AP News

Friday, July 3, 2015 - 09:43

గుంటూరు: మాచర్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తపల్లి జంక్షన్ సమీపంలోని ఓ డాక్డర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు దొంగలు.. డాక్లరతోపాటు అతని భార్యను తాళ్లతో కట్టేసి... తుపాకీతో బెదిరించి చోరీ చేశారు. 15 సవర్ల బంగారం, రూ. 4 వేల నగదును అపహరించారు.

 

Friday, July 3, 2015 - 09:30

తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్ల వద్ద చిరుతలు కలకలం సృష్టించాయి. 1300 మెట్టు దగ్గర ఒక పెద్ద చిరుత పులి, రెండు చిన్న చిరుత పులులు కనిపించాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. నడకదారి భక్తులను నలిపి వేశారు. చిరుతల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Friday, July 3, 2015 - 08:02

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. పోలింగ్‌ కేంద్రాలకు పెన్నులు, సెల్‌ఫోన్లు తీసుకురాకూడదనే నిబంధనను విధించారు. ఓటింగ్‌కు వైలెట్‌ కలర్‌ పెన్నులను అధికారులే...

Thursday, July 2, 2015 - 21:27

హైదరాబాద్: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో... రేపు జరగబోయే... స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు... ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికార పార్టీ వ్యవహరిస్తోన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ప్రతిపక్ష వైసీపీ... ప్రకాశం జిల్లాలో ఎన్నికను బహిష్కరించింది. ఇక కర్నూలు జిల్లాలో రెండు పార్టీల మధ్య హోరాహోరా జరిగే అవకాశం వుంది. ఇప్పటికే ప్రలోభ పర్వాలకు తెరలేచినట్లు...

Thursday, July 2, 2015 - 21:23

విజయవాడ: ఏపీ రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు పోరుబాట పట్టారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కూలీలు, కార్మికులకు నెలకు తొమ్మిది వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. పేదలు, కూలీల ఆధ్వర్యంలో డీఆర్ డీఏ కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు, కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీల...

Thursday, July 2, 2015 - 21:20

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి... విశాఖ జిల్లా పర్యాటన ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ వెళ్లిన జగన్‌కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఆయన అచ్యుతాపురం బయల్దేరారు. రాజమండ్రి బ్రిడ్జి వద్ద కారు ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పటి వరకూ పరిహారం అందివ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
...

Thursday, July 2, 2015 - 21:17

ప.గో:గోదావరి నది రాష్ట్రానికే జీవనాడిలాంటిదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన బాబు... గోదావరి తల్లి రుణం తీర్చుకునే అవకాశం పుష్కరాల ద్వారా వచ్చిందని... అందుకే ఖర్చుకు వెనకాడకుండా 520 కోట్ల రూపాయలు కేటాయింటినట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులనూ పరిశీలించి... వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
...

Thursday, July 2, 2015 - 18:36

గుంటూరు:బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు చెరువు జమ్ములపాలెం వాసులుగా గుర్తించారు. బాపట్ల రైల్వేస్టేషన్‌లో 4 రోజుల వ్యవధిలో ఇదో సంఘటన. 

Thursday, July 2, 2015 - 18:35

.గో: ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి పుష్కరాల సీడీలను ఆవిష్కరించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాలపై ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో రివ్యూ నిర్వహించారు. పుష్కరాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. 

Thursday, July 2, 2015 - 18:34

రెక్కడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది. పనిలేకపోతే పూటగడవని ధీనస్థితి వారిది. అలాంటి వారి జీవితాల్లో...రాజధాని పేరుతో చీకట్లు నింపారు. భూమిలిచ్చే రైతులకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. కానీ రైతుల కుడి భుజాలైన... కూలీలను మాత్రం మరిచిపోతున్నారు. నిన్నటిదాకా చేతి నిండా పనితో...కడుపు నిండా అన్నం తిన్న కూలీలు....ఇప్పుడు పనులు లేక పస్తులు ఉంటున్నారు. రాజధాని కూలీల కష్టాలపై...

Thursday, July 2, 2015 - 18:30

కడప జిల్లా టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుతోంది.. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన సీఎం రమేష్‌ తీరుపై స్థానిక నేతలు భగ్గుమంటున్నారు.. ఆయన ఒంటెద్దుపోకడలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జిల్లాలో టీడీపీ పరాభవానికి సీఎం రమేష్‌ నిర్ణయాలే కారణమంటున్నారు నేతలు.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు సీఎం రమేష్‌ ప్రాధాన్యం ఇచ్చిన ఫలితమంటున్నారు తమ్ముళ్లు.. బద్వేల్,...

Thursday, July 2, 2015 - 18:26

కర్నూలు: జిల్లాలో దారుణం మూడేళ్ల చిన్నారితో... ఓ మద్యం వ్యాపారి సారా తాగించి పొట్టనపెట్టుకున్నాడు.ఆస్పత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. డోన్ మండలం పెదమల్కాపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న డోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపడుతున్నారు. 

Thursday, July 2, 2015 - 18:24

పశ్చిమగోదావరి: జిల్లా సీఎం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పోలవరం మండలం, ఎడ్లగూడెం వద్ద వేగంగా వస్తున్న పోలీస్‌ కాన్వాయ్‌... అదుపు తప్పి ఓ పూరింట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడిక్కడే చనిపోయింది. మరొకరికి, పోలీస్‌ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో బాధితులను న్యాయం...

Thursday, July 2, 2015 - 16:39

అనంతపురం:ఉరవకొండలో దారుణం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు గమనించి హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. కోదండరాం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిండికేట్‌ బ్యాంకు అధికారుల వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తల్లి పేరు మీద ఉన్న పంట రుణం చెల్లించినా.. బ్యాంకు అధికారులు పాస్‌ పుస్తకం...

Thursday, July 2, 2015 - 16:36

కృష్ణా: జిల్లాలోని మోపిదేవి బీసీ బాలుర వసతి గృహంలో.. ఫుడ్‌ పాయిజన్‌ అయింది. దీంతో వంద మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి వండిన ఆహారం కలుషితం కావడంతో.. వాంతులు, విరేచనాలు అయినట్లు విద్యార్థులు చెప్పారు. గురుకుల విద్యార్థులను మండలి బుద్ధప్రసాద్‌, పలువురు నేతలు పరామర్శించారు....

Thursday, July 2, 2015 - 16:34

తుళ్లూరు: ఏపీ రాజధాని ప్రాంతంలో చైనా ప్రతినిధి బృందం పర్యటించింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన బృందం.. పలు అంశాలపై అధ్యయనం చేసింది. అంతకుముందు.. విజయవాడలో కలెక్టర్, ప్రభుత్వాధికారులతో సమావేశమైన చైనా ప్రతినిధి బృందం.. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌తో పాటు.. ఏపీలోని 13...

Thursday, July 2, 2015 - 16:29

ప.గో:ఆంధ్రప్రదేశ్‌ను కరువురహిత ప్రాంతంగా చేయడమే తమ లక్ష్యమన్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు.. గోదావరి, కృష్ణా జలాలను సమర్ధవంతంగా వినియోగించుకున్నప్పుడే నీటి సమస్య తీరుతుందని చెప్పుకొచ్చారు.. ఈ రెండు నదులను అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని బాబు తెలిపారు.

Thursday, July 2, 2015 - 13:35

గుంటూరు : రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో ఉపాధి కూలీల సమస్యలపై సీపీఎం సమరభేరీ మోగించింది. వారు పడుతున్న ఇబ్బందులు..కష్టాలను దూరం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. కూలీలు..మహిళలు పెద్ద ఎత్తున్న ఆందోళనకు తరలివచ్చారు. వీరు సీఆర్డీఏ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో...

Thursday, July 2, 2015 - 12:56

రాజమండ్రి : ''ఐ డోన్ట్ వాంట్ లిజనింగ్...డోన్ట్ విత్ ప్లే..దేర్ ఈజ్ ఏ కంప్లైంట్..దేర్ ఈజ్ ఏ కంప్లైంట్..యూ టేక్ కేర్..యూ ఆర్ అనెఫిషియెట్ దెన్ క్విట్..యూ ఆర్ కేపబుల్ ..యూ ఆర్ డూ ఇట్..అదర్ వైస్ డోన్ట్ ప్లే విత్ మి..వచ్చే వరకు సరి చేయాలి..లేకుంటే ప్రాపర్ స్థానంలో ఉంటావు..బీ కేర్ ఫుల్''..ఇవన్నీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. గురువారం...

Thursday, July 2, 2015 - 11:26

గుంటూరు : నిన్నటి వరకు గుంటూరు తెలుగు తమ్ముళ్లు కాలర్‌ ఎగరేసి తిరిగారు. ప్రస్తుతం తమ్ముళ్లు కాస్తా తలలు పట్టుకుంటున్నారు. మీరు కల్పించుకోకుంటే తీరని నష్టం జరుగుతుందంటూ అధినేత దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు. తెలుగుదేశం గ్రూపు తగాదాలతో రగిలిపోతోంది. సమన్వయంతో పనిచేయాల్సిన పార్టీ నేతలు వర్గ రాజకీయాలతో తలలు పట్టుకుంటున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయకుండా ఈ...

Thursday, July 2, 2015 - 10:15

రాజమండ్రి : జులై 14...తెలుగు రాష్ట్రాల్లో పావన గోదావరి తీరంలో పుష్కరాలు ప్రారంభమయ్యే రోజు. సర్వపాపహరణి.. గోదావరి పుష్కరిణి. ఆ నదీమ తల్లికి పుష్కర పుణ్య ఘడియలు వచ్చాయంటే యావత్ భారతావనే దక్షిణ గంగలో మునకేసేందుకు పరితపిస్తుంది. అలౌకిక ఆనందం పొందేందుకు గోదారి తీరానికి పరుగులు తీస్తుంది. ఈ క్రతువులో పాలుపంచుకోలేని భక్తుల కోసం తపాలశాఖ పుష్కర జలాభిషేకం చేసేందుకు...

Thursday, July 2, 2015 - 09:28

హైదరాబాద్ : ఏపీ జెన్‌కోలో విదేశీ బొగ్గు స్కామ్‌ కొనసాగుతోంది. టెండర్‌ గడువు ముగిసినప్పటికీ కొత్త టెండర్లు పిలవకుండా పాతవారినే కొనసాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతోంది. దీంతో ప్రజలపై ఛార్జీల భారం పడుతోంది. ఒకపక్క ప్రభుత్వ పెద్దలు.. మరోపక్క విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలోని ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో గత రెండేళ్లుగా ఈ భారీ స్కామ్‌ కొనసాగుతూనే ఉంది.
...

Thursday, July 2, 2015 - 07:01

ఢిల్లీ : నేడు అంతర్జాతీయ క్రీడాపాత్రికేయుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంఘాలు స్పోర్ట్స్ జర్నలిస్టు డే..వేడుకలను ఘనంగా జరుపుకోడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడారంగానికి అసాధారణ సేవలు అందించిన ప్రముఖులను సత్కరించుకోబోతున్నాయి. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, July 2, 2015 - 06:23

విశాఖపట్టణం :వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు వైఎస్‌ జగన్‌ విశాఖపట్టణం చేరుకుంటారు. అక్కడినుంచి అచ్యుతాపురం చేరుకుని.. ఇటీవల ఓ ప్రైవేట్‌ వాహనం నదిలో పడి 22 మంది మృత్యువాతపడ్డ కుటుంబ సభ్యులను...

Wednesday, July 1, 2015 - 21:20

తిరుమల: దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగింది. తొలుత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రెసిడెంట్. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో...

Wednesday, July 1, 2015 - 21:15

హైదరాబాద్:ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి..? ఏకంగా పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారే పార్టీని వీడుతుండటం దేనికి సంకేతం..? తెలుగు రాష్ట్రాల్లో ఇక పార్టీ కోలుకోవడం కష్టమని నేతలు గుర్తించారా..? పీసీసీలుగా పనిచేసిన అనుభవంతో ముందే సర్ధుకుంటున్నారా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది..
సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని షాక్‌.......

Wednesday, July 1, 2015 - 20:17

తూ.గో: రాజమండ్రి పుష్కర ఘాట్ లో గోదావరి నిత్యాహారతి వేడుకను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు పుష్కర శంఖారావాన్ని పూరించారు. అనంతరం పురష్కర సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్య రూపక ప్రదర్శనలు కనులవిందు చేశాయి.

Pages

Don't Miss