AP News

Monday, October 5, 2015 - 15:38

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ సీపీఎం పోరుబాట పట్టనుంది. ఈనెల 8వ తేదీ నుండి పాదయాత్రలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. టిడిపి, బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని అన్ని జిల్లా కేంద్రాలలో 8వ...

Monday, October 5, 2015 - 15:21

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం త్వరలోనే నెరవేరనుంది. అగ్రిగోల్డ్ మోసాలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అందులో భాగంగా ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురితో విచారణ సంఘాన్ని నియమిస్తామని తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారని పేర్కొంది....

Monday, October 5, 2015 - 14:39

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు రూపంలో ఉన్న ఫెక్సీలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తమ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడంతో కొంతమంది రైతులు తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు. బాబును అవతారమూర్తిగా భావిస్తూ.. వివిధ రూపాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆయన పేరుమీద గుడిని కూడా కట్టబోతున్నారు. తమ ఊరును రాజధాని చేశారని బాబును...

Monday, October 5, 2015 - 14:26

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల వ్యవహారంపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్న జగన్‌.. అవగహన లేని ఒక ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమన్నారు. తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రంలో కొంగజపాలు చేస్తున్న జగన్‌.. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తే బాగుంటుందని గంటా హితవు పలికారు. ఈనెల ఏడో తేదీ...

Monday, October 5, 2015 - 14:25

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతోంది. దీనితో అధికారులందరూ బిజీగాబిజీగా గడుపుతున్నారు. ఏర్పాట్లు ఎలా చేయాలన్నఅంశంపై సమీక్షలు జరుపుతున్నారు. అడిషనల్ డీజీ సురేంద్రబాబుతోపాటు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్, కోస్టల్ ఐజీ సంజయ్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ ఈ ఏర్పాట్లపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. దసరా రోజు... తూళ్లూరు...

Monday, October 5, 2015 - 14:12

ప్రకాశం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై టెన్ టివిలో ప్రసారమైన కథనాలపై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మంత్రి శిద్ధా రాఘవయ్య ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం 29 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది.
చీమకుర్తిలో ఇసుక అక్రమరవాణాపై ఈనెల 25వ తేదీన టెన్ టివిలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. మైలవరం తదితర ప్రాంతాల్లో...

Monday, October 5, 2015 - 13:30

విశాఖ: సింహాచలం ఆలయ అధికారులపై మంత్రి గంటా శ్రీనివాసరావు.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజినిగిరిపాలెం గ్రామస్తులను ఖాళీ చేయాలని ఆలయ ఈవో బెదిరించడంపై స్థానికులు మంత్రి గంటాకు ఫిర్యాదు చేశారు. పట్టాలున్న తమ భూములు దేవస్థానంకు చెందినదని ఈవో బోర్డులు పెట్టారు. ఇదేంటని ప్రశ్నించిన 12 మంది రైతులపై ఈవో అక్రమ కేసులు పెట్టారు. దీంతో గ్రామస్తుల ఆందోళనతో స్పందించిన...

Monday, October 5, 2015 - 13:26

హైదరాబాద్ : ఏపీ ఉన్నతవిద్యామండలి వివాదంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.. తర్వాతి విచారణను నవంబర్‌ 30కి వాయిదావేసింది..

Monday, October 5, 2015 - 13:23

కడప : ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి చిన్నారి మృత్యువాత పడిన సంఘటన మరువకముందే అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో అలాంటి సంఘటనే పునరావృతం అయింది. ఎర్రమ్మ అనే మహిళ కాళ్ల వేళ్లను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. కూతురి కాన్పు కోసం వచ్చిన ఎర్రమ ప్రసూతి వార్డులో...

Monday, October 5, 2015 - 09:17

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో.. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. పలు విశ్వవిద్యాలయాల ఆచార్యులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. విజయవాడలోని సీఆర్డీఏ ఆఫీస్‌లు జరిగిన సమావేశానికి.. శ్రీవెంకటేశ్వర, నాగార్జునా, ఆంధ్ర, కృష్ణదేవరాయ యూనివర్సిటీల నుంచి దాదాపు 30మంది...

Monday, October 5, 2015 - 07:02

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ సమస్యలన్నీ తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వానికి రాజధానిపైన ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కరించడంలో లేదంటూ అనేకమంది ఆందోళన పట్టబోతున్నారు. రాజధాని ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సీపీఎం పాదయాత్రకు సిద్ధమైంది.

6 నుంచి ...

Sunday, October 4, 2015 - 21:17

హైదరాబాద్ : టీటీడీపీలో అసమ్మతి రాగం బహిరంగంగానే వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు.. తమకు దక్కిన పార్టీ పదవులపై అలకబూనారు. తెలంగాణలో సత్తా చాటాలనుకుంటున్న టీడీపీకి.. నేతల అసమ్మతి ఏ పరిణామాలకు దారి తీస్తాయో అనే కలవరం కార్యకర్తల్లో నెలకొంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీకి.. తెలంగాణలో అసమ్మతి రాగం బాహాటంగానే...

Sunday, October 4, 2015 - 18:22

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూశారు. సాయంత్ర ఐదు గంటలకు నగరంలోని స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి భౌతికకాయన్ని తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి.రేపు రాయదుర్గం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏడిద మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏడిద మృతిపట్ల...

Sunday, October 4, 2015 - 18:11

తూర్పుగోదావరి : అభిమాన హీరో..హీరోయిన్ లను చూడటానికి అభిమానులు ఎగబడుతుంటారు. ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. కొంతమంది అభిమానులు గాయాల పాలు కావడమే కాకుండా మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా కాకినాడలో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' మూవీ టీం జైత్రయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. హీరో కారును...

Sunday, October 4, 2015 - 18:07

విజయవాడ : చినుకుపడితే రోడ్లు చిత్తడవుతున్నాయి..రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీనితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడను ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో రెండు గంటలకు పైగా కుంభవృష్టి కురిసింది. భారీ వర్షంతో కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నీరంతా...

Sunday, October 4, 2015 - 16:29

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. బూత్ ల ఆక్రమణ, ఓటర్ల బెదిరింపులు, బాంబు దాడులతో హడలెత్తించారు. ఈ సందర్భంగా ఆదివారం...

Sunday, October 4, 2015 - 16:16

విజయవాడ : రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ తిరునావక్కరసు హాజరయ్యారు. రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, బీజేపీ ఉద్ధేశ్యపూర్వకంగానే...

Sunday, October 4, 2015 - 15:47

విశాఖపట్టణం : త్వరలో ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకురాబోతున్నట్టు మంత్రి గంటా శ్రీనివాస్‌ తెలిపారు. దీని వల్ల గవర్నమెంట్‌ వర్సిటీలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పిన మంత్రి.. తమ ఉద్దేశం మాత్రం ప్రభుత్వ వర్సిటీలను ఇబ్బందుల్లోకి నెట్టడం కాదన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పోటీ పడాలని చెప్పారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు...

Sunday, October 4, 2015 - 15:38

విజయవాడ : భోగాపురంలో టిడిపి చేస్తున్న బలప్రయోగాన్ని అందరూ ఖండించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని, జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారన్నారు. పెద్ద...

Sunday, October 4, 2015 - 14:22

అక్కడ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్లు తొణికిసలాడుతుంటాయి..! శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బంగారు అంగళ్లు అడుగడుగునా దర్శనమిస్తాయి..! మణిమాణిక్యాలు మతులు పోగొడితే.. కెంపులు అతివల మనసులు దోచేస్తాయి. అక్కడ దొరకని నగలుండవు.. కనిపించని డిజైన్‌ ఉండదు..! ఎటు చూసినా వినియోగదారులే.. ఏ పండగొచ్చినా జన జాతరే..! ఇదీ.. కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు అంగళ్ల ఘనత. కానీ.. ఇదంతా చరిత్ర కాబోతోంది....

Sunday, October 4, 2015 - 14:02

అనంతపురం : జిల్లాలోని ఆగలిలో ఉద్రిక్తత నెలకొంది. స్వర్ణముఖి నది ఆనకట్ట దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎపి, కర్నాటక రైతులు ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. ఆనకట్ట తొలగించాలని కర్నాటక రైతులు డిమాంద్ చేస్తున్నారు. తొలగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఎపి రైతులు హెచ్చరిస్తున్నారు. రైతుల్లో పెద్ద ఎత్తున్న ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. కర్నాటక రైతు సంఘం నేతలు పోరాటాన్ని లీడ్...

Sunday, October 4, 2015 - 12:39

హైదరాబాద్ : పార్టీకోసం పని చేసే కార్యకర్తలను పూర్తిగా ఆదుకుంటామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎన్ టిఆర్ ట్రస్ట్‌ భవన్ లో టిడిపి కేంద్రం, తెలుగు రాష్ట్రాల కమిటీలు ఆయంన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇతర పార్టీలకు రాని విరాళాలు, నిధులుగా టిడిపికి వచ్చాయని తెలిపారు. ప్రమాదంలో...

Sunday, October 4, 2015 - 12:16

కృష్ణా : తెలుగు రాష్ట్రాల్లో గొలుసు దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ పంజా విసురుతున్నారు. గడిచిన వారంలో ఏకంగా 40కి పైగా చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ఆరుగురు స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా.. మచిలీపట్నం ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. రోజురోజుకూ...

Sunday, October 4, 2015 - 12:06

హైదరాబాద్ : జాతీయ రహదారిపై సైకిల్ జర్నీ ప్రారంభమైంది. రీజినల్ పార్టీ... నేషనల్ పార్టీగా మారింది. ఇన్నాళ్లు తెలుగురాష్ట్రాల్లోనే చక్కర్లు కొట్టిన... సైకిల్ నేషనల్ హైవే పైకెక్కింది. ఎన్ టిఆర్ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ కేంద్ర, తెలుగు రాష్ట్రాల కమిటీ కొలువు దీరింది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. కేంద్ర ప్రధాన కార్యదర్శిగా...

Sunday, October 4, 2015 - 09:42

శ్రీకాకుళం : జిల్లాలో డయేరియా విజృంభించింది. దీంతో.. సిగడం మండలం వెలగాడ గ్రామంలో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో.. బాధితులను రాజాం ఆస్పత్రికి తరలించారు.

 

Sunday, October 4, 2015 - 09:37

తూర్పుగోదావరి : జిల్లాలో నిన్న గోదావరిలో గల్లంతయిన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. పురుశోత్తమ్‌పట్నంలో వద్ద ఉన్న గోదావరిలో ప్రమాదవశాత్తూ జారిపడి నలుగురు గల్లంతయ్యారు. అయితే ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. చిన్నకొండేరు వీరబాబు, దీపికగా పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపును తీవ్రతరం చేశారు.

 

Sunday, October 4, 2015 - 08:43

కర్నూలు : తెలుగురాష్ట్రాల్లో ప్రయాణాలు భయాందోళన కలిగిస్తున్నారు. కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి హిందూపురం వెళ్తోంది. మార్గంమధ్యలో తెల్లవారుజామున అవుకు రిజర్వాయర్‌ సమీపంలో బస్సు బోల్తా పడింది. వెంటనే ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులు...

Pages

Don't Miss