AP News

Thursday, July 9, 2015 - 18:15

చిత్తూరు : గోదావరి పుష్కరాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గోదావరికి సమర్పించడానికి శ్రీవారి ఆలయం నుంచి సారె రాజమండ్రికి బయలుదేరింది. స్వామి వారి విగ్రహం, పసుపు, కుంకుమ తదితర పూజాసామాగ్రితో కూడిన ప్రత్యేక వాహనం రాజమండ్రికి బయలదేరింది. వాహనం తిరుచానూరు, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడల మీదుగా రాజమండ్రి పుష్కర ఘాట్‌కు చేరుకుంటుంది. ఈ నెల 14న సీఎం చేతుల...

Thursday, July 9, 2015 - 18:13

పశ్చిమగోదావరి : అతడు చట్టసభల్లో సభ్యుడు...కానీ చట్టాలంటే అస్సలు గిట్టదు. అధికార పార్టీ ఎమ్మెల్యే..అయినా అధికారులంటే అలుసు. తాజాగా మహిళా ఎమ్మార్వోపైనే దాడికి దిగి తన దౌర్జన్యాన్ని చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి దెందులూరుకు చెందిన ఈ ఎమ్మెల్యే తీరుతో ఇప్పడు అధికార టిడిపికి తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా చింతమనేని...

Thursday, July 9, 2015 - 13:33

కృష్ణా: తహసీల్దార్‌పై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనపై.... కృష్ణా జిల్లావ్యాప్తంగా దుమారం రేగుతోంది. జిల్లాలోని తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది...కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్‌పై దాడి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ బాబు చెప్పారు. ఇసుక ర్యాంపు ఏ జిల్లాకు సంబంధించిందో తేల్చిన తర్వాత.... తుదుపరి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు....

Thursday, July 9, 2015 - 12:16

కృష్ణా: విజయవాడలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షకు దిగారు. పీడీఎఫ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. టీచర్ల అక్రమ బదీలలకు వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, అంతర్‌ జిల్లాల బదిలీలను అనుమతించాలని, రాజకీయాల పైరవీలను అరికట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

 

Thursday, July 9, 2015 - 11:58

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీమాంధ్ర నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని మాటల తూటాలు పేల్చారు. ఎపి విభజన చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభలో ఎంతమంది ఉన్నారని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకున్న సమాచారం మేరకు ఐదుమందే ఉన్నారని తేల్చి చెప్పాడు.

Thursday, July 9, 2015 - 11:53

విశాఖపట్టణం: జీకేవీధి పీఎస్‌లో మిస్ ఫైర్ కలకలం సృష్టించింది. తుపాకీని శుభ్రం చేస్తుండగా...ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ అజయ్‌కుమార్‌ మృతి చెందారు. ఐతే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సహచరులు భావిస్తున్నారు.

 

Thursday, July 9, 2015 - 11:49

కృష్ణా: ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని రక్షించేందుకు... ఏపీ మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగారు. చింతమనేనిపై చేసిన ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులపైనా టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. ఐతే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ... నూజివీడులో తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది...

Thursday, July 9, 2015 - 10:20

కృష్ణా: అక్రమార్జనే లక్ష్యంగా ఇసుక మాఫియా నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. రెవెన్యూ సిబ్బందిని నిలువరించేందుకు, మహిళా అధికారులపై సైతం దాడి చేసేందుకు కూడా వెనుకడుగువేయలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు మండల తహశీల్దారు వనజాక్షిపై... పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తన అనుచరులతో కలిసి దాడి.. చేసి...

Thursday, July 9, 2015 - 10:17

విశాఖ: 'బాహుబలి' దెబ్బకు థియేటర్లు బలవుతున్నాయి. విశాఖలో బాహుబలి అభిమానులు హల్‌చల్‌ చేశారు. బాహుబలి మూవి ప్రదర్శించటం లేదని....ఓ థియేటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. దొండపర్తిలోని శ్రీకన్య థియేటర్‌పై అభిమానులు దాడి చేశారు. థియేటర్లు అద్దాలు ధ్వంసమయ్యాయి. అభిమానులపై యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Thursday, July 9, 2015 - 07:52

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు.. తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. పవన్‌కు టీడీపీ నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎంపీలు స్పెషల్‌ స్టేటస్‌ మరిచి వ్యాపారాలు చేసుకుంటున్నారన్న ఆయన మరోసారి ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. తనను తిట్టినంత మాత్రాన ఏపీకి ప్రత్యేక హోదా రాదని చురకలంటించారు. కేసులు పెడితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమంటూ...

Thursday, July 9, 2015 - 07:45

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు బృందం జపాన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. చంద్రబాబు బృందం టోక్యో నగరాన్ని సందర్శించింది. షింబసీ స్టేషన్ నుంచి షింటో యొసు స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించారు. టోక్యోలో 2020 ఒలింపిక్స్ జరిగే ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. అనంతరం తోషిబా కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
ఏపీలో విద్యుత్ నిర్వహణపై...

Wednesday, July 8, 2015 - 18:18

తిరుపతి : టిడిపికి..పవన్ అభిమానుల మధ్య దూరం పెరుగుతోందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుకోవాలి. పవన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎంపీలు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. విజయవాడ, తిరుపతిలో పార్టీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చారు. ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. తిరుపతిలో నాని...

Wednesday, July 8, 2015 - 18:17

ఢిల్లీ : త్వరలోనే కేంద్రం నుండి ఏపీకి నిధులు వస్తాయని, ఓపిక పట్టాలని ఎపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ పరిష్కారమౌతాయని, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ నెరవేర్చడంలోకేం ద్రం సానుకూలంగాఉంద న్నారు. ఏపీ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన ప్రాజెక్టులను..పథకాలను ఆయన...

Wednesday, July 8, 2015 - 18:09

విజయవాడ: పాతబస్తీలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్‌కల్యాణ్‌పై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ధర్నా చేశారు. పవన్‌ ప్రచారంతోనే ఎన్నికల్లో టీడీపీ గెలించిదని విమర్శించారు. పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రోడ్లపై...

Wednesday, July 8, 2015 - 13:36

గుంటూరు:కోడితాడిపర్రులో రైతుల ఆత్మహత్యల ఘటనపై గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే స్పందించారు. రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రైతుల నుంచి భూమిని తీసుకోబోమని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రైతుల ఆత్మహత్యల ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

 

Wednesday, July 8, 2015 - 12:47

హైదరాబాద్: టిడిపి ఎంపీల విమర్శలకు పవన్‌ కళ్యాణ్ కౌంటరిచ్చాడు. తాను జైలుకు వెళ్లటానికైనా, కోర్టులను ఎదుర్కునేందుకైనా సిద్ధమని ట్విటర్‌లో స్పందిచాడు. మరోవైపు విజయవాడలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దమ్ముంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలంటూ...టిడిపి నేతలను డిమాండ్ చేస్తున్నారు.

Wednesday, July 8, 2015 - 12:04

అతివల అందానికే మరింత అందం తీసుకువచ్చేది చీర. అందుకే భారతీయ మహిళలు.. అందులో తెలుగువాళ్లకు చీర అంటే మహా ఇష్టం. చీరల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అణువణువునా కనిపిస్తుంది. అయితే నేతన్నల నైపుణ్యం వారి కడుపులు మాత్రం నింపలేకపోతుంది. చాలీచాలని సంపాదనతో ఎలా బతకాలో అర్ధం కాక నేతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఉప్పాడ చీరలు నేసే చేనేత కార్మికుల...

Wednesday, July 8, 2015 - 11:58

ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో చంద్రబాబు చేనేత కార్మికులకు ఎన్నో హామిలిచ్చారు. నేతన్నల తలరాతలను మారుస్తానని మాటిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా చేనేత కార్మికుల రుణం తీర్చుకోలేదు. ఏపీలో అతిపెద్ద చేతివృత్తి పరిశ్రమ అయిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే సంక్షోభంలోకి కూరుకుపోయింది. కష్టాల కడగండ్లను అధిగమించలేక కృష్ణా జిల్లా నేతన్నలు దుర్భర పరిస్థితులు...

Wednesday, July 8, 2015 - 11:55

వ్యవసాయం, చేనేత దేశానికి రెండు కళ్లన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. మొదటి కన్ను చూపు కోల్పోతోంది. మరో కంటికి అంతా అంధకారమే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ చేనేత కార్మికుడిని తట్టినా కన్నీటి వ్యధలే కనిపిస్తాయి. ప్రేమనే దారంతో మమకారమనే మగ్గంతోనే చీరలను, వస్త్రాలను నేసే నేతన్నకు ఇప్పుడు దిక్కే లేకుండా పోతోంది. గుంటూరు మంగళగిరి నేతన్న మగ్గంపై చావలేక, బతకలేక జీవచ్చవంలా బతుకు పయనం...

Wednesday, July 8, 2015 - 11:48

గుంటూరు: రైతులు ఆందోళన చేస్తున్నారు. అమృతలూరు మండలం కోడితాడిపర్రులో ఆలయ భూముల వేలం నిరసిస్తూ .... రోడ్డెక్కారు. రైతుల మృతితో కోపోద్రిక్తులైన రైతులు ....ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి వామపక్ష పార్టీలతో పాటు పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. మెయిన్‌రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు...

Wednesday, July 8, 2015 - 11:45

గుంటూరు: అమృతలూరులో విషాదం నెలకొంది. కోడితాడిపర్రులో ఆలయ భూముల వేలం నిరసిస్తూ రెండు రోజుల క్రితం....ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సత్తయ్య అనే రైతు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ మృతిచెందాడు. కోడితాడిపర్రులో చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన వ్యవసాయ భూములను...ఆలయ అధికారులు వేలం వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామ రైతులకు, ఆలయ అధికారుల మధ్య...

Wednesday, July 8, 2015 - 10:41

హైదరాబాద్:జపాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. జపాన్ రాజధాని టోక్యోలో చంద్రబాబు బృందం పర్యటించింది. సుమారు గంట పాటు నగరాన్ని పరిశీలించారు. 2020లో ఒలింపిక్స్‌ జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. షింబసీ స్టేషన్‌ నుంచి షింటోయెసు వరకు బాబు మెట్రో రైల్‌లో ప్రయాణించారు. తోషిబా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా గ్రిడ్ ఏర్పాటు చేయాలని...

Wednesday, July 8, 2015 - 07:07

తిరుపతి:టిటిడి మరో వివాదాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని.. మరోసారి అభాసుపాలవుతోంది. మైనార్టీ విద్యార్థులపై వివక్ష చూపడంపై సర్వత్రా విమర్శలు పెల్లుబికుతున్నాయి. టిటిడి కి చెందిన విద్యాసంస్థల్లో హిందూయేతర విద్యార్థులకు అడ్మిషన్లను నిలిపివేయడంతో వివాదం తలెత్తింది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో ఇలాంటి వివక్షను సహించేదిలేదని...

Wednesday, July 8, 2015 - 06:58

హైదరాబాద్: జపాన్‌ పర్యటన రెండో రోజు ఏపీ బృందం... జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యింది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ నుంచి కూడా ఆహ్వాన లేఖ వస్తుందని తెలిపారు. తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, స్వామి వారి లడ్డూ ప్రసాదాలు బహూకరించారు. పలువురు జపాన్‌ మంత్రులతోనూ ఏపీ బృందం సమావేశమైంది. ఏపీ రాజధాని...

Wednesday, July 8, 2015 - 06:55

హైదరాబాద్:రాజకీయ దుమారం రేపిన పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ఏపీ పార్లమెంట్ సభ్యులు గట్టిగానే సమాధానమిచ్చారు. పార్లమెంట్ సభ్యులు వ్యాపారం చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. చిరంజీవి కూడా కాంగ్రెస్ ఎంపీ అని... ఆయన వ్యాపారాలు చేయడం లేదా అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ సహా ఎవరైనా మంచి సలహాలిస్తే స్వీకరిస్తామని..ఎంపీల పనితీరును...

Tuesday, July 7, 2015 - 21:24

విజయనగరం : జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నా.. ఆగమేఘాల మీద సర్కార్‌ తుది నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఏం కావాలో చెప్పండి చేస్తామంటూనే.. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇప్పుడు భోగాపురం మండలం అట్టుడుకుతోంది. అభివృద్ధి పేరుతో వినాశన...

Tuesday, July 7, 2015 - 20:39

కడప : జిల్లాలో నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ కె.వి.రమణ విచారణ చేపట్టారు. జడ్పీలో 13వ ఆర్థిక సంఘ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, జనరల్ ఫండ్స్ లను వైసిపి ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపీలు ఇష్టారాజ్యంగా పంచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. వైసిపి ప్రజా ప్రతినిధులకు సహకరించిన అధికారులపై వేటు వేసేందుకు కూడా కలెక్టర్‌ సిద్ధంగా...

Pages

Don't Miss