AP News

Monday, March 20, 2017 - 10:13

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కర్నూలు, నెల్లూరు జిల్లాల ఫలితాలు వచ్చేశాయి. ఈ రెండింటిలోనూ టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. కడప జిల్లాకు వచ్చేసరికి టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. 42 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కొనసాగుతున్నారు.
కడప...

Monday, March 20, 2017 - 09:07

నెల్లూరు :జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో నిలిచారు. కౌంటింగ్ జరిగిన గంట అనంతరం ఫలితం వచ్చేసింది. వైసీపీ అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి గెలుపొందారు. వాకాటి నారాయణ 85 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఐదు టేబుళ్లపై కౌంటింగ్ జరిపారు. ఇక్కడ...

Monday, March 20, 2017 - 08:24

విజయవాడ : మూడురోజుల సెలవుల తర్వాత ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది.. షెడ్యూల్‌ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఇందులో వివిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశముంది.. ముఖ్యంగా రాష్ట్రానికి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు, రుఫమాఫీ, మధ్యాహ్న భోజనపథకంకోసం ఏజెన్సీలు, రేషన్‌కార్డులకోసం విజ్ఞప్తులు, ఎన్టీఆర్ వైద్యసేవలకింద నిధుల...

Monday, March 20, 2017 - 08:12

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కడప స్థానిక బరిలో టిడిపి నుండి బీటెక్ రవి, వైసీపీ నుండి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు స్థానిక బరిలో టిడిపి నుండి చక్రపాణి, వైసిపి నుండి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్...

Sunday, March 19, 2017 - 12:14
Sunday, March 19, 2017 - 08:26

చిత్తూరు : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా మార్గంమధ్యలో యాదమర్రి మండలం లక్ష్మయ్యకండ్రిగలో లారీ, టెంపో ట్రావెలర్ ఢీ కొననున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. 

 

Sunday, March 19, 2017 - 07:21

గుంటూరు : కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా...రాష్ట్రాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్ట్‌లను..ప్యాకేజీని రప్పించానని అన్నారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
...

Saturday, March 18, 2017 - 19:57

కృష్ణా : జిల్లాలోని జి.కొండూరు మండలం వెల్లటూరు, శేగిరెడ్డిపాడు, వెలగలేరు, కుంటముక్కల గ్రామాలలోని ఇటుక బట్టీలపై సంబంధిత అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీలను పలు లోపాలతో నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.     

 

Saturday, March 18, 2017 - 19:54

విజయవాడ : వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నిర్మాణమవుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని... మంత్రి దేవినేని తెలిపారు. పోలవరం పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న ఉమ... స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

 

Saturday, March 18, 2017 - 19:52

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట మండలం, ములకలూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనార్టీలకు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని..మైనార్టీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, ప్రస్తుత బడ్జెట్‌లో పెద్దపీట వేశామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ...

Saturday, March 18, 2017 - 19:38

అనంతపురం : 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ జనసేన అధినేత ప్రకటనతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోనున్నాయా..? పవన్‌ కల్యాణ్‌ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారనున్నాయా..? జనసేనాని అనంత పోటీపై 10 టీవీ ప్రత్యేక కథనం..! 
అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ 
జనసేన అధినేత 2019 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు....

Saturday, March 18, 2017 - 19:09

ప్రకాశం : జిల్లాలో వడగండ్ల వాన రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. అరగంట సేపు కురిసిన వడగండ్ల వానతో నిమ్మ, బత్తాయి, పుచ్చ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఓవైపు పంటలు లేక అవస్థలు పడుతుంటే.. మరోవైపు వడగండ్ల వాన తమకు అపార నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని...

Saturday, March 18, 2017 - 18:09

నెల్లూరు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయమహల్‌ గేటు సెంటర్‌ వద్ద రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. యువకుడు కొండాపురం మండలం తూర్పుయర్రబల్లికి చెందిన వినయ్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు చేసుకునే ముందు వీరిద్దరు రైల్వేట్రాక్‌ సమీపంలో కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

...
Saturday, March 18, 2017 - 17:53

గుంటూరు : రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నానని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరులో సంక్షేమ కార్యక్రమముల శంకుస్థాపన మహోత్సవము కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చొరవ, పట్టుదలతో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని తెచ్చానని చెప్పారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా, ఘర్షణ పడకుండా రాష్ట్రాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నానని చంద్రబాబునాయుడు...

Saturday, March 18, 2017 - 17:42

విజయవాడ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని... యూటీఎఫ్ తోపాటు... పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెండు రకాలుగా వేతనాలు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఏపీ పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60ఏళ్లకు పెంచుతామంటూ... సీఎం చంద్రబాబు ఎన్నికలకుముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హామీని...

Saturday, March 18, 2017 - 13:25

గుంటూరు : గొళ్లపాడులో సీఎం చంద్రబాబు ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కుటుంబంలో ప్రతి ఒక్కరూ నెలకు 100 చొప్పున చెల్లిస్తే.. వారికి 2 లక్షల ఆరోగ్యబీమా కవర్‌ అవుతుంది. ప్రజలు ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పేదవారికి వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.

Saturday, March 18, 2017 - 09:43

ప్రకాశం: జిల్లా చీరాల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తోన్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివపార్వతి అనే మహిళా కూలీ చనిపోగా... మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన 15మంది మహిళా కూలీలు పనికోసం ఒకే ఆటోలో పర్చూరు వెళ్తున్నారు. చీరాల...

Saturday, March 18, 2017 - 06:58

అమరావతి : ఏపీలో రహదారులు రక్తమోడాయి. గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో ఆటో బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. సుమారు 20మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గురజాల ఆస్పత్రికి తరలించారు. అటు ప్రకాశం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ల వెళ్లే మార్గంలోని కంభం, పోరుమామిళ్ల గ్రామాల మధ్య మూలమలుపులో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు...

Saturday, March 18, 2017 - 06:54

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినందకు మంత్రి అచ్చెంనాయుడు తనను వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళ ఆరోపిస్తోంది. ఆమదాలవలస మండలం కోర్లకోటకు చెందిన కళ్యాణి ఆర్.అండ్.బిలో క్లాస్ ఫోర్ ఎంప్లాయిగా పనిచేస్తోంది. పైఅధికారులు తనను వేధిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులపైనే కంప్లైంట్...

Saturday, March 18, 2017 - 06:47

అమరావతి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది.. రికార్డు స్థాయిలో మూడు జిల్లాల్లో 99శాతం పోలింగ్‌ నమోదైంది.. ఈ నెల 20న కౌంటింగ్ జరగనుంది..

నెల్లూరు జిల్లాలో 99.9 శాతం ఓటింగ్‌

నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ...

Saturday, March 18, 2017 - 06:34

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారి మైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వివిధ అంశాలపై చర్చించేందుకు వెలగపూడి సచివాలయంలో మలేసియా, ఆస్ట్రేలియాకు చెందిన విదేశీ ప్రతినిధులు సీఎంతో సమావేశం అయ్యారు.

మైనింగ్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారాలు

మైనింగ్ విషయంలో...

Friday, March 17, 2017 - 20:17

విజయవాడ : మరోసారి ట్విట్టర్‌ వేదికగా కేంద్రంతీరుపై మరోసారి విమర్శలు చేశారు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్.. యూపీ లో రుణమాఫీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీపై స్పందించారు.. రుణమాఫీపై తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.. రైతు ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగాఉన్నాయని గుర్తుచేశారు.. యూపీలో మాత్రమే రుణమాఫీని కేంద్రం ఇస్తామనడం...

Pages

Don't Miss