న్యూస్ మార్నింగ్

Sunday, May 27, 2018 - 21:40

అభ్యుదయ సినీనటుడు, రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాదాల రంగారావు మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ ప్రజానాట్య మండలి నాయకులు, రచయిత కందిమల్ల ప్రతాప్ రెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్ బాబ్జి, డైరెక్టర్...

Sunday, May 27, 2018 - 07:58

తెలుగు దేశం పార్టీ పండగ... మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజీ తీసుకురావాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు ఉద్దానం సమస్యపై ఏపీ సర్కార్ పై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విమర్శలు గుప్పించారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిస్పందించారు. ఈ అంశాలపై టెన్ టివి విజయవాడ స్టూడియలో...

Saturday, May 26, 2018 - 08:37

జనసేనాని పవన్‌కల్యాణ్‌ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి తక్షణమే ఆరోగ్య మంత్రిని నియమించాలన్న తన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించక పోవడంతో.. ఆయన నిరశనకు దిగారు. ఇవాళ.. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌడ్స్‌లో దీక్షకు దిగుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంట వరకు పవన్‌ దీక్ష కొనసాగించనున్నారు. పవన్‌ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జనసేన దీక్షలు చేపట్టనుంది. ఈ...

Friday, May 25, 2018 - 21:20

అంతర్జాతీయ ఒప్పందాలకు అమెరికా తూట్లు పొడుస్తూ...మాట తప్పుతోంది అమెరికా.. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తో భేటీని రద్దు చేసుకుని మరోసారి మాట తప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన...

Friday, May 25, 2018 - 20:49

రేపటికి మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుంది. ఈ నాలుగేళ్ల పాలనలో మోడీ సాధించిందేంటీ ?  ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత సుందర్ రామశర్మ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Thursday, May 24, 2018 - 21:23

తమిళనాడులో స్టెరిలైడ్ రాగి కర్మాగార విస్తరణ పనులతో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. దాని విస్తరణ పనులు ఆపాలి..తమ ప్రాణాలకు ముప్పుగా ఉందని అక్కడి ప్రజలంత ఏకంగా పోరాటం చేస్తున్నారు. వారిపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. కాల్పులు జరిపారు. కాల్పుల్లో 13 మంది చనిపోయారు. విస్తరణ పనులు ఆపాలి.. మా ప్రాణాలు నిలబెట్టాలనే పోరాటం అక్కడ జరుగుతుంది. తూత్తుకూడిలో ఏం జరుగుతోంది..? ...

Thursday, May 24, 2018 - 20:47

బీజేపీ వ్యతిరేకపార్టీలు ఏకతాటిపైకి రానున్నాయా..? 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారనున్నాయా..? కూటములు..రాజకీయ పార్టీలు..అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ నేత వేణుగోపాలాచారి, ఏపీ బీజేపీ నేత రఘునాథ్, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. 
దేశ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో...

Wednesday, May 23, 2018 - 07:31

తమిళనాడులోని తూత్తుకుడిలో నిరసననకారుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9మంది ఆందోళనకారులు మృతి చెందారు. స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అంశాలపై...

Tuesday, May 22, 2018 - 20:38

టీటీడీ మాజీ అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. సీఎం చంద్రబాబు టీటీడీ పాలకమండలితో సమావేశమయ్యారు. శ్రీవారి ఆభరణలు,అవినీతి, ఆ ప్రాంతంలోజరుగుతున్న అవకతవకలపై చర్చ జరగాల్సిన అవసరముందని రమణదీక్షితుల వాదన..మరోపక్క ఆభరణాలు సురక్షితంగా వున్నాయనీ..అవినీతి ఏమీ జరగటంలేదని పాలకమండలి స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ...

Monday, May 21, 2018 - 09:45

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు అండగా వుంటుందనే ఉద్శ్యేంతోనే టీడీపీకి తాను మద్ధతునిచ్చాననీ..అటు కేంద్రంలో కూడా ఏపీకి ప్రజలకు మంచి చేస్తుందనే ఆలోచనతో మోదీ ప్రభుత్వానికి తాను సపోర్ట్ చేశాననీ కానీ ఇద్దరు ప్రజలను మోసం చేసారనీ..ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రం దగా చేసిందనీ..ఈ విషయంలో రాష్ట్ర...

Monday, May 21, 2018 - 09:43

ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 80 రూపాలయలు దాటేసింది. డీజిల్ సైతం 73రూపాయలకు చేరుకుంది. పెట్రోరేట్ల పెరుగుదలతో .. నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని సామాన్యుడు ఆందోళన పడుతున్నాడు. ఎన్నో వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం పోట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తీసుకురాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి...

Sunday, May 20, 2018 - 07:43

కర్నాటక పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా.. దక్షిణాదిలోనూ జైత్రయాత్ర కొనసాగించాలని భావించిన బీజేపీకి.. గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దొడ్డిదారిలో కన్నడనాట అధికారాన్ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకొని.. ప్రొటెం స్పీకర్‌ ద్వారా.. మూజువాణీ ఓటుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. బలపరీక్షకు నిలవకుండానే యడ్యూరప్ప...

Saturday, May 19, 2018 - 18:31

కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. బల నిరూపణ కాకముందే శాసనసభలో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్..జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. జేడీఎస్..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కిందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్చించారు. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్ టివి నిర్వహించిన బిగ్...

Friday, May 18, 2018 - 09:31

కర్నాటకలో బీజేపీ అనైతిక చర్యకు పాల్పడిందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు ఎస్.వీరయ్య, కాంగ్రెస్ నేత క్రిశాంక్, బీజేపీ నేత కోటేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. కర్నాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. మ్యాజిక్ ఫిగర్ రాకున్నా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణీస్వకారం చేయడం...

Wednesday, May 16, 2018 - 09:10

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Tuesday, May 15, 2018 - 19:49

కర్ణాటక : కన్నడ పీఠం పార్టీల మధ్య కాకపుట్టిస్తోంది. అతి పెద్ద పార్టీగా అవతరించామని బీజేపీ గప్పాలు కొట్టుకుంటున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డా ఇంకా రాజకీయ వాతావరణం ఉత్కంఠగానే ఉంది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ.. మెజార్టీ రాకపోవడంతో... ప్రభుత్వ...

Tuesday, May 15, 2018 - 08:40

కర్నాటక ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Monday, May 14, 2018 - 19:36

పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 12మంది మృతి చెందారు. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఇద్దరు సీపీఎం కార్యకర్తలను సజీవదహనం చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకుగురి చేశారు. వారిని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. సీపీఎం కార్యకర్తలు దేబుదాస్‌, ఉషాదాస్‌లపై దాడిచేసిన టీఎంసీ గూండాలు ఇంట్లోనే...

Monday, May 14, 2018 - 08:23

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణనను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇటీవలే కన్నా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో రైతు బంధు కార్యక్రమం కొనసాగుతోంది. అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), చందూ సాంబశివరావు (టిడిపి), రమేష్ నాయుడు (బిజెపి), తెలకపల్లి రవి(విశ్లేషకులు)...

Sunday, May 13, 2018 - 08:08

కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగింది. కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇక్కడ జేడీఎస్ ప్రధాన పాత్ర పోషించనుందని పేర్కొన్నాయి. దీనితో జేడీఎస్ కాంగ్రెస్ కు మద్దతిస్తుందా ? లేక బిజెపికి మద్దతిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాలపై ప్రముఖంగా ఏపీపై ప్రభావం చూపుతుందా ? ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నాగుల...

Saturday, May 12, 2018 - 20:09

కర్ణాటక : ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా కర్ణాటక ఎన్నికలపైనే ఉంది. అంతగా ఆసక్తిరేపిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫలితాలు ఈ నెల 15న వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ అవుతుందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌...

Saturday, May 12, 2018 - 09:38

ఏపీ రాజకీయాలపై వక్తలు చర్చించారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, విశ్లేషకులు వినయ్ కుమార్, టీడీపీ నేత మన్నెం సుబ్బారావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Friday, May 11, 2018 - 07:29

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌లో ప్రారంభించారు. కానీ ఇక్కడ కౌలు రైతులకు మాత్రం 'సాయం' చెయ్యమని ఖరాఖండిగా చెప్పారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (విశ్లేషకులు), ఎస్ .రాం మోహన్ (టి.కాంగ్రెస్), సత్యనారాయణ గుప్తా (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు...

Thursday, May 10, 2018 - 21:19

రూపాయి పతనం ఎందుకవుతుంది..? రూపాయి పతనం వెనుక కారణాలేంటీ..? డాలర్ తో పోల్చితే రూపాయి విలువ తగ్గుతుంది.. ? ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయి పతనం కొత్తగా ప్రారంభం అయింది కాదని...గతం నుంచి ఉందన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ఎగుమతి.. దిగుమతులు, డిమాండ్, సప్లయ్ పై రూపాయి పతనం ఆదారపడి...

Thursday, May 10, 2018 - 21:09

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇవాళ కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌లో ప్రారంభించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి, టీఆర్ ఎస్ సీనియర్ నేత రాజమోహన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి పాల్గొని, మాట్లాడారు. రైతుబంధు పథకం...

Thursday, May 10, 2018 - 07:19

తెలంగాణలో.. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు బంధు కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. దీనికి రాష్ట్రమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. పట్టాలున్న సుమారు లక్షమంది రైతులకూ లబ్ది చేకూరనుంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), పున్నా కైలాష్ (కాంగ్రెస్), మన్నె గోవర్ధన్ రెడ్డి (టీఆర్ఎస్...

Wednesday, May 9, 2018 - 20:08

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై వక్తలు వాడీవేడి చర్చ చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss