AP News

Saturday, October 31, 2015 - 06:34

విజయవాడ : ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం జనచైనత్య యాత్రలను మార్గంగా ఎంచుకుంది. గడప గడపకు టీడీపీ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొంటారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజవర్గాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహిస్తారు. గ్రామ గ్రామాన...

Saturday, October 31, 2015 - 06:32

నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. కండలేరు ఎడమ కాలువపై 62 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీని ద్వారా.. పొదలకూరు మండలంలోని సుమారు పాతిక వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. దీన్ని నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో...

Friday, October 30, 2015 - 20:31

విజయవాడ : ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.. ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు.. నవంబర్ 3న నా నియోజకవర్గం, నా బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నమని ప్రకటించారు.. దేశ, విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. గుంటూరు జడ్పీ హాళ్లో ప్రత్తిపాడు నియోజకవర్గ...

Friday, October 30, 2015 - 20:21

హైదరాబాద్ : డిసెంబర్ 16 నుంచి హైదరాబాద్ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రకటన వెలువడింది. దీపావళి తరువాత ఏపీ టీడీపీ మేథోమధన సదస్సు జరగుంది. మరోవైపు నవంబర్ 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగే టీటీడీపీ సర్వసభ్య సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ భేటీలోనే నారాయణ్ ఖేడ్ బైపోల్ పై కూడా చర్చించనున్నారు.

 

Friday, October 30, 2015 - 18:53

విజయనగరం : మాస్టర్ సచిన్ టెండుల్కర్ వారసుడు అర్జున్ టెండుల్కర్ ...విజయనగరంలో జరుగుతున్న అండర్ -16 క్రికెట్ మ్యాచ్ లో సందడి సందడి చేశాడు. ఇక్కడి సర్ విజ్జీ స్టేడియం వేదికగా బరోడాతో జరుగుతున్న మూడురోజులమ్యాచ్ లో ముంబైజట్టు సభ్యుడిగా అర్జున్ వరుస బౌండ్రీలతో అలరించాడు. అర్జున్ ను చూడటానికి అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. అయితే ..నిర్వాహక సంఘం మాత్రం...

Friday, October 30, 2015 - 18:49

విజయవాడ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూష హత్యకేసు తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు ఏపీ మంత్రి చినరాజప్ప.. కాస్త ఆలస్యమైనా కోర్టు మంచి తీర్పు ఇచ్చిందన్నారు.. ఈ శిక్ష వెంటనే అమలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు..

Friday, October 30, 2015 - 18:46

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు. కేంద్ర మంత్రి సృజన చౌదరికి హైకోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేసింది. సృజనా చౌదరీతో పాటు మరో ఆరుగురి డైరెక్టర్లకు దిక్కరణ నోటీసులు ఇచ్చింది. 2010 లో హెస్టియా హోల్డింగ్ కంపెనీ తీసుకున్న రుణానికి సృజన చౌదరీకి చెందిన కంపనీ సృజనా యూనివర్సల్ ఇండ్రస్టీ షూరీటిగా ఉంది. అయితే గతంలో లండన్ కోర్టు, సిటి సివిల్...

Friday, October 30, 2015 - 18:41

ప.గో :సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్‌‌, మరదలు కళ్యాణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో నిందితులు పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Friday, October 30, 2015 - 15:37

నెల్లూరు :గూడురులో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకుంటున్న అశోక్ అనే విద్యార్థి హాస్టల్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Friday, October 30, 2015 - 15:36

విజయవాడ : బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. విజయవాడలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహించిన రాష్ట్ర సదస్సులో మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ పరిరక్షణ పోరాటంలో కలిసి వచ్చేవారితో ఆందోళనకు దిగుతామన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల ఎకరాలను స్వాధీనం...

Friday, October 30, 2015 - 15:35

హైదరాబాద్ : జగన్ రాజీనామా చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుందంటే... అందుకు తాము సిద్ధమన్నారు వైసీపీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ. అయితే మాతో పాటు టీడీపీ నేతలు కూడా రాజీనామాకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. హోదా కోసం వైసీపీ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని జ్యోతుల నెహ్రూ అన్నారు.

Friday, October 30, 2015 - 15:15

అనంతపురం :కరువుతో రాయలసీమ అల్లాడిపోతుంటే..సీఎం చంద్రబాబు మాత్రం నీరోచక్రవర్తిలాగా అమరావతిలో ఫిడేలు వాయించుకుంటు కూర్చున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాయలసీమను ఆదుకునేందుకు సీఎం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Friday, October 30, 2015 - 15:07

హైదరాబాద్ : తమ కూతురిని తమకు కాకుండా చేసిన దుర్మార్గుడికి శిక్ష పడటంతో అనూహ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యపై అత్యాచారం జరిపి.. దారుణంగా హత్య చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ చంద్రభానుకు ముంబై సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. జనవరి 5, 2014న మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్లిన అనూహ్యను డ్రాపింగ్‌ నెపంతో తన ట్యాక్సీలో...

Friday, October 30, 2015 - 14:52

నెల్లూరు : జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. ముందువెళ్తున్న లారీని గ్రానైట్‌ లోడ్‌ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రానైట్‌ రాళ్లు పడి నలుగురు మహిళలు మృతి చెందారు. వెంకటాచలం మండలం చెముడుగుంట రహదారిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Friday, October 30, 2015 - 14:47

హైదరాబాద్ : ఆంధ్రాకు బద్దశత్రువైన కేసీఆర్‌ అమరావతి శంకుస్దాపనకు వస్తే..ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం రానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో కండలేరు ఎడమకాలువ ఎత్తిపోతల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..ప్రతిపక్ష నేత జగన్‌పై ఫైర్‌...

Friday, October 30, 2015 - 14:27

హైదరాబాద్ : సామాజిక వ్యవస్ధ పుట్టుకను, కులాల ఏర్పాటు వెనుక చరిత్రను, ఆంతర్యాన్ని వివరిస్తూ టెన్‌టీవీలో ప్రసారమవుతున్న జనచరిత కార్యక్రమానికి పద్మమోహన అవార్డు లభించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తరతరాలుగా కులం పేరుతో జరుగుతున్న అన్యాయాలను సైద్ధాంతికంగా శాస్త్రీయంగా వివరిస్తున్న జనచరితకు వచ్చిన ఈ అవార్డును టెన్‌ టీవీ అసిస్టెంట్‌ ఎడిటర్‌ తాడి సతీష్‌ అందుకున్నారు....

Friday, October 30, 2015 - 14:20

ప.గో : ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఆగస్టు 25న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వేలమందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన...

Friday, October 30, 2015 - 10:52

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మళ్లీ స్వైన్ టెర్రర్ మొదలైంది. స్వైన్‌ ఫ్లూ విజృంభించి ప్రజల్ని గజగజ వణికిస్తోంది. వాతావరణం కాస్త చల్లబడటంతో మాయదారి రోగం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పంజా విసురుతోంది. స్వైన్‌ స్వైర విహారంతో జనాలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు
...

Friday, October 30, 2015 - 10:49

విజయవాడ : ఎపి సచివాలయ ఉద్యోగులు విజయవాడకు వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు హుకూం జారీ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు హైదరాబాద్‌లో ఉండేందుకు సమయమిచ్చారు. విజయవాడలో వసతి సౌకర్యాలు ఉన్నా లేకున్నా ఉద్యోగులు కొన్ని త్యాగాలు చేయక తప్పదని స్పష్టం చేశారు.
విజయవాడకు ఎపి సచివాలయ ఉద్యోగులు...
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులు విజయవాడకు...

Thursday, October 29, 2015 - 18:53

విజయవాడ : రాజధాని నిర్మాణంలో తాము కూడా పాలు పంచుకుంటామని నెదర్లాండ్స్‌ ప్రతినిధులు చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఈ రోజు విజయవాడలో సీఎంతో భేటీ అయిన నెదర్లాండ్స్‌ ప్రతినిధులు.. చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణంలో తామేం చేయగలమనేది వారు చంద్రబాబుకు వివరించారు. 

Thursday, October 29, 2015 - 18:52

విజయవాడ: ఎన్ని సమస్యలున్నా ఉద్యోగులు అమరావతికి జూన్‌కల్లా వచ్చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఆర్ధికంగా పరిస్ధితి అనుకూలంగా లేకపోయినా ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చామని.. ఇప్పుడు పరిస్ధితి అర్ధం చేసుకుని త్యాగాలకు సిద్ధం కావాలని బాబు స్పష్టం చేశారు. హెచ్‌ఆర్‌ఏ వ్యవహారంపై పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగులు మాత్రం ఈ విద్యా...

Thursday, October 29, 2015 - 18:51

విజయవాడ : ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజకీయాలను చేస్తోందని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి. రాజధాని కోసం రైతుల నుంచి వేల ఎకరాల్లో భూములు తీసుకున్న ప్రభుత్వానికి భూదాహం తీరలేదని ఆయన విమర్శించారు. రాజధానిలో పేదవారు ఉండటం ప్రభుత్వానికి ఇష్టం లేకే బలవంతపు భూసేకరణ చట్టాన్ని రైతులపై ప్రయోగిస్తుందన్నారు....

Thursday, October 29, 2015 - 16:58

విజయవాడ: రాజధాని ప్రాంతానికి భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని ఏపి సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు హెచ్చరించారు. అవసరమైతే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని అన్నారు. కృష్ణానది ఒడ్డున నివసించే పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నించినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు...

Thursday, October 29, 2015 - 16:45

కృష్ణా : విజయవాడ దగ్గరలోని కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌సిటీ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను సాంకేతిక కారణాలతో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండుగంటలుగా నిలిచిపోవడంతో.. రైళ్లలోని ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Thursday, October 29, 2015 - 16:39

విజయవాడ: టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని మొదటి సారిగా ఎపిలో ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. మొదటి విడతగా ప్రకాశం, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా విడతల వారిగా...

Thursday, October 29, 2015 - 16:38

విజయవాడ : తుళ్లూరు కాంట్రాక్టుల విషయంలో తనపై వస్తున్న వార్తలు అసత్య కథనాలని మంత్రి నారాయణ విమర్శించారు. తుళ్ళూరు పరిధిలో జరగాల్సిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. ఇంకా కేవలం 29 గ్రామాల్లోని 300 ఎకరాలు మాత్రమే పెండింగులో ఉన్నందు వలన అక్కడి రైతులకు ల్యాండ్ పూలింగులో పాల్గొని వారి భూములకు విలువలు పెంచుకోవల్సిందిగా...

Thursday, October 29, 2015 - 15:11

కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కర్నూలు నగరంలో హెల్మెట్‌ వినియోగంపై కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. ప్రమాదాలనివారణ కోసం ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ కోరారు.

Pages

Don't Miss