AP News

Monday, April 17, 2017 - 18:44

అమరావతి: ప్రతి సోమవారం విజయవాడలోని కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ నుంచి పోలవరం నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షిస్తున్న చంద్రబాబునాయుడు, ఈసారి ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించిన చంద్రబాబు, ఆ తర్వాత స్పిల్‌ వే రెగ్యులేటర్‌, డయాఫ్రం వాల్‌, గేట్ల నిర్మాణాలను తనిఖీ...

Monday, April 17, 2017 - 18:41

తూర్పుగోదావరి :రంపచోడవరంలో విషాదం చోటుచేసుకుంది. తూర్పుమన్యంలో ఓ కొండపైన నివాసం ఉంటున్న గిరిజనుల పూరిగుడిసె మంటల్లో కాలి బూడిదకాగా..ఆ మంటల్లోనే చిక్కుకొని నలుగురు చిన్నారులు కన్నుమూశారు. నలుగురు చిన్నారులను ఇంట్లో వదిలిపెట్టిన తండ్రి కూలీపనిగా వెళ్లగా..కొద్దిసేపటికి తల్లి మంచినీటి కోసం బయటకు వెళ్లింది. అయితే తల్లిదండ్రులిద్దరూ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే...

Monday, April 17, 2017 - 18:33

అనంతపురం : జిల్లాలోని కదిరిలో ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు పరీక్ష రాశారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షలకు హాజర అయ్యారు. అయన అధికారులు పట్టించుకోలేదు. ఉదయం 8 గంటలవరకే అభ్యర్థుల పేపర్ చేతికొచ్చింది. అధికారులు తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Monday, April 17, 2017 - 17:39

విజయవాడ : గుణదల చేరుకున్న దేవినేని నెహ్రూ మృతదేహనికి మంత్రి నారా లోకేష్, రవీంద్ర నివాళులు అర్పించారు. నెహ్రూ మృతదేహం కడసారి చూపు కోసం కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. ఆయన అంతిమయాత్ర రేపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

Monday, April 17, 2017 - 17:26

గుంటూరు : కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ పాలనలో తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే నుంచే తన శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులతో వరుసగా రివ్యూ మీటింగ్ లు, భేటీలు నిర్వహిస్తున్నారు

అనుభవం లేని లోకేష్‌కు కీలక శాఖలు.....
పంచాయితీ రాజ్,...

Monday, April 17, 2017 - 17:07

ఢిల్లీ : కశ్మీర్‌లో అల్లర్లను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న సీపీఎం పోలిట్‌ బ్యూరో సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూలంకషంగా చర్చించామన్నారు. జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని వాటిని సవరించాలని సీపీఎం కోరిందన్నారు. నోట్ల రద్దు...

Monday, April 17, 2017 - 16:57

విజయవాడ : జీతాలు ఇవ్వడం లేదంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని కార్యాలయం ఎదుట కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ఆందోళణకు దిగారు. ఎంపి నాని తమను మోసం చేశారని గత 8 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ డ్రైవర్లు, క్లీనర్లు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత నెల 15వ తేదీలోపు జీతాలు ఇస్తామని కేశినేని నాని హామీ ఇచ్చారని....కానీ ఇప్పటివరకు ఇవ్వకుండా తమను రోజూ ఆఫీసు...

Monday, April 17, 2017 - 16:40

పశ్చిమ గోదావరి : ప్రతిపక్షాలు ఎన్ని అవరోధాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి తీరతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబునాయుడు..... అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం...

Monday, April 17, 2017 - 14:56

పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. గేట్ల తయారీ యూనిట్‌, స్పిల్‌వే రెగ్యులేటర్‌ను పరిశీలించారు. డయా ఫ్రం వాల్‌ నిర్మాణ పనులనూ చంద్రబాబు పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 

Monday, April 17, 2017 - 13:50

విజయవాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ గుండెపోటుతో చనిపోయారు. విద్యార్ధి దశలోనే రాజకీయాలపట్ల ఆకర్షితులైన నెహ్రూ.. పాలిటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీలో కీలక నేతగా మారి... ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. బెజవాడ రాజకీయాల్లో తన ముద్ర వేశారు. దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానంపై 10టీవీ కథనం..
1954 జూన్‌ 22న నెహ్రూ జననం ...

Monday, April 17, 2017 - 13:32

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అవినీతి అధికారి బయటపడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌సహా ఎనిమింది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు...

Monday, April 17, 2017 - 13:10

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్ సిండికేట్ మాయాజాలం..సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. సిమెంట్ ధరలు అమాంతం పెంచేయడంతో ఇళ్ల నిర్మాణం కష్టతరంగా మారింది. ఏటా ఇలా కృత్రిమ కొరత సృష్టించి అనూహ్యంగా ధరలను పెంచేస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాదికి 15 లక్షల టన్నులు అవసరం.....
కృష్ణా జిల్లా...

Monday, April 17, 2017 - 12:59

విజయవాడ : 'మీ పాలన భేష్‌.. బీసీలు, ఎస్టీలు, ముస్లింమైనార్టీల రిజర్వేషన్ల కోటా పెంచడానికి ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అభినందన లేఖ రాశారు. తమ ముఖ్యమంత్రిలా చేయొద్దన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరినందుకే చంద్రబాబు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ముద్రగడ తన లేఖలో...

Monday, April 17, 2017 - 12:47

విజయవాడ : కిడ్ని సమస్యతో బాధపడుతు తుది శ్వాస విడిచిన దేవినేని నెహ్రూ తన జీవితంలోని తీపి జ్ఞాపకాలను ఫొటోల రూపంలో భద్రపరుచుకున్నారు. వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలతో ఓ గ్యాలరీని ఏర్పాటు చేశారు. నెహ్రూ రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్రలుగా నిలిచాయి. ఎన్టీఆర్ పిలుపుమేరకు టీడీపీతో తన ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటో ఎంతో...

Monday, April 17, 2017 - 12:24

విజయవాడ : భానుడి ప్రతాపానికి విజయవాడ నగర వాసులు విలవిల్లాడుతున్నారు. మండుతున్న ఎండలకు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉదయం నుంచే నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అటు ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు పెరిగిపోయాయి. ఆలయ అధికారులు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండతో ఇబ్బంది పడుతున్నారు....

Monday, April 17, 2017 - 10:33

కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై ఆవులు తరలిస్తున్న ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న   ఆవులకు గాయాలు అయ్యాయి. కొన్ని ఆవులకు కాళ్లు విరిగాయి. తుని నుంచి హైదరాబాద్‌ కబేలాకు ఆవులు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Monday, April 17, 2017 - 10:29

నెల్లూరు : నగరంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులనే టార్గెట్‌ చేశారు. మంగళూరు పోలీస్‌కమిషనర్‌ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. నగరంలోని మాగుంట లేఅవుట్‌ ప్రాంతంలో ఉన్న కమిషనర్‌ నివాసంలో ఈ దొంగతనం జరిగింది. దొంగల కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఏకంగా పోలీస్‌ బాస్‌ ఇంటేకే కన్నం వేయడంతో.. నెల్లూరులో కలకలకంగా మారింది. 

 

Monday, April 17, 2017 - 10:10

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటు రావడంతో నెహ్రూ మృతి చెందారు. నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలించారు. మృతదేహం ఒంటి గంటకు విజయవాడకు చేరుకోనుంది. భౌతికాయాన్ని పొట్లూరు...

Monday, April 17, 2017 - 09:51

హైదరాబాద్ : టీడీపీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ హఠాన్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవినేని నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు. గత వారం రోజులుగా కిడ్నీ సంబంధ వ్యాధితో దేవినేని నెహ్రూ బాధపడుతున్నారు. అనారోగ్యంతో వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్‌...

Monday, April 17, 2017 - 07:21

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటు రావడంతో నెహ్రూ మృతి చెందారు. 22 జూన్ 1954 సం.లో నెహ్రూ జన్మించారు. దేవినేని నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. దేవినేనికి అక అబ్బాయి, ఒక అమ్మాయి...

Sunday, April 16, 2017 - 21:11

కడప : పొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం.. రణరంగాన్ని తలపించింది. ఎన్నిక వాయిదా వేయాలంటూ టీడీపీ నేతలు... జరిపి తీరాల్సిందేనంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. పంతం నెగ్గించుకునేందుకు ఇరువర్గాలూ హంగామా సృష్టించాయి. టీడీపీ సభ్యులు బల్లలు, కుర్చీలు విరిచేయగా... వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఏకంగా ఆర్ డీవోను కొట్టినంత పనిచేశారు. 
కుర్చీలు...

Sunday, April 16, 2017 - 19:06

విజయనగరం : జిల్లా టీడీపీ రాజకీయాల్లో కొత్త టెన్షన్ మొదలైంది. బొబ్బిలి ఎమ్యెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడంతో టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తి మొదలైంది. మంత్రి పదవి కోసం తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కెఎ నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ప్రతిపక్ష వైసీపీ నుంచి పార్టీలో చేరిన సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడంతో...

Sunday, April 16, 2017 - 18:57

విశాఖపట్నం : అరకులోయకు సరికొత్త అందం చేకూరింది. అరకు అందాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అద్దాల రైలు అందుబాటులోకి వచ్చింది. రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అద్దాల రైలును ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైలును...

Pages

Don't Miss