Yadadri

19:05 - July 18, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా బీబీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. యువకుడిని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును రాంగ్‌ రూట్‌లోకి తీసుకెళ్లాడు. ఆ బస్సుకు ఎదురుగా ఎలాంటి వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

 

21:15 - July 16, 2018

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతం.. ఉత్తర కోస్తా- ఒరిస్సా ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా 9.5 కి.మీ ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు జూలై19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరడంతో గేట్లు ఎత్తేస్తున్నారు. దీనికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలవల్ల గోదావరి, తుంగభద్ర, నాగావళి, వంశధార నదులకు ప్రవాహ ఉధృతి పెరిగింది.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 6 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ బాగా పెరిగింది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయని, అలలు కూడా మూడు మీటర్ల పైబడి ఎగిసిపడే అవకాశం ఉన్నందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. బీచ్‌లోకి నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటోంది విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం.

మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొత్తవలస - కిరండూల్‌ రైల్వే లైనులో కొండ చరియలు విరిగి పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొర్రా - చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 66/2 కి.మీ. సమీపంలో ఉదయం 9.30 గంటల సమయంలో బండరాళ్లు పడి విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దీంతో పాసింజరు రైలు చిమిడిపల్లి స్టేషన్‌లోనే నిలిచిపోయింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు.

భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో వాగులు, వంకలు నిండు కుండను తలపిస్తున్నాయి. గుండాల మండలం మల్లన్న, కిన్నెరసాని, ఏడుమెలికల, పొట్టినిమ్మ వాగుల సంగమం, నడిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మోదుగుల గూడెం రైతులు తమ పొలాలకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, గర్భిణీలు, చిన్నపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. సుమారు ఇరవై గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ర్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ రాగల మూడు రోజుల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి తెలుగు రాష్ర్టాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

18:52 - July 14, 2018
16:48 - July 14, 2018

యాదాద్రి : భువనగిరి జిల్లా వీరవెల్లి గ్రామంలో ఓ మహిళ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసింది. సిలివేరు నర్సింహ అనే వ్యక్తి భూమి ఇప్పిస్తానని 35 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆలేరుకు చెందిన సమంతారెడ్డి సెల్‌ టవర్‌ ఎక్కింది. ఎన్నిసార్లు నర్సింహ ఇంటికి వచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈరోజ వీరవెల్లికి వచ్చిన సమంతారెడ్డి సెల్‌టవర్‌ ఎక్కింది. తనకు వెంటనే డబ్బులు ఇప్పించి న్యాయం చేయకపోతే సెల్‌ టవర్‌ నుంచి దూకుతానని హెచ్చరించింది. స్థానికులంతా పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని సమంతారెడ్డితో పోలీసులు మాట్లాడుతున్నారు.

 

12:40 - July 13, 2018

యాదాద్రి : గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఇప్పుడు అతను తనను వివాహం చేసుకోవటానికి ఇష్టపడటంలేదని ప్రియుడి ఇంటి ముందుకు గత నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టింది. అయిన స్పందించకపోవటంతో సెల్ టవర్ ఎక్కి తన నిరసనను తెలిపింది. అతను వివాహానికి ఒప్పుకుంటేనే కిందికి దిగుతానని లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కాగా గతంలో కూడా సదరు యువతి తన ప్రియుడిపై కేసు నమోదు చేయగా..అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినా వివాహానికి నిరాకరించటంలేదు..దీంతో సదరు యువతికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినాగానీ..అతనితో కలిసి తీయించుకున్న ఫోటోలు బైటకు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోకపోవటంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.


 

21:15 - July 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగటంతో జనజీవనం స్తంభించింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, కూసుమంచి, తిరుమలాయపాలెం, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, భువనగిరి, శాలిగౌరారం, ఎల్కారంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిశాయి. తాండూరు, తెల్కపల్లి, తిమ్మాజిపేట, బిజినేపల్లిలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి జల్లులు కురిశాయి. నార్నూర్ మండలంలో 9.64 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కడెం నారాయణ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి 13,109 క్యూసెక్కుల వరద నీరు చేరింది. 3 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రావులపాలెంలో 5.57 సెం.మీ, గడలలో 5.42 సెం.మీ, కపిలేశ్వరంలో 5.35 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. తణుకు, అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అత్తిలిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీరోడ్‌ కాలువలోకి కుంగిపోయింది. కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో భారీ వర్షానికి రోడ్లన్ని నీటమునిగాయి. పలుచోట్ల లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇటు తెలంగాణ, అటు ఏపీలో ఖరీఫ్‌ నారుమళ్లకు తీవ్రమైన నష్టం ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపునీరుతో నారుమళ్లు కుళ్లిపోతున్నాయి. నారుమడుల్లోంచి ముంపునీటిని బయటకు పంపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నాటు వేసే పనులు ముందుకు సాగటం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చాలా చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

13:32 - July 11, 2018

యదాద్రి : జిల్లాలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన ప్రసన్నతో బీబీనగర్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవలే ప్రేమ వివాహం జరిగింది. బీబీనగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో బీబీనగర్ తహశీల్దార్ ఆఫీస్ పక్క గల్లీలోని నివాసంలో ప్రసన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

17:55 - July 10, 2018

యాదాద్రి భువనగిరి : చందుపట్లకు చెందిన ఓ యువతి.. వలిగొండలో ప్రియుడు భాస్కర్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్‌ తనను ప్రేమించానని చెప్పి.. మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దం కావడంతో జ్యోతి ఆందోళనకు దిగింది. రెండు నెలలుగా తప్పించుకున్న తిరుగుతున్న భాస్కర్‌పై.. జ్యోతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడం... భాస్కర్‌ వేరే యువతితో పెళ్లికి సిద్దం కావడంతో... ఆమె ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. 

12:29 - July 7, 2018
13:01 - July 4, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri