షాంఘైలో కుప్పకూలిన భవనం..శిథిలాల్లో తొమ్మిదిమంది

Submitted on 16 May 2019
Nine praples trapped in Shanghai building collapse in Chaina

చైనాలోని షాంఘై నగరంలో ఓ భవనం కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో 20మంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయారు.  ఫైనాన్సియల్ హబ్ ప్రాంతంలో ఉన్న  భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో శిథిలాల్లో 20 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది.

అనంతరం 11మందిని సురక్షితంగా కాపాడారు. మరో తొమ్మిదిమంది శిథిలాల్లోనే ఉండిపోగా వారిని కాపాడేందుకు 150 మంది రెస్క్యూటీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది.  కాగా  భవనం కుప్పకూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చైనాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

chaina
Shangha
Nine peaples
trapped
Building Collapse

మరిన్ని వార్తలు