతో సాధారణ రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తోందని విమర్శించారు...

Sunday, September 20, 2015 - 18:31

శ్రీకాకుళం : జిల్లాలోని మడ్డువలస రిజర్వాయర్ కు భారీగా వరద నీరు పోటెత్తింది. జలాశయంలో నీరు నిండడంతో నాలుగు గేట్లు ఎత్తివేశారు. దిగువకు 9వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనితో కొప్పర, కొండఖేకరపలిల్ గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అంతేగాకుండా పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఒడిషా భారీ వర్షాలతో వేదవతి, సువర్ణ ముఖి నదులు...

Sunday, September 20, 2015 - 16:46

తూర్పుగోదావరి : మండపేట ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల్లో మహిళల అభ్యంతకర వీడియోలు తీసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మండపేటలో జరిగిన ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో మహిళలను అభ్యంతకర వీడియోలు తీశారు. వీటిని వారి కుటుంబసభ్యులకు చూపించి బ్లాక్ మెయిల్ లకు పాల్పడ్డారు. వారి నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్...

Pages

Don't Miss