AP News

Tuesday, October 13, 2015 - 11:44

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని షాడె బాలికల హైస్కూల్‌ హాస్టల్‌లో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దాసరి నందిని రాజమండ్రిలోని షాడె బాలికల హాస్టలో ఉంటుంది. నారాయణ కాలేజీలో ఇంటర్మీయడ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో హాస్టల్‌లోని తను ఉంటున్న గదిలో నందిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

Tuesday, October 13, 2015 - 10:30

శ్రీకాకుళం : దేశంలో నిర్భయ లాంటి ఎన్నో చట్టాలు వచ్చినప్పుటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మరో మహిళ మృగాళ్ల అత్యాచారానికి బలైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఓ వివాహితపై దుండగులు అత్యాచారినికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న భార్యాభర్తలపై దుండగులు దాడి చేశారు. భర్తను తీవ్రంగా గాయపర్చి..భార్యపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు...

Tuesday, October 13, 2015 - 10:19

గుంటూరు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైఎస్‌ జగన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఫ్లూయిడ్స్‌ తీసుకునేందుకు జగన్‌ నిరాకరించారు. దీంతో డాక్టర్లు జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన దీక్ష భగ్నమైంది. తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు....

Tuesday, October 13, 2015 - 09:41

గుంటూరు : ఎపికి ప్రత్యేకహోదా కోసం జగన్ 6 రోజులుగా దీక్ష చేపట్టారని... ప్రభుత్వం ప్రత్యేకహోదాపై మాట్లాడకుండా.. జగన్ దీక్షను భగ్నం చేయడం అన్యాయమని, దారుణమని వైసిపి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చికిత్సకు జగన్ నిరాకరించారు. అయినా పోలీసులు వైద్యులచే బలవంతంగా చికిత్స అందిస్తున్నారు. బలవంతంగా...

Tuesday, October 13, 2015 - 09:31

విజయవాడ : కృష్ణమ్మ ఒడిలో దసరా సందడి మొదలైంది. ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీస్వర్ణ కవచ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
శ్రీస్వర్ణ కవచ దుర్గాదేవిగా దర్శనం
భక్తుల పాలిట...

Tuesday, October 13, 2015 - 08:49

గుంటూరు : అందరూ భాగస్వాములవ్వాలి. ప్రతిఒక్కరూ తనవంతు బాధ్యత నిర్వహించాలి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకను మరింత కమనీయంగా జరిపించాలి. నవ్యాంధ్ర రాజధాని శంకుస్ధాపన వేడుకపై ఏపి ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు ఇది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణను కూడా సిద్ధం చేసింది. శంకుస్ధాపన మహోత్సవంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే ఓ బృహత్తర ప్రయత్నానికి తెర...

Tuesday, October 13, 2015 - 06:57

గుంటూరు : జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. చిట్టిగుంట ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పల్లెవెలుగు బస్సును తగులబెట్టారు. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

Tuesday, October 13, 2015 - 06:52

గుంటూరు : ఎపికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన దీక్ష భగ్నమైంది. తెల్లవారుజామున 4గంటలకు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో జగన్‌ను జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్ద గుమిగూడారు. దీక్షను విరమించేది లేదని జగన్ వారించినా.....

Monday, October 12, 2015 - 21:58

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని.. దీని అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో సహకరిస్తోందని అన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. విభజన చట్టంలో ఉన్నవే కాకుండా.. లేని అంశాలపైనా కేంద్రం సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖలో సినీ పరిశ్రమ పరిఢవిల్లాలని...

Monday, October 12, 2015 - 18:21

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీనితో కుటుంబసభ్యులు..అభిమానులు..కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ తో ఆయన ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీక్ష విరమించాలని పరీక్షించిన వైద్యులు సూచనలను జగన్ సున్నితంగా తిరస్కరించారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే పరిస్థితి...

Monday, October 12, 2015 - 16:31

కృష్ణా : జిల్లా నాగాయలంక మండలం ఎదురుమండిలో పేదల భూముల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులతో పాటు రైతులను అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘుతో పాటు 60 మంది నేతలను అదుపులోకి తీసుకుని నాగాయలంక పీఎస్ కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Monday, October 12, 2015 - 16:26

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన నిరవధిక నిరహార దీక్షపై ఏపీ మంత్రులు..నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంగ దీక్షలు..అసలు మతలబేంటనీ ప్రశ్నిస్తున్నారు. లక్ష మందితో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ మంత్రులు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్ దీక్షపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అరాచకం సృష్టించేందుకు జగన్...

Monday, October 12, 2015 - 15:16

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన నిరహార దీక్షపై ఆందోళనలు నెలకొంటున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వైద్యులు పేర్కొనడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా అర్బన్ ఎస్పీ త్రిపాఠి కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అర్ధరాత్రి...

Monday, October 12, 2015 - 14:23

హైదరాబాద్ : జగన్‌ దీక్ష కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. కీటోన్స్ లెవెల్స్ పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో దీక్ష విరమించాలని పలువురు కోరినా జగన్‌ నిరాకరిస్తున్నారని నేతలు తెలియచేశారు. వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది. కేంద్రప్రభుత్వం జగన్‌ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ...

Monday, October 12, 2015 - 13:21

కర్నూలు : ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో సౌకర్యాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీ విద్యార్థుల లేఖలను పిల్‌గా స్వీకరించింది కోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు కళాశాలను జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. 13 వందల మంది విద్యార్థినులకు 12 మరుగుదొడ్లు ఉన్నాయని కలెక్టర్‌ నివేదిక అందించారు. 12 మరుగుదొడ్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు...

Monday, October 12, 2015 - 12:19

హైదరాబాద్ : విశాఖలో కిడ్నిప్‌ అయిన టీడీపీ నేతలు ఇంకా మావోయిస్టు చెరలోనే ఉన్నారు. మావోయిస్టులు తాజాగా మరోలేఖను కూడా విడుదల చేశారు. రెండు రోజుల్లో బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. స్పందించకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని ప్రకటించారు.

 

Monday, October 12, 2015 - 12:16

గుంటూరు : మంత్రి పత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌ కు చెందిన భూములను అత్యంత చవక రేట్లకు తన భార్య పేరిట రాయించుకున్నారని వైసీపీ నేత మర్రి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కోటప్పకొండ సమీపంలోని అగ్రిగోల్డ్‌ కు చెందిన భూముల్లో గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని వైసీపీ నేత మర్రి తెలిపారు. పత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని అత్యంత చవగ్గా భూములను సంపాదించారని...

Monday, October 12, 2015 - 12:14

గుంటూరు : జగన్‌ దీక్ష కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. కీటోన్స్‌ లెవెల్స్‌ పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో దీక్ష విరమించాలని పలువురు కోరినా జగన్‌ నిరాకరిస్తున్నారని నేతలు తెలియచేశారు. వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది.

Monday, October 12, 2015 - 10:50

విజయనంరగం : గూడు చెదిరించి.. గుండె పగిలింది. హుదూద్ రూపంలో వచ్చిన పెనుతుపాను విలయతాండవం సృష్టించింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉద్యానవనాలు నాశనమయ్యాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ విషాదం జరిగి ఏడాది గడుస్తున్నా విజయనగరం వాసులను ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజయనగరం వాసుల గుండెల్లోదడ పుడుతోంది. ఈ విషాదం జరిగి...

Monday, October 12, 2015 - 10:43

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలిసారిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఇవాళ ఏయూ కాన్విగేషన్ హల్‌లో భారీ స్థాయిలో నిర్వహించాలని వర్సిటీ అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇటీవలే 89 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఏయు.....

ఈ వర్సిటీ ఇటీవలే 89 ఏళ్లు పూర్తి చేసుకొని...

Monday, October 12, 2015 - 10:32

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. నిరాహార దీక్ష చేస్తున్న తమ అభిమాన నాయకుడికి మద్దతు తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగన్‌ దీక్ష స్థలికి వస్తున్న కాలేజీ విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్‌తో ఫోటోలు దిగేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది....

Monday, October 12, 2015 - 09:40

హైదరాబాద్ : విశాఖలో నిన్న ఆర్కేబీచ్‌ దగ్గర గల్లంతైన విద్యార్ధుల్లో ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. మృతులు గణేష్‌, రోహిత్‌, జబ్బార్‌లుగా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు.

 

Monday, October 12, 2015 - 09:38

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ దీక్ష ఆరోరోజూ దీక్ష కొనసాగుతోంది. సోమవారం ఉదయాన్నే డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే జగన్‌తో పలుమార్లు సంప్రదించిన వైసీపీ నేతలు దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇప్పటికే జగన్‌ బాగా నీరసించినట్లు కనపడుతోంది. 

Monday, October 12, 2015 - 09:36

హైదరాబాద్ : తిరుమల ఘాట్‌ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్‌ రోడ్డులో 14 వ కిలోమీటర్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డట్టు టీటీడీ సిబ్బంది గుర్తించింది. కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండ చరియలను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది చర్యలు మొదలు పెట్టింది. 

Monday, October 12, 2015 - 06:37

విశాఖ : హుదూద్‌..! ఈ పదం వింటే చాలు.. విశాఖ వాసుల ఒళ్లు జలదరిస్తుంది. సాగరతీర నగరాన్ని కకావికలం చేసిన ఆ ప్రకృతి విలయ తాండవం.. గుర్తుకొస్తే చాలు.. స్థానికులు వణికిపోతారు. గంటల వ్యవధిలోనే విశాఖను ఛిన్నాభిన్నం చేసిన హుదూద్‌ సంభవించి నేటికి ఏడాది పూర్తయింది. 365 రోజులు గడిచినా.. నాటి కాళరాత్రులను విశాఖవాసులు నేటికీ మరచిపోలేక పోతున్నారు.

...
Monday, October 12, 2015 - 06:33

విశాఖ : విశాఖపట్టణం సముద్రం తీరం మృత్యుబీచ్‌గా మారుతోంది. ఇక్కడికి రావాలంటేనే సందర్శకులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సముద్ర తీరానికి చేరుకుంటున్న సందర్శకులు ఇక్కడ జరుగుతున్న గల్లంతులను చూసి గజగజవణికిపోతున్నారు.

బీచ్‌కు వెళ్లిన ఏడుగురు పదో తరగతి విద్యార్థులు........

Monday, October 12, 2015 - 06:26

విజయవాడ : ఏపీలోని ఏ ప్రాంతం వారైనా రాజధానికి నాలుగు గంటల్లో చేరుకునేలా రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ 186 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తామంటూ.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. అయితే.. అవసరమైన భూమిని రాష్ట్ర...

Pages

Don't Miss