న్యూస్ మార్నింగ్

Tuesday, December 8, 2015 - 07:33

హైదరాబాద్ : విజయవాడ కృష్ణలంకలో సోమవారం జరిగిన ఘటనతో కల్తీ మద్యం విక్రయాలు వెలుగులోకి వచ్చినా... చాటుమాటుగా ఇలాంటి చీకటి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవకతవకలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోర్టు మెట్లు ఎక్కనున్నారు?కారణాలు ఏమిటి? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ...

Monday, December 7, 2015 - 21:45

విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనకు ఎపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నాయకురాలు రమాదేవి, వైసిపి నేత అంబటి రాంబాబు, టిడిపి నేత రాజేంద్రప్రసాద్, బిజెపివైఎం నేత విష్ణువర్దన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కృష్ణలంక ఘటన దురదృష్టకరమన్నారు. మృతులకు తక్షణం నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కొల్లు...

Monday, December 7, 2015 - 08:01

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై బిజెపి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని వామపక్ష పార్టీలు నేడు పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపట్టబోతున్నాయి. ప్రత్యేక హోదా వస్తుందని చెప్తున్న మాటలకు విశ్వసనీయత ఉంటుందా? రైతులకు...

Saturday, December 5, 2015 - 18:34

దివంగత సీఎం వైఎస్ ముఖ్య అనుచరుడు...గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ స్వరం వినిపిస్తున్నారు. అవినీతిపైన...ప్రభుత్వంపైన పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో పాలన భయంకరంగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఉండవల్లితో టెన్ టివి ముచ్చటించింది. జై సమైక్యాంధ్ర పార్టీ...ప్రత్యేక హోదా…క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశం తదితర అంశాలపై ఆయన...

Saturday, December 5, 2015 - 09:44

రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేయడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. 'రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అప్పగించనుంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ కు అప్పగించే యోచనలో ఉంది'. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, ఎపి కాంగ్రెస్ నేత తులసీరెడ్డి, టిడిపి నేత...

Friday, December 4, 2015 - 09:42

పార్టీ పిరాయింపులు సరికాదని వక్తలు సూచించారు. 'టిఆర్ ఎస్ లోకి వలసల జోరు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, వైసిపి నేత మధుమోహన్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్ మాదిగ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్ ఎస్ లోకి వలసలు పెరిగాయనడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అభివృద్ధి...

Thursday, December 3, 2015 - 19:31

హైదరాబాద్ : నీతి లేదు. రీతి లేదు. ప్రజాతీర్పుకు విలువే లేదు. అధికారమే పరమావధి. పదవులే తాయిలం. ఏళ్లకు ఏళ్లుగా పార్టీలో పాతుకుపోయినా...కొన్నాళ్లు, కొన్నేళ్లు పవర్‌లో చేతిలో లేకపోతే ఉండలేకపోతున్నారు నేతలు. గోడ దూకి విపక్షం నుంచి అధికారపక్షానికి జంపవుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు తారాస్థాయికి చేరాయి.

తెలుగు...

Thursday, December 3, 2015 - 07:58

గుజరాత్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ చేదు ఫలితాలు చవి చూసింది. బీజేపీ గెలుపు పట్టణాల వరకే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో అది తుడిచిపెట్టుకపోయింది. పల్లెపట్టుల్లో కాంగ్రెస్ ముందంజ వేసింది. మరోవైపు ఆనం సోదరులు టిడిపి పార్టీలో చేరారు. రౌడీ పార్టీలో చేరమని పేర్కొంటూ వైసీపీపై పలు విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలపై ఇంకా దుమారం రేగుతోంది. ఈ అంశాలపై...

Wednesday, December 2, 2015 - 07:52

సర్కారు వైద్యం ఇక ప్రైవేట్ పరం కానుంది. నిర్వాహణ బాధ్యతలనూ ప్రైవేటు సంస్థలే చేపట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ నేత రాజాసింగ్ పార్టీ అధ్యక్షుడి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ ఒకటో తేదీ వరకు ఉద్యోగులందరూ కొత్త రాజధాని ప్రాంతానికి...

Tuesday, December 1, 2015 - 20:00

హైదరాబాద్ : డిసెంబర్‌ 10న ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని తలపెట్టాయి ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌తో పాటు దళిత విద్యార్థి సంఘాలు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్,టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలను ఆహ్వానించాయి. అయితే ఇదే సమయంలో ఆరెస్సెస్, వీహెచ్‌పీ అనుబంధ సంఘాలు బీఫ్‌ ఫెస్టివల్‌పై...

Tuesday, December 1, 2015 - 08:53

ప్రజల మధ్య అనైక్యత కలిగించే విధంగా ఎన్ డిఎ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వక్తలు తెలిపారు. 'పార్లమెంట్ సమావేశాలు... అసహనంపై చర్చ' అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బాబురావు, బీజేపీ నేత ప్రేమేందర్, టీడీపీ నేత విజయ్ కుమార్, వైసిపి నేత కరణం ధర్మశ్రీ పాల్గొని, మాట్లాడారు. జిజెపి నేతలు మత అసహనాన్ని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని...

Monday, November 30, 2015 - 08:45

ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగడం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు నగేష్ కుమార్, టిఆర్ ఎస్ నేత రాకేష్, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రతీ ఎన్నికల్లో డబ్బు ప్రధానమైనదిగా కనిస్తుందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే పోరాడటానికి అవకాశం...

Saturday, November 28, 2015 - 07:57

హైదరాబాద్ : పార్లమెంట్‌లో రాజ్యాంగంపై నిర్వహించిన చర్చను మతంపై మళ్లించారని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆరోపించారు. వంద ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఎలా, ఉండబోతుందో ఊహించి రాజ్యాంగాన్ని రచించారని అంబేద్కర్‌ను ప్రధాని కొనియాడారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగ భావనను ప్రజల్లోకి విస్తృతంగా...

Friday, November 27, 2015 - 07:59

హైదరాబాద్ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. సామాజిక ధర్మం గురించి చర్చ చేయకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడటం అంటే మరళా దేశ చరిత్రను వెనక్కు నడిపిస్తున్నట్లే అని న్యూస్ మార్నింగ్ చర్చలో సీనిరయర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నుద్దేశించి కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు...

Thursday, November 26, 2015 - 19:40

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం - కట్టుబాట్లపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. కానీ కోట్లాది ప్రజల అభ్యున్నతిని కాక్షించినా ఆ స్వప్నం కలగానే ఉంది. ఆరు దశాబ్దాల తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. అసమానతలు అదే రీతిలో రాజ్యమేలుతూనే ఉన్నాయి. అన్యాయాలు వెక్కిరిస్తూనే...

Thursday, November 26, 2015 - 07:56

హైదరాబాద్ : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు మొదలు పెడితే యుద్ధమే వస్తుందని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. బాక్సైట్ తవ్వకాలను నిలిపేస్తున్నామన్న చంద్రబాబు ఆ మాటకు కట్టబడతాడా? బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడా? వ్యతిరేకత వచ్చిన తరువాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పడం వెనుక అర్థం ఏమిటి? అసహనం పేరుతో ఎన్డీయే ని...

Wednesday, November 25, 2015 - 07:59

వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి పసునూరి దయాకర్ రావు గెలుపొందారు. ఈసందర్భంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు అసహనంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. బీజేపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి. వెంకట్ (సీపీఎం),...

Tuesday, November 24, 2015 - 08:01

హైదరాబాద్ : నేడు వరంగల్ పార్లమెంట్ సీటు ఎవరిదో తేలిపోనుంది. అయితే ఈ ఎన్నిక టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రిఫరెండమ్ కాదని... పెరా మీటరే అని 'న్యూస్ మార్నింగ్' చర్చలో నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పనున్నారా? ప్రతి ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందా? విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం జాగ్రత్తగా...

Monday, November 23, 2015 - 07:52

ఏపీ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. దీని భారం అంచనా రూ.5,629 కోట్లు. ఈ మేరకు 2016-17 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలపై డిస్కమ్ లు కసరత్తు పూర్తి చేశాయి. ఈ నెల 24న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ట్రాన్స్ కో, డిస్కమ్ ల ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. మరోకవైపు ఎర్రచందనం స్మగ్లర్...

Sunday, November 22, 2015 - 12:26

రాయలసీమను రతనాల సీమ అంటారు. రాయల సీమను రాళ్ల సీమ అని కూడా అంటారు. రాయలసీమలో ఖనిజ సంపద కోసం దేశం అంతా చర్చిస్తుంది. అలాగే రాయలసీమలో కరవుపై దేశమంతటా మాట్లాడుకొంటోంది. శ్రీ బాగ్ ఒప్పందం నుండి మొన్నటి ఏపీ పునర్ విభజన చట్టం వరకు అడుగడుగునా పాలకుల హామీలు వైఫల్యాల చరిత్ర అని ఇక్కడి ప్రజల్లో బాగా నాటుకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని భావించాం...

Saturday, November 21, 2015 - 07:46

తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని ప్రభుత్వం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం...

Friday, November 20, 2015 - 08:00

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో మావోయిస్టులు టిఆర్ ఎస్ నేతలను కిడ్నాప్ చేశారు. ఎన్ కౌంటర్ల కు ప్రతిగా కిడ్నాప్ చేయడం సమంజసమేనా? మావోయిస్టులు చేసిన చర్యలు పునరాలోచించుకోవాలి అని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కిడ్నాప్ లు పరిష్కారం కాదు. ఎన్ కౌంటర్ల పై టిఆర్ ఎస్ పద్ధతి మార్చుకోక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు పురావృతం అవుతున్నాయా? శృతి,...

Thursday, November 19, 2015 - 09:38

సీఎం కేసీఆర్ రాజకీయ దిగజారుడు మాటలు మానుకోవాలని వక్తలు సూచించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, టీటీడీపీ నేత విద్యాసాగర్, టీకాంగ్రెస్ నేత మల్లురవి, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత.. తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. నేతలు వ్యక్తి గత విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరవు ప్రాంతాల నివేదికలు...

Wednesday, November 18, 2015 - 07:56

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర మేయర్ అనురాధ దంపతులపై దుండగులు కత్తులు..తుపాకులతో దాడి చేశారు. దీనితో అక్కడికక్కడనే అనురాధ మృతి చెందగా ఆసుపత్రిలో అనురాధ భర్త కన్నుమూశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో 144 సెక్షన్ అమలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ...

Tuesday, November 17, 2015 - 09:40

తెలంగాణలో టీ.ప్రభుత్వం అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని వక్తలు ఆరోపించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసిపి అధికార ప్రతినిధి మధన్ మోహన్ రెడ్డి, టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. మరిన్ని వివరాలను...

Monday, November 16, 2015 - 09:52

ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పారదర్శకంగా విచారిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లిరవి, టిడిపి నేత సూర్యప్రకాశ్, బిజెపి నాయకురాలు పాదూరి కరుణ, టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమర్రి నర్సింహ, వైసిపి నేత కరణం ధర్మశ్రీ పాల్గొని, మాట్లాడారు. గంగిరెడ్డి అరెస్టును...

Pages

Don't Miss