AP News

Saturday, August 6, 2016 - 22:03

ఢిల్లీ : కేంత్రం తన పంతాన్ని నెగ్గించుకుంది. 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బిల్లును సక్సెస్‌ఫుల్‌గా గట్టెక్కించింది. బిల్లుకు మెజార్టీ పార్టీలు మద్దతు ప్రకటించడంతో జీఎస్టీ బిల్లు విజయవంతంగా గట్టెక్కింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా బిల్లు విషయంలో కేంద్రం ఎందుకు డ్రామాలాడుతోంది.? హోదా బిల్లుకు 11 పార్టీలు మద్దతు ప్రకటించినా..బిల్లు...

Saturday, August 6, 2016 - 21:53

విజయవాడ : ప్రత్యేక హోదా బిల్లు చర్చ నేపథ్యంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి..మనకు వ్యతిరేకంగా బల్లపై చప్పట్లు కొట్టడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ముందు నుంచి కేంద్ర మంత్రి సుజనా కమలనాథులతో బాగా టచ్‌లో  ఉంటారనే ప్రచారం నిజమైందని కొందరంటున్నారు..ఈ వాదనలో వాస్తవమెంత. ఓ పక్క రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి...

Saturday, August 6, 2016 - 21:46

విజయవాడ : రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు..  కేంద్ర మంత్రి సుజనా చౌదరి.. ప్రత్యేక హోదాపై చిత్తశుద్దితో కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించడంలేదని విమర్శించారు.. రాజకీయాలు ఆపి ఏపీ ప్రయోజనాలకోసం కృషి చేయాలని సూచించారు.. రాజ్యసభలో ఛైర్మన్‌ ప్రకటన తర్వాత తాను బల్ల చరిచి అభినందించాల్సిన అవసరం ఏదీలేదని స్పష్టం చేశారు.. ఇలా చేయడంవల్ల...

Saturday, August 6, 2016 - 21:41

కడప : ప్రత్యేక హోదా రాద‌ని తెలిసినా చంద్రబాబు నాట‌కాలాడుతున్నార‌ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌ఫూర్ విమర్శించారు. క‌డ‌ప‌లో జ‌రిగిన సీపీఎం జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి హాజ‌రైన గఫూర్‌..ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు..రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్రమను నిర్మించి..రాయ‌లసీమ‌లోని...

Saturday, August 6, 2016 - 21:38

ప్రకాశం : జిల్లా మార్కాపురం మార్కెట్‌ యార్డు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మర్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. టైర్‌ పంక్చర్‌ కావడంవల్లే బస్సు అదుపుతప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు.

Saturday, August 6, 2016 - 18:09

విజయవాడ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. విజయవాడ డివిజన్‌ ట్రెజరీ ఆఫీసులో సబ్‌ ట్రెజరరీ అధికారిగా పనిచేస్తున్న మోహన్‌రావు నాలుగు నెలల క్రితం ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేసి.. ఉద్యోగ విరమణ చేసిన జగన్నాథరావు అనే వ్యక్తికి తనకు కావాల్సిన పిఎఫ్‌ ఇతర అలవెన్స్‌లను శాంక్షన్ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో జగన్నాథరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు....

Saturday, August 6, 2016 - 17:11

అనంతపురం : రాష్ట్రానికి ఆర్థిక లోటు ఉన్నా.. చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. ఏపీలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్షమే నేతన్నల...

Saturday, August 6, 2016 - 15:40

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యులు చట్టంలో.. హామీలను ఎందుకు పొందపరచలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత...

Saturday, August 6, 2016 - 14:04

విశాఖ : ఎన్నో ప్రమాదాలు జరగకుండా కాపు కాసింది...నడి సంద్రంలో నావలకు మార్గం చూపింది...మత్స్యకారులకు పెద్ద దిక్కుగా నిలిచింది. మొత్తానికి విశాఖ నగరానికి వెన్నుముకగా ఉంది..అంతటి విశిష్టత కలిగిన నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నేడు అవసాన దశలో ఉంది.

బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటు చేసి నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ..
...

Saturday, August 6, 2016 - 13:56

శ్రీకాకుళం : వర్షాకాలం వస్తే చాలు శ్రీకాకుళం జిల్లాలోని వరినాట్ల కూలీలు ఎక్కడ లేని హుషారుతో కలసి కట్టుగా పని చేస్తారు.. కష్టాన్ని మర్చిపోతారు.. అలుపు సలుపు లేకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. పంటలు బాగా పండాలని, మంచి లాభాలు రావాలని తమ పాటల ద్వారా కోరుకుంటారు. ఇది జిల్లాలో వరినాట్లు వేస్తూ కూలీలు కనిపించే తీరు.

లక్ష్మీదేవిని...

Saturday, August 6, 2016 - 13:51

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మవరంలోని రైల్వే వంతెనను సీఎం ప్రారంభించారు. అనంతరం వనం మనం కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్కను నాటారు. అలాగే చేనేత కార్మికుల రుణమాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్క అనంతపురం ధర్మవరం, వెంటకటగిరి,ఉప్పాడలలో...

Saturday, August 6, 2016 - 12:33

హైదరాబాద్ : ఉమ్మడి సంస్థల విభజనాంశం కొలిక్కి వస్తోంది. ఇరు రాష్ట్రాల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇంతవరకూ 61 సంస్థల ఆస్తుల్లో దాదాపు 30 వేల కోట్ల రూపాయలను ఇరురాష్ట్రాలు పంచుకోగా మరికొన్న సంస్థల ఆస్త్తులపై క్లారిటీ రానుంది. ఈ మేరకు విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు కమిటీ వచ్చేవారం కీలక...

Saturday, August 6, 2016 - 12:29

చెన్నై : రోజులు గడుస్తున్నాయి..తమవారు అసలు ఉన్నారో లేదో...వస్తారో రారో తెలియదు. దానికి సంబంధించి ఎవరూ సమాచారం ఇవ్వరు. అసలు మా వాళ్లు వస్తారా ? రారా.. ? వస్తే ఎప్పుడొస్తారు ? ఇది గల్లంతైన ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏఎన్ -32 విమానంలో ప్రయాణించిన ఉద్యోగుల బంధువుల ఆవేదన. విమానం గల్లంతై ఇప్పటికి 15 రోజులు గడుస్తున్నా..విమానానికి సంబంధించిన...

Saturday, August 6, 2016 - 10:56

మహారాష్ట్ర : నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. కృష్ణా నది జన్మస్థలం మహాబలేశ్వర్‌లో రికార్డు స్థాయిలో గడిచిన నాలుగు రోజుల్లో 110 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు,...

Saturday, August 6, 2016 - 10:37

గుంటూరు : అమరావతి..! నవ్యాంధ్రకు రాజధాని ప్రాంతం. ఈ ప్రాచీన చారిత్రక ప్రదేశం.. కృష్ణమ్మ పుష్కరాలకు సమాయత్తమవుతోంది. రాజధానిగా తమ ప్రాంతం ఎంపికైన తర్వాత వస్తున్న పుష్కరాలను ఇంటింటి పండుగలా జరుపుకునేందుకు స్థానికులు సన్నద్ధమయ్యారు. అధికారుల ఏర్పాట్లు ఒకవైపు.. స్థానికుల సన్నాహాలు మరోవైపు.. కృష్ణాతీర అమరావతి ప్రాంతంలో పుష్కర శోభ అలరారుతోంది....

Saturday, August 6, 2016 - 10:26

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఏపీలో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే మూడు జిల్లాల్లోనూ పుష్కర ఏర్పాట్లు జోరందుకున్నాయి. ప్రభుత్వం అధికారులను ఉరుకులు పెట్టిస్తోంది. అయితే.. క్షేత్రస్థాయిలో పనులు ఇంకా ఓ కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. పుష్కరాల నాటికైనా ఇవి పూర్తవుతాయా అన్న అనుమానాలున్నాయి. వేగిరం లోపించిన...

Saturday, August 6, 2016 - 09:59

విజయవాడ: మానవ నాగరికత ఉద్భవించింది నదీ తీరాల్లోనే.. మహా నగరాలైనా, పుణ్య క్షేత్రాలైనా అన్నీ నదీ తీరాల్లోనే వెలిశాయి. నదితో మనిషికి విడదీయరాని అనుబంధం ఉంది. మన పురాణ ఇతిహాసాల్లోనూ నదుల ప్రాశస్త్యం ప్రతీ సందర్భంలోనూ కనిపిస్తుంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మొత్తం పన్నెండు ప్రధాన నదులను పుణ్య నదులుగా కీర్తించారు. ప్రతీ ఏడు ఒక్కో నదికి పుష్కరం...

Saturday, August 6, 2016 - 07:40

విజయవాడ :విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాల పనులలో భాగంగా విజయవాడకే తలమానికమైన ప్రకాశం బ్యారేజ్ కొత్త శోభను సంతరించుకుంది. పుష్కరాల సందర్భంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ కాంతులతో కనువిందు చేసింది. సీఎం చంద్రబాబు ఎల్‌ఈడీ బల్బుల లైటింగ్‌ను ప్రారంభించారు. బ్యారేజీ పొడవునా రకరకాల కాంతులతో విరజిమ్మిన లైటింగ్...

Saturday, August 6, 2016 - 06:58

ఢిల్లీ : కృష్ణా పుష్కరాలకు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ,వెంకయ్యనాయుడులను కలిసారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలో పేర్కొన్న హామీల గురించి ప్రధానితో మాట్లాడారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని ప్రధాన విషయాలు గురించి ఇరువురు...

Friday, August 5, 2016 - 20:53

ఢిల్లీ : ప్రత్యేక హోదా బిల్లును బీజేపీ కోల్డ్‌ స్టోరేజీలో పడేసింది. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును మనీ బిల్లు అంటూ  ఆర్థికమంత్రి జైట్లీ అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ  నేపథ్యంలో బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ ఏపీని మోసం చేసిందంటూ ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి....

Friday, August 5, 2016 - 20:31

బందర్ పోర్టు నిర్మిస్తామని..అయితే రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈమేరకు టెన్ టివి రవీంద్రతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...'మచిలీపట్నం పోర్టు చరిత్ర కలిగిన పోర్టు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పోర్టును నిర్లక్ష్యం చేశారు. బందరు పోర్టు ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పని చేసాను.....

Friday, August 5, 2016 - 19:56

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా సాధిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించామని చెప్పారు. గతేడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా...

Friday, August 5, 2016 - 19:47

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేకహోదాను ఇస్తామని, ఇవ్వమని చెప్పే ధైర్యం లేక టీడీపీ, బీజేపీలు నపుంసక పాత్ర పోషించాయని ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకహోదా అమలు చేస్తారా.. లేదా స్పష్టం చేయాలన్నారు. ఆట ఇంకా పూర్తి కాలేదు.. బంతి మీకోర్టులోనే ఉంది అన్నారు. 

Friday, August 5, 2016 - 19:18

ఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మరోసారి బీజేపీ హ్యాండిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ తప్పించుకుంది. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ అభ్యంతరాలు లేవనెత్తారు.. మనీబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌ చేపట్టలేమని లోక్‌సభలో...

Friday, August 5, 2016 - 18:47

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించామని టిడిపి ఎంపీలు తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ ఎంపీలందరూ ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదా ఆవక్యకతను వివరించామన్నారు. దానిపై మోడీ స్పందిస్తూ...రాష్ట్రానికి తప్పకుండా న్యాయం చేస్తామని తమకు హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు. వచ్చే వారం...

Friday, August 5, 2016 - 18:16

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో సీపీఎం, సీపీఐ నేతలు రిలే దీక్షలు చేపట్టారు.. హోదా ఇచ్చి ఏపీని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలోతీరుగా చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నాయని నేతలు మండిపడ్డారు..

Friday, August 5, 2016 - 18:06

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ముందు ఉన్న గాంధీవిగ్రహం దగ్గర ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఏపీలో 6కోట్ల ఆంధ్రులంతా ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని...ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా...

Pages

Don't Miss