AP News

Wednesday, August 17, 2016 - 11:19

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కర సందడి నెలకొంది. ఆరో రోజు పలు ఘాట్ లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భవానీ ఘాట్, పున్నమి ఘాట్..ఇతర ఘాట్ లకు భక్తుల తాకిడి ఎక్కువైంది. వీఐపీ ఘాట్ లలో పలువురు స్నానాలు చేశారు. పున్నమి ఘాట్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. కాసేపట క్రితం గవర్నర్ దంపతులు...

Wednesday, August 17, 2016 - 11:16

గుంటూరు : జిల్లాలోని పిడుగురాళ్ల సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన 13 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి విశాఖలోని నర్సీపట్నంకు సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీ రోడ్డుపక్కన...

Wednesday, August 17, 2016 - 11:11

హైదరాబాద్ : ప్రభుత్వ పాలన..వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాని..ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమి అనుకుంటున్నారో తెలుసుకొనేందుకు నిర్వహించిన 'గడపగడపకు వైసీపీ' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో జగన్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన నేతతో ఆయన లోటస్ పాండ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీలు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా జగన్ వ్యూహాలు...

Wednesday, August 17, 2016 - 09:58

యాత్రికులను దోచేస్తున్న పుష్కర దొంగలు...నదీ తీరాన సంచరిస్తున్న ముఠాలు..పుష్కరాలకు వచ్చిన భక్తుల దోపిడి..

పుష్కరాలకు వెళ్లే వారు జర భద్రంగా ఉండండి. పుష్కరాలు జరుగుతున్న కృష్ణా నదీ తీర ప్రాంతంలో దోపిడి దొంగలు మాటు వేసి ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈజీగా దోచేస్తున్నారు. భారీగా డబ్బులు..నగలతో పుష్కరాలకు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని పలువురు...

Wednesday, August 17, 2016 - 09:32

విజయవాడ : రాష్ట్రంలో పుష్కర సందడి నెలకొంది. ఆరో రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామునుండే ఘాట్లకు పోటెత్తుతున్నారు. పలు ఘాట్లలో వీఐపీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అమరావతిలో ధ్యానబుద్ధ ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. పున్నమి ఘాట్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. విజయవాడ మేయర్...

Wednesday, August 17, 2016 - 09:26

గుంటూరు : జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుండి ఓ ప్రైవేటు బస్సు నెల్లూరుకు వెళుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి విశాఖలోని నర్సీపట్నంకు సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీ రోడ్డుపక్కన ఆగింది. ఈ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు...

Wednesday, August 17, 2016 - 08:09

విజయవాడ : ఏపీలో పుష్కరాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. పున్నమి ఘాట్ వద్ద భక్తులతో నిండిపోయింది. జిల్లాలో ఉన్న ఆరు ప్రధాన ఘాట్లలో భక్తుల రద్దీ నెలకొంది. వీఐపీల తాకిడితో పాటు భక్తుల తాకిడి అధికంగా ఉంది. సుదూర ప్రాంతాల నుండే కాక పక్క రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. జేబు దొంగలు తమ హస్తలాఘవాన్ని వాడుతున్నారు. విలువైన బంగారు ఆభరణాలు తస్కరిస్తున్నారని పలువురు...

Wednesday, August 17, 2016 - 06:37

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదం కేసుపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ మరోసారి విచారణ ప్రారంభించింది. నీటి పంపకాలపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ వద్ద సుధీర్ఘ వాదనలు వినిపించింది. రాష్ట్రాలకున్న రాజకీయ సరిహద్దులు మారుతాయే తప్ప నదులకున్న సరిహద్దులు మారవని ఏపీ తరపు సీనియర్‌ న్యాయవాది ఏ.కే. గంగూలీ వాదనలు వినిపించారు. నది పుట్టుక నుంచి సముద్రంలో ఒక...

Wednesday, August 17, 2016 - 06:17

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వారం రోజుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనున్నది. చట్టంలో చేసిన హామీల్లో ఇప్పటికీ అమలుకాని వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించాలని డిసైడ్‌ అయ్యింది.  విభజన చట్టంలోని హామీల...

Tuesday, August 16, 2016 - 22:00

చిత్తూరు : జిల్లాలోని పుంగనూరు బోయకొండ గంగమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.. హుండీలో చోరీచేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. వీరిని ఆలయ అధికారులు పోలీసులకు అప్పగించారు.. 

Tuesday, August 16, 2016 - 21:58

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో  కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై జైట్లీతో చర్చించారు. అంతకుముందు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇరువురు భేటీ అయ్యారు.  రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

 

Tuesday, August 16, 2016 - 21:29

చిత్తూరు : తిరుమలేశుని అన్నప్రసాదం భక్తుల్లో అజీర్తికి కారణమవుతోందా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. నాణ్యత లేని బియ్యాన్ని ప్రసాద వితరణ కోసం వాడుతుండడమే శ్రీవారి భక్తుల్లో అజీర్తికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద నిత్యాన్నదాన వితరణ కేంద్రంలో వాడే పదార్థాలపై శాస్త్రీయ అధ్యయనం కొరవడడంతో.. టీటీడీ సత్సంకల్పం విమర్శలపాలవుతోంది. 
...

Tuesday, August 16, 2016 - 20:13

అనంతపురం : జిల్లాలోని హిందూపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 30 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు,యూపీఎస్‌, స్కానర్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని సిబ్బంది చెబుతున్నారు. 

Tuesday, August 16, 2016 - 20:05

విజయవాడ : సినీనటుడు కోటాశ్రీనివాసరావు విజయవాడలో పుష్కరస్నానం చేశారు. సాంప్రదాయబద్దంగా పుష్కరస్నానం చేసి పిండప్రదానం చేశారు. ఇప్పటివరకు  5 సార్లు కృష్ణా పుష్కరాలలో పాల్గొన్నానని  కోటా తెలిపారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు.

 

Tuesday, August 16, 2016 - 20:02

హైదరాబాద్ : పుష్కరాల్లో పుణ్యస్నానాలతో పాటు పితృదేవతలకు పిండప్రదానం చేయడం పరిపాటి. పూర్వీకులకు పిండప్రదానం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరి ఆశీస్సులందిస్తారని అనేక మంది తమ పితృదేవుళ్లకు నదిమా తల్లి ఒడిలో పిండాలను వదులుతుంటారు. అయితే కృష్ణా పుష్కరాల్లో పిండాలను నదిలో కలపనీయకుండా అధికారులు.. చెత్త బుట్టలో పడేస్తున్నారు. అరకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు...

Tuesday, August 16, 2016 - 18:55

కృష్ణా : జిల్లాలో పుష్కర స్నానాలు విషాదం జరిగింది. ఏటూరు వద్ద స్నానాలకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. నందిగామ చైతన్య కాలేజీ విద్యార్థులు హరగోపాల్, లోకేష్, గోపిరెడ్డి, నగేష్‌, హరిగా వీరిని గుర్తించారు. నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పదకొండు మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. ఘాట్ లో నీరు బాగా...

Tuesday, August 16, 2016 - 18:42

విజయవాడ : నదుల అనుసంధానం ద్వారా కృష్ణా- గోదావరి నదులకు సంవత్సరం వ్యవధిలో పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ధ్యానబుద్ధ ఘాట్‌లో భక్తులతో ఆయన మాటామంతి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని కాపాడాలని.. ఇందుకోసం ఇంకుడు గుంతలు, పూడికలు తీసి భూగర్భ నీటిమట్టాన్ని పెంచాలని కోరారు. ప్రతి వ్యక్తి నదులను పూజించాలన్నారు. కృష్ణా నది...

Tuesday, August 16, 2016 - 16:28

గుంటూరు : జిల్లాలోని సీతానగరం ఘాట్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురైంది. ఘాట్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జరీనాబేగం స్పృహతప్పి పడిపోయింది. మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నా అధికారులు సెలవుకు నిరాకరించారని జరీనా తల్లి తెలిపింది. జరీనాకు తోడుగా విధులు నిర్వహించేందుకు వచ్చానని ఆమె తల్లి తెలిపింది. జరీనాబేగం పాత గుంటూరు పీఎస్...

Tuesday, August 16, 2016 - 16:13

కృష్ణా : జిల్లాలోని చందర్లపాడు (మం) ఏటూరు వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఉన్న బందోబస్తు సిబ్బంది ఇక్కడకు తరలివచ్చారు. ప్రస్తుతం నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పదకొండు మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు....

Tuesday, August 16, 2016 - 13:26

గుంటూరు : ఏపీ పుష్కరాల్లో పెను అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు (మం) ఏటూరు వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఉన్న బందోబస్తు సిబ్బంది ఇక్కడకు తరలివచ్చారు. ప్రస్తుతం రెండు మృతదేహాలను బయటకు తీశారు.
నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి...

Tuesday, August 16, 2016 - 12:49

గుంటూరు : ఏపీ పుష్కరాల్లో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఉదయం ఒక పూజారి గుండెపోటుతో మృతి చెందగా తాజాగా కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల జాడ తెలియడం లేదు. నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పది మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. ఘాట్ లో నీరు బాగా లేకపోవడంతో ఓ బోట్ లో జిడుగు వద్దనున్న పాయ వద్దకు వచ్చారు. అక్కడకు వచ్చిన అనంతరం పది మంది విద్యార్థులు...

Tuesday, August 16, 2016 - 12:14

ముంబై : ఆ బంగళాకు ఎంతో విశిష్టత ఉంది. పేరు ప్రఖ్యాతలూ ఉన్నాయి. ఎంతో మంది జాతీయ నేతలు. బస చేసేందుకు విడిదిగా ఉపయోగపడింది. 1904లో నిర్మించిన ఆ బంగళాను ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇప్పుడా బంగ్లా వందల కోట్లు పలుకుతోంది. ఇంతకు ఆ పురాతన బిల్డింగ్‌ ఎక్కడుంది..? స్వాతంత్య్ర సమరయోధులకు రహస్య స్థావరం. స్వాతంత్య్ర సమరయోధులకు రహస్య స్థావరంగా...

Tuesday, August 16, 2016 - 10:15

నెల్లూరు : జిల్లాలో మత్స్యకారులు కిడ్నాప్ కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తమిళ జాలర్లు జిల్లాకు చెందిన 18 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసినా అధికారులు..మెరైన్ సిబ్బంది స్పందించడం లేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆంజనేయపురం మత్స్యకారులు వేటకు వెళ్లారు. మొత్తం 18 మంది చేపల వేట కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో...

Pages

Don't Miss