AP News

Thursday, August 20, 2015 - 12:12

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సర కాలంలో ఏమి ఇచ్చామో చూడాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అవి తెలిస్తే విమర్శలు చేసే వారు మాట్లాడరని తెలిపారు. ఎట్లాంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వమని వెంకయ్య పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు కాంగ్రెస్..విపక్ష నేతలపై...

Thursday, August 20, 2015 - 11:41

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు దగ్గర సోదాలు జరిపిన పోలీసులు ఈ దుంగలను గుర్తించారు. వీటి విలువ దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

 

Thursday, August 20, 2015 - 10:58

గుంటూరు: అదొక ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారం. రౌడీలు, గూండాలు షరా మామూలుగా ఎంటరైపోయారు. వారితోపాటు కత్తులు, కర్రలు కూడా వచ్చేశాయి. ఇల్లు కూల్చేశారు. టెంట్‌ వేసేశారు. పెద్దలు, పిల్లలు.. ఆఖరికి పశువులను కూడా ఉండనివ్వలేదు. అక్కడే ఉంటే చంపేస్తామన్నారు. ఉదయం మొదలైన ఈ తంతు.. సాయంత్రానికి జరిగిన బలవంతపు రిజిస్ట్రేషన్‌తో ముగిసింది. నిజమో కాదో తెలియదు కాని.. సినీ...

Thursday, August 20, 2015 - 10:16

కడప : విద్యార్థినిలు మనిషా, నందినిల ఆత్మహత్య ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంత్రి నారాయణకు చెందిన నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రిగారి కాలేజీ కావడంతో నిందితులను వదిలేసి ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారు. కడపలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు జగదీశ్, ఓబులేసు, సుబ్బారెడ్డి, శివకుమార్‌ను...

Thursday, August 20, 2015 - 08:10

పశ్చిమగోదావరి: జిల్లాలో నిట్‌ ఏర్పాటు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. అటు ఏలూరు, ఇటు తాడేపల్లిగూడెం మధ్య ఊగిసలాడిన వ్యవహారం చివరకు ఢిల్లీ పెద్దల జోక్యంతో గూడెం వైపు మొగ్గుచూపింది. దీంతో మంత్రి మాణిక్యాలరావు పంతం నెరవేరింది. ఈనెల 20న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌ చేతుల...

Thursday, August 20, 2015 - 07:24

హైదరాబాద్: బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మోడీ ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఏపీ సర్కారు కంగుతిన్నది. మరో వైపు ఏపీ సర్కారు విభజన సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై ఇప్పటికే ఏపీలో నిరసనలు మొదలయ్యాయి. ఇదే అంశంపై కేంద్రంతో చర్చించాలనుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.
...

Thursday, August 20, 2015 - 07:11

హైదరాబాద్: వారు నిలువనీడ కోల్పోయే వాళ్లు.. వాళ్లకు నివాసాలెందుకు..? వారు మునిగిపోయేవాళ్లు.. వాళ్లకు విద్యా ఫలాలెందుకు..? జలసమాధి అయ్యేవారికి ఆస్పత్రులతో పనేంటి..? సర్వం కోల్పోయేవాళ్లకు సౌకర్యాలతో అవసరమేంటి..? ఇదీ.. విలీన మండలాల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. పోలవరం ప్రాజెక్టు ఆ గ్రామాలను ఇంకా ముంచెత్తనేలేదు.. ప్రభుత్వం మాత్రం వారి...

Wednesday, August 19, 2015 - 21:34

గుంటూరు : నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు మరో మలుపు తిరిగింది. తాను అనుభవించిన చిత్రవధకు ప్రతిరూపంగా రెండో డైరీ బయటపడింది. కాలేజీలో మిత్రులకన్నా ముందే తనకు పరిచయమైన ర్యాగింగ్‌ రాక్షసాన్ని కళ్లకు కట్టింది ఆ డైరీ...

మిస్‌ పర్‌ ఫెక్ట్‌ కిరీటం తొడిగి..

మిస్‌ పర్‌ ఫెక్ట్‌ కిరీటం తొడిగి.. అడుగుడగునా తనపట్ల...

Wednesday, August 19, 2015 - 21:27

హైదరాబాద్ : చంద్రబాబుకు ఢిల్లీ తలుపులు తెరుచుకోవడం లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ నాడు చిరునవ్వులు చిందించిన నరేంద్ర మోదీ దర్శన భాగ్యం కలగడం లేదు. తన ఆప్తమిత్రున్ని కలవడానికి మోదీ టైంలేదంటున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు..కనీసం బీహార్‌ రేంజ్‌లోనైనా ప్యాకేజీ రాబట్టుకోవాలనుకుంటున్నా మోదీ కటాక్షం...

Wednesday, August 19, 2015 - 18:37

చిత్తూరు : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు...కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో మెగా ఫుడ్‌పార్క్‌ రాబోతుందని..అంతేకాక మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి...

Wednesday, August 19, 2015 - 18:35

చిత్తూరు: జిల్లా నగరిలో రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడుల మధ్య నెలకొన్న విబేధాలు ఆధిపత్యపోరుగా మారినట్లు స్పష్టమవుతోంది. నగరిలో ఎమ్మెల్యే రోజా తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన నగరి నిరసన ఎపిసోడ్‌లో ఛేజింగ్‌లు సైతం చోటు చేసుకున్నాయి.

అధికార, ప్రతిపక్ష పార్టీల...

Wednesday, August 19, 2015 - 16:37

గుంటూరు : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. గుంటూరులో మేధావుల ఫోరం అధ్వర్యంలో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీన సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోడి భేటి తరువాత... స్పెషల్ స్టేటస్‌పై నిర్ణయం ప్రకటించని పక్షంలో... నెలరోజుల పాటు ఆందోళన...

Wednesday, August 19, 2015 - 16:33

తిరుపతి: ఒకవైపు బంద్‌ నిర్వహిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మరోవైపు వారిని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్న పోలీసులు.. మొత్తం మీద చిత్తూరు జిల్లా నగరిలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే కొందరు నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎమ్మెల్యే రోజాను కూడా అరెస్ట్‌ చేయాలని ప్రయత్నించారు. సినీ ఫక్కీలో ఆమె వాహనాన్ని వెంబడించారు. అయితే సరిహద్దులు దాటి...

Wednesday, August 19, 2015 - 16:31

హైదరాబాద్ : రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. సంవత్సరానికి 3 సార్లు కాపు నందించే పంట భూములను తీసుకోవడం సరికాదనన్నారు. బహుళ పంటలు పండే ఉండవల్లి, పెనుమాక, బేతపూడితో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ చట్టం అమలు వద్దన్నారు. ఒక ప్రాంతాన్ని, ఒక వర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వాతావరణ కాలుష్యంతో పాటు.. కొంతమంది...

Wednesday, August 19, 2015 - 14:44

హైదరాబాద్‌ : నాంపల్లి సీబీఐ కోర్టుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో.. ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది.

Wednesday, August 19, 2015 - 14:42

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు జరగాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. ఈనెల 25, 28, 29, 31 తేదీల్లో వీలైన రోజు చెప్పాలని సీఎంను ప్రధాని కార్యాలయం కోరినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న చంద్రబాబు... ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీని కలవాల్సి ఉంది. 

Wednesday, August 19, 2015 - 13:37

హైదరాబాద్ : భూ సేకరణ అంశంపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. ఈసారి రెండు, మూడు ముక్కల్లో కాకుండా సుదీర్ఘంగా ట్వీట్స్ చేయడం విశేషం. సౌరవంతమైన పలు రకాల పంటలు పండే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి ప్రాంతాల్లో మూడు పంటలు పండే భూములు, సమతుల్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని ఆయన...

Wednesday, August 19, 2015 - 13:28

కడప : జిల్లా నారాయణ కాలేజీలో విద్యార్ధినుల ఆత్మహత్యలకు నిరసనగా విజయవాడలో ఎఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్ విద్యా సంస్ధల బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. మాచవరంలోని నారాయణ, చైతన్య విద్యా సంస్ధల ఎదుట నేతలు ఆందోళనకు చేపట్టారు. స్కూలు బస్సు అద్దాలు పగులకొట్టిన నేతలు అనంతరం కాలేజీ ముందు బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య...

Wednesday, August 19, 2015 - 13:27

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో భేటీ అయ్యారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. హిందూపురంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. స్టేడియం నమూనాను అచ్చెన్నాయుడుకు అందజేశారు. పీపీపీ పద్ధతిలో ఈ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోననని, ...

Wednesday, August 19, 2015 - 12:41

తిరుపతి : యూనివర్సిటీలో నీటి సమస్య పరిష్కరించాలని ఎస్వీ విద్యార్థులు కదం తొక్కారు. గత నాలుగు రోజులుగా సమస్య తీర్చాలని కోరుతున్నా అధికారుల మొండి వైఖరిని తప్పుబట్టారు. నీళ్లు లేకపోవడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉన్నారని విద్యార్థులు పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా చిత్తూరు - తిరుపతి రహదారిపై...

Wednesday, August 19, 2015 - 12:37

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెంచాలని ఏపీ ఆర్టీసీ యోచిస్తోంది. సంస్థపై భారాన్ని తగ్గించాలంటే చార్జీలు పెంచకతప్పదని ప్రభుత్వాన్ని విన్నవించుకుంది. చార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాలని కోరింది. దీనికి పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చినట్లు తెలుస్తోంది.
భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కొద్ది రోజుల తరువాత...

Wednesday, August 19, 2015 - 11:22

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల దగ్గరి నుండి బాబు వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వెంటనే అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము బాబును కలుస్తామని, ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేశారు. పోలీసులు...

Wednesday, August 19, 2015 - 09:33

కడప : జిల్లాలో అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు, చిత్తూరు జిల్లాల నుండి అదనపు బలగాలను మోహరించారు. ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల వైఖరిని నేతలు తప్పుబడుతున్నారు. కడప జిల్లా నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నారాయణ కాలేజీలో...

Wednesday, August 19, 2015 - 06:32

ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత రాష్ట్రం పట్టించుకోక.. కొత్త రాష్ట్రం కష్టాలు తీర్చక అక్కడివారు నానా అగచాట్లూ పడుతున్నారు. ఇది.. తెలంగాణ నుంచి ఏపీలోకి కలిసిన పోలవరం ముంపు మండలాల ప్రజల వేదన. ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో...

Wednesday, August 19, 2015 - 06:27

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమావేశం రాజకీయంగా అత్యంత కీలకం కాబోతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, ఆర్థిక సహాయం వంటి అధికారిక అంశాలతో పాటు చంద్రబాబు అనధికారిక అజెండా పైనా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. సంక్లిష్ట పరిస్థితుల్లో సాగుతున్న వీరిద్దరి భేటీ ఏయే పరిణామాలకు దారితీస్తుందోనని...

Wednesday, August 19, 2015 - 06:21

కడప : నారాయణ కాలేజీలో నందిని, మనీషా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలతో సహా విపక్షాలు మంత్రి నారాయణను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేడు కడప జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన..
కడప...

Tuesday, August 18, 2015 - 21:24

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశం ఏపీలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం... ఏపీని ఎందుకు విస్మరిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

ప్రత్యేక హోదా వచ్చే వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండాలన్న రఘువీరా..

స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో...

Pages

Don't Miss