న్యూస్ మార్నింగ్

Saturday, August 6, 2016 - 07:51

ఏపీ రాజకీయాలు ఢిల్లీలో మరింత వేడెక్కాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ అధికార ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈక్రమంలో ప్రత్యేక హోదా బిల్లును బీజేపీ మరోసారి కోల్డ్ స్టోరేజీలో పడేసింది. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును మనీ బిల్లు అంటూ ఆర్థికమంత్రి జైట్లీ శుక్రవారం రాజ్యసబలో అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ...

Friday, August 5, 2016 - 08:04

123 జీవో రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తీర్పును సవాల్‌ చేస్తూ పుల్‌ బెంచ్‌కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఇవాళ మరోసారి రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ అజెండాలో ఈ...

Thursday, August 4, 2016 - 07:55

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రభుత్వం తెచ్చిన 123 జీవోను హైకోర్టు రద్దుచేసింది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారమే భూములు సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎక్కడ భూ సేకరణ చేసినా ఇదే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. భూ సేకరణకు 2013 చట్టం ఉండగా..123 జీవోను ఎందుకు తెచ్చారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం...

Wednesday, August 3, 2016 - 08:59

ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు బుధవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జీఎస్టీ బిల్లు చర్చకు వచ్చే సందర్భంగా ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లు బుధవారం నాడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈనేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా...

Tuesday, August 2, 2016 - 20:35

దళితులపై దాడులు ఆపాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. దళితుల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను...

Tuesday, August 2, 2016 - 14:12

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీలో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వైసీపీ నేడు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు మద్దతునిచ్చాయి.
నగేష్ (సీనియర్ విశ్లేషకులు), శ్రీరాములు (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసీపీ) పాల్గొనిఅ భిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్...

Monday, August 1, 2016 - 07:57

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నంత హడావుడి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఎంపీల భేటీతో జరిగిన భేటీలో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటారని ప్రచారం జరిగినా... ఈ సాహసం చేయలేకపోయారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), రఘునాథ్ బాబు (బీజేపీ), పార్థసారధి (వైసీపీ), రామకృష్ణ...

Sunday, July 31, 2016 - 14:28

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని తేలిపోయిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏం చేయబోతున్నారు? ఆయన బిజెపితో స్నేహం కొనసాగిస్తారా? తెగదెంపులు చేసుకుంటారా? ఒకవేళ టిడిపి, బిజెపి చెలిమి చెదిరితే, లాభపడేదెవరు? ఇదే అంశంపై రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు.? ఈ నేపథ్యంలో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివి చర్చా వేదిక...

Saturday, July 30, 2016 - 08:55

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలలో ప్రధానమైనది ఏపీకి 'ప్రత్యేక హోదా' అంశం. గత రెండు సంవత్సరాల నుండి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా ఆశలపై ఎన్డీయే ప్రభుత్వం దాదాపు నీళ్లు చల్లినట్లుగా భావించే పరిస్థితులు శుక్రవారం రాజ్యసభ సభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చల్లో తేలిపోయింది. విభజన...

Friday, July 29, 2016 - 07:56

ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ తెలుగు రాష్ట్రాలలో వేడిని పుట్టిస్తోంది. పరీక్షలు రాసిన విద్యార్థులు..వారి తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తోంది. ఈ విషయంగా లీక్ జరగటం అనేది జరగలేదు..దాంట్లో వాస్తవం లేదని తెలంగాణ మంత్రువర్యులు సమర్థించుకున్నారు. విమర్శలు వెల్లువెత్తటంతో సీఐడీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎంసెట్‌-2 లీక్ అయినట్లుగా నిర్థారించింది. నిందితులు...

Thursday, July 28, 2016 - 07:54

ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాల లీక్ పై తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం రేపుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం విచారణలో పలు సంచలనాత్మక అంశాలు బయటపడ్డాయి. సుమారు రూ.50కోట్ల స్కామ్ బయటపడింది. ఈ నేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. కాగా సీఐడీ విచారణలో ఎంసెట్ 1 ప్రశ్నాపత్రాన్ని కూడా లీక్ చేసినట్లుగా...

Wednesday, July 27, 2016 - 07:32

తెలంగాణలో హాట్‌హాట్‌గా మారిన మల్లన్నసాగర్‌ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరుబాట పట్టాయి. ప్రాజెక్టు విషయంలో అధికార పార్టీ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఉద్యమాలు చేస్తున్న విపక్షాలను హెచ్చరికలు చేస్తూనే... క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరం చేసే యోచనలో ఉంది. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా గులాబీబాస్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై టెన్ టివిలో...

Tuesday, July 26, 2016 - 09:55

మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో దిహిందూ రిసెడెంట్ ఎడిటర్, విశ్లేషకుడు నగేష్, రైతు సంఘం నేత మల్లారెడ్డి, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బలవంతంగా భూములు సేకరించిడం సరికాదని చెప్పారు....

Monday, July 25, 2016 - 18:18

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఉద్యోగాల భరోసా ఏది? ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జాడ ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిర్వేదంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.హరగోపాల్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు)సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ)అద్దంకి దయాకర్ (కాంగ్రెస్ నేత) నారాయణ (యూటీఎఫ్ ) పాల్గొన్నారు. ఈ మెగా డిబేట్ లో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చారో...

Monday, July 25, 2016 - 12:04

మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం అప్రజాస్వామికమని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ నేత తాళ్లూరి శ్రీనివాస్, వైసీపీ నేత గౌతంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీడీపీ నేత సాంభశివరావు పాల్గొని, మాట్లాడారు. టీసర్కార్ నిరంకుశంగా పరిపాలన చేస్తుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతలా...

Saturday, July 23, 2016 - 07:43

ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన ప్రత్యేక బిల్లుకు మోక్షం లభించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ప్రధానమైన ప్రత్యేక హోదా కల ఈసారీ కూడా నెరవేరలేదు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ జరగకుండానే రాజ్యసభ శుక్రవారం నుండి సోమవారానికి వాయిదా పడింది. బిల్లును అడ్డుకున్నది మీరంటే మీరంటూ పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దీంతో ప్రత్యేక సెగలు.....

Friday, July 22, 2016 - 08:10

ఉమ్మడి రాష్ట్రంగా వున్న ఆంధ్రపదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు ప్యాకేజీలు,పలు హామీలను అప్పటి అధికారంలో వున్న యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ప్రధానమైనది ఏపీకి 'ప్రత్యేక హోదా'. విభజన జరిగి రెండు సంవత్సరాలు దాటింది. కానీ ప్రత్యేక హోదా అంశం అనేది హామీ ఇంతవరకూ నెరవేరలేదు. ఈ అంశంపై...

Thursday, July 21, 2016 - 12:22

ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 25 రోజులపాటు ఢిల్లీలోని ప్రముఖ నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి ఎటువంటి వాతావరణం వుంది? తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరి ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టటానికి...

Wednesday, July 20, 2016 - 07:57

పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టబోయే ప్యత్యేక బిల్లుకు టీడీపీ మద్ధతు ఇస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత అనేది లేదు. కారణం రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ అలంభించిన విధానాలను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ రాజకీయ స్వార్థం కోసం చేసిన బలవంతపు విభజన అంశంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా అంశాన్ని చట్టం చేయకుండా కేవలం...

Tuesday, July 19, 2016 - 19:15

అమరావతి రాజధానిని స్విస్ ఛాలెంజ్ ద్వారా నిర్మాణం చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు, నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీవీసీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. కౌంటర్ ప్రతిపాదనలకు 45 రోజులు గడువు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విదేశీ సంస్థలకు...

Tuesday, July 19, 2016 - 09:53

సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విభజన హామీలను నెరవేర్ఛాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రమంద్రి ఉమాభారతిని సీఎం కేసీఆర్ కోరారు. న్యాయాధికారుల ధర్నాలపై దేశ ఉన్నత న్యాయస్థానం ఏపీ..తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను...

Monday, July 18, 2016 - 08:52

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై టీసర్కార్ పునరాలోచన చేయాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత బి.వెంకట్, టీడీపీ నేత దినకర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత డిజైన్...

Sunday, July 17, 2016 - 19:03

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను గ్రీన్ సిటీగా త‌యారు చేయడమే ప్రధాన లక్ష్యమంటోంది బల్దియా. పోల్యూష‌న్‌ ఫ్రీ సిటీగా మార్చడానికి పౌరులంద‌రూ సహకరించాలని కోరుతోంది.. మెరుగైన సేవ‌లు అందించ‌డంకోసం టెక్నాల‌జీని విరివిగా ఉప‌యోగిస్తున్న కార్పొరేష‌న్... కొత్తగా 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా కమిషనర్ జనార్ధన్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ...

Saturday, July 16, 2016 - 09:42

అంతరాష్ట్ర మండలి సమావేశం చాలా కీలకమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత సమ్మారావు, సీపీఎం నేత వెంకట్, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. గతంలో కూడా అనేక సార్లు అంతారష్ట్ర మండలి సమావేశాలు జరిగాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలని...

Friday, July 15, 2016 - 08:53

ప్రస్తుత డిజైన్ లో 'మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం అవసరం లేదని... డిజైన్ ను మార్చాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో  టీడీపీ నేత విద్యాసాగర్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రస్తుత డిజైన్ ప్రకారం.. 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయని తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని...

Thursday, July 14, 2016 - 09:42

ప్రభుత్వ విద్యను రక్షించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత వకుళాభరణం కృష్ణా మోహన్, ఐద్వా నాయకురాలు రమాదేవి, బీజేపీ నేత ఆచారి పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం పడిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ఉపాధ్యాయులకు భోదనేతర విధులను రద్దు చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, July 13, 2016 - 08:35

ప్రజలకు అన్యాయం చేయకుండా భూ సమీకరణ చేయాలని వక్తలు కోరారు. 'ప్రాజెక్టులు.. భూ సమీకరణ' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీడీపీ నేత మాల్యాద్రి పాల్గొని, మాట్లాడారు. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భూమి సేకరించాలని సూచించారు. 2013 భూ సమీకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు న్యాయం జరుగుతోందని చెప్పారు. కార్పొరేట్...

Pages

Don't Miss