AP News

Saturday, January 30, 2016 - 21:32

విశాఖపట్టణం : ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సీఎం చంద్రబాబు తొడగొట్టడమేంటనీ ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. విశాఖలో ప్రొ.కబడ్డీ లీగ్ పోటీలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొడ కొట్టారు. తెలుగు టైటాన్స్, యు ముంబ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొడ ఎలాగొట్టారో వీడియోలో చూడండి. 

Saturday, January 30, 2016 - 21:24

విజయవాడ : కాపులు ఎదగకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తునిలో రేపు కాపు బహిరంగ సభ పెట్టుకుంటుంటే..దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

Saturday, January 30, 2016 - 21:22

హైదరాబాద్ : పూణేకు చెందిన భారతీయ ఛాత్ర సంసద్‌ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారాన్ని అందించింది. రాష్ట్ర విభజన జరిగిన క్లిష్ట పరిస్థితుల్లో నూతన రాష్ట్ర ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ సీఎం చంద్రబాబుకు ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Saturday, January 30, 2016 - 21:17

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూట‌మి విజేతగా అవ‌త‌రిస్తుంద‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హైద‌రాబాద్ మ‌ళ్లీ అభివృద్ధి బాట ప‌ట్టాలంటే టీడీపీ, బీజేపీ కూట‌మికి ఓటు వేయాల‌ని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కూట‌మి గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. టీడీపీ, బీజేపీ కూట‌మికే ఓటు వేయాల‌ని టిడిపి అధినేత చంద్రబాబు నగర ఓటర్లకు...

Saturday, January 30, 2016 - 21:15

హైదరాబాద్ : పరేడ్‌ గ్రౌండ్‌ సభలో సీఎం కేసీఆర్‌ టిడిపి అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి దత్తాత్రేయపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌పై అడుగడుగునా తన ముద్ర ఉందని చెప్తున్న చంద్రబాబుకు..బషీర్‌బాగ్‌ కాల్పుల గుర్తులు ఇప్పటికి అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర సహకారంతో తెలంగాణలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను కడుతున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పడం...

Saturday, January 30, 2016 - 18:46

కృష్ణా : జిల్లా మచిలీపట్నంలో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హిందూ కళాశాలలో నిర్వహిస్తున్న యువకెరటాల కార్యక్రమంలో ఈ ఘర్ణణ చోటుచేసుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే విద్యార్థులు పరస్పరం బ్లేడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Saturday, January 30, 2016 - 18:44

ఢిల్లీ : మాజీ ఆర్మీ చీఫ్‌, మాజీ గవర్నర్‌...కేవీ కృష్ణారావు కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. 1942లో సైన్యంలో చేరిన జనరల్‌ కృష్ణారావు ఆర్మీ చీఫ్‌గా 1983లో ఉద్యోగ విరమణ చేశారు. 1984లో నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. 1990లో జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. జనరల్‌ కృష్ణారావు స్వస్థలం...

Saturday, January 30, 2016 - 18:42

హైదరాబాద్ : ఫిబ్రవరి 27,28 తేదీలలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించేందుకు హిందూపురం ఎమ్మెల్యే మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మాణిక్యాలరావులు అధికారులతో ఏపీ సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హాజరయ్యారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా...

Saturday, January 30, 2016 - 18:41

విజయవాడ : ఏపీలో అభివృద్ధి ప్రచారం పేరుకే తప్ప ఆచరణలో ఏమీ లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఎంవోయుల వలన పెద్దగా ఉపయోగం లేదని గత ప్రభుత్వాలలో కూడా ఇలాంటివి చాలా జరిగాయని వాటివల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకునేందుకు ఇస్తున్న ప్రాధాన్యత.. చేతల్లో చూపడం లేదన్నారు తెలకపల్లి రవి.

 

Saturday, January 30, 2016 - 18:40

విజయవాడ : ఏపీ ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో పిటిషన్ వేసిన శ్రీమన్నారాయణ ఆరోపించారు. సీఆర్డీఏ పరిధిలోని ఏ గ్రామానికి కూడా సరైన సమాచారం అందించడం లేదని, అధికారులు, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. భూములు ఇచ్చాక రైతులను బానిసలుగా చూస్తున్నారని శ్రీమన్నారాయణ...

Saturday, January 30, 2016 - 16:15

చిత్తూరు : టిటిడి పాలక ధర్మకర్తల మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2,678 కోట్ల వార్షిక బడ్జెట్ కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ద్వారా వడ్డీ ఎక్కువగానే వస్తుందని పాలక మండలి భావించింది. స్పెషల్ ఎంట్రీ, వీఐపీ దర్శనాల ద్వారా రూ.209 కోట్లు..తలనీలాల ద్వారా రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా...

Saturday, January 30, 2016 - 15:38

హైదరాబాద్ : తునిలో నిర్వహించతలపెట్టిన కాపు గర్జనను పూర్తిగా రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు విమర్శించారు. ముద్రగడ పద్మనాభాన్ని ముందు ఉంచి రాజకీయం చేయాలనుకుంటున్నారన్నారు. కాపులకు వైఎస్సార్ చేసిందేమిలేదని.. వంగవీటి రంగా భార్యకు కనీసం ఎంఎల్ ఏ టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాపుల కోసం టీడీపీ రూ.100 కోట్లు కేటాయించామన్నారు....

Saturday, January 30, 2016 - 15:34

హైదరాబాద్ : కొత్త రాష్ట్రం ముందున్న సవాళ్లను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఎస్పీ టక్కర్‌ అన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ఓ కొత్త టీంను తయారుచేస్తానని తెలిపారు. విభజన సందర్భంగా చాలా కష్టాలు ఉన్నాయని, ప్రపంచం..దేశంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో...

Saturday, January 30, 2016 - 15:17

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించడానికి జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 'ఆపరేషన్ రెడ్' పేరిట స్మగ్లర్లను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్మగర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. కోల్ కతాకు చెందిన మారుకొండ లక్ష్మణ్ ..ఢిల్లీకి చెందిన...

Saturday, January 30, 2016 - 13:51

విజయవాడ : రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ ఆపాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఈమేరకు ఆయన విజయవాడలో వీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో రైతాంగం నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తుందని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం...రైతుల అంగీకారం లేకుండా... భూములను సేకరించ కూదని.. కానీ 2013 చట్టనికి విరుద్దంగా రైతు నుంచి సర్కార్ భూసేకరణ చేస్తుందని...

Saturday, January 30, 2016 - 13:40

ఏంటీ త్రీడీ 'కాలేయం' అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. శరీరంలో కాలేయం కూడా ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాలేయానికి సంబంధించిన పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. అప్పుడు మందులకు నయం కాని స్థితికి చేరుకున్నప్పుడు ఈ త్రీడి కణజాలం దోహదపడుతుంట. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి....
బెంగళూరుకు చెందిన పాండోరమ్‌ టెక్నాలజీ సంస్థ ఓ అద్భుతాన్ని...

Saturday, January 30, 2016 - 13:37

ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్టు నచ్చితే ఏం చేస్తాం.. 'లైక్‌' బటన్‌ నొక్కుతాం. అంతే తప్ప ఆ పోస్టు నచ్చినప్పుడు మన మనసులోని భావనను వ్యక్తపర్చడం కుదరదు. ఇక అలా కాదు... పోస్ట్‌ నచ్చినప్పుడు కలిగే భావోద్వేగాన్ని కూడా తెలియజేయొచ్చు. త్వరలోనే ఫేస్‌బుక్‌లో అలాంటి ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. దాని పేరే 'రియాక్షన్స్‌' 'లైక్‌' తరహాలో వెంటనే మన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించేందుకు...

Saturday, January 30, 2016 - 13:22

హైదరాబాద్  : ఏపీ సచివాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఎస్ పి టక్కర్‌, ఇతర ఉన్నతాధికారులు... ఆ తర్వాత కొద్దిసేపు మౌనం పాటించారు.. గాంధీ చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. 

 

Saturday, January 30, 2016 - 12:30

హైదరాబాద్ : టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలకు టిడిపిపై నమ్మకం ఉందన్నారు. ఐటీని అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనని చెప్పారు. హైటెక్ సిటీ ప్రాంతంలో గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. కానీ తాను వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజలకు టిడిపిపై నమ్మకం, అచంచల...

Saturday, January 30, 2016 - 12:04

కృష్ణా : విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి, వేడిగా జరిగింది. కాంట్రాక్ట్‌ కార్మికులను రోడ్డున పడేసే జీవో 279ను రద్దు చేయాలని కౌన్సిల్ బయట కార్మికులు ఆందోళన చేపట్టారు. కౌన్సిల్ లోపల ప్రతిపక్ష కార్పొరేటర్‌ల నిరసనలతో సమావేశం ఉత్కంఠగా సాగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా.. అధికార దర్పాన్ని కొనసాగిస్తూ ప్రతిపాదనలను ఏకపక్షంగా...

Saturday, January 30, 2016 - 11:48

నెల్లూరు : జిల్లాలో వైట్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు స్వల్పగాయాలయ్యాయి. కోవ్వూరు మండలం నదనగుంట ఎన్ హెచ్ 5 జాతీయ రహదారిపై విజయవాడ నుండి రేణిగుంట వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ కు స్వల్పగాయాలయ్యాయి. లక్షలు విలువ చేసే వైట్ పెట్రోల్ ను పట్టుకునేందుకు బిందెలు, డ్రమ్ములతో, క్యాన్లతో ప్రజలు...

Saturday, January 30, 2016 - 10:31

విశాఖ : నగరంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరగనున్న అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూకు సమయం దగ్గర పడుతుండడంతో నావికా దళం రిహార్సల్స్‌ను ముమ్మరం చేసింది. ఫ్లీట్ రిహార్సల్స్‌లో భాగంగా విశాఖ సాగర తీరంలో వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్ రిహార్సల్‌లో వివిధ దేశాల నేవీ దళాలు పాల్గొంటాయి. ఫిబ్రవరి 6న జరిగే ఫ్లీట్ రివ్యూలో ప్రధాని, రాష్ట్రపతి,...

Saturday, January 30, 2016 - 10:24

చిత్తూరు: కొచ్చి వెళ్తున్న శబరిమలై ఎక్స్ ప్రెస్‌లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. తిరుపతి సమీపంలో బి-2 కోచ్‌లోకి చొరబడ్డ దొంగలు పలువురు ప్రయాణికులు లాప్‌ట్యాప్‌లను, మొబైల్ ఫోన్లను దొంగిలించారు. దొంగల హల్‌చల్‌తో ప్రయాణికులు హడలెత్తిపోయారు.

Friday, January 29, 2016 - 18:47

తూర్పుగోదావరి : కాపులు గర్జించబోతున్నారు. ఈనెల 31వ తేదీన జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. దాదాపు పది లక్షల మంది హాజరౌతారని అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారికి పక్కనే కొబ్బరి తోటలో ఏర్పాటు చేసిన సభకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తాం...

Friday, January 29, 2016 - 17:00

అనంతపురం : కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు. ఆయన అనంతరం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కూలీలు, చిన్న, సన్న కారు రైతులు పట్టణాలకు వలస వెళ్లి బిక్షగాళ్లుగా మారుతున్నారని కేంద్ర పెద్దలు సైతం ఈ పథకం ఎందుకు అన్నటుగా మాట్లాడుతున్నారని, ఫిబ్రవరి వతేదీన 2 జిల్లాలోని...

Friday, January 29, 2016 - 16:22

విజయవాడ : బెజవాడ కార్పొరేషన్‌ సమావేశంలో హోర్డింగుల ఏర్పాటు ప్రైవేటువారికి అప్పచెప్పడంపై గొడవ జరిగింది. సీపీఎం కార్పొరేటర్‌ ఆదిలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు తమ మద్దతు లేకుండానే తీర్మానం ఆమోదించేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి వాదనను టీడీపీ కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో.. సీపీఎం, వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. 49 డివిజన్ లున్న విజయవాడ...

Friday, January 29, 2016 - 15:48

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్మికుల జీవన స్థితిగతులు నానాటికి దిగజారిపోతున్నాయని ట్రేడ్‌ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డాయి. ఒకవైపు కార్మిక చట్టాలకు సవరణలు తెస్తూ వాటిని...

Pages

Don't Miss