మాయగాళ్లు : మోసపోయిన సోనాక్షి వర్మ

Submitted on 12 June 2019
Nigerian Cheats Actress Sonakshi Varma

సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని..నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. సెలబ్రెటీలను సైతం బురిడీ కొట్టిస్తున్నారు మాయగాళ్లు. తాజాగా సినీ నటీ సోనాక్షి వర్మను నైజీరియన్లు మోసం చేసిన ఘటనల కలకలం రేపుతోంది. మోసగించారంటూ..ఆ నటి సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది. 

సోనాక్షి ఫేస్ బుక్‌కు ఓ నైజీరియన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దీనిని ఆమె యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ జరిగేది. కొద్ది రోజుల తర్వాత పరిచయానికి గుర్తుగా ఓ గిఫ్ట్
పంపుతున్నట్లు..నేరుగా ఇంటి వద్దకే వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. దీనిని సోనాక్షి నమ్మింది. మే 27వ తేదీన ఫోన్ వచ్చింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారినంటూ ఫోన్ చేశాడు. ఓ వ్యక్తి పేరిట బహుమతి వచ్చిందని..హైదరాబాద్‌కు పంపాలంటే రూ. లక్షా 35 వేల కావాల్సి ఉంటుందని తెలిపాడు.

చెప్పిన బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ చేయాలని చెప్పగా..ఏ మాత్రం ఆలోచించకుండా ఆ వ్యక్తి చెప్పినట్లు చేసింది. తర్వాత గిఫ్ట్ కోసం వేచి చూసింది. ఎలాంటి గిఫ్ట్ రాలేదు. అప్పుడు అనుమానం వచ్చింది సోనాక్షి వర్మకు. అధికారినంటూ ఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్చాఫ్ ఉంది. మోసపోయానని అప్పుడు అనుమానం వచ్చింది. వెంటనే హైదరాబాద్‌‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు సోనాక్షి. 

Nigerian
Cheats
Actress
Sonakshi Varma
Cyberabad Crime

మరిన్ని వార్తలు