AP News

Tuesday, September 29, 2015 - 15:50

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు టీడీపీ యువనేత లోకేశ్ నాయుడు.. జిల్లాకువచ్చిన లోకేశ్‌కు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.. అక్కడినుంచి నల్లజర్లలోని టీడీపీ కార్యకర్తల శిక్షణాశిబిరానికి హాజరయ్యారు యువనేత..

Tuesday, September 29, 2015 - 14:42

హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో నెలకొన్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎక్స్ గ్రేషియా పెంచాం, నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. చర్యలు తీసుకుంటున్నా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో.. నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుతాలను హైకోర్టు అదేశించింది.

 

Tuesday, September 29, 2015 - 09:21

గుంటూరు : జిల్లాలో విషాదం నెలకొంది. పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. రైలుపేట మూడో వీధిలో తెల్లవారు జాము 5.30 సమయంలో పాతభవనం కూలింది. దీంతో ఇంట్లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు అంజమ్మ(70), ప్రదీప్(3)లుగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో విషాఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా...

Tuesday, September 29, 2015 - 07:10

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది ప్రభుత్వం. దీనికోసం ఏకంగా తొమ్మిదిన్నర కోట్ల రూపాయలను ఆ సంస్థకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నామని చెపుతూ.. మరోవైపు కోట్లాది రూపాయలు దుబారాచేయడంపై విపక్షాలు ఆగ్రహం...

Monday, September 28, 2015 - 21:31

విశాఖ : చిట్టి చిట్టి అడుగులతో చిందులేసిన ఆ చిన్నారి జాడ ఇంకా తెలియలేదు. గులాబీలా నవ్వులు రువ్విన ఆ చందమామ ఎక్కడుందో కనపడలేదు. ఇంకా ఆశ మిణుకు మిణుకు మంటోంది. నాలుగురోజుల నిరీక్షణకు ఇంకా ఫలితం దక్కలేదు. ఎక్కడో తమ చిట్టితల్లి బతికే ఉందని కన్నతండ్రి నమ్ముతున్నారు. విశాఖ నగరాన్ని చుట్టుముట్టిన ఈ విషాదానికి అంతమెప్పుడో అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది.

...

Monday, September 28, 2015 - 18:43

హైదరాబాద్ : భూమిని కోల్పోయిన వాళ్లకు భూమి ఇస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వాళ్లకు మరోచోట ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. కానీ...ఏళ్లు గడుస్తున్నా..ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా..కాదు పొమ్మంటున్నారు. ఇదీ శ్రీశైలం ముంపు బాధితుల ఆవేదన. శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేయాలని పాలమూరు అధ్యయన వేదిక తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్...

Monday, September 28, 2015 - 18:38

విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయినాథ్ కెమికల్స్‌లో భారీ పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

Monday, September 28, 2015 - 18:36

కృష్ణా : విజయవాడలో రోడ్ల విస్తరణకు బాలరిష్టాలు తప్పడం లేదు. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా పరిస్థితి మారింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో... అధికారులు భూసేకరణ సర్వే పనుల్లో జోరుపెంచినా.. గృహ యజమానులు వారి స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్నారు. భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్ .........

Monday, September 28, 2015 - 18:33

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని శంకుస్ధాపనకు సమయం దగ్గరపడుతుండటంతో...ఏర్పాట్లలో మునిగిపోయింది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 22 విజయదశమి రోజున జరిగే..ఈ కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపనకు ప్రధాని మోదీతో పాటు సింగపూర్‌ ప్రధాని లీహసన్‌ లూంగ్‌, జపాన్‌ విదేశాంగ మంత్రి రానుండడంతో కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది....

Monday, September 28, 2015 - 18:31

కర్నూలు : జూపాడుబంగ్ల పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి మృతి కలకలం రేపుతోంది. లింగాపురానికి చెందిన పుల్లన్న.. పీఎస్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సారాయి కేసులో పోలీసులు ఆదుపులోకి కోవడంతో మనస్థాపం చెందిన పుల్లన్న.. పురుగుల మందు తాగాడు. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. పుల్లన్న చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుడి బంధువులు.. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు...

Monday, September 28, 2015 - 18:29

గుంటూరు : చిలకలూరిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మురికిపూడి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి తల్లికూతుర్లు మృతి చెందారు. కొమ్మనబోయిన నాగమణి.. తన ఐదేళ్ల కూతురుతో కలిసి పొలం పనులకు వెళ్లింది. నాగమణి పొలం పనులు చేసుకుంటుండగా.. కూతురు బావిలో పడబోయింది. ఇది చూసిన తల్లి.. కూతుర్ను కాపాడబోయి బోరుబావిలో జారి పడిపోయింది. భార్య కూతరు మరణించడంతో భర్త బోరున...

Monday, September 28, 2015 - 16:47

విజయవాడ : రైతులకు అప్పులిచ్చినవారిపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు. ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వాలని అప్పు తీసుకున్న రైతులపై ఒత్తిడి చేయద్దన్నారు. ఒకవేళ ఎవరైనా..అలా ఒత్తిడి చేస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Monday, September 28, 2015 - 15:51

విజయవాడ : :ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పి.మధు ఫైర్ అయ్యారు. పేదల భూములను బలవంతంగా లాక్కొని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా...భూబ్యాంక్‌ విధానానికి చంద్రబాబు స్వస్తి పలకాలన్నారు. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

Monday, September 28, 2015 - 15:49

హైదరాబాద్ : అనంతపురం- అమరావతి వయా కర్నూలు రహదారిని జాతీయ రహదారిగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. వెయ్యి కోట్ల రూపాయలతో ఎన్ హెచ్ -44 ను ఎన్ హెచ్ -65తో అనుసంధానించనున్నారు. నాలుగు లైన్ల రహదారిని 6 లేదా 8 లైన్లుగా మార్చనున్నారు. భూ సమీకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని చుట్టూ 126 కి.మీ. రింగురోడ్డుకు కేంద్రం అంగీకారం...

Monday, September 28, 2015 - 15:46

విజయనగరం : ఎస్‌.కోటలో ఎస్టీ హాస్టల్‌ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వసతి గృహానికి పక్కా భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ నిన్న సాయంత్రం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన 156 మంది విద్యార్థినులు నీరసించిపోయారు. వీరిలో 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

Monday, September 28, 2015 - 14:49

కృష్ణా : గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. 2016లో ప్రారంభం కానున్న కృష్ణా నది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. రాజమండ్రి కోటిలింగాల రేవు...

Monday, September 28, 2015 - 14:45

కృష్ణా :విజయవాడలో గుర్రం జాషువా 120వ జయంతోత్సవాలను సీఐటీయూ ఘనంగా నిర్వహించింది. జిల్లా కార్యాలయంలో ఆ సంఘం నేతలు.. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. అగ్రకులం కవులున్న కాలంలోనే తక్కువ జాతి నుంచి వచ్చిన గుర్రం జాషువా తన కవితలతో అందరినీ ఆకట్టుకుని మెప్పించారని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.గఫూర్ అన్నారు. కుల నిర్మూలనకు పాటుబడిన కవులలో...

Monday, September 28, 2015 - 13:54

విజయవాడ : మహాకవి గుర్రం జాషువా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని.. సీఎం చంద్రబాబు అన్నారు. జాషువా 120వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోజాషువా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. తనను ఎగతాళి చేసిన వారిని.. జాషువా ఎదురుప్రశ్నలు అడిగి అబ్బురపరిచేవారని అన్నారు. జాషువా స్ఫూర్తితో మంచి కవితలు, రచనలు...

Monday, September 28, 2015 - 13:33

చిత్తూరు : తిరుపతిలోని కపిలతీర్థంలో పెను విషాదం చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన యువకులు..అనూహ్యంగా వరద నీరు రావడంతో కొండపై నుంచి పుష్కరిణిలో పడి చనిపోయారు. కపిలేశ్వరాలయం కొలువై ఉన్న ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఘటన తిరుపతి వాసులను కలవరానికి గురిచేసింది. అప్పటి వరకూ ఎంతో...

Monday, September 28, 2015 - 13:19

విజయవాడ : కొండా లక్ష్మణ్‌ బాపూజీ, గుర్రం జాషువాలు మహనీయులని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కొనియాడారు. ఏపీలో రైతాంగం కోసం చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులు పెంచాలన్నారు. రైతు ఆత్మహత్యలపై కారణాలను అన్వేషించి.. రైతుకుటుంబాలకు మేలు చేయాలన్నారు.

 

Monday, September 28, 2015 - 11:49

చిత్తూరు : తిరుపతి కపిల తీర్థం పుష్కరిణి ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇవాళ పుష్కరిణి నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న రాత్రి దొరికిన ఏడు మృతదేహాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. 

Monday, September 28, 2015 - 11:45

నెల్లూరు : జిల్లాలోని తోటపల్లి గూడురులో ఓ కానిస్టేబుల్ ను స్థానికులు చితకబాదారు. మల్లకార్జున్ అనే కానిస్టేబుల్ ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త.. స్థానికులతో కలిసి.. కానిస్టేబుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

 

Monday, September 28, 2015 - 10:50

గుంటూరు : కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా 120 జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాశక్తి బుక్ హౌస్, సాహితి స్రవంతి, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జాషువ సమగ్ర రచనలు, సమాలోచన రాష్ట్ర స్థాయి సాహితీ సదస్సు నిర్వహించారు. గుంటూరు ఎసీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు...

Monday, September 28, 2015 - 10:40

నెల్లూరు : పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం విజయవంంతం అయింది. ఖగోళ పరిశోధనకు సంబంధించి ఇస్రో తొలి ప్రయోగం ఇది. 7 ఉపగ్రహాలను నిర్ణీతక్షక్ష్యలో పీఎస్ ఎల్వీ సీ 30 ప్రవేశపెట్టింది. ఆస్ట్రోశాట్ తో పాటు అమెరిరా, కెనడా, ఇండోనేషియాకు చెందిన ఆరు ఉపగ్రహాలను పీఎస్ ఎవ్ వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లింది. ఐదేళ్లపాటు పీఎస్ ఎల్ వీ సీ-30 సేవలు కొనసానున్నాయి. గ్రహాలు, నక్షత్ర...

Monday, September 28, 2015 - 10:31

నెల్లూరు : శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ ఎల్ వీ సీ-30 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆస్ట్రో శాట్ సహా 7 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది.

 

Monday, September 28, 2015 - 09:21

ఢిల్లీ : ఆ... యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌.
భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం...

Monday, September 28, 2015 - 08:49

నెల్లూరు : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-30ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన లక్ష్యంతో ఆస్ట్రోశాట్ ప్రయోగం నిర్వహిస్తున్నారు.
...

Pages

Don't Miss