న్యూస్ మార్నింగ్

Saturday, February 17, 2018 - 07:46

విభజన హామీల అమలు రాజకీయలకు అతీతంగా ఉండాలని, అయితే దీనిపై ప్రజలను రెండు ప్రభుత్వాలు గందరగోళానికి గురి చేస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్ అన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ఒకే మాట మాట్లాడుతుందని, ఇప్పటికే 12 వేల కోట్లు ఇచ్చామని, మరో 10 వేల కోట్లు ఇస్తామని సభలో ప్రకటించామని బీజేపీ నేత శ్రీధర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Friday, February 16, 2018 - 21:46

జేఎఫ్ సీ తేల్చబోయే నిజాలేంటీ ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విభజన చట్టం హామీలు, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్ రావు, టీడీపీ నేత మాణిక్యవరప్రసాద్, వైసీపీ కొణిజేటీ రోశయ్య పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Friday, February 16, 2018 - 08:07

ఏపీలో విభజన హామీల వేడి కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు..ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ తొలి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో...

Thursday, February 15, 2018 - 08:05

ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు కోసం వివిధ రాజకీయ పార్టీలు నాలుగేళ్ల తరువాత గళమెత్తుతున్నాయి. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ ప్రకటనతో టిడిపి అప్రమత్తమయ్యింది. వైసీపీ పార్టీపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మొదటి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు మరింత పోరాటాలు ఉధృతం చేయాలని...

Wednesday, February 14, 2018 - 07:30

విభజన హామీలు..ప్రత్యేక హోదా కోసం వైసీపీ కీలక నిర్ణయం వెలువరించింది. పార్టీకి సంబంధించిన ఎంపీలతో రాజీనామా చేయిస్తామని జగన్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగేళ్లు అయిన పోయిన అనంతరం విభజన హామీలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి. కేంద్రం నిధులు ఇచ్చిందని..ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియచేయాలని బిజెపి పేర్కొంటోంది..కానీ నిధులు అంతగా రాలేదని టిడిపి పేర్కొంటుండడంతో...

Tuesday, February 13, 2018 - 07:56

దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్‌ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్‌ సర్కార్‌ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజ్ మోహన్...

Monday, February 12, 2018 - 19:47

విభజన చట్టం హామీల రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం..ప్రధానపక్షం మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. ఏపీకి చాలా నిధులు ఇచ్చామని బీజేపీ పేర్కొంటుండగా బీజేపీ లెక్క‌ల‌న్నీ త‌ప్పేనని టీడీపీ పేర్కొంటోంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసి లెక్క తేలేందుకు..నిజాలు బయటకు చెప్పేందుకు జేఎఫ్ సీని ఏర్పాటు చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో...

Monday, February 12, 2018 - 07:51

బీజేపీ అధ్యక్షుడు కొన్ని లెక్కలు చెప్పారని, గల్లా జయదేవ్ కొన్ని లెక్కలు చెప్పారని, కానీ నాలుగేళ్ల పాటు ఈ లెక్కలు ఎక్కడికి వెళ్లాయని, టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని సపోర్ట్ చేశాయని, రాకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఏపీ ప్రజలకు జవాబు చెప్పె బాధ్యత తెలుగు దేశం ప్రభుత్వానికి ఉందని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజల కోసమే బీజేపీతో కొనసాగుతుందని,...

Sunday, February 11, 2018 - 09:35

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత మన్ను సుబ్బారావు, వైసీపీ నేత మండల హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, February 10, 2018 - 09:44

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత పట్టాభీరామ్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన హామీ ఇవ్వాలని తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు....

Friday, February 9, 2018 - 07:30

బీజేపీ ఎన్నికలకు ముందు వాగ్ధానాలు చేసి తర్వాత మొండిచేయి చూపిస్తుందని నేతలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమలో విశ్లేషకులు, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, టీడీపీ నేత చందూసాంబశివరావు, బీజేపీ నేత కోటేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. బీజేపీకి మాట తప్పడం సహజ లక్షణం, అలవాటని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా చట్టబద్ధమైన అంశం అని అన్నారు. టీడీపీ కేంద్రంపై పోరాడాలని...

Thursday, February 8, 2018 - 10:43

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వంచిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో లోక్ సత్తా నేత శ్రీనివాస్, కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి న్యాయం చేయాలన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో...

Wednesday, February 7, 2018 - 19:49

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం..దీనిపై భారత ప్రధాన మంత్రి బుధవారం లోక్ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విభజన సమయంలో తప్పు మొత్తం కాంగ్రెస్ దేనని చెప్పుకొచ్చారు. కానీ ఏపీకి భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం ఉండకపోవడం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి స్టూడియో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ...

Wednesday, February 7, 2018 - 13:09

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం, కేంద్రప్రభుత్వం.. విభజన హామీలు అనే అంశాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో టీడీపీ నేత దినకర్, వైసీపీ నేత మధన్ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Tuesday, February 6, 2018 - 19:34

ప్రేమలు కరవవుతున్నాయి.... బంధాలు భారమవుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కిరాతకులుగా మారుతున్నారు. కన్నపేగు ప్రేమను మరచి తమలోని కర్కశత్వాన్నిబయటపెడుతున్నారు. ఇటీవల విశ్వనగరంలో వెలుగు చూసిన హృదయవిదార ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఇంతకు ఎందుకీ అప్యాయతలు గాడితప్పుతున్నాయి... పైశాచిక హత్యలు పెరిగిపోటానికి కారణమేంటి... రోజురోజుకు పెరుగుతున్న బలవన్మరణాలను...

Tuesday, February 6, 2018 - 08:21

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఏపీని బీజేపీ, టీడీపీలు మోసగించాయని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం సుబ్బారావు, సీపీఎం నేత మురళీకృష్ణ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, February 5, 2018 - 21:37

తెలంగాణలో త్వరలో రాబోయే మరో కొత్త రాజకీయ పార్టీపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఎల్ ఎఫ్ కో కన్వీనర్...

Monday, February 5, 2018 - 07:53

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, టీఆర్ఎస్ ఏర్పాడిన నుంచి ఎన్నో పార్టీలు వచ్చి వెళ్లాయని, విద్యార్థి జేఏసీ మొదట ఓయూలో మొదలైందని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితిల్లో కోదండరాం కొత్త పార్టీ పెడుతున్నట్టు తెలుస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫెలయ్యాయని, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చని కానీ ఆ పార్టీ మనుగడ ఎలా ఉంటుందో ఆలోచించాలని టీడీపీ...

Sunday, February 4, 2018 - 21:02

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఏపీపై కేంద్రం అలసత్వం ప్రదర్శించడంతోపాటు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 'బడ్జెట్ లో ఏపీకి అన్యాయం.. కేంద్రప్రభుత్వం తీరుపై టీడీపీ ప్రభుత్వం వైఖరి ఏంటీ? అనే అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బాబూ...

Sunday, February 4, 2018 - 08:03

నాలుగు సవంత్సరాల బడ్జెట్ చూస్తే ఏపీ వారు అలుసుగా తీసుకున్నారని, రైల్వే జోన్ ఇస్తామన్నారు, విద్యసంస్థలు ఇస్తామన్నారు, కానీ ఎటువంటి హామీలు కూడా కేంద్ర అమలు చేయండం లేదని, బీజేపీకి రాష్ట్రం పట్ల ప్రేమ లేదని ఇప్పటికైన టీడీపీ మెల్కోనాలని సీపీఎం నేత గఫూర్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేశాయని ఆ సందర్భంగా ప్రజలకు వారు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ...

Saturday, February 3, 2018 - 07:39

కేంద్రబడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అటు విపక్షాలతోపాటు ... ఇటు ప్రభుత్వంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిత్రపక్షమంటూ మౌనంగా ఉంటుంటే... రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్న జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలోనూ.... కేబినెట్‌ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వచ్చింది. ఈ అంశంపై టెన్ టివి చర్చ చేపట్టింది. విజయవాడ స్టూడియోలో రమేష్ (వైసీపీ), పట్టాభిరామ్ (...

Friday, February 2, 2018 - 07:38

కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందంటున్నారు అన్ని పక్షాల నేతలు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో కొంతమేర అయినా న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రభుత్వాలకు నిరాశే ఎదురైంది. అయితే.. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి ఇచ్చింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో వీరయ్య (విశ్లేషకులు), నరేష్ (బిజెపి) పాల్గొని అభిప్రాయం...

Thursday, February 1, 2018 - 14:53

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని వక్తలు అన్నారు. ఇవాళ బడ్జెట్ 2018 ను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యాక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు,  విశ్లేషకులు నాగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు బెల్యా నాయక్, మనోహర్ రావు పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదన్నారు. బడ్జెట్...

Thursday, February 1, 2018 - 13:16

పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ 2018-19 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, తమ పాలనలో నిజాయితీ, పారదర్శక విధానాలతో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ సంస్కరణలతో వృద్ధి రేటు పెరిగిందని, మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయన్నారు. తొలి మూడేళ్లలో సగటున 7.5 శాతం వృద్ధి చెందిందని తెలిపారు...

Thursday, February 1, 2018 - 08:07

నేడు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 11గంటలకు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 9గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుండి రాష్ట్రపతి భవన్ కు జైట్లీ వెళ్లనున్నారు. 10.15 నిమిషాలకు పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 1.30కి రాజ్యసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను టేబుల్ చేయనున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా...

Wednesday, January 31, 2018 - 18:26

చంద్రగ్రహణంపై అపోహలు ఉండవద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధి బీఎన్ రెడ్డి, జేవీవీ ప్రతినిధి రమేష్, మనోహర్, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, ప్రొ.వెంకటేశ్వరరావు, సైక్రియాటిస్టు వీరేంద్రనాథ్, ప్రొ.రాంచంద్రయ్య పాల్గొని, మాట్లాడారు. చంద్రగ్రహణం చూడడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవన్నారు. ఎలాంటి నష్టం, ముప్పు వాటిల్లదని చెప్పారు. మరిన్ని...

Wednesday, January 31, 2018 - 07:35

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. స్పిల్‌వే కాంట్రాక్టు పనులను నవయుగకు అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పిల్‌వే కాంక్రీట్, స్పిల్‌వే చానల్ పనులను ఇక నవయుగ సంస్థే చేపట్టనుంది. పాత ధరలకే ఈ పనులను చేయనుంది. ఢిల్లీలో ఏపీ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై విజయవాడ...

Pages

Don't Miss