AP News

Wednesday, February 14, 2018 - 21:29

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇపుడు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించింది. మంగళవారం నెల్లూరు జిల్లా కలికిరి సభలో.. జగన్‌ చేసిన రాజీనామా కామెంట్లు రాజకీయ కాకను పెంచేస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ - వైసీపీ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. ద్రోహులు మీరంటే.. మీరేనంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఎంపీల రాజీనామాలు...

Wednesday, February 14, 2018 - 20:40

మోహన్ భగవత్ యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు గానీ, వారి వాఖ్యల వెనక వారి వద్ద ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోందని, వర్ణవ్యవస్థను పాటించడానికి అర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని, ఆర్ఎస్ఎస్ వెజిటెబుల్ ఆర్గనైజేషనని, భారత్ సైన్యం లో రెండు రకాల వారు ఉంటారని టీమాస్ ఫోరం చైర్మన్ కంచె ఐలయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Wednesday, February 14, 2018 - 19:07

గుంటూరు : నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రకటన తర్వాత ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. దీనిపై టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఏపీలో తాజా సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, February 14, 2018 - 18:43

కడప : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జేఏసీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు మాజీ మంత్రి రామచంద్రయ్య. పెద్ద పెద్ద నేతలను జేఏసీ ఏర్పాటు కోసం వాడుకోవడం సమంజసం కాదన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంత వరకు సీఎం చంద్రబాబు నాయుడు అఖిలపక్షం భేటీ నిర్వహించకపోవడం దారుణమన్నారు. తక్షణం రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి పార్టీలకతీతంగా ఢిల్లీకి వెళ్లి పోరాడదామని...

Wednesday, February 14, 2018 - 18:42

హైదరాబాద్ : మొన్నటి వరకూ మీడియా సమావేశంలోనో.. సోషల్ మీడియా ద్వారానో తన స్పందన తెలిపిన జనసేనాని పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా పంథాను మార్చుకున్నారు. ముఖ్యంగా ఏపీ విభజన హామీల సాధన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఒంటరిపోరుతో కేంద్రాన్ని కదిలించలేమని భావించారో ఏమో... విభజన హామీల లెక్కలు తేల్చేందుకు జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రశ్నించేందుకే...

Wednesday, February 14, 2018 - 18:40

హైదరాబాద్ : టీడీపీ నేతల విమర్శలను వైసీపీ నాయకులు సైతం అంతేస్థాయిలో తిప్పికొడుతున్నారు. రాజీనామాలతో రాష్ట్ర ప్రజల కోసం త్యాగానికి సిద్ధపడుతున్న వైసీపీ ఎంపీలపై నిందలు తగదంటున్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేక.. సభ బయటికొచ్చి విచిత్ర వేషధారణలతో డ్రామాలాడుతుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

Wednesday, February 14, 2018 - 18:40

శ్రీకాకుళం : రోజుకో మాట మారుస్తూ వైసీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యులు కింజారపు రామ్మోహన్‌ నాయుడు. పాదయాత్రకే ఆదరణ లేని సమయంలో ఎంపీల రాజీనామ పేరుతో పార్టీ మైలేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ కోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ఢిల్లీలో తమ గళాన్ని...

Wednesday, February 14, 2018 - 17:42

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌ కామెంట్లపై టీడీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాకోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారన్న వైసీపీ అధినేత ప్రకటనను టీడీపీ ఎద్దేవా చేస్తోంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న తమ ఎంపీలు మాత్రమే పార్లమెంటులో నిరసన తెలిపారంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, February 14, 2018 - 16:07

కర్నూలు : జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ డాక్టర్ గుట్టురట్టైంది. శకుంతల సర్కిల్ లో శ్రీనరహరిక్లీనిక్  పేరుతో నరహరి అనే నకిలీ వైద్యుడు నడుపుతున్నాడు. విద్యార్హత లేకున్నా నరహరిరెడ్డి 20 ఏళ్ల నుంచి వైద్య వృతి కొనసాగిస్తున్నారు. ఇన్ని ఏళ్లకు డాక్టర్ బాగోతాన్ని విజిలెన్స్ అధికారలు బయటపెట్టారు. మరింత సమాచారం కోసం వీడియ క్లిక్ చేయండి. 

Wednesday, February 14, 2018 - 15:41

విశాఖ : రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రైల్వే జోన్ కేటాయింపులో ఆలస్యం చేస్తే సహించబోమని.. పోరాటాలను ఉధృతం చేస్తామని అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, February 14, 2018 - 15:39

కృష్ణా : విభజన చట్టంలోని హామీల అమలుకు భారీస్థాయిలో ఉద్యమం చేపట్టబోతున్నట్టు వామపక్ష పార్టీల నేతలు తెలిపారు. దీనిపై దశలవారీగా ఉద్యమం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను సమీకరిస్తామన్నారు. విభజన చట్ట హామీల అమలుకు మార్చి 6న పార్లమెంట్‌ ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ తెలిపారు. ఇవాళ...

Wednesday, February 14, 2018 - 15:38

విశాఖ : ఏప్రియల్ 6న రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్.జగన్ బూటకపు ప్రకటన చేసారంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రెండేళ్లుగా రాజీనామాలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్న జగన్ తిరిగి పాతపాటే పాడుతున్నారని విమర్శించారు. 2016లో నిజంగా రాజీనామా చేసి ఉంటే వైసీపీ నేతల చిత్తశుద్ధిని ప్రజలు నమ్మేవారని గంటా అన్నారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉండి...

Wednesday, February 14, 2018 - 13:12

పశ్చిమగోదావరి : శివరాత్రి సందర్భంగా ఆచంటలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలకు హాజరైన మహిళల పట్ల కొంతమంది ఆకతాయి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించడం..కామెంట్స్ చేశారని కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి...

Wednesday, February 14, 2018 - 13:10

పశ్చిమగోదావరి : ఏడేళ్ల పాటు కేసు నడించింది..చివరకు కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆయనో ఎవరో కాదు..పలు వివాదాలకు కారణమైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ 2011లో దెందులూరులో జరిగిన జన్మభూమి సభలో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై చింతమనేని చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా...

Wednesday, February 14, 2018 - 12:39

విజయవాడ : ఏపీలో సోలార్ విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతోంది. విద్యాసంస్థలు.. వ్యాపార సముదాయాలు సైతం ఇప్పుడు సోలార్‌ పవర్‌పై దృష్టి పెట్టాయి. విజయవాడలో అతి పెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయోగాత్మకంగా 150 వాట్స్ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్‌ ఇది... ఈ కాలేజ్‌ ప్రాంగణంలో...

Wednesday, February 14, 2018 - 12:26

కృష్ణా : విభజన చట్టాల హామీలు ఎలా సాధించుకోవాలి..ప్రత్యేక హోదాకు అనుసరించాల్సిన వ్యూహం..కేంద్రం మెడలు ఎలా వంచాలే దానిపై వామపక్షాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటి వరకు జరుగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలని యోచిస్తున్నాయి. విభజన హామీలు అమలుకు టిడిపి వత్తిడి చేయకపోవడం..కేంద్రం స్పందించకపోవడంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.

నాలుగేళ్లు...

Wednesday, February 14, 2018 - 11:25

విజయవాడ : గత కొన్ని రోజులుగా ఏపీలో విభజన హామీల అమలు..ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ కేంద్రంపై అధికార..విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిదే. దీనిపై ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షమైన వైసీపీ ఒక్కసారిగా వ్యూహం మార్చేసింది. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటనతో రాజకీయ వేడి మరింత రగులుకుంది. దీనితో టిడిపి...

Wednesday, February 14, 2018 - 06:45

కర్నూలు : మహా శివరాత్రికి శ్రీశైలం ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఓం నమోః శివాయ నామస్మరణతో శ్రీ గిరి పొంగిపోయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నంది వాహనంపై విహరించారు. సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం అద్యంతం కన్నుల పండువగా సాగింది. పాగాలంకరణతో వరుడైన మల్లన్న కల్యాణోత్సవం అర్ధరాత్రి దాటిన తర్వాత అట్టహాసంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మల్లన్న...

Tuesday, February 13, 2018 - 21:35

గుంటూరు : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ... అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అంబానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో అమరావతి చేరుకుని.. నేరుగా రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రానికి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రియల్‌ టైం...

Tuesday, February 13, 2018 - 21:35

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ లాలూచీ పడిందని మధు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ టీడీపీ-బీజేపీలు ఎన్నికల స్టంట్‌కు తెరతీశాయని మండిపడ్డారు....

Tuesday, February 13, 2018 - 21:33

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్‌.. కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. కేంద్రానికి అల్టిమేటం లాంటిది జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అని. కేంద్రం హోదా ఇచ్చేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు జగన్‌. పార్లమెంటు బడ్జెట్‌ మలివిడత సమావేశాలు ప్రారంభమయ్యే నాటి నుంచి దశలవారీ...

Tuesday, February 13, 2018 - 20:43

వైసీపీ నిర్ణయం కీలకమైందని, ఇప్పటికే అన్ని వర్గాల వారు ఏపీ కోసం పోరాటం మొదలు పెట్టారని, జగన్ గత ఏడాది తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారని, జగన్ కేవలం ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారని, జనగ్ చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని మోడీ పై మాత్రం మౌనంగా ఉన్నారని ప్రముఖ విశ్లేషకులు తెలపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Pages

Don't Miss