Yadadri

10:43 - May 27, 2017

యాదాద్రి భువనగిరి : స్వాతి, నరేష్ ల ప్రేమకథ విషాదంగా ముగిసింది. నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే హత్య చేశాడు. ఇతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరంతా కలసి నరేష్ ను నరికి చంపి, కాల్చి, వారి పొలంలోనే పూడ్చి పెట్టారు. పోలీసు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఎల్బీనగర్ డీసీపీ స్పెషల్ టీమ్ అదుపులో ఉన్నాడు. హత్యకు ముందు స్వాతితో నరేష్ కు ఫోన్ చేయించాడు ఆమె తండ్రి. వివాహం జరిపిస్తామంటూ నమ్మించాడు. శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మి వచ్చిన నరేష్ ను హత్య చేసి, కాల్చి, పాతిపెట్టారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:38 - May 26, 2017

భువనగిరి నరేష్ కోసం గాలింపు...ఎక్కడా దొరకని క్లూ..23 రోజులయినా జాడలేని ప్రేమికుడు..హైకోర్టు గడువుతో దర్యాప్తు ముమ్మరం..ఐదు ప్రత్యేక బృందాలతో శోధన..

కోర్టు ఇచ్చిన గడవు దగ్గర పడుతోంది..ఈలోగా ప్రేమికుడు నరేష్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి..కోర్టు ఎదుట హాజరు పరచాలి..లేకుంటే ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలి. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఐదు స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. కానీ నరేష్ జాడ మాత్రం దొరకడం లేదు. నరేష్ ఆచూకీ చెప్పిన వారికి పారితోషకం ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. యాదాద్రి భువనగిరికి చెందిన నరేష్ ఆచూకీ తెలియడం లేదు. ఈనెల 2వ తేదీన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో కేసు ఇంకా జఠిలమైంది. మరి గడువులోగా నరేష్ ఆచూకీ కనిపెడుతారా ? లేదా ? అనేది చూడాలి.

14:37 - May 25, 2017

యాదాద్రి : అమిత్ షా అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను అవమానపర్చారని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏయే పథకాలకు ఖర్చు చేశారన్న దానిపై చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భువనగిరిలో నేటి నుంచి మూడు రోజులపాటు జరుగనున్న సిపిఎం రాష్ట్రస్థాయి శిక్షణాతరగతుల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలో కేంద్రం నుంచి వచ్చినదానికంటే కేంద్రానికి చెల్లించినవే ఎక్కువని... కేంద్రంతో పోరాడి నిధులు సాధించడంలో సీఎం కెసిఆర్ విఫలమయ్యారని తమ్మినేని విమర్శించారు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా.. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్ధతివ్వమని కెసిఆర్ స్పష్టంచేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

17:55 - May 20, 2017

హైదరాబాద్: యాదాద్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాయిపావని కన్‌స్ట్రక్షన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెంపుల్‌ సిటీ పరిధిలో కార్మికులు ఉంటున్న 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అక్కడే ఉన్న రెండు ఆవులు మంటలకు సజీవ దహనమయ్యాయి. స్థానికంగా ఫైరింజన్లు లేకపోవడంతో.. సాయిపావని కన్‌స్ట్రక్షన్‌కు చెందిన వాటర్‌ ట్యాంకర్లతో మంటలను అదుపుచేశారు.

 

17:54 - May 20, 2017

హైదరాబాద్: యాదాద్రి జిల్లా పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నరేష్ ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు చివరగా తల్లిదండ్రులకు లేఖ రాశాడు. నమ్మివచ్చిన స్వాతి కోసం మిమ్మల్ని వదిలి వెళ్తున్న క్షమించండి అంటు లేఖలో రాశాడు... చావైనా బతుకైనా తనతోనే అని పేర్కొన్నాడు.

17:00 - May 18, 2017

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెర్లకు చెందిన నరేశ్‌ అదృశ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేశ్‌ అచూకీ తెలసుకుని కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మను బెంచ్‌ ఆదేశించింది. నరేశ్‌ను వెతికే బాధ్యతలను ప్రత్యేక అధికారికి అప్పగించాలని చెప్పింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేశ్‌... అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన స్వాతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ముంబైలో నరేశ్‌ స్నేహితులు వీరిద్దరికీ వివాహం చేశారు. ఆ తర్వాత భువనగిరి వచ్చిన నరేశ్‌ గత నెల 2 నుంచి కనిపించకుండా పోయాడు.. పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదంటూ నరేశ్‌ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై '10టివి'లో చర్చను చేపట్టింది. ఈ చర్చడలో నరేశ్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందర, ఎంబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి..

13:26 - May 18, 2017

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేష్ ఆచూకీ తెలుసుకొని కోర్టులో హాజరుపరచాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. నరేష్ ను వెతికే బాధ్యతను ప్రత్యేక అధికారికి అప్పగించాలని హైకోర్టు సూచించింది. స్వాతి తండ్రిని అన్ని కోణాల్లో విచారించారా..? అని బెంచ్ ప్రశ్నించింది. నరేష్ అదృశ్యం వెనుక స్వాతి వాదానలు విన్న నరేష్ కనిపించకుండాపోతే పోలీసులు ఎం చేశారని ప్రశ్నించింది. నరేష్ అదృశ్యం వెనుక స్వాతి తండ్రి ప్రమేయంపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని న్యాయవాది శరత్ తెలిపారు. గత మార్చి 25 స్వాతి, నరేష్ పెళ్లి చేసుకున్నారు. మే 2న స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డి పుట్టింటి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి నరేష్ అదృశ్యం అయ్యాడు. దీని పై పోలీసుల స్పందిచకపోవడంతో నరేష్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

09:27 - May 17, 2017

యాదాద్రి : జిల్లాలోని బీబీనగర్ వద్ద పెళ్లిబృందం డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వీరు జగద్గీరిగుట్ట నుంచి యాదాగిరి నరసింహా దర్శనానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ వేగంగా డీసీఎం నడపడంతో అదుపు తిప్పి బోల్తా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

18:21 - May 16, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా పల్లెర్లకు చెందిన నరేశ్ మిస్సింగ్ కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. నరేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించింది. నరేశ్ ఆచూకీ కనిపెట్టాలని అతని తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో స్వాతి మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. నరేశ్ అదృశ్యం నుంచి స్వాతి మరణం వరకు యువతి తండ్రిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెరకు చెందిన నరేశ్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. నరేశ్ ప్రేమించి పెళ్లాడిన స్వాతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కుమార్తె మంగళవారం తెల్లవారు ఝామున బాత్రూమ్ లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్వాతి తల్లిదండ్రులు చెబుతున్నారు. స్వాతి ఆత్మహత్యకు యత్నించినట్లు చెబుతున్న బాత్రూమ్ ఎత్తు తక్కువగా ఉండటం.. చున్నీ కూడా కిందవరకూ వేలాడుతూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట్నుంచి స్వాతి ప్రేమ వ్యవహారం గిట్టని ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివాహం.. ఆ తరువాత రద్దు..
యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెరకు చెందిన నరేశ్, లింగరాజుపల్లికి చెందిన స్వాతి డిగ్రీ చదువుకునేటప్పుడు ప్రేమలో పడ్డారు. 2015లో డిగ్రీ పూర్తి చేసిన నరేష్ ముంబయిలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత కూడా స్వాతితో ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో మార్చి 16న.. నల్లగొండ జిల్లా , చిట్యాలలో ఓ శుభకార్యానికి వచ్చిన నరేశ్‌.. అదే పెళ్లికి వచ్చిన స్వాతిని ముంబై తీసుకెళ్లాడు. మార్చి 25న బాంద్రా కోర్టును ఆశ్రయించి కులాంతర వివాహం చేసుకున్నాడు. స్వాతి తండ్రి మాత్రం.. తన కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నరేశ్‌పైనా, అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులపైనా ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా, నరేశ్‌ కుటుంబ సభ్యులను పలురకాలుగా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. దీంతో, స్వాతి, నరేశ్‌లు వివాహాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.

స్వాతి మరణం..
ఏప్రిల్‌ 2న స్వాతి ముంబై వెళ్లిపోయి భర్త నరేశ్‌తో కలిసి వేరుకాపురం పెట్టించింది. విషయం తెలిసి నరేశ్‌ తల్లిదండ్రులు వారిని తమ ఇంటికే తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో.. వారి పెళ్లిని తానూ అంగీకరిస్తున్నానని, ఊరికి రమ్మనడంతో, నరేశ్‌, స్వాతిలు మే 2న ముంబై నుంచి భువనగిరి బయలుదేరారు. అంతే, స్వాతి పుట్టిల్లు చేరింది కానీ, నరేశ్‌ ఆచూకీ లేకుండా పోయాడు. ఆందోళన చెందిన నరేశ్‌ తల్లిదండ్రులు, కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. నరేశ్‌ మిస్సింగ్‌ కేసు నివేదికను సమర్పించడంతో పాటు, స్వాతినీ కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. బుధవారం కోర్టుకు హాజరు కావాల్సిన తరుణంలో.. స్వాతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. నరేశ్ మిస్సింగ్ కేసులో అతని తల్లితండ్రులు సైతం స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కులం తక్కువనే కారణంతోనే.. స్వాతి తండ్రి నరేశ్‌, స్వాతిల పెళ్లిని అంగీకరించలేదని వారు ఆరోపిస్తున్నారు ఏదేమైనా నరేశ్ అదృశ్యం గుట్టు తేలకముందే.. స్వాతి మరణం మరో మిస్టరీకి తెరలేపింది.

11:19 - May 16, 2017

యాదాద్రి : జిల్లాలోని పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యం కేసులో నరేష్ భార్య స్వాతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. మార్చి 25న స్వాతి నరేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహనికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారు ముంబై వెళ్లారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి మే 2 న ఆమెను పుట్టింటికి తీసుకోచ్చాడు. ఆ తర్వాత నరేష్ అదృశ్యం అయ్యాడు. నరేష్ అదృశ్యాం కేసును పోలీసులు పట్టించుకోకపోవటంతో నరేష్ తల్లిదండ్రులు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు డీజీపీ నోటీస్ జారీ చేసింది. మరో రెండు రోజుల్లో నరేష్ గురించి తెలిసే అవకాశం ఉన్న సమయంలో అతని భార్య స్వాతి మృతి పలు అనుమానాలు రెకేతిస్తున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri