Yadadri

13:43 - March 7, 2018

యాదాద్రి : భార్గవి హత్య చేసిన నరేందర్‌కు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. భార్గవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. నరేందర్‌కు ఉరిశిక్ష పడితేనే తమకు న్యాయం జరుగుతుందని భార్గవి కుటుంబ సభ్యులంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలు చూడండి..

09:59 - March 7, 2018

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకో అడగ్గానే ప్రియురాలు భార్గవిని.. ప్రియుడు నరేశ్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. అనంతరం..తమ వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టాడు. భార్గవిని హత్య చేసిన తర్వాతిరోజే నిందితుడు.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే చివరిసారిగా సోదరితో భార్గవి మాట్లాడిన ఫోన్ కాల్ బయటకొచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:21 - March 7, 2018

యాదాద్రి : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. మాయమాటలు చెప్పి పొలానికి రప్పించాడు. పక్కాప్లాన్‌తో హత్యచేసి పూడ్చి పెట్టారు. మరునాడు మరో యువతి మెడలో తాళికట్టాడు. పెళ్లైన రెండోరోజే హత్య విషయం బయటపడి కటకటాల పాలయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి భార్గవి - బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని నరేష్‌ ఐదు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. భార్గవి ఆత్మకూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. గతంలో పెట్రోల్‌ బంక్‌లో పనిచేసిన నరేష్‌.. ప్రస్తుతం భార్గవి పనిచేస్తోన్న ఆస్పత్రిలోనే అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి కులాలు వేరైనా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి గురించి వీరి మధ్య పలుమార్లు ప్రస్తావన వచ్చినా నరేష్‌ వ్యూహాత్మకంగా ఆ విషయం దాటవేస్తూ వస్తున్నాడు. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సాకులు చెప్తూ భార్గవిని నమ్మిస్తూ వచ్చాడు.

ఒకవైపు భార్గవితో ప్రేమాయణం సాగిస్తూనే మరోవైపు పెళ్లికి రెడీ అయ్యాడు నరేష్‌. ఈనెల 4నే మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్గవి.. ప్రియుడు నరేష్‌ను నిలదీసింది. తనకూ ఆ పెళ్లి ఇష్టంలేదని.. పెద్దవాళ్లే బలవంతంగా చేస్తున్నారని నమ్మించాడు. వ్యవసాయ బావి వద్దకు వస్తే అన్నీ మాట్లాడుకుందామని... ఆపై యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. నరేష్‌ మాటలు నిజమని నమ్మిన భార్గవి.. పొలం దగ్గరికి వెళ్లింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం భార్గవి తలపై బండరాయితో మోది చంపేశాడు. అనంతరం బావికోసం పూడిక తీసిన మట్టిలో పూడ్చిపెట్టాడు.

భార్గవిని పక్కా ప్లాన్‌తో హత్య చేసిన నరేష్‌.. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా మరునాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తమ కూతురు రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో భార్గవి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తుండడంతో ఆందోళన రెట్టింపు అయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ వ్యవహారంపై కూలీ లాగారు. నరేష్‌ను మొదట ప్రశ్నించగా ప్రేమించిన మాట వాస్తవమేనని.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు నిజం బయటకు కక్కాడు. తనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు.

నరేష్‌ ఇచ్చిన సమాచారంతో వ్యవసాయ బావి దగ్గరి భార్గవి మృతదేహాన్ని బయటకు తీశారు. డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించి నరేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును కిరాతంగా హత్యచేసిన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని భార్గవి తల్లిదండ్రులు కోరుతున్నారు.

20:55 - March 6, 2018

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకో అడగ్గానే ప్రియురాలు భార్గవిని.. ప్రియుడు నరేశ్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. అనంతరం..తమ వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టాడు. భార్గవిని హత్య చేసిన తర్వాతిరోజే నిందితుడు.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు.  

 

11:10 - February 4, 2018

యాదాద్రి : ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గత ప్రభుత్వాలు హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. మేడారం నుంచి తిరిగి వస్తుండగా యాదాద్రి లక్ష్మినరసింహ్మ స్వామి వారిని తలసాని దర్శించుకున్నారు. యాదాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్నారు

11:35 - February 3, 2018

 

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా చిన్న కందుకూరు గ్రామంలో దళితులపై దాడి జరిగి నెల రోజులవుతోంది..ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఆ దళిత వాడల్లో ఉన్న దళితులు ఎప్పుడు ఏం జరగుతుందా ? అని బిక్కుబిక్కుమంటున్నారు. దళితులకు అభయం కల్పించేందుకు..వారికి ధైర్యం చెప్పేందుకు బీఎల్ఎఫ్...టీ మాస్ నేతలు నడుం బిగించారు. శుక్రవారం వారి గ్రామానికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టెన్ టివి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.

గో మాంసం తిన్నారనే నెపంతో ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారని దళితులు పేర్కొంటున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా తమపైనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారని దళితులు వాపోతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:41 - February 2, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దాడికి గురైన దళితులకు టీమాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అండగా నిలిచింది. దళితులపై దాడి జరిగి నెలరోజులవుతున్నా... ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన బాటపట్టింది. వెంటనే బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి టీ-మాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు ర్యాలీగా కందుకూరుకు బయల్దేరారు. అనంతరం బాధిత దళితులకు అండగా... గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టీ-మాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య, కన్వీనర్‌ జాన్‌వెస్లీ, బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, టీమాస్‌ నేతలు పాల్గొన్నారు.

దళితులు, మైనారిటీలపై దాడులు 
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కవయ్యాయన్నారు తమ్మినేని. తెలంగాణలోనూ కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. అయితే... ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దళితులకు అండగా నిలిచి మనోదైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకునేందుకు ప్రయత్నించారని... పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు తమ్మినేని. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు కంచ ఐలయ్య. బాధ్యులను అరెస్ట్‌ చేసే వరకు దళితులకు అండగా నిలబడతామన్నారు. మరోవైపు బాధ్యులను అరెస్ట్‌ చేయని పోలీసులు.. బాధితులను బెదిరిస్తూ కేసులు పెడుతున్నారన్నారు నల్లా సూర్యప్రకాశ్‌. ఇకపై ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదన్నారు. సభకు హాజరైన టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలంతా దళితవాడలో పర్యటించి.. దళితులతో కలిస సహపంక్తి బోజనాలు చేశారు. టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలు అండగా నిలబడడంతో.. తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం బాధిత దళితుల్లో వ్యక్తమవుతోంది. 

18:12 - February 2, 2018

యాదాద్రి : జిల్లా చిన్నకందుకూరులో దళితులపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల దాడికి నిరసరగా గ్రామంలో ప్రతిఘటన సభ నిర్వహిస్తున్న టీ మాస్ ఫోరం, బీఎల్‌ఎఫ్‌ నేతలపై యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కుమార్‌ జులుం ప్రదర్శించారు. ప్రతిఘటన సభకు అనుమతిలేదంటూ మైక్‌ కట్‌ చేసి దురుసుగా ప్రదర్శించారు. దుర్భాషలాడారు. సీఐ బెదిరింపులకు ఫోన్‌లో చిత్రీకరిస్తున్న నవతెలంగాణ రిపోర్టర్‌ రామకృష్ణపై దాడికి దిగారు. ఫోన్‌ లాక్కున్నారు. 

13:30 - February 2, 2018

యాదాద్రి : యాదగిరిగుట్ట సీఐ అశోక్ కుమార్ జులుం ప్రదర్శించారు. బీఎల్ఎఫ్..టీమాస్ నేతలపై దురుసుగా ప్రవర్తించారు. చిన్నకందుకూరు టీ మాస్..బీఎల్ఎఫ్ సభకు అనుమతి లేదంటూ సీఐ మైక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ చర్యలను నేతలు ఖండించారు. సీఐ దురుసు ప్రవర్తనను నవతెలంగాణ రిపోర్టర్ పై కూడా సీఐ జులుం ప్రదర్శించారు. దీనిపై నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సీఐని మందలించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు వెనక్కి తగ్గడంతో సభ ప్రశాంతంగా జరుగుతోంది.

జనవరి 14 వ తేదీన ఆర్ఎస్ ఎస్ కు చెందిన కొంతమంది దళిత కుటుంబాలపై దాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఎల్ఎఫ్, టీ మాస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రతిఘటన సభ ఏర్పాటు చేసి..దళితులకు మద్దతు తెలియచేయాలని...బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ మాస్..బీఎల్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. 

13:26 - January 30, 2018

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హనుమాన్ నగర్, బంగారుగడ్డలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. 3 బెల్ట్ షాపుల్లో 47 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 65 బైక్ లు, 6 కార్లు, 3 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri