సౌత్ కొరియాలో తొలి త‌మిళ చిత్రం..సూర్య 'NGK'

Submitted on 26 May 2019
NGK, First Tamil Movie To Release In South Korea.

నటుడిగా తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సూర్య. ప్రస్తుతం తన 36వ సినిమాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం NGK. సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో సూర్యకు భార్యగా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుపుతున్నారు. ఈ చిత్రం త‌మిళ‌, తెలుగు భాష‌ల‌లో రిలీజ్ కానుంది.

అంతేకాదు సౌత్ కొరియాలోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. అక్క‌డ విడుద‌ల‌వుతున్న తొలి త‌మిళ చిత్రం ఇదే. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక సూర్య త‌న 37వ చిత్రంగా కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. 38వ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని తెలుస్తోంది. ‘NGK’ సినిమా ప్రేక్షకులతోపాటు అభిమానులు కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే ధీమాతో ఉంది చిత్ర యూనిట్.

NGK
First Tamil Movie
South Korea
2019

మరిన్ని వార్తలు