AP News

Sunday, September 6, 2015 - 11:54

గుంటూరు : ఐ రైడ్‌ విత్‌ ఇండియా నినాదంతో గుంటూరులో ఐఎంఏ వైద్యులు సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద మున్సిపల్‌ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిలు ర్యాలీ ప్రారంభించారు. అనంతరం వైద్యులతో కలిసి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వేణుగోపాల్‌ రెడ్డిలు 5 కిలో మీటర్ల సైక్లింగ్‌ లో పాల్గొన్నారు. నూతన రాజధాని అమరావతిలో ప్రత్యేకంగా...

Sunday, September 6, 2015 - 11:31

చిత్తూరు : భక్తులకు శ్రీవారి లడ్డూ భారం కానుందా ? రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను సాకుగా చూపించి లడ్డూ ధరను పెంచేందుకు టీటీడీ యత్నిస్తుందా ? ఇకపై సామాన్యులు శ్రీవారి లడ్డూలు కొనడం అసాధ్యమేనా ? శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు ముందుగా అడిగేది లడ్డూనే. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి టీటీడీ ప్రసాదంగా లడ్డూను అందిస్తుంటారు. అయితే ఇవి చిన్న...

Sunday, September 6, 2015 - 11:28

చిత్తూరు : కలియుగ వైకుంఠుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకుంటారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదమైన లడ్డూను కొనుగోలు చేసేందుకు భక్తులు ఎంతో పరితపిస్తుంటారు. లడ్డూ ప్రసాదం స్వీకరించకపోతే... తిరుమలను దర్శించుకున్న ఫీలింగే ఉండదని శ్రీవారి భక్తులు అంటున్నారంటే ఆ లడ్డూకు ఎంత విశిష్టత ఉందో తెలుస్తోంది. తిరుమలకు ఎవరు వెళ్లొచ్చినా.....

Sunday, September 6, 2015 - 11:23

కృష్ణా : బందరు పోర్టు లో ఓ రైతు గుండె ఆగిపోయింది. తన భూమి ప్రభుత్వం లాక్కోంటోందని..దీనితో తన కుటుంబం ఎలా జీవనం సాగించాలనే దానిపై తీవ్ర మనస్థాపానికి గురైన రైతు తనువు చాలించాడు. గుండె పోటు రావడంతో ఆయన కన్నుమూశాడు. ఇటీవలే ఏపీ సర్కార్ బందరు పోర్టు నిర్మాణం కోసం భూముల సేకరణ చేపట్టింది. సుమారు 14,700 ఎకరాల భూములు సేకరించడానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు....

Sunday, September 6, 2015 - 11:06

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. విశాఖలోని వైఎస్‌ఆర్‌ పార్క్, చావులమాదం, అల్లీపురంలోని పారిశుధ్యంపై ఆరా తీశారు. డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. పారిశుధ్యం సరిగా లేకపోవడంతో... జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24గంటల్లో పనులు మెరుగుపర్చాలని ఆదేశించారు.

Sunday, September 6, 2015 - 11:01

కడప : విద్యార్థులకు దారి చూపాల్సిన వాడే దారితప్పాడు..! 120 కోట్ల మంది తలవంచే జాతీయ చిహ్నానికి తలవంపులు తెచ్చాడు..! వ్యక్తిగత ఇష్టాలను.. వ్యవస్థపై రుద్దిన కడప యోగిమేన యూనివర్సిటీ వీసీ.. రాజ్యాంగాన్ని బహిరంగంగా అవమానించాడు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హద్దులు దాటిన వ్యక్తిగత మత విశ్వాసాలతో.. రాజ్యాంగాన్నే అవమానించాడు కడప జిల్లాలోని యోగి వేమన...

Sunday, September 6, 2015 - 10:32

గుంటూరు : మొన్నటివరకు నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులను భయబ్రాంతులకు గురి చేసిన అధికారులు.. తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. భూసేకరణ సమస్య సమిసిపోయిందని సంబరపడుతున్న తరుణంలో... ప్రభుత్వానికి ఇవ్వని భూములు వ్యవసాయానికి తప్ప మరేందుకూ ఉపయోగించకుండా చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారుల మాటలను బట్టి చూస్తుంటే ఇదే విషయం...

Sunday, September 6, 2015 - 10:11

తిరుపతి : శనివారం కిడ్నాప్ కు గురైన నెలన్నర వయస్సున్న చిన్నారి ఆచూకి లభ్యమైంది. తమిళనాడు సమీపంలోని నేనవూరులో బాబు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పూజ అనే మహిళ శిశువును అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిన్నారిని తిరుపతికి తీసుకొస్తున్నట్లు సమాచారం. తిరుపతిలోని ఓ ప్రాంతంలో సంతోష్ దంపతులు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నెలన్నర...

Saturday, September 5, 2015 - 21:26

హైదరాబాద్ : బందరు తీరంలో ఉద్యమ కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఆవేదనతో, ఆవేశంతో పోటెత్తుతున్నాయి. పోర్టు నిర్మాణం పేరుతో భూములు లాగేసుకునే చర్యను అన్నదాతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అయినా.. రైతుల ఆందోళనను పూచిక పుల్లలా తీసిపారేసిన ప్రభుత్వం.. 14 వేల ఎకరాల భూములు సేకరించాల్సిందేనంటూ కేబినెట్‌ భేటీలో తీర్మానించింది...

...
Saturday, September 5, 2015 - 21:23

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మచిలీపట్నం పోర్టుకు 14 వేల ఎకరాలు సేకరించడం.. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలన్నీ ఈ గవర్నెన్స్‌ పరంగా ఒకే గొడుకు కిందకు తేవడం వంటి నిర్ణయాలతోపాటు, పలు అంశాలకు ఆమోద ముద్రవేసింది...

మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో....

మూడున్నర గంటలపాటు సాగిన...

Saturday, September 5, 2015 - 19:03

గుంటూరు : కాన్వెంట్ చదువులు, కార్పొరేట్ హంగులు లేకున్నా వాటికంటే మెరుగైన రీతిలో చదువునందిస్తూ సత్తా చాటుతోంది ఓ ప్రభుత్వ పాఠశాల.. ఆహ్లాదకర వాతావరణంలో ఒత్తిడిలేని విద్యనందిస్తూ టాప్‌లో నిలుస్తోంది.. పదోతరగతిలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఆశ్చర్యపోయే రీతిలో గ్రేడ్‌లు తెచ్చుకుంటూ సర్కారీ స్కూళ్ల సత్తాచాటుతున్నారు ఇక్కడి...

Saturday, September 5, 2015 - 18:45

పశ్చిమగోదావరి : ఏలూరులో నటుడు బాలకృష్ణ ప్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్, బాలకృష్ణ, తనయుడు మోక్షజ్ఞ ఫొటోలతో నగరంలో భారీ ఎత్తు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ ఫ్లెక్సీని చింపేశారు. సమాచారం తెలుసుకున్ననందమూరి అభిమానులు.. ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు...

Saturday, September 5, 2015 - 18:44

విశాఖ : ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న గురుపూజోత్సవంలో ప్రమాదం సంభవించింది. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ సభలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన సభా ప్రాంగణాన్ని చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు...

Saturday, September 5, 2015 - 18:42

హైదరాబాద్ : గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో విషాదం నెలకొంది. అందుకూరులో అట్లూరి లాజరు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కరెంటు పని చేస్తున్న లాజరు.. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి పంట వేశాడు. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో పాటు పంట కోసం చేసిన అప్పులు, వడ్డీలు కొండంత పెరిగిపోవడంతో మనోవేదనకు...

Saturday, September 5, 2015 - 15:47

కృష్ణా : విజయవాడలో అధికార పార్టీ నేతలు కబ్జాలకు తెగబడుతున్నారు. విద్యాధరపురంలో ఏకంగా స్మశాన వాటికను కబ్జా చేసేందుకు టిడిపి నేతలు యత్నించారు. అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్మశానాన్ని మట్టితో పూడ్చేశారు. దీంతో సీపీఐ, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంఘటనా ప్రాంతంలో ఆందోళనకు దిగారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని ఆషాను అడ్డుకుని ఆమెను...

Saturday, September 5, 2015 - 15:45

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చ సంగతి ఎలాగున్నా.. డైలాగ్‌ వార్‌కు మాత్రం కొదవలేదు. మాట్లాడే వాడే మొనగాడండూ రెచ్చిపోయారు ప్రజాప్రతినిధుల్లో చాలామంది. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రతిపక్ష నేత జగన్‌, సీఎం చంద్రబాబు మధ్య సాగిన్‌ కౌంటర్‌ వార్‌తో సభలో నవ్వులు పూశాయి ఆ తర్వాత.. ఇదే అంశం ఇద్దరి మధ్యా నిప్పులు...

Saturday, September 5, 2015 - 15:41

హైదరాబాద్ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సీఈవో రేసులో ఏపీలో విజయవాడనగరానికి చెందిన మహిళా పద్మశ్రీ వారియర్ ఎంపిక కావటం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పద్మశ్రీ వారియర్ విజయవాడ మాంటిస్సోరి పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్, డిగ్రీలను విజయవాడలోని మేరి స్టేల్లా కళాశాలలో చదివారు. దీనిపై ఆయా విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు...

Saturday, September 5, 2015 - 14:55

తిరుపతి : వారాంతం కావడంతో.. తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం 15కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ స్పీకర్ కోడెల, డీజీపీ రాముడు శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో అనావృష్టి, దుర్బిక్షం తొలగిపోయి... అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు కోడెల తెలిపారు. ర్యాగింగ్ తో...

Saturday, September 5, 2015 - 14:50

కృష్ణా : బందరు నౌకాశ్రయ పరిధి రైతులతో ఏపీ మంత్రులు మచిలీపట్నం టౌన్‌ హాలులో సమావేశమయ్యారు. బందర్ పోర్టుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం భూసేకరణ నోటీసును జారీ చేసింది. దీంతో గత మూడు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్రారెడ్డి ఆరు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు....

Saturday, September 5, 2015 - 14:46

హైదరాబాద్ : కడప యోగి వేమన యూనివర్శిటీ వీసీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. పరిపాలనా భవనం మీది జాతీయ చిహ్నం నాలుగు సింహాలపై వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయించారు వీసీ శ్యాంసుందర్‌. జాతీయచిహ్నంపై ఎలాంటి ఇతర గుర్తులు, బొమ్మలు ఉండకూడదు. అయినా వీసీ నిర్ణయం తీసుకుని పెట్టించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి....

Saturday, September 5, 2015 - 14:44

హైదరాబాద్ : ఏపి కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్స్‌ ఎంపిక, రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై చర్చించారు. దీంతో పాటు రైతు కోసం చంద్రన్న యాత్ర, పరిశ్రమల కోసం భూ కేటాయింపులపై సమీక్షించారు. 29 నుండి ప్రారంభం కానున్న చంద్రన్న రైతు భరోసా యాత్ర ను సక్సెస్ చేసేందుకు కావల్సిన ప్రణాళికలను...

Saturday, September 5, 2015 - 13:42

విశాఖపట్టణం : ఆచార్యదేవోభవ అన్న సూక్తికి సరైన అర్థం చెబుతున్నారు ఇద్దరు మహిళా టీచర్లు... ఒక్క చదువు చెప్పడంతోనే తమ బాధ్యత పూర్తయిందని భావించలేదు.. సమాజంలో చైతన్యంకోసం అహర్నిషలు శ్రమించారు.. సేవేలక్ష్యంగా ముందుకు కదులుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కిపైగా గిరిజన తెగలు నివసిస్తున్నాయి... ఇందులో చాలా తెగలకు మాతృభాషలున్నాయి...

Saturday, September 5, 2015 - 13:34

విజయనగరం : ఆ మాస్టారుకు స్కూలే జీవితం... రాత్రింబవళ్లూ పాఠశాల అభివృద్ధికోసమే ఆలోచిస్తారు.. పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా పాఠాలు బోధించే విధానాలపై నిత్యం అధ్యయనం చేస్తూనే ఉంటారు. ఆ ఉపాధ్యాయుడి చలువతో ప్రస్తుతం ఆ స్కూల్‌ జిల్లా స్థాయిలోనే ప్రముఖ స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం శేరిపేట ప్రాథమికోన్నత పాఠశాల ఇది.. నారాయణమూర్తి...

Saturday, September 5, 2015 - 13:30

నెల్లూరు : చీకటిని తరిమి వెలుగును చూపేవాడు గురువు. విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయునిది. అలాంటి గురువులు కొందరు ఓ ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలిపారు. చదువుల్లో, ఆటల్లో, విజ్ఞానంలో విద్యార్థులను మేటిగా తీర్చిదిద్దారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న నెల్లూరు కేఎన్‌ఆర్ స్కూల్...

Saturday, September 5, 2015 - 13:26

చిత్తూరు: జీవో నెంబర్ 120ని వెంటనే ఉపసంహరించాలని రాయలసీమ పరిరక్షణ వేదిక నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి వైద్య కళాశాలలో అడ్మిషన్లపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా బైరెడ్డి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు, నీళ్లు తదితర...

Saturday, September 5, 2015 - 12:37

తిరుపతి : మరోసారి పద్మావతి మహిళా విద్యాలయం వార్తల్లోకెక్కింది. శనివారం విద్యార్థులు ఆందోళన చేయడం..అనుతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ఆందోళనకు రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి మద్దతు పలికి ఆందోళన నిర్వహించారు.మెడికల్ అడ్మిషన్ల విషయంలో రాయలసీమ విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు...

Saturday, September 5, 2015 - 10:55

తూర్పుగోదావరి : ఆయనో సర్కారీ బడిపంతులు. ఈ హైటెక్‌ యుగంలో సర్కార్ బడులంటే ఎక్కడో కొంత చిన్నచూపు ఉంటోంది. కాని అందుకు భిన్నంగా సర్కారీ బడుల్లో మార్పు తీసుకురావాలని ఆ పంతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పేద విద్యార్థులకు పాఠ్యాంశాలే కాదు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు ధీటుగా మలిచేందుకు తన వేతనాన్నేదారపోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవాళ ఉపాధ్యాయ...

Pages

Don't Miss