Yadadri

17:19 - March 15, 2017

యాదాద్రి : సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి లక్ష్యంతో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కాటేపల్లి, సికిందర్ నగర్, మోటకొండూరు, దిలావర్ పూర్, మంతపురి, బహదూర్ పేట, ఆలేరులో పాదయాత్ర పర్యటించనుంది. అనంతరం ఆలేరులో బహిరంగసభ జరగనుంది.

21:27 - March 14, 2017

యాదాద్రి : సీపీఎం మహాజన పాదయాత్ర 4వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పులిగిల్లలో ఈ చారిత్ర ఘట్టానికి వేదిక అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రసంగించారు. పాదయాత్ర తమ కోసం చేయడం లేదని, పార్టీ కోసం కాదని పేద ప్రజల బాగు పడటానికని మరోసారి స్పష్టం చేశారు. పులిగిల్లను తాము గుర్తు పెట్టుకుంటామన్నారు. 1500 గ్రామాల్లో పాదయాత్ర జరిగిందని, సమస్యలపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 80వేలకు పైగా దరఖాస్తులు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు ఎలాంటి బతుకులున్నాయో వచ్చిన తరువాత అలాంటి బతుకులున్నాయని విమర్శించారు.

18:09 - March 14, 2017

యాదాద్రి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్ల మహా ఘట్టం వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో చేరుకుంది. చారిత్రాత్మకంగా ఎంతో పేరున్న తమ గ్రామంలో.. మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్లకు చేరుకోవడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహాజన పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు సీపీఎం కార్యకర్తలు చేసిన ఏర్పాట్లపై టెన్ టివితో అక్కడి నేతలు మాట్లాడారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

10:31 - March 14, 2017

యాదాద్రి : తెలంగాణ బడ్జెట్‌ సామాజిక న్యాయానికి ఆమడదూరంలో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సామాజిక న్యాయం దిశగా బడ్జెట్‌ లేదన్నారు. అగ్రవర్ణాలు, కమీషన్ల చుట్టూనే బడ్జెట్‌ తిరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర జనాభాలో 52శాతంగా ఉన్న బీసీలకు 5వేల కోట్లు కేటాయిస్తే వారి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3ఎకరాల భూమి హామీల ఊసే లేదన్నారు. తక్షణమే బడ్జెట్‌ ప్రతిపాదనలు సమూలంగా మార్చాలని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

10:28 - March 14, 2017

యాదాద్రి : పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందుబాటులో ఉండేలా కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దొరల బడ్జెట్‌గా ఉందని..ఇది పేదల అభివృద్ధికి ఏ మాత్రం దోహదం చేసేలా లేదని తమ్మినేని విమర్శించారు. అందరికీ సామాజిక న్యాయం అందాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా..ఏ ఒక్క వర్గం ప్రజల కష్టాలు తీరలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. అందరికి సామాజిక న్యాయం అందాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర లక్ష్యమని తమ్మినేని అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌ వాగ్ధానాల బడ్జెట్‌ ...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌ వాగ్ధానాల బడ్జెట్‌ అని తమ్మినేని ఆరోపించారు. ఆర్థిక మంత్రి ఈటల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఎంబీసీలకు ఈ బడ్జెట్‌ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని తమ్మినేని అన్నారు. అంకెల గారడితో మాటలు చెబుతున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ఆచరణలో చేస్తున్నది ఏం లేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తమ్మినేని విమర్శించారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను సమూలంగా మార్చాలని ఆయన సూచించారు.

149 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర..

ఎర్రజెండా నీడలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 149 రోజులు పూర్తి చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న తమ్మినేని బృందం ప్రతి చోటా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. ఇవాళ పాదయాత్ర బృందం భీమన్‌పల్లి, పోచంపల్లి, వంకమామిడి, సంగెం గ్రామాల్లో పర్యటించింది. మేదరి కులస్థుల సమస్యలు, పోచంపల్లిలో చేనేత కార్మికులకు చెందిన భూమి కబ్జాపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖలు రాశారు.

18:45 - March 12, 2017

యాదాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 148వ రోజుకు చేరుకుంది. యాదాద్రి జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్ర బృందానికి పల్లెపల్లెన ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇవాళ వెల్లంకిలో మొదలైన పాదయాత్ర జైకేసారం, నేలపట్ల, మందాలగూడెం, లింగారెడ్డిగూడెం మీదుగా చౌటుప్పల్‌కు చేరుకోనుంది. ఈ రోజు పాదయాత్రలో కేరళ మాజీ మంత్రి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఏ. బేబి పాల్గొంటారు.

18:36 - March 11, 2017

యాదాద్రి : తెలంగాణలో ప్రస్తుత టీఆర్‌ఎస్‌ పాలన వల్ల బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడంలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న మహాజన పాదయాత్ర..యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. రామన్నపేట వద్ద జిల్లాలోకి ప్రవేశించిన సీపీఎం మహాజన పాదయాత్రకు సీపీఎం శ్రేణులు, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగుతున్న యాత్రకు స్థానికులు తమ సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రామన్నపేటలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం..ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. 

19:33 - March 2, 2017
17:22 - March 2, 2017

యాదాద్రి : భువనగిరి జిల్లాలోని బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కొలనుపాకకు చెందిన కనకరాజు యాదవ్ తో జనగాం జిల్లా నవాబుపేట ప్రాంతానికి చెందిన రేవతికి వివాహాం కుదిరింది. ఆలేరు మండలం కొలనుపాకలో వీరి వివాహా ఏర్పాట్లు చేశారు. కానీ రేవతికి 18 ఏళ్లు నిండలేదని ఐటీడీఎస్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వివాహం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పెళ్లిని ఆపి వేయించారు. దీనిపై రేవతి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు. పెళ్లికి ఎంతో ఖర్చు చేసి ఏర్పాట్లు చేయడం జరిగిందని, వివాహం రద్దు కావడంతో తాము నష్టపోతామని పేర్కొన్నారు. మైనర్ కు వివాహం జరగడం వల్ల కలిగే నష్టాలను అధికారులు వారికి తెలియచేశారు. ఈ వయస్సులో పెళ్లి చేయడం మంచిది కాదని హితవు పలికారు.

20:47 - March 1, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri