న్యూస్ మార్నింగ్

Thursday, April 19, 2018 - 10:39

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు దుర్మార్గమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత క్రిషాన్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు పెరిగాయని అన్నారు. రేపిస్టులకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు...

Wednesday, April 18, 2018 - 14:38

దేశంలో నగదు కొరత పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని వక్తలు అన్నారు. నగదు కొరతపై అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Tuesday, April 17, 2018 - 21:27

హైకోర్టులో కేసీఆర్‌ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దును కోర్టు కొట్టేసింది.  ఇద్దరి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, అడ్వకేట్ వి.ఆర్ మాచవరం పాల్గొని,...

Tuesday, April 17, 2018 - 08:22

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాలు.. వందలాది మంది సాక్షుల విచారణ.. అయినా తేలని దోషులు. సుదీర్ఘకాలం సాగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులుగా బటయపడ్డారు. 10 మంది నిందితుల్లో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ సాక్ష్యాలు సేకరించలేక పోయింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్‌కోర్టు తీర్పు వెలువరించింది. కాగా...

Monday, April 16, 2018 - 21:42

కథువా ఘటన ఏం సూచిస్తుంది ? మతోన్మాదానికి ఇంత వికృత రూపం ఉంటుందా ? రేపిస్ట్ మనవాడైతే మహిళలు కూడా మద్దతు పలకొచ్చా ? మతోన్మాదం వెర్రితలలు.. అనే అంశంపై వీక్షణం...వేణుగోపాల్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'అత్యాచారం, హత్య క్రూరమైన నేరం. మనుషులున్నా దేశమేనా అన్న అనుమానం కల్గుతుంది. మతోన్మాదం అథమస్థాయికి దిగజారింది. హిందూ మతోన్మాదం...

Sunday, April 15, 2018 - 12:51

ఆంధ్రప్రదేశ్ కాస్తా సమరాంధ్రగా మారిపోయింది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ వివిధ పార్టీలు రోడెక్కుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు పెల్లుబికుతున్నాయి. పార్లమెంట్ లో బీజేపీ అనుసరించిన నిరసనకు తీరుగా ప్రత్యేక హోదా సాధన సమితి, జనసేన, వామపక్షాలు 16వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), రఘునాథ్...

Saturday, April 14, 2018 - 08:12

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై అడుగులు వేస్తున్నారు. బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో భేటీ అయ్యారు. మరొకవైపు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఏపీ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై కాకుండా తదితర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), ఇందిర శోభన్ (టి.కాంగ్రెస్), విష్ణు శ్రీ (బిజెపి), మన్నె గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్)...

Friday, April 13, 2018 - 20:24

తెలుగు రాష్ట్రాలలో నో క్యాష్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఏ బ్యాంక్ కు వెళ్లినా, ఏ ఏటీఎంకు వెళ్లినా..నో క్యాష్ బోర్టులు దర్శమిస్తున్నాయి. ఆర్బీఐ నుండి రూ.2వేల నోట్లు ఆగిపోయాయని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎం సెంటర్లు మూత పడిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కష్టాలు సామాన్యులను వెంటాడుతున్నాయి. దీంతో సామాన్యులంతా నగదు కోసం పలు ఇబ్బందులు...

Friday, April 13, 2018 - 07:32

ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇంకా సెగలు పుట్టిస్తోంది. హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని...

Thursday, April 12, 2018 - 20:07

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ , ఆయన సోదరుడు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ తో పాటు సోదరుడు అతుల్ సెంగార్ ను కూడా సోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై ప్రభుత్వం సిట్ దర్యాప్తు కు ఆదేశించింది. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపలేరని ఉన్నావ్...

Thursday, April 12, 2018 - 07:32

పార్లమెంట్ లో విపక్షాలు వైఖరిని నిరసిస్తూ ప్రధాన మంత్రి ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. బీజేపీ చేపడుతున్న ఈ దీక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ లో కేంద్రం సరియైన విధంగా వ్యవహరించలేదని, కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేసిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలపై టెన్...

Wednesday, April 11, 2018 - 21:59

దేశంలో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా మోదీ ఒకరోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. మోదీతో పాటు బీజేపీ ఎంపీల దీక్ష చేపట్టనున్నారు. పార్లమెంటును ప్రతిపక్షాలు స్థంభింపచేయడంపై నిరసన. దేశంలో మార్పు కోసం నిర్ణయాలు తీసకుంటుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ బీజేపీ ఆరోపణ. మోడీ దీక్షపై ప్రతిపక్షాలు గరంగరం. పార్లమెంట్ సాక్షిగా చట్టాలను కాలరాసి...దీక్షంటూ నాటకమాడుతున్నారని విమర్శ. ఇప్పటి వరకు...

Wednesday, April 11, 2018 - 21:12

మళ్లీ మొదటికి వచ్చిన అగ్రిగోల్డ్‌ కేసు. ఆస్తులు కొనుగోలు చేస్తానని ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్న జీఎస్సెల్‌ గ్రూప్‌. నిరాశలో 30 లక్షల మంది బాధితులు. అగ్రిగోల్డ్‌ ఆస్తులకన్నా నాలుగింతల అప్పులు ఉన్నాయన్న జీఎస్సెల్‌ గ్రూప్‌. రాజకీయ దురుద్దేశంతో జాప్యం చేస్తున్నారంటున్న బాధితులు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌. కోర్టు సూచనల మేరకే వ్యవహరిస్తామంటున్న ప్రభుత్వం. శ్రీకాకుళం...

Wednesday, April 11, 2018 - 07:31

తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్ర ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. 15వ ఆర్థికసంఘం సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులు మండిపడ్డారు. కలిసి పోరాడుదాం అన్న కేరళ ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, కర్నాటక రాష్ర్టాల మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉపవాస దీక్ష చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై టెన్ టివి ప్రత్యేక చర్చలో...

Tuesday, April 10, 2018 - 21:07

రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలకు సంబంధి అన్ని పార్టీలు పోరాటబాట పట్టాయి. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రత్యేకహోదా సాధించాలనే కాంక్ష బలంగా ఉండటం పార్టీలన్నీ గుర్తించాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ కేంద్రంగా అటు టీడీపీ, ఇటు వైసీపీలు చేసేటటువంటి పోరాటం, రాష్ట్ర ప్రయోజనాలా, రాజకీయ ప్రయోజనాలా, ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తిమాట అనుకుండా ఉద్యమం...

Tuesday, April 10, 2018 - 20:43

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా..? ఇక దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయా..? ఇక కేంద్రం దిగిరాక తప్పదా..? ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా ? నిధులన్నింటినీ పందేరం చేస్తుందా ఉత్తరాదికి, తిరువనంతపురంలో జరుగుతున్న ఆర్థిక మంత్రుల సమావేశం ఎలాంటి సంకేతాలు పంపింది. 15 వ ఆర్థిక సంఘం సిపార్సులపై దక్షిణాది...

Tuesday, April 10, 2018 - 07:58

హైదరాబాద్ : 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా పరిణమించనుందా? . సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదశలో... 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు-దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు.. మంగళవారం కేరళలో కీలక సమావేశం జరగబోతోంది. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను...

Monday, April 9, 2018 - 19:46

మోది ప్రభుత్వంపై మిత్ర పక్షాల నుంచే తిరుగుబాటు మొదలైంది. సంకీర్ణ ధర్మాన్ని పాటించకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారని...తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా బీజేపీ నేతలే మోదీపైనా.. సొంతపార్టీపైనా విమర్శలు ఎక్కుపెట్టడం చెప్పుకోదగ్గ పరిణామమే. సొంతపార్టీ కుంపట్లు ఇలాగే రగులుతూ పోతే.. 2019 ఎన్నికలు.. బీజేపీకి ఎదురీతే అవుతాయని విశ్లేషకులు...

Monday, April 9, 2018 - 10:54

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని..వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, జనసేన నేత అద్దెపల్లి శ్రీధర్, వైసీపీ నేత రోశయ్య పాల్గొని, మాట్లాడారు. కేంద్ర తన మొండి వైఖరి విడనాడి ప్రత్యేక హోదా ఇవ్వాలని......

Sunday, April 8, 2018 - 20:45

సురేష్ రెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2004లో 12వ శాసనసభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ? టి.కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది ? తదితర విషయాలు తెలుసుకోనేందుకు మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్...

Sunday, April 8, 2018 - 08:47

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వక్తలు అన్నారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, అవిశ్వాస తీర్మానాలు, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న విధానం సరికాదన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సీహెచ్.బాబూరావు, వైసీపీ నేత మన్నెం సుబ్బారావు, టీడీపీ నేత మండల హనుమంతరావు పాల్గొని,...

Saturday, April 7, 2018 - 20:45

ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెట్రోల్..డీజిల్ ధరలు చేరుకుంటున్నాయి. విపరీతమైన పన్నులు బాదుతూ క్రూడాయిల్ ధరలను పాలకులు సాకుగా చూపుతున్నారు. పెట్రో ధరల ప్రభావంతో నిత్యావసర ధరలు..రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొని శశికుమార్ (ఆర్థిక నిపుణులు), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్),...

Saturday, April 7, 2018 - 08:43

పార్లమెంట్ సమావేశాలు నిర్వహణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని...నియంతృత్వ దోరణిలో జరిగాయని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, టీడీపీ నేత శ్రీరాములు పాల్గొని, మాట్లాడారు. సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరిపేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు.. స్పీకర్, చైర్మన్ సభను వాయిదా వేద్దామనే ఆలోచనలోనే...

Friday, April 6, 2018 - 09:40

టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత లాల్ వజీర్, వైసీపీ నేత రాజశేఖర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Thursday, April 5, 2018 - 21:44

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న యోచనను విరమించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Pages

Don't Miss