న్యూస్ మార్నింగ్

Saturday, May 20, 2017 - 07:19

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులు గొప్ప పోలీసులా...పోలీసులు సాధారణ ప్రజల పట్ల ఎలా ఉన్నారో అనేది ముఖ్యమని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న ప్రముఖ విశ్లేషకులు వినయ్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి అన్నారు. 

Friday, May 19, 2017 - 07:36

చర్చల ద్వారా సమస్యలను పరిష్కారించాలని, విజ్ఞాతతో ప్రపంచం నుంచి మద్దతు తీసుకోవాలని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీనియర్ విశ్లేషకులు నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రాతను బీజేపీ కాపాడుతోందని బీజేపీ నేత కట్రాగడ్డ ప్రసన్న అన్నారు. మోడీ మూడేళ్ల పాలన అనుకున్న స్థాయిలో లేదని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏడాదికి 2కోట్ల మందికి ఉపాధి ఇస్తామని...

Thursday, May 18, 2017 - 09:17

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం కింద రూ.259 కోట్లు బకాయిలు, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, రాయలసీమలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత గఫూర్, ద హిందు మాజీ అసిస్టెంట్ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ నేత రామ శర్మ అన్నారు. అనంతపురంలో కరవు మామూలే అని టీడీపీ నేత విజయ్ కుమార్  అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, May 17, 2017 - 07:33

హైదరాబాద్ : ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నారని, నిజాం వరుసుడిలా సీఎం వ్యవరిస్తున్నారని, నిరసన తెలపడం ప్రజల హక్కు ఉందని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న న్యూడెక్రసీ నేత గోవర్దన్, కాంగ్రెస్ నేత రజనీష్ గౌడ్, బీజేపీ నేత ఆచారి అన్నారు. ధర్నా చౌక్ పెద్ద సమస్య కాదని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Tuesday, May 16, 2017 - 20:04

ఇందిరాపార్కు వద్ద సోమవారం నాడు లాఠీఛార్జీని నిరసిస్తూ సీపీఎం ఆందోళన చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సర్కార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. లాఠీఛార్జీ చేయడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఎం.శ్రీనివాస్ (సీపీఎం నగర కార్యదర్శి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), విద్యాసాగర్ (టిడిపి), మల్లు రవి (కాంగ్రెస్)...

Tuesday, May 16, 2017 - 08:41

హైదరాబాద్ : గత 15 ఏళ్లగా ధర్నా చౌక్ నడుస్తోందని, ప్రజల గొంతు వినబడకుండా ప్రభుత్వం చేస్తోందని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత దారుణంగా జగలేదని ఇందిరా అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, May 15, 2017 - 19:51

అఖిలపక్షం చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ విజయవంతమైంది. ప్రభుత్వ కుట్రను భగ్నంచేసిన ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు నిరసన ద్వారా తమ వాదనను గట్టిగా వినిపించారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసినా... వెనకడుగు వేయక అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. స్థానికుల ముసుగులో గులాబీనేతలు, పోలీసులు చేసిన హంగామా వీడియో ఫుటేజ్‌ ద్వారా బయటపెట్టారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో...

Monday, May 15, 2017 - 08:55

ధర్నా చౌక్ సామాన్యుల పోరాట స్ఫూర్తి అని, ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని టెన్ టివిలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ చర్చలో విశ్లేషకులు తెలపల్లి రవి, టీడీపీ నేత దుర్గాప్రసాద్, వైసీపీ నేత ధర్మశ్రీ, టీఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Saturday, May 13, 2017 - 10:47

హైదరాబాద్: ధర్నా చౌక్‌ను తరలించొద్దంటూ తెలంగాణలో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఏకమైన ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో 28 రోజులుగా నిరసనదీక్షలు చేస్తున్న పలువురు నేతలు.. శుక్రవారం మౌనదీక్ష చేపట్టారు. 15వ తేదీన ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశం పై 'న్యూస్...

Friday, May 12, 2017 - 09:10

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను టెర్రరిస్టులుగా చూస్తోంది. వారిని జైళ్లలో వేయడమే కాదు.. వారి హక్కులనూ దారుణంగా కాలరాస్తోంది. అన్నదాతల చేతులకు సంకెళ్లు వేసి మరీ వేధిస్తోంది. అవును, ఖమ్మం జిల్లాలో మిర్చిరైతులను పోలీసులు టెర్రరిస్టుల మాదిరిగానే పరిగణించారు. వారి చేతులకు బేడీలు వేసి మరీ కోర్టుకు హాజరుపరిచారు. ప్రజాసంఘాలు...

Thursday, May 11, 2017 - 07:15

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి.. ఎన్డీయేలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే.. ప్రతిపక్షమైన వైసీపీ ఇప్పుడు ఎన్డీయేతో సన్నిహితం మెలిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా...

Wednesday, May 10, 2017 - 08:48

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాల్లో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు గురవుతున్నారు. ఈరోజు మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎందుకు అలా జరుగుతున్నాయి? సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడిపల్లి సీతారామరాజు, టిడిపి నేత చెందూ సాంబశివరావు, సీపీఎం నేత కె.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పూర్తి...

Tuesday, May 9, 2017 - 08:48

హైదరాబాద్: టిటిడి కార్యనిర్వహణాధికారిగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నియమాకం వివాదాస్పదంగా మారుతోంది. ఉత్తరాదికి చెందిన సింఘాల్‌ను ఈఓగా నియమించండం పట్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ నియామకాన్ని నిన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద తప్పుపట్టగా... తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈవ్యవహారంపై స్పందించారు. దీనిపై...

Monday, May 8, 2017 - 07:59

హైదరాబాద్: బీసీ కమిషన్ రిజర్వేషన్ల పై కేంద్రం చేతిలో ఉండబోతోందా? బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోతోందా, పరిపాలన వికేంద్రీకరణ ఉండాల్సిన అవసరం లేదా?పాలన ఏకీకృతమేనా? రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉండాల్సిన అవసరం లేదా? రిజర్వేష్ల అంశం చాలా రాష్ట్రాలో పెండింగ్ లోఉంది. బిజేపి రిజర్వేషన్ల తేనె తుట్టెను కలిపి మతవిశ్వాసాన్ని కల్గించేందుకు...

Saturday, May 6, 2017 - 11:23

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నేత, టీఆర్ ఎస్ నేత నందికొండ శ్రీనివాస్, బీజేపీ ప్రేమేందర్ పాల్గొని, మాట్లాడారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రూ.12 వేలు ప్రకటిస్తే రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుధ్ది ఉంటే రైతులను ఆదుకోవాలన్నారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం...

Friday, May 5, 2017 - 19:57

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షణను ఖరారు చేసింది. దోషులైన ముఖేష్‌, వినయ్‌, పవన్‌, అక్షయ్‌కు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును దేశ...

Friday, May 5, 2017 - 09:50

మిర్చికి మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు మల్లారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ సీనియర్ నేత రాజమోహన్ పాల్గొని, మాట్లాడారు. మిర్చికి 10 వేల రూపాయలు ఇచ్చి కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు పెట్టిన పెట్టుబడిలో పదో వంతు కూడా...

Thursday, May 4, 2017 - 19:28

హైదరాబాద్: నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టే ఉంది పాలకుల వైఖరి. మిర్చికి మద్దతుధర ఇచ్చినట్టే ఇచ్చి.. కొనుగోలుపై పరిమితి విధించడం దేనికి సంకేతం..? ప్రకటించిన మద్దతు ధర మిర్చిరైతుకు ఉపశమనం కల్గించేదేనా..? మద్దతుధర సరిపోదంటూనే.. ఇద్దరు సీఎంలు నోరెందుకు మెదపడంలేదు..? ఇవే అంశాలపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ రైతు సంఘం నేత సాగర్, బిజెపి...

Thursday, May 4, 2017 - 10:08

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నర్సింహ్మారెడ్డి, విశ్లేషకులు నగేష్ కుమార్, టీడీపీ నేత వర్ల రామయ్య పాల్గొని, మాట్లాడారు. రైతులను కష్టకాలంలో ఆదుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

Wednesday, May 3, 2017 - 08:09

మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం స్పందిచాలని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. మిర్చిరైతుల సమాస్యలపై జరిగిన చర్చలో విశ్లేషకులు భైర దీలిప్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, టీఆర్ఎస్ నేత గొవర్ధన్ పాల్గొన్నారు. దీలిప్ మాట్లాడుతూ మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకిభవించారు. ఇందిరా మాట్లాడుతూ పత్తికి...

Tuesday, May 2, 2017 - 14:40

రైతుల కోసం పోరాటం చేయడం తప్పు కాదని న్యూస్ మార్నింగ్ లో వక్తలు అభిప్రాయపడ్డారు. చర్చలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మల్యాద్రి, వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. భారతదేశంలో రైతంగా సంక్షోభం ఏర్పడిందని రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతుల సమస్య ప్రధానంగా ఉందని తెలిపారు. అలాగే రుణా మాఫి ఆలస్యం కావడం వల్ల రైతులకు ఇబ్బంది కల్గిందన్నారు....

Monday, May 1, 2017 - 08:49

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, టీఆర్ ఎస్ రాకేష్, వైసీపీ నేత నాగార్జున, టీడీపీ నేత దుర్గాప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయారు. ఇరు రాష్ట్రాల...

Saturday, April 29, 2017 - 08:27

మిర్చి రైతులకు మద్దతు ధర ప్రటించాలని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నరసింహరెడ్డి, కాంగ్రెస్ నేత మానవత రాయ్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత రాజమోహన్ రెడ్డి మాట్లాడారు.నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో మిర్చిధర పడిపోవడంతో రైతులు ఆవేదనతో మిర్చి యార్డుపై దాడి చేశారని అన్నారు. ప్రభుత్వం పత్తి వద్దని చెబితే రైతులు కందులు,...

Friday, April 28, 2017 - 08:16

టీఆర్ఎస్ పార్టీ క్రమంగా తన ప్రభావన్ని కోల్పోతోందని టెన్ టివి న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ చర్చ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత శ్రీనివాస్, నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ప్లీనరీలో చెప్పిన మాటలు బహిరంగ సభలో చెప్పారని వీరయ్య అన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ను మాత్రమే...

Thursday, April 27, 2017 - 07:58

హైదరాబాద్:యూనివర్సిటీలు మేధావుల ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రణబ్, ఓయూ వందేళ్లు పూర్తి చేసుకోవడం స్ఫూర్తిదాయకమని, తానీ వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నాటి మీర్ ఉస్మాన్ స్వప్నం నేడు సుసంపన్నమైందన్నారు. మరోవైపు గవర్నర్‌ నర్సింహన్, సీఎం కేసీఆర్ ఈ వేదికపై...

Wednesday, April 26, 2017 - 07:58

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న ఉస్మానియా...

Pages

Don't Miss