Yadadri

11:48 - July 30, 2017

యాదాద్రి : జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎం.టీ. రేపాక, ఉప్పాలపాడ్‌ గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి.. రెండు గ్రామాల్లో తిరుగుతూ దాదాపు పదిమందిపై దాడి చేశాయి.. ఇందులో నలుగురు చిన్నారులున్నారు.. వీరిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వ్యాక్సిన్‌ అందుబాటులోలేక భువనగిరికి తరలించారు. 

18:06 - July 29, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లా నారాయణపురం మండల శివారులోని శ్రీరామ స్పిన్నింగ్‌ మిల్లులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ మిల్లులో పనిచేస్తోన్న 50మంది బాలలకు విముక్తి కల్పించారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటోన్న పరిశ్రమ చైర్మన్‌, ఎండీసహా 16మందిపై కేసులు నమోదు చేసినట్టు రాచకొండ పోలీస్‌ అదనపు కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు. ఇందులో 12మందిని అరెస్ట్‌ చేశామన్నారు. విముక్తి పొందిన బాలకార్మికుల్లో 36మంది బాలురు, 11మంది బాలికలు ఉన్నారు. వీరందరూ ఒడిషా,చత్తీస్‌గఢ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని బాలల సంక్షేమ కమిటీకి అప్పగించినట్టు తరుణ్‌జోషి తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. 

17:38 - July 27, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో అంబోజు నరేష్ పరువు హత్యకేసులో పోలీసులు సమగ్ర విచారణ జరపడం లేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. భువనగిరి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. నరేశ్ కేసును సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. హంతకుల వెనుక ఉన్న రాజకీయ నేతలు ఎవరో పోలీసులు బహిర్గతం చేయాలని ప్రజా సంఘాల నేతలు కోరారు. 

21:20 - July 26, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా పల్లెర్లలో నరేష్‌ అస్థిపంజరం లభించింది. స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న నరేష్‌ను.. అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చంపి కాల్చి బూడిదను మూసీలో కలిపానంటూ పోలీసులను తప్పుదోవపట్టించాడు. మరోవైపు విచారణలో పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా పల్లెర్లలో కనిపించిన అస్థిపంజరం తమ కుమారుడు అంబోజి నరేష్‌దే అంటున్నారు అతని తల్లిదండ్రులు. అయితే అది నరేష్‌దో ? కాదో? డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తెలుస్తుందన్నారు భువనగిరి డీఎస్పీ. పంచనామా చేసి డీఎన్‌ఏ పరీక్షలకు పంపిస్తామని ..పరీక్షల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని ఆయన చెప్పారు. 

20:19 - July 26, 2017

యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నరేష్, స్వాతి కేసులో మరో దిగ్ర్భాంతి కలిగించే విషయం వెలుగు చూసింది. నరేష్ అస్థిపంజరం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. నరేష్ ను హత్య చేసి కాల్చి చంపిన అనంతరం బూడిదను మూసీ నదిలోకి వేసినట్లుగా చెప్పిన స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అబద్దాలేనని తెలుస్తోంది. స్వాతి - నరేష్ ప్రేమ..పెళ్లి..విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. దీనిపై టెన్ టివి వరుసగా కథనాలు ప్రసారం చేసింది. తాజాగా అస్థిపంజరం లభ్యం కావడంపై నిజ నిజాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:18 - July 26, 2017
18:46 - July 26, 2017

హైదరాబాద్ : ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్వాతి తండ్రి శ్రీనివాస్ 'దృశ్యం' సినిమా చూపిస్తున్నాడా ? దృశ్యం సినిమాలో తన కూతురును కాపాడుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. కానీ శ్రీనివాస్ ఫక్తు అదే తరహాలో ప్రవర్తిస్తున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్వాతి నరేష్ ప్రేమ..పెళ్లి విషాదంతమైన సంగతి తెలిసిందే. నరేష్ ను హత్య చేసి తగులబెట్టి బూడిదను మూసీలో పారబోసినట్లు శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే.

పల్లెర్లలో..
తాజాగా నరేష్ దిగా భావిస్తున్న అస్థిపంజరం బయటపడడం కలకలం రేపుతోంది. పల్లెర్లలో ఇది బయటపడింది. నరేష్ ఇంటి నుండి వెళ్లిన సమయంలో వేసుకున్న డ్రెస్ ఆధారంగా అస్థిపంజరం ఖచ్చితంగా నరేష్ దని కుటుంబసభ్యులు, అక్కడి గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనితో శ్రీనివాస్ చెప్పినవన్నీ అబద్దాలేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఘటనా ప్రదేశానికి పోలీసులు, ఎమ్మార్వో, ఇతర అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రేమ..పెళ్లి విషాదాంతం..
నరేష్ - స్వాతిలు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి భరించలేకపోయాడు. కొన్ని మాటలు చెప్పి స్వాతిని వెనక్కి పిలిపించుకన్నాడు. కానీ నరేష్ మాత్రం కనిపించలేదు. దీనితో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణనను పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపత్యంలో స్వాతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీనిపై టెన్ టివి వరుస కథనాలు ప్రసారం చేసింది.

టెన్ టివి కథనాలకు స్పందన..
పోలీసుల తీరుతో విసుగు చెందిన నరేష్‌ తల్లిదండ్రులు న్యాయం కోసం... సీపీఎం, ప్రజాసంఘాలతో పాటు 10టీవీని ఆశ్రయించారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కేసు డీజీపీ వరకు వెళ్లింది. హైకోర్టు అక్షింతల అనంతరం కేసును ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర్లుకు అప్పజెప్పడంతో కేసు ముందుకు కదిలింది. అయితే అప్పటికే పోలీసుల నిర్లక్ష్యం.. వేగంగా స్పందించకపోవడం వల్ల స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆత్మకూరు ఎస్సై శివనాగ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అలాగే.. భువనగిరి ఏసీపీ, డీసీపీతో పాటు.. చౌటుప్పల్‌ ఏసీపీ, రామన్నపేట, భువనగిరి సీఐలకు మెమోలు జారీ చేశారు.

పలు ఆధారాలు..
స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు మేజర్లు అయిన నరేష్‌-స్వాతిలు ముంబైలో పోలీసుల అనుమతితో వివాహం చేసుకున్నప్పటికీ.. ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ వారిద్దరిని తిరిగి స్వగ్రామం వచ్చేటట్టు చేసిన రాయభారం ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. వారిద్దరూ వచ్చిన తర్వాత రామన్నపేట సీఐ శ్రీనివాస్‌ సమక్షంలో పంచాయతీ నిర్వహించి ప్రేమజంటను బలవంతంగా విడదీసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. 

16:39 - July 25, 2017

యాదాద్రి భువనగిరి : తమ పొలాలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరులో విద్యుత్‌ సిబ్బందిని రైతులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గతంలో మాదిరిగానే విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకుని ఉన్నతాధికారులు రైతులతో మాట్లాడారు. దీంతో శాంతించిన రైతులు విద్యుత్‌ సిబ్బందిని వదిలిపెట్టారు. 

20:48 - July 21, 2017

యాద్రాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్‌ మండలంలో ఏర్పాటు చేసిన నిమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్‌ నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్ తో ఆయన మహాపాదయాత్ర చేపట్టారు. బీబీనగర్‌ మండలం రంగాపురం లోని నిమ్స్‌ ఆస్పత్రి నుంచి యాదాద్రి క్షేత్రం వరకు  మహాపాదయాత్ర చేపట్టారు. ఈపాదయాత్రకు భువనగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. అనిల్‌ కుమార్‌రెడ్డితో ఫేస్‌ టూ ఫేస్‌ టెన్ టివి నిర్వహించింది. నిమ్స్‌ ను అభివృద్ధి చేయాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:08 - July 21, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri