న్యూస్ మార్నింగ్

Friday, February 24, 2017 - 19:58

అమెరికాలో జాతి వివక్ష మళ్లీ జడలు విప్పుకుంది. ఎన్నికల ప్రచార వేళ.. డొనాల్డ్‌ ట్రంప్‌ నాటిన విద్వేషపు బీజాలు.. అప్పుడే మొగ్గతొడుగుతున్నాయి. జాతివివక్ష తలకెక్కిన ఓ తెల్లజాతీయుడి విచక్షణ రహిత చర్యకు.. ఓ భారతీయుడు బలయ్యాడు. మరొకరు గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రుడూ తెలుగువారు కావడం గమనార్హం. అమెరికాలో నరనరానా జాతి వివక్షతను నింపుకున్న ఓ తెల్లజాతీయుడు.. ఇద్దరు తెలుగువారిపై తూటాలు...

Friday, February 24, 2017 - 10:51

సెమినార్ నిర్వహిస్తుంటే ఏబీవీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్ తో దాడి చేయడం కరెక్టేనా.. అని ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నత తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, టీఆర్ ఎస్ అధికార ప్రతనిధి తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. సెమినార్ ను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, February 23, 2017 - 21:39

టీటీడీ నిధులు దారి మళ్లుతున్నాయని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, లక్ష్మీపార్వతి, సీపీఎం నేత మురళి పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, February 23, 2017 - 08:56

నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోగా.. టీ-జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమని పలువురు నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యను ఖండించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందని, ఇప్పటికైనా కేసీఆర్‌ కళ్లుతెరిచి వాస్తవాలను గ్రహించాలని సూచిస్తున్నారు. నిరుద్యోగుల వెతల్ని అర్థం చేసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ అంశంపై...

Wednesday, February 22, 2017 - 09:04

నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రొ.కోదండరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంపై పలు విమర్శలు ఎదురవుతున్నాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. కానీ ర్యాలీ నిర్వహించి తీరుతామని జేఏసీ, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), రాకేష్ (టీఆర్ఎస్), ప్రతాప్ రెడ్డి (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు...

Tuesday, February 21, 2017 - 07:34

పవన్ కళ్యాణ్ రాకతో గుంటూరు జిల్లా చినకాకాని జనసంద్రంగా మారింది. చేనేత సత్యాగ్రహ దీక్షకు పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. నిరాహారదీక్ష చేస్తున్న నేత కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చేనేతల సమస్యలపైవారితో కాసేపు మాట్లాడారు. నేతన్నలతోకలిసి మగ్గం నేశారు. నూలు వడికారు.. వస్త్రాలు ఎలా నేస్తారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి...

Monday, February 20, 2017 - 19:55

హైదరాబాద్: ప్రభుత్వాలు చేపట్టే చర్యలు చేనేత కార్మికులను ఆదుకుంటాయా? గుంటూరులో చేనేత సత్యాగ్రహ దీక్ష కు జనసేన అధినేత పవన్ మద్దతు ప్రకటించారు. మరో వైపు చేనేత కార్మికుల పట్ల తెలుగు రాష్ట్రాలు సానుకూలంగా మాట్లాడుతున్నాయి. అవి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి? చేనేత అంటే ఏంటి? పవర్ లూం అంటే ఏమిటి? ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో...

Monday, February 20, 2017 - 10:42

చేనేత కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత విజయకుమార్, వైసీపీ నేత అమర్ నాథ్, బీజేపీ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. చేనేత కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. చేనేత కార్మికులను అప్పుల నుంచి ప్రభుత్వం విముక్తి కలిగించాలని కోరారు. మరిన్ని...

Saturday, February 18, 2017 - 07:30

హైదరాబాద్: కాసేపట్లో అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ చేసుకోనున్నారు. అయితే.. పళనిస్వామి ఈ గండం నుంచి గట్టెక్కుతాడా ? లేడా ? అనే సస్పెన్స్‌ మాత్రం కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన డీఎంకే తాజాగా వ్యూహం మార్చుకుంది. ఈ నేపథ్యంలో బిజెపి ఏం చేయబోతోంది? రాజ్యాంగం ప్రకారం గరవ్నర్...

Friday, February 17, 2017 - 08:39

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు (63)పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం మీద సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేటి నుంచి ప్రగతి భవన్ లో జనహిత ప్రారంభం కానుంది. జనహితంలో సీఎం కేసీఆర్ వివిధ వర్గాల ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరిస్తారు. అప్పటికప్పుడే అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు జారీ చేశారు. జనహితం...

Thursday, February 16, 2017 - 09:06

హైదరాబాద్: డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే నేతలంతా అవినీతిపరులే అని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత బాబూరావు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారెవ్వరూ తప్పించుకోలేరన్న సత్యాన్ని.. శశికళ విషయంలో న్యాయస్థానం నిరూపించిందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌ శశికళకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడ్డారని,...

Wednesday, February 15, 2017 - 09:09

హైదరాబాద్: గత ఏడాది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల కుల వివాదం మరో మలుపు తిరిగింది. రోహిత్‌ దళితుడు కాదని, అతను బీసీ వర్గానికి చెందినవాడని ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధరించింది. అయితే.. కేసును తప్పుదోవ పట్టించడానికే రోహిత్‌ కులంపై కేంద్రం కుట్ర చేస్తోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ సిగా...

Tuesday, February 14, 2017 - 20:04

రోహిత్ వేముల ఎస్సీ కాదనడం బాధాకరమని విశ్లేషకులు నగేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేసులో ఉన్న హెచ్ సీయూ వీసీ అప్పారావు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమిళనాడు రాజకీయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Tuesday, February 14, 2017 - 09:09

హైదరాబాద్: టెన్షన్‌.. టెన్షన్‌. ఇది తమిళనాడు రాజకీయ వర్గాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీరు. ఓవైపు రోజురోజుకు మద్దతు పెంచుకుంటూ పన్నీర్‌ సెల్వం జోష్‌ మీద ఉండగా.. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చిన్నమ్మ అష్టకష్టాలు పడుతున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఏం...

Monday, February 13, 2017 - 08:55

హైదరాబాద్: తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. పన్నీర్ సెల్వం మద్దతుదారుల సంఖ్య రోజురోజుకూపెరుగుతుండటం..శశికళ వర్గానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యం గరవ్నర్ ఏం చేయబోతున్నారు? మరో వైపు డీఎంకే నేత...

Saturday, February 11, 2017 - 13:02

తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయం వెనుక కేంద్రప్రభుత్వం పాత్ర ఉందని వక్తలు ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నేత కైలాష్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. గవర్నర్.... కేంద్రప్రభుత్వం ఏజెంట్ అని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను రద్దు...

Friday, February 10, 2017 - 11:08

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత కుమార్, టీడీపీ నేత రామ్ శర్మ లు పాల్గొని, మాట్లాడారు. గవర్నర్ కేంద్రప్రభుత్వం, బీజేపీకి అనుగుణంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి కట్టుబడి గవర్నర్ విద్యాసాగర్ రావు...

Thursday, February 9, 2017 - 19:53

హైదరాబాద్: తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలో గవర్నర్ విద్యాసాగర్ రావు తడబాటుకు గురయ్యారా?తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు హఠాత్తుగా జరిగాయా?తమిళనాడు రాజకీయ సంక్షోభంలో బిజెపి హస్తం ఉందా? ఈ గందరగోళంలో డీఎంకే పాత్ర ఎంత ఉంది? శశికళ అక్రమాస్తుల కేసుతో రాష్ట్ర రాజకీయాలను ముడిపెట్టడం సబబేనా...

Thursday, February 9, 2017 - 11:34

నరేంద్రమోడీ ప్రధాని స్థాయిలో ఉండి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని వక్తలు అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, బీజేపీ నేత అద్దేపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు...

Wednesday, February 8, 2017 - 07:22

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం పదవి చేపట్టాలనుకున్న శశికళకు షాక్‌ ఇస్తూ ఇన్నాళ్లూ ‘అమ్మ’ చాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌ సెల్వం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శశికళ వర్గీయులు తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని సంచలన ప్రకటన చేశారు. ప్రజలు కోరుకుంటే దానిని...

Tuesday, February 7, 2017 - 07:24

హైదరాబాద్: కృష్ణా జిల్లా ఇలపర్రులో దళితులు భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల నిర్బంధకాండతో ఇలపర్రులో అలజడి రేగింది. సీపీఎం సహా ప్రజాసంఘాల నేతల అరెస్టులతో అట్టుడికింది. దళితుల భూములు వారికి అప్పగించేదాక తమ పోరాటం ఆగదన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. పోలీసులు వచ్చినా, సైన్యం వచ్చినా...

Saturday, February 4, 2017 - 08:03

లోక్ సభ, రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వదదకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఇ.అహ్మద్ మరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని, ఆయన మరణవార్తను ప్రకటించడంలో కుట్రలు జరిగాయని ఆరోపిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో...

Friday, February 3, 2017 - 08:11

దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఉన్న మెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటీవ్స్‌ నేటి నుండి సమ్మెకు దిగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ సమరశంఖం పూరించింది.. ఈ నెలాఖరులోగా ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్), రాజు భట్ (మెడికల్...

Thursday, February 2, 2017 - 13:24

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ -17 లో ఏపికి పచ్చిదగా జరిగినా.. సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించడం హేయమైన చర్య అని నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం గురించి,మెట్రో రైలు నిర్మాణం, తెలంగాణ లో ఎయిమ్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా చేశారు. నోట్ల రద్దు పై ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా బడ్జెట్ లో ఎలాంటి ఊసే...

Wednesday, February 1, 2017 - 20:12

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరి నెల చివరిలో కాకుండా తొలి రోజునే 2017-18 బడ్జెట్ ను జైట్లీ ప్రవేశ పెట్టడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. అలాగే రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో కలిపేయడం..ప్రణాళిక..ప్రణాళికేతర వ్యయం..లకు స్వస్తి పలకడం వంటి 2017 బడ్జెట్ కు నాంది పలికారు. పేదల బడ్జెట్ అని ప్రధాని మోడీ అంటుంటే...

Wednesday, February 1, 2017 - 13:32

హైదరాబాద్: సామాన్యులకు మాటలు.. సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ, సామాన్యులకు నిర్ధిష్టంగా చేసింది ఏమీ లేదని సీపీఎం జాతీయ నేత శ్రీనివాసరావు విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉందని కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో మంత్రి జైట్లీ ప్రవేశపెడుతూ తెలిపారు. జ2017-18 బడ్జెట్ రూ. 21 లక్షల 47కోట్లు, రక్షణ రంగానికి రూ. 2లక్షల 74వేల...

Wednesday, February 1, 2017 - 07:32

హైదరాబాద్:హెచ్ -1బి వీసా వల్ల తెలుగు వారి పై ఎలాంటి ప్రభావం పడుతోంది.? ట్రంప్ నిర్ణయాలు ప్రపంచంలోనే ఆందోళనలు రేకెత్తిస్తున్నాయా? తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్‌ నరసింహన్‌ మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిఆర్ ఎస్ నేత డాక్టర్ రాకేష్, ఏపీ టిడిపి నేత...

Pages

Don't Miss